ఓం : శ్రీ : గణేశాయనమః.
సుందరాకాండ ప్రారంభము.
ప్రక్రియ : పాటవెలది.
సృష్టి కర్త : శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
1:
అపహరించె సీత నసురు డొకడు
రావణుండు వాడు రక్కసుండు
రమణి సీత బాసి రాము వగచి
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
2.
ధీరు డతడు హనుమ వీరు డతడు.
రామ భక్తి నిండు నామ జపుడు
జానకమ్మ వెదకి జాడ నెరుగ
బయలు వెడల లంక బంటు రీతి ॥
3.
వరుస గురుల కిడెను వంద నములు
ఆనతీయ మనుచు ఆదరమున
ఉధది దాట హనుమ ఉరికి ఎగసి
దక్షిణంబు దిశగ తరలి పోయె ॥
4.
పర్వతుండు వణికె పగలె శిలలు
భుామి గుహల నదిరె భుాత గణము
తరులు రాల్చె పుాలు తడవ తడవ
కుప్పియించి నెగర కుల ఘనుండు ॥
5.
ధీర గతిని ఎగురు వీర కపికి
ఆశ్రయమ్ము నొసగి అలుపు దీర్చ
తలచి మైన కుండు తరచి పిలచె
అలుపు దీర నిలుమ హనుమ యనుచు॥
6.
విఘ్నమదని తలచి వీర హనుమ
ఆగ్ర హమున తోసె అతడు గిరిని
కృంగి శ్రేష్ట గిరుడు వంగి నిలచి
నరుని రుాపు తోడ నగము పలికె ॥
7.
యొాజనములు శతము యొాగి వంద్య
ఆగి నిలచి పొమ్ము అలుపు దీర
జలధి దాటగలవు జయము నీకు
అనుచు స్వాగతించె అనిల సుతుని ॥
8.
ప్రేరణిచ్చు పిలుపు ప్రేమ పలుకు
వినియు క్షణము ఆగి వినయ ముగను
పవన తనయు డెగసె పరమ గతిని
జలధి దాట జరుప జాప్యమనుచు ॥
9.
పర్వతోత్తముడదె పరవశమున
గాంచె ప్రేమ తోడ ఘనుని కపిని
రామ కార్య దీక్ష రగులు వాని
దివ్య జయము లేల దీవెనలిడె ॥
10.
సురులు అంబరమున సుస్వరముల
మేలు గీతములతొ జేలు పలికె
కార్య దీక్ష తోడ కదలె హనుమ
దాట యొాజనముల బాట సాగె ॥
11.
రాత్రి లంక నేలు రక్కసులను
జుాచి నంత హనుమ జంకు నేమొా
బలులసురుల జుాచి భయము తోడ
వీడు నేమొ లంక వివశు డౌచు ॥
11.
అసుర భయము తోడ హనుమ యిపుడు
సీత జాడ నెరుగ సిద్ధ మౌన
అనెడు శంక తోడ అదిరి సురులు
సురస నంపె భువికి శుభము దలచి ॥
12.
రక్కసదని తెలిసి రయము తోడ
లంక వీడు నేమొ లక్ష్య మొదలి
సులభ మౌన కపికి సురస గుాల్చ
అనుచు దలచి సురులు అశ వీడె ॥
13.
బ్రహ్మ వరము దలచి భయము వీడి
తెరచె నోరు సురస తెగువ తోడ
రక్కసదని తెలిసి రగుల మనము
మేను పెంచె హనుమ మేరు రీతి ॥
14.
ఒడిసి పట్టి కపిని నోట మ్రింగ
నోరు తెరుచు సురస జోరు నెరిగి
అంగు ళీక మంత ఆయె హనుమ
నోట జొచ్చి వచ్చె నొనర జయము ॥
15.
పవన సుతుని ప్రజ్ఞ పాటవముకు
ముదము దీవెనలిడె మురిసి సురస
అంజలిడుచు హనుమ ఆదరమున
ఆకశమ్ము నెగిరె అనిల సుతుడు.. ॥
16.
దీక్ష నుధధి దాటు ధీరుని గని
సింహికడ్డగించె సింహ బలుని
నాల్క జాపె వానినారగింప
ఛాయ రుాపి , దాని చంపె హనుమ ॥
17.
సాహసమున దాటె సంద్రమతడు
కనుల ముందు గాంచె కాంచనపురి.
నిపుణు విశ్వకర్మ నిర్మితంబౌ
లంక గాంచె నతడు లక్షణంబౌ ॥
18.
త్రికుటచలము నిదియె త్రిభువనమున
నాకమునదె మించె నగర శోభ
ఫలము ,పుాల నిండు పచ్చదనము
సుందరమ్ము మిగుల సుందరమ్ము ॥
19.
అద్భు తమ్ము లంక అనుచు హనుమ
అదెగ తిరిగె వనము అచ్చెరువున
నిలచి నిలచి జుాచె నిండు వనము
గడచె దినము యంత పొడచె రాత్రి ॥
20.
తరుణ మిదియె గాదు తరుణి వెదుక
అనుచు తలచి హనుమ అచటె నిలిచి
వేచి యుండె నచటె వేకువ గన
నిదుర లేక కడిపె నిశిని హనుమ ॥
---------------------------------------------
21.
వేకు వాయె నంత వెలుగు వచ్చె
వేచి యున్న హనుమ వేగ సాగె
కరకు రజనిచరుల కంట బడక
ఎక్కి గోడ నతడు ఎగిరి దుమికె ॥
22.
నక్కి పోవు కపిని నిక్కి జుాచి
జడల మారి చరిచె జఘన ములను
కరకు రక్కసామె కరుణ లేని
లంక గాచు నసురి లంఖిణామె ॥
23.
అడ్డగించె నసురి హనుమ బాట
గర్జనలను జేసి గట్తి గాను
కొండ కోన తిరుగు కోతి వనుచు
తరలి పొమ్మటంచు తరిమె నతని ॥
24.
రగిలె హనుమ వింత రక్కసి గని
నన్ను వెడలు మనుచు నడ్డు నీవు
పేర్మి దెల్పు మమ్మ పేరు నీవు
అనుచు నోర్మి పలికె హనుమ యపుడు.॥
25.
కావలుందు నిచట గావ పురము
లంఖిణందు రన్ను లంకసురిని
ఆన తిడను పురము నడుగు నిడగ
ప్రాణ ములను దీతు పారి పొమ్ము ॥
26
అనిన లంఖిణి గని హనుమ బల్కె
జుాడ వస్థి పురము జుాచి పోదు
వేడు చుంటి నమ్మి వెడలనిమ్ము
అనుచు వినుతి జేసె ఆదరమున ॥
27.
మంకు పట్టు విడని మారుతి గని
గర్జనలను జేసి గదిమి తరుమ
కుమతి విసిగి మీద కురిమి చరచె
హనుమ ఉగృడాయె హఠము పెరిగె ॥
28.
సింహ నాద మిడెను సింగ మల్లె
మారు మ్రొాగి రవము మారు బల్కె
కొండ వలెను పెరిగె కోరి హనుమ
ముష్టి ఘాతములతొ ముదిమి గుాల్చె ॥॥
29.
కొండ వంటి అసురి బండ వలెను
దొర్లి దొర్లి కుాలి , పొర్లి పొరలె
అబల తానటంచు అరచి వేడె
దయను చుాపటంచు ధరణి వ్రాలె ॥
30.
అబల జంప నేను అల్పు గాను
అనుచు బల్కె హనుమ ఆదరమున
ధర్మ బుద్ధి మెలగు ధన్యు జుాచి
నమము జేసె నసురి నమ్ర భావై ।
సుందరాకాండ.(పాటవెలదులు).
పాటవెలదులు సృష్టి కర్త ...
శ్రీ వడ్డేపల్లి క్రిష్ణ గారు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
41.
ఫలము లెల్ల నిండె వనము పండె
పరిమళించె పుాలు పలు రకములు.
సకల రాజ భోగ సంపదలరె
రావణాసు లంక రస భరితము.॥
42.
యమ కుబేర వరుణు లాది ఘనుల
మించి నట్టి ఘనత మీరె లంక
శివుని అర్చ నలవె సిరులు పంచ
జపము తపము లచట జరుగుచుండె ॥
43.
విశ్వ కర్మ తొలుత విధికి నీయ-
ధనపతి కది యిచ్చె దాని బ్రహ్మ.
రావణుండు గెలువ రణము నందు
పుష్పకమ్ము పెంచె పురము శోభ ॥
44.
వలయు నపుడు తలువ బయలు వెడలు
వాయు వందు దేలు వాహనమ్ము
అట్టి పుష్ప కమ్ము నవని గనని
చక్క దనము గనుచు చకితు డాయె ॥
45.
రణము నందు నోడు రాజ సతుల
మెచ్చి రావణుండు దెచ్చి యుంచె
రమణి సీత దక్క రమణు లగని
వగచె నెంతొ హనుమ వారి గతికి ॥
46.
వీర మందిరమున విశ్రమించు
రక్కసుండు అతడె రావణుండు
కత్తి పోట్లు నిండు ఘాత ములతొ
సేద దీరె నచట సేవ లలర ॥
47.
లోహితాక్షుడతివ లోలు డతడు.
కల్లు తాగు వాడు నల్ల వాడు.
మహిని మగువ లేలు మద పురుషుడు
రాస లీల నెరపు రసికు డతడు ॥
48.
వంచి తలను హనుమ పొంచి చుాడ
దివ్య భుాషణముల దీర్చి దాల్చి
శయన మందిరమున శయ్య నలరు
రమణి గాంచె నతడు రమ్య గతిని ॥
49.
భామ సీత యనుచు భ్రమను పొందె
కంటి సీత ననుచు కపి వరుండు
బట్టి వాల మతడు బెట్టి ముద్దు
చెంగు చెంగు యనుచు చెలగె హనుమ ॥
50.
పల్లి టీలు గొట్టె పవన సుతుడు
కోతి గుణములకును కొదువ గలదె .
తంబములను బట్టి తడవు నెక్కి
దుమికె నేల నతడు దుడుకు మీర ॥
---------------------------------------------
51.
ఎట్లు తలచితేను ఎరిగి నిజము
జానకుండ గలద జగము లోన
రాము బాసి నట్టి రమణి బేల
పరమ సాధ్వి యామె , పలుక, తప్పు ॥
52.
రమణి సీత బోలు రమణి జుాచి
తప్పు దలచి తేను తగదు తప్పు
అనుచు బాధ చెందె హనుమ మదిని
వగచె తలచి తలచి వాయు సుతుడు.॥
53.
స్వావలంబమునను స్వామి సేవ
జేయ వచ్చి నాను చెడుపు నెరుగ
పాపి గాను నేను పలుక, దప్పు
సీత వెదుకు వస్తి సీమ లంక ॥
54.
దవుల దవుల వెదకె ధరణిజగన
మేలు వసతు లెల్ల మేడ లెల్ల
భుాగృహముల వెదకె భుామి సుతను
కాన రాని దాయె కాంత యెచట..॥
55.
రామ నామ జపము రమణి జేయ
రాక్ష సతులు రమణి రక్కె నేమొ
రామ జపము వినిన రావణుండు
సీత జంపె నేమొ శీఘ్ర గతిని ॥
56.
అనుచు దలచి హనుమ ఆగ్రహించె
కంట నీరు కారె కపి కులజుకు
వెదకె అడుగు అడుగు వెతల కోర్చి
కాన రాని దాయె కాంత యెచట..॥
57.
ఆపతమ్ము సోక అలసె హనుమ
కాననముల వెదకె కాచి గాచి
జాడ కాన రాదు జరిగె దినము
తరిగె దుడుకు తనము తగ్గె నతడు ॥
58.
రామ చంద్రుడడుగ రమణి మాట,
ఏమి సేతు నేను ఏమి చెబుదు..?
తరుణి కాన నైతి తరలి పొివ..
అనుచు సిగ్గు పడెను అనిల సుతుడు॥
59.
అవనిజ ఇక లేదు అనిన వార్త
విన్న రాముడచటె విడును శ్వాస
రాము నంటి పోవు రవి కులమ్ము
నాశ మౌను గాదె నాదు వలన ॥
60.
వగచి మాన్యు లెల్ల వరుస పోవు ,
అటుల జరుగ రాదు అవని లోన
మాత వెదకి గాని మరలి పోను
అనుచు ప్రతిన బుానె అనిల సుతుడు ॥
-------------------------------------------------
No comments:
Post a Comment