Friday, July 24, 2020

ముత్యాల పుాసలు

ముత్యాలపూసలు
అంశం: రైతు జీవితం
శీర్షిక: అందరివాడు
పేరు: డా. సూర్యదేవర రాధారాణి
వృత్తి: వైద్యం (గైనకాలజిస్ట్)
హైదరాబాదు

(1)
తరతరాలుగా  మట్టిని  నమ్ముకొని
జీవితాలను  అక్కడే  గడిపే
ఓరైతన్నా! నీజీవితమును వివరముగ
వ్రాయడము  మాతరమా  నిజముగ.
ఆకలితీర్చుట  ఒకటే  తెలిసిన
ఓకష్టజీవీ  ఓద్రంధము  రచించిన
అగునేమో  కొంతవరకు  న్యాయము

(2)
మట్టిని  మాత్రమే  నమ్ముకొని
నీవు  సాగించకున్న  వ్యవసాయము
మాకేది   తినగ  తిండి
శరీరానికి  వెన్నెముక  వోలె
మానవాళికే  నీవు  దన్నువుగా
చేసిన  నిన్ను  నిర్లక్ష్యం
ఉంటుందా  మాకు  మోక్షము

(3)
ప్రకృతి  మీద  ఆధారము
అతివృష్టి  అనావృష్టి  ప్రభావము
ఆపై  విత్తనాల  కొరత
లేదా  విత్తనాలు  కల్తీ
ఇంకా  ఎరువుల  బెడద
ఎరువులువేస్తే  పురుగులు  చావవు
విరక్తితో  మనిషితాగితే  పరలోకమే

(4)
ఆరుగాలాలు  పనిమీదే  ధ్యాస
చేస్తారు  తీసుకోకుండా  శ్వాస
ప్రభుత్వానికి  పట్టదే  ఊసు
సమయానికి  ఉండదే  విద్యుత్తు
చెయ్యరు  రుణాలు  రద్దు
తప్పదు  చాలాసార్లు  పస్తు
ఎవరికీ  ఇలాంటి  జీవితమొద్దు

(5)
పండిస్తావు  కష్టపడి  బంగారం
చివరికి  చేతికందేది  అనుమానం
ఉండదు  ఎవ్వరి  సహకారం
అంతా  అయ్యాక  మిగిలేది
ఎటు  చూసినా  అంధకారం
పడలేక  అలాంటి  అవమానం
చేరుకోవాలి అనిపిస్తుంది  స్మశానం

(6)

కవిపిస్తుంది ఆశ ఎదురుగా
అందుకే  తిరిగి  లేస్తావుగా
మళ్ళీ  తిప్పలు  తప్పవుగా
ఉంటావు కొండంత ఆశతో
అదేచరిత్ర  కాకూడదు పునరుక్తము
నీవులేక  లేనేలేదు  ప్రభాతము
నీకుచెప్పాలి  మేమంతా సుప్రభాతము

(7)

మట్టిని  దున్ని  హలముతో
వేస్తావు  విత్తనాలు తెలివితో
తోడుగా ఎరువులు  అప్పుతో
చూస్తావు  వానకై  ఆశతో
భయంకరం  వర్షం  లేకపోతే
భీభత్సం  వాన  ఎక్కువైతే
మిగులుతావు  అంతా  అయోమయంతో

(8)
కంటికి  నిండా  నిదురేది?
కడుపుకు నిండా తిండేది?
వొంటికి  నిండా బట్టేది?
ఇంటికి  పైన  కప్పేది?
ఎన్నడూ చేతిలో డబ్బేది?
మనసుకి  ఇసుమంత  శాంతేది?
పిల్లల చదువుకు వీలేది?

 (9)
పాడీ  పంటలే  కాదా
ప్రతి  మనిషికి  అవసరం
భారము  అవ్వగా జీవితం
అమ్ముకుని  అన్నీ  నష్టానికి
వదిలేసి  వెళ్తారు  నగరానికి
పట్టదు కదా ఎవరికీ
పల్లెతల్లి ఘోష నిజానికి

(10)
అందుకే  వెయ్యాలి  ప్రణాళికలు
ఆదుకోవాలి  రైతును  అన్నివిధాలు
కాకూడదు  బ్రతుకు  భారాలు
చెయ్యాలి  పంటలను  భీమాలు
చెయ్యాలి  తప్పనిసరి  చదువులు
అపుడే అందరిళ్ళలో వెలుగులు
ప్రతిరోజూ  సంక్రాంతి  దీపావళులు

ఈ రచనను ముత్యాలపూసలు ప్రక్రియ కోసమే వ్రాయబడినది . ఇది దేనికి అనువాదము కాదు. మరే ఇతర పత్రికలకు పంపలేదని హామీ ఇస్తున్నాను. 
                          డా . రాధారాణి సూర్యదేవర

ముత్యాల పుాసలు

🍄🍄🍄🍄🍄🍄🍄🍄
పేరు: గుదిమెళ్ళ మంజుల
ఊరు: విజయవాడ
ప్రక్రియ: ముత్యాల పూసలు
అంశము: రైతు
🍄🍄🍄🍄🍄🍄🍄🍄

01.

హలమేనట అతని బలం
హలమేనట అతని ఆయుధం
అందించును మనకు ఆహారం
వ్యవసాయమే అతని ఆధారం
హర్షించేను మన దేశం
అతనికి లేదు ఏప్రోత్సాహం
అతడే మన రైతునేస్తం

02.

హలం పొలం అవశ్యం
రైతన్నకు ప్రతి దినం
దుక్కిదున్ని హాలాహలం
పండించేను బంగారం
పొట్ట కూటి కొరకు
చేయబోడు రైతన్న వ్యవసాయం
అందరికీ కడుపు నింపాలన్నదే ధ్యేయం

03

నేల తల్లి బిడ్డరా
మట్టి పైనే మమకారమురా
చేతపట్టి హలాన్ని
పండించేను సిరి సంపదలని
విత్తనమున రైతు చూసే
సృష్టిలోన ప్రాణుల ఆకలిని
హర్షించక తప్పదు ఈ కర్షకుడిని

04
భిక్షాటన చేసే వారికి
ఆకలి తీర్చేది అన్నమే...
కోట్ల సంపాదన వెనకేసినా
ఆకలి తీర్చేది అన్నమే....
కూటి కోసం కోటి విధ్యలున్నా
హలం పొలం మాత్రమే
తెలిసిన రైతుకు వ్యవసాయమే శరణ్యం

05
చాలు చాలు ఈదారుణం
ఇకనైనా ఆగాలి ఈవైనం
ప్రాధాన్యం లేని వైనం
రైతుకు అందాలి ప్రోత్సాహం
వ్యవసాయమే అతని ఉపాధి
వ్యవసాయమే అతని వృత్తి
రైతు కన్నీటికి అంతమే చెప్పాలి సమాజం

06
కర్షకుడే కానీ హర్షించేదెవ్వరు
బీడు భూములను బంగారుచేసే
కానీ సమాజానికి అపరిచితుడయ్యే
మట్టి లోన మాణిక్యమే
కానీ మాటవరసైనా గుర్తింపు లేదే
పేరుకే అన్నదాత కానీ
అతడి జీవితాన కరువుకాటకాలే

07
మట్టి మనిషి రైతన్న
నేలతల్లి కూర్పు రైతన్న
కాయ కష్టము చేసే
కొండలు పిండిని చేసే
పొట్ట కూటి కొరకు
పొలం బాట పట్టి
పదిమందికి అన్నదానం చేసే

08
ఆకసాన కురిసే వానచినుకు
నేల రాలిన తరుణాన
చినుకు నేల తల్లికి
సంధి చేయువాడే రైతు
గాలి వీచే సమయాన
భూమిపై తాను కష్టించిన
పైరును పరవసింపచేసేవాడే రైతు

09
ఎవరికి ఎరుక ఈలోకంలో
ఏవిత్తనాన ఏమొక్క దాగినదో
ఎవరికి తెలుసులే ఈలోకంలో
ధాన్యం ఏరైతు పండించెనో
ఎవరికి ఎరుకలే ఈలోకాన
ఏరైతుకు ఏబాధ ఉన్నదో
ఏ గండి తనకన్నీటిని ప్రవహింపచేసేనో

10
ఋణాలు తీసుకునే రైతుకు
మనం ఋణం ఉన్నాము
వాన చినుకుకై వేచిచూసే
రైతుకు మనం చేయూతనిద్దాం
మధ్యవర్తుల దళారులను త్యజించి
రైతు వద్దకు వెళదాం
రైతన్నని నిజమైన అన్నదాతగా కీర్తిద్దాం

ముత్యాల సరాలు అంశం.రైతు జీవనం.

🌲🌲🌲🌲🌲🌲🌲
ప్రక్రియ: ముత్యాల సరాలు
అంశం: రైతు జీవనం
పేరు: శైలజ పెదప్రోలు
ఊరు:పార్వతీపురం
రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
ఫోన్: 9440549110
🌲🌲🌲🌲🌲🌲🌲

001.

రైతు విలువ తెలుసుకో 
నేలతల్లికి తేమ నిచ్చి 
హలంతో  దుక్కి దున్నీ 
విత్తులను ఒక్కటిగా పోగేసి 
మొలక తెచ్చి నీరుపోసి 
ధాన్య రాశులను కుప్పచేసి 
అన్నం పెట్టే మహారాజు
🍃🍃🍃🍃🍃🍃🍃

002.

ఆకలి తీర్చే రైతన్న 
దిక్కు నీకు వెవరన్న 
ప్రాణం పొసే మీకు 
పైసలు లేని జీవితం 
జీవం లేని రాళ్లకు 
జీవితం ఎరిగిన వాళ్లకు 
కర్షకుడై హర్షం వ్యక్తంచేస్తావు
🍃🍃🍃🍃🍃🍃🍃

003.

పల్లెసీమకు పట్టుకొమ్మ నీవు 
విత్తులకు శక్తీని ఇచ్చి 
నీకండబలం పిండి చేసి 
అన్నార్థుల ఆకలి తీర్చడానికి 
నీవు పడే శ్రమ 
అనన్యం అనంతం కదా 
దేశానికీ నీవు దివిటీవి
🍃🍃🍃🍃🍃🍃🍃

004

దేశ భవిత నీచేతుల్లో 
మనుష్య జాతి జాగృతి 
నీవే నాదేశ ప్రగతి 
నీవు లేక మేములేము 
పంట పంటకు నీకష్టం 
చేతికందినప్పుడు నీకు ఇష్టం 
మాకడుపు నింపే దైవమునీవే
🍃🍃🍃🍃🍃🍃🍃

005

పాడి పంటలు నీవే 
బంగరు భూమి దున్నీ 
నేలమ్మా కన్నీరు తుడిచి 
బంగారు పంటలు పండించి 
ఇష్టంగా కాయకష్టం చేసి
సిరుల వర్షాలు కురిపించు 
మా రైతే మారాజు
🍃🍃🍃🍃🍃🍃🍃

006.

అలుపెరగని  ఓ అన్నదాత 
విలువెరుగక అన్న మాట 
విడిచి పెట్టావయ్యా నామాట 
అన్యదా భావించక ఈపూట
ప్రతీది నీ చలవేనయ్యా 
మాలోపాలను తొలగించవయా
నీఋణం తీర్చ లేమయ్య
🍃🍃🍃🍃🍃🍃🍃

007.

పత్తి పంట పోయిందని 
నీవు ప్రాణం తీసుకోకు 
చీడపీడలతో  పోతే ఆ పంట 
మరణమే శరణం అనుకోకు 
దేశానికి నీవు పట్టుకొమ్మ 
నిలువెత్తు నీడ నీజన్మ 
తెలుసుకోవోయి ఓ రైతన్న
🍃🍃🍃🍃🍃🍃🍃

008

కలుషితం అవుతున్న భూమిని
చూసి ఏడవకురన్న ఓ రైతన్న 
సహజ ఎరువులు ముద్దని 
రసాయన మందులు వద్దని 
అందరి ఆరోగ్యం నీదని 
నీవు పండించే పంటని 
అందించవయ్యా భారతి బిడ్డవై
🍃🍃🍃🍃🍃🍃🍃

009.

జోడెడ్ల బండి మీద 
తలపాగా చుట్ట చుట్టి 
చిత్రమైన చిలకట్టు కట్టి 
పయనం అవుతుంటే  నీవు 
పరుగు పరుగున రానా 
పట్టెడన్నం పండించే రైతన్న 
పరమాత్ముడివి మాకు నీవన్న
🍃🍃🍃🍃🍃🍃🍃

010.

 పొద్దుగాలే నిద్రలేచి నీవు 
పొలంకు నీవు పారతోబోతివి 
తిండి తిప్పలెరుగక నీవు 
కాయకష్టం చేసిన శ్రమజీవివి 
అలుపెరుగని ఆశా జ్యోతివి 
అహర్నిశలు  నీ ఆలోచన 
 మాకొరకే నీ అన్వేషణ
🍃🍃🍃🍃🍃🍃🍃
ఈ ముత్యాల సరాలు లో రైతుజీవనం మీద రాసిన  10 ముత్యాలసరాలు నా స్వంత రచనయే అని ఎక్కడ అనువాదం కానీ, ముద్రితం కానీ కాదని హామీఇస్తున్నా....
🌲🌲🌲🌲🌲🌲🌲

ముత్యాల పుాసలు ప్రక్రియ...అంశం. సతతం హరితం.

🌳 సతతం హరితం 🌳
🌹________________🌹
ప్రక్రియ: ముత్యాల పూసలు
అంశం: చెట్లు
పేరు: ఐనవోలు కృష్ణవేణి
ఊరు: చింతపర్తి
మండలం: వాయల్పాడ్
జిల్లా: చిత్తూరు
______________________

    🌳 సతతం హరితం🌳
______________________

01. భూమి క్రింద చిన్నివిత్తనం
నిదుర పోయె ఆదమరచి
బాలసూర్యుడు తూర్పు దిక్కున
నిదుర లేపెను లేలెమ్మని
ఆచిన్నివిత్తనం ఆవులించుచూ పైకిలేచే
ఆచిన్నిమొక్కే మహావృక్ష మాయే
ఊరి వారందరికీ నీడనిచ్చే🌳

02. పుడమికి అందం నేనురా
 పచ్చని చెట్టును నేనురా
పాలుగారే మనసు నాదిరా
చల్లని నీడను  నేనురా
కొమ్మలోని రెమ్మని నేనురా
కమ్మని అమ్మని నేనురా
నీ కన్నతల్లినీ నేనురా!!🌲

03. తరులే మనిషికి జీవంరా
తరులే మనిషికి ప్రాణంరా
తరుల వలనే వర్షంరా
తరుల వలనే కూడునురా
తరులే జీవుల ఆయువురా
తరులే జీవుల ప్రాణంరా
తెలుసుకొని మెసులుట మేలునురా🌾🌾

04. చెట్లుంటే భూమికి అందం
  అవివుంటేనే మనిషికి చందం
చెట్లు తోటిదే జీవనబంధం
చెట్లే భూమికి ప్రాణాధారం
చెట్లే పుడమికి జీవాధారం
చెట్లులేనిదే బ్రతుకే లేదు
మానవజాతికి మెతుకే లేదు🎋🌾🌾

05. చేయీ చేయీ కలుపుదాం
చెట్లను బాగా పెంచుదాం
పుట్టుక నుండి చచ్చేవరకు
చెట్ల తోటిదే మనజీవితం
చెట్లే మన మౌననేస్తాలు
ఇంటింటా చెట్లు నాటుదాం
ఊరంతా పచ్చదనం పెంచుదాం🌴🌴

06. వృక్ష సంపద ను పెంచాలి
   స్వచ్ఛత నే సాధించాలి
కాలుష్య కోరలను తుంచాలి
పర్యావరణ సమతుల్యం మనలక్ష్యం
మొక్కల పెంపకం మహాభాగ్యం
వాటి సంరక్షణ మహత్కార్యం
అదేమన జీవిత కైంకర్యం🌱🌱

07. జగతిన హర్షం నిండాలంటే
ప్రగతి పథంలో నడవాలంటే
కరువును దూరం చేయాలంటే
పుడమి పచ్చగా ఉండాలంటే
భూకంపం, భూతాపం తగ్గాలంటే
తరువులు బాగా పెంచాలి
భూమి కి పచ్చతివాచీ పరచాలి☘️☘️

08. పచ్చనిచెట్లు ప్రగతి కి మెట్లు
పచ్చదనం మన ప్రగతికి మూలం
  పచ్చని పరిసరాలు పెంచుదాం
ఆరోగ్యానికి ఆభరణాలనీ చాటుదాం
ఊరంతా వనం చేద్దాం
ఆరోగ్యంగా మనం ఉందాం
రోగాలను తరిమి కొడదాం🌿🌿

09.  నరుకుట చెట్లు  వద్దు
      పెంచుట చెట్లు  ముద్దు 
        రక్షించకపోతే మనం పర్యావరణం  
శిక్షించును మనలని విపత్తులతో
చెట్లను మోసే భూతల్లికి
 భక్తితో చేతులెత్తి మొక్కాలందరు 
చెట్లులేనిదే అంతా శూన్యం🌳🌳

10.  కప్పుకున్నది నేలతల్లి పచ్చతివాచీ
ప్రీతియన్నది పుడమితల్లి చల్లదనం
ప్రాణ మన్నది పాలపిట్ట కమ్మదనం
మెచ్చుకున్నది  రైతు మోము పచ్చదనం
ఆనందమాయే పర్యావరణ పసిదనం
పారిపోయే వైపరీత్యాలు బహుదూరం
వృక్షో రక్షతి రక్షిత: 🌳🌴🌲🎄☘️🌾🌱🌾🌾

______________________

హామీ పత్రం: ఈ కవిత నా స్వంత రచన  . దేనికి అనుకరణ కాదు అనుసరణ కాదు.

మణి పుాసలు ప్రక్రియ.

మణిపూసలు
🌺🌺🌺🌺🌺🌺
శీర్షిక- రైతు జీవిత మజిలీ
రచన-సంగం దొరబాబు
సూపర్వైజర్ ఆఫ్ స్కూల్స్ జీవీఎంసీ, విశాఖపట్నం
చరవాణి:8309710513
🌷🌷🌷🌷🌷🌷🌷
1) మానవ నాగరికత పరిణామంలో
సంచారి స్థిరపడే వ్యవసాయిగా
నదీ తీరాన క్షేత్రాలలో
పంట పండించ ఆరంభమయ్యే
ఇలలో రైతు జీవనం
మానవాళికి భుక్తి ప్రసాదింప
తాను శ్రమించే ఆరుగాలం
----------------------------------
2.) నాగరిక మనిషి జీవనారంభం
      రైతు జీవనం నుంచే
      ఆరుగాలం పొలం దున్ని
      హలం పట్టి చెమటోడ్చి
     తొలగించు క్షుద్బాధ మానవాళికి
     తాను మాత్రం మిగిలిపోయే
     అనాదిగా కష్టజీవి వలే!
-----------------------------------------
3) రైతే రాజంటున్న పెద్దలు
   ‌‌ మాటలకే పరిమితం భాసలు
    వేదికలపై కరతాళంల కోసం...
    ఎన్నేళ్లయినా ఎన్నాళ్లైనా మారేనా
    రైతు జీవితం ఈనాటికీ
    భూమాతను నమ్ముకున్న రైతుకు
    నేడు భూమియే కరువాయే
-----------------------------------------
4) రైతే దేశానికి వెన్నెముక
    అన్నారు చాచా నెహ్రూ
    బలం తగ్గి కృషించుచుండె
    నేడు ఆ వెన్నుముక
     రైతు కనుమరుగు అయితే
     మానవాళికి భుక్తి యేల
     ‌గుర్తించాలి ప్రజలు అందరూ
-------------------------------------------
5) రైతు సంక్షేమం కోసం
   ‌‌  పరితపించాలి మన పాలకులు
    రైతు బిడ్డ రైతే
    కావలెనని ఆశ పడేలా
    రైతుకు ఊపిరి పోయాలి
    రైతు లేని నాడు
    మానవజాతికి మనుగడ లేదు
--------------------------------------------
6.) పాడి పంట తెలుగింట
      చూచుటకు కనుల పంట
      పాడియే ప్రాణం రైతుకంట
      పాడి ఉంటే సంపదలంట
      పాడియే భాగ్యం రైతుకంట
      పాడిపంటలు ఉంటే ఇంటింటా
      సిరులు పండునట ముంగింట
--------------------------------------------
7) ప్రకృతిని నమ్ము రైతు
    ప్రకృతిని కొలుచు రైతు
    ప్రకృతిని ఆరాధించు రైతు
    ప్రకృతి బంధువు రైతు
    ప్రకృతి నేస్తం రైతు
    ప్రకృతి ముద్దుబిడ్డ రైతు
    ప్రకృతితో మమేకం రైతు
-------------------------------------------
8) రైతు  పచ్చగా ఉండ
    నేలమ్మ పులకించు చుండ
    రైతు స్వేదం రాలు చుండ
    భూమాత పరవశించు చుండ
    రైతు కష్టం చూచుచుండ
    పరులుకైనా వలదు వలదుండ
    రైతే రాజన్నది సత్యముండ!
------------------------------------------
9.) రైతు కంట నీరు
     జాతి కీడు కోరు
     దండిగా ఉంటే నీరు
      రైతు వేయు నారు
      పంట ఇంటికి చేరు
      ఇంట అందరూ హుషారు
      సరదాల సంబరాల హోరు!
-----------------------------------------
10.) రైతు కంట ఆనందం 
        దేశానికి ఎంతో శుభం
       దేశం అంతా సస్యశ్యామలం
       ఆకలి కేకలు మాయం
       ప్రజలు అందరూ సుభిక్షం
       ఇది కదా భాగ్యం
        మనది రైతు రాజ్యం
----------------------------------------