Tuesday, April 1, 2025

అనువాద సాహిత్యం. ఏనుగు లక్ష్మణకవి. అనువదించిన భర్తృహరి నీతి పద్యాలు.

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగర్ .

29/ 3 /25 శనివారం 

అంశం అనువాద కవిత్వం

శీర్షిక  : భర్తృహరి నీతి శతకం.

ఏనుగు లక్ష్మణ కవి అనువాదం.

కవితా సంఖ్య : 3 

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర (.43)

పాట


తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు వివిధ భాషల్లోని రచనలను తెలుగులోకి అనువదించారు. అలాంటి కొందరిలో  

 "ఏనుగు లక్ష్మణ కవి "ఒకరు. ఈయన

   18వ శతాబ్దానికి చెందిన కవి.

    భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రిశతిని" "సుభాషిరత్నావళి" పేరుతో తెలుగులోకి అనువదించారు.

   

 భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రిశతి "ఎంతో ప్రసిద్ధి చెందినది. దీనిలో నీతి, శృంగారం, వైరాగ్యం అనే మూడు శతకాలు ఉన్నాయి. వీటిని తెలుగులో ఎందరో కవులు అనువదించారు. వాటిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చాలా ప్రసిద్ధి చెందింది.


భర్తృహరి నీతి శతకంలోని ఈ పద్య  భావాన్ని చూద్దాం...

 

 "విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

     విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః

     విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం దైవతం

     విద్యా రాజసు పూజ్యతే న తు ధనం విద్యావిహీనః పశుః"


  భావం: 

--------

విద్య మనిషికి అందమైన రూపం. దాచి ఉంచిన గొప్ప ధనం. విద్య వల్ల భోగాలు, కీర్తి, సుఖం లభిస్తాయి. విద్య గురువులకు గురువు. విదేశాలకు వెళ్లినప్పుడు బంధువులా సహాయపడుతుంది. విద్య గొప్ప దైవం. రాజులు కూడా ధనం కంటే విద్యనే పూజిస్తారు. విద్య లేనివాడు పశువుతో సమానం.


సజ్జనుల గురించి...

----------------


  "క్షాంతశ్చేద్గుణ ఏవ కిం శరణినాం త్వం చేత్ సమర్థః కః

     దీనశ్చేత్ కతమా ధియాం గతిరహో గర్వశ్చేన్మా తే రమా

     సత్యశ్చేత్ కిము తత్సవైర్గుణగణైః సర్వేషు చేత్త్వయ్యసౌ

     దోషైకః కిము సజ్జనా యది పునస్త్వయ్యేకదా దుర్వచః"


   భావం:

--------

 ఓ సజ్జనుడా! నీవు క్షమించగలిగితే నీ ఓర్పుకు మించిన గుణం ఏముంది? నువ్వు సమర్థుడవైతే నీకు సాటి ఎవరు? నువ్వు దీనుడవైతే తెలివైనవారికి దిక్కెవరు? నువ్వు గర్విస్తే నీకు లక్ష్మీదేవి దూరమవుతుంది. నువ్వు నిజం మాట్లాడితే ఇక ఇతర గుణాలు ఎందుకు? నీలో అన్ని మంచి గుణాలు ఉంటే ఒకే ఒక చెడు మాటను ఎందుకు వినాలి?"


చాలా బాగున్నాయి కదూ పద్యాలు..

భర్తృహరి శృంగార, వైరాగ్య శతకాలలో కూడా ఎన్నో జీవిత సత్యాలను తెలిపే పద్యాలు ఉన్నాయి.



మహతీ శ్రీరామం,కవితా సంకలనం కొరకు...

మహతీ శ్రీరామం,కవితా సంకలనం కొరకు...

04/01/2025.

అంశం : శ్రీ రామ తత్వం .

( ఆటవెలది పద్యాలు:).

శీర్షిక : సకల గుణాభిసోముడు ,శ్రీరాముడు.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


 

  ధర్మమూర్తి యతడు, ధరణినే లెడువాడు

  సత్యసంధు డతడు, సాధు మూర్తి.

  ప్రజలనేలు రాజు, ప్రేమ స్వరూపుండు

  రాము డతడు జగతి   రక్షకుండు.!!

   

రామ బాణ మదియె  రక్షించు అస్త్రము 

   దుష్ట రక్కసులను , దునుము శక్తి.

శమము లేక లంక  శాసించు రావణు-

మట్టు బెట్టి నట్టి మహిమ ఘనము.  !!


భక్తి తోడ గొలువ  భాగ్యమిచ్ఛెడు రామ -

 పదము  ముక్తి నిచ్చు  మూల ధనము.

ఏలి కతడు విడడు ఏక పత్నీ వ్రతము- 

 దాత యెపుడు  విడడు ధర్మ పథము. !! 


రామ నామ జపము, రక్షించు మంత్రము

కష్ట ములను దీర్చి కాపాడు నమ్ము.

వాయుపుత్రు హృదిని వరలేటి దేముడు .

నామ మంత్ర మహిమ నమ్మ  ఘనము !!


అన్నదమ్ములకత డాదర్శమగు స్ఫూర్తి.

పుత్ర ధర్మ మేలు పుణ్యమూర్తి    .

రమ్య మైన గాధ రామాయణమె గాద. 

రామ చరిత భువిని రసపు గుళిక.!!




----------------------------