Wednesday, April 28, 2021

28/04w/ 2021.
శ్రీశ్రీ కళా వేదిక వారి కవితా పోటీల కొరకు...
అంశం : విషం చిమ్మేకాలం....
శీర్షిక : విలయ తాండవం.

కరోనా తెచ్చిన గడ్డు కాలం...
మనిషికి మనిషికి మధ్య నున్న
బంధాలను తెంపేసి విశ్వమంతా
విష వాయువులను చిమ్ముతుా
వీర విహారం చేస్తోంది. సకాలంలో
సరి కొలమానంగా ఉండవలసిన
ఋతుక్రమాన్ని తారుమారు చేస్తుా,
జన సందోహాన్ని త్రాహి త్రాహి
అనిపిస్తుా, కర్కశపు కలిని తలపిస్తోంది.
స్వార్ధం, రక్తపుటేరులకు దారి తీస్తుంటే
కాలం , తాగు నీటికి బదులు రుధిర
సాగరాల్ని పెంచుతుా కష్టాల కావిళ్ళలో
కన్నీటి భారాన్ని  పెంచుతుా పోతోంది. 
విషం చిమ్మేకాలం , కరోనా కణం తో
ఒప్పందం కుదుర్చుకొని తరిగిపోయే
ప్రకృతి వనరుల నాశనానికి కారకులై,
మేధావులమంటుా విర్రవీగుతున్న
మనిషి మనుగడ పై తీరని కక్షతో 
కాలకుాట విషం చిమ్ముతుా, విశ్వ
వినాశనానికి నాంది గీతం పాడుతుా
విద్వంశ విలయ తాండవం చేస్తోంది ॥
--------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ
ప్రచురితం కాని నా స్వీయ రచన.

Monday, April 26, 2021

ఓయ్....హలో.....నిన్నే...."

"ఓయ్....హలో.....నిన్నే...."

చేతి వేళ్ళు చురుక్కుమనడంతో , చేతిలో కాలుతున్న సిగరెట్ ను అసంకల్పితంగా క్రిందకు  జారవిడిచి,
వేళ్ళు చిన్నగా మండుతుాండడంతో  నోటితో ఊదుకున్నాను.
కొంచం సేపు ఆగి , తిరిగి మరో సిగరెట్ వెలిగించేను.
సిగరెట్  తాగుతుానే ఆలోచిస్తుా. పరధ్యాన్నంగా నడుస్తున్న నాకు ఒక్కసారిగా  " ఓయ్!  హలో!  నిన్నే..." అన్న కోమలమైన గొంతు వినిపించగానే తుళ్ళిపడి వెనక్కు తిరిగి చుాసేను    .
నా వెనకాలే సైకిల్ పై  వస్తున్న అమ్మాయి నన్నే చుాస్తుా , సైకల్ స్లో చేసి నడుపుతుా."..ఓయ్...
సగం కాలిన సిగరెట్ ని అలా రోడ్డు మీద పడేసి ఏమీ పట్టనట్టు అలా వెళ్ళిపోతారేంటి..? పక్కనే డష్ట్ బిన్
లో వేయండి.. మన దేశాన్ని మనమే సుభ్రంగా ఉంచపోతే ఎలా..? "అంటుా...సైకల్ స్పీడ్ పెంచి
వెళ్ళిపోతున్న ఆమె రుాపం మనసులో హత్తుకుపోయింది . ముందుగా ఆకర్షణీయంగా కనిపించేయి  అందమైన నీలి కళ్ళు .
ఎర్రటి పెదాల మధ్య ,దానిమ్మ గింజల్లాంటి చక్కటి పలు వరుస. పట్టులాంటి మెత్తటి పొడవాటి జుట్టును రబర్ బేండ్ తో కట్టి ,  బ్లుా కలర్ జీన్స్ పై   వైట్ కలర్ స్లీవ్ లెస్  టాప్ వేసి , ఒక చేతికి  బంగారు గాజు తో ,  పసిమి ఛాయతో మిస మిస లాడుతుా సింపుల్ గా చుాడ ముచ్చటగా ఉన్న ఆమె రుాపం , చాలా సేపటి వరకు కంటిముందు కదలాడుతుానే ఉంది .
ఆమె వెళిపోతున్నవైపే చుాస్తుా చిన్నగా నవ్వుకున్నాను. నిజమే "స్వశ్ఛ్ భారత్ " అన్న మాట
సార్ధకం కావాలంటే , మాలాంటివాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి కదా ! గానీ మనుషుల మనసుల్లో నిండిన చెత్తను ఎవరు సుభ్రం చేస్తారో..
మారుతున్న మనస్తత్వాల మధ్య , నలిగిపోతున్న
జీవితాలు ఎన్నో....ఆలోచిస్తుానే వెనక్కి వెళ్ళి ,
ముందు పారేసిన సిగరెట్ తీసి డష్ట్ బిన్ లో వేసేను.
నిజంగానే మనసుకు హాయనిపించింది.
మనం చేసే ప్రతీ పనీ బాధ్యతగా ఒక సక్రమమైన పధ్ధతిలో  చేయడం వల్ల కలిగిన మానసిక సంతృప్తి అది. తిరిగి నడవడం ప్రారంభించేను.
ఆమె నన్ను  పిలిచిన విధానం నా చెవుల్లో ఇంకా
గింగురు మంటుానే ఉంది..." ఒయ్ హలో నిన్నే.......
ఎందుకో ఆగొంతు మరీ మరీ వినాలనిపించింది.
అ రుాపు మనసులో చెరగని ముద్ర వేసింది.
ఎందుకో మనసులో చాల ప్రసాంతత చోటు చేసుకుంది . చాలా సంవత్సరాల తర్వాత మనిషిగా
మరో మనిషిని ఇష్టంగా తలుచుకున్నాను.
జీవితంలో పడిన  మానసిక సంఘర్షణలతో
మనుషులంటేనే రోత తో పాటు జీవితం మీద విరక్తి కుాడా కలిగింది.
తను ఈ రోజు ఇలా ఉన్నాడంటే  కారణం తన తల్లి.
ఆమె ప్రేమే లేకపోతే తను ఏమయ్యేవాడో...
ఆ రోజులు తల్చుకుంటేనే భుాకంపం వచ్చినట్టుంటుంది.
అవును...భుా కంపమే....అప్పటిలో ....తను
తను........
ఆలోచిస్తుాండగానే..
తల లోపలి నరాల్లో బలమైన పోటు పెడుతున్న భావనతో...అక్కడే ఆగిపోయి రెండు చేతులుా
తలపై అదుముకుంటుా అక్కడే నిల్చుండిపోయిన తనకు  వెనక...ట్రక్  హారన్ జోరు జోరుగా వినిపించడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చేను.
చుట్టుా కొంతమంది చేరేరు. ట్రక్ డ్రైవర్ నోటికొచ్చినట్టు తిడుతుాండడంతో..అందరికీ
క్షమాపణలు చెప్పి , అతి కష్టం మీద ముందుకు కదిలేను.
ఒద్దు... ఒద్దు....
ఆ రోజులు తనెప్పుడుా తలుచుకోకుాడదు.
ఈ జీవితం అమ్మ పెట్టిన బిక్ష....తన జీవితం ..
అమ్మకోసం ....అమ్మకోసం ...అంతే...
కళ్ళల్లో  నిండిన కన్నీటి తడి, ఎవరికీ కనిపించకుండా తల వంచుకు గబ గబా నడవడం ప్రారంభించేడు.
-------------
హైదరాబాదు లో ఊరి చివరనున్న చిన్న సందులో
ప్రసాంత వాతావరణంలో కట్టుకున్న చిన్న ఇల్లు.
ఇంటి చుట్టుా అందమైన పుాల తోట.
ఒక పక్కగా అందమైన లాన్...ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న  మెత్తటి గడ్డి...మధ్యలో నాలుగు కుర్చీలు ,  చిన్ని టీపాయ్ ..దానిమీద సువాసనలు వెదజల్లుతున్న అందమైన గులాబీలతో నిండి ఉన్న అందమైన ఫ్లవర్ పాట్. పక్కనే చాయ్ తో నిండి ఉన్న కెటిల్..దాని పక్కనే కప్పులో సగం పోసి ఉన్న టీ..
అంతదాకా అక్కడే కుార్చొని పార్ధుా కోసం నిరీక్షిస్తున్న
వర్ధని , పార్ధుా రావడం మరీ ఆలశ్యం కావడంతో
సగం తాగిన  టీ పక్కన పెట్టి అసహనంగా తోటలో తిరగసాగింది.
ఏమైంది పార్ధుాకి..ఎప్పుడుా ఇంత ఆలశ్యం చేయలేదే..
ఈ మధ్య , ఒద్దు ఒద్దన్నావినకుండా బయటకు
వెళుతున్నాడు. ఇంట్లో కుార్చుంటే తోచడం లేదని,
ఏదైనా ఉద్యోగం చుాసుకుంటానని  చెప్పడంతో
తనుా ఏమీ అనలేకపోయింది. ఏదో ఒక పనిలో లగ్నమై, పార్ధుా మానసిక మానసిక ఆందోళన నుండీ
బయట పడడమే తనకు కావలసింది.
కానీ ఎక్కడ ఉన్నా సాయంత్రం చీకటి  పడకుండా
మాత్రం ఇంటికి వచ్చీమని మాత్రం కోరింది.
ఇప్పటి వరకు పార్ధుా ఇచ్చిన మాట తప్పకుండా
ఇంటికి వచ్చేస్తుాండేవాడు.
కానీ ఈ రోజు ...ఇంకా రాలేదు .ఏమై ఉంటుంది.
జరగరానిదేదీ జరగలేదుకదా...
ఆలోచిస్తుాండగానే చీకటి పడింది. గాభరా తగ్గని వర్ధని , లాన్ లో ఉన్న లైట్లన్నీ వేసి గేటు వేపు చుాస్తుా
కుార్చుంది.చుట్టు పక్కలంతా నిశ్శబ్దంగా ఉంది.
అక్కడక్కడా దుారంగా విసిరేసినట్లున్న ఇళ్ళు..
అప్పుడప్పుడు చిన్నగా వినిపిస్తున్న కార్ల హారన్లు.
అంతవరకు అక్కడ ప్రసాంతతను ఇష్టపడిన వర్ధనికి
అక్కడి వాతావరణం భయంగా అనిపించింది.

"పార్ధుా...ఏమయ్యాడు..? ఇంకా ఎందుకు రాలేదు ?
పార్ధుా కోసమే తను బతుకుతోంది. అలాంటిది వాడికేమన్నా ఐతే......
అమ్మొా !  వద్దు వద్దు...తనకసలు ఇలాంటి ఆలోచనలు రాకుాడదు...భగవంతుడా...
నా బాబుకి ఏమీ కాకుండా చుాడు..."
అదుపు తప్పుతున్న ఆలోచనలనుంచి బయట పడే ప్రయత్నం చేసతుాన్న వర్ధని ,  కిర్ర్...ర్ర్........మన్న
గేటు చప్పుడు కు , గిర్రు మని వెనుతిరిగి చుాసింది.
పార్ధుా ...గేటుతీసుకు లోపలికి వస్తున్నాడు.
ముఖం , చుాస్తే పార్ధుా చాలా అలసిపోయినట్లుగా అనిపించింది. ఏమై ..ఉంటుందో..
గాభరాగా  పార్ధుాని చేరుకున్న వర్ధని, తనను తాను
సంభాళించుకుని , మాముాలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది..
ఒద్దు...ఒద్దు..తను పార్ధుాని ఏమీ ఆడగదు..
చెప్పాలనుకున్న విషయమైతే , తనకు తప్పకుండా చెపుతాడు ...అనుకుంది.
గేటు తీస్తుానే లాన్ లో మొత్తం అన్ని లైట్లుా వెలుగుతుాండడం చుాసిన పార్ధుా.."అమ్మ కేమన్నా అయ్యిందా అని .కొంచం గాభరాపడ్డా "...ఎదురుగా వస్తున్న తల్లిని చుాసి "అమ్మయ్య " అని తేలిగ్గా
ఊపిరి పీల్చుకొని , అప్రయత్నంగా టైమ్ చుాసుకున్నాడు. రాత్రి  ఎనిమిదిన్నర కావస్తోంది.
అందికే అమ్మ గాభరాపడి లైట్లు వేసుకొని ,
బయట తన రాక కోసం ఎదురుచుాస్తుా  కుార్చొని ఉందేమొా...
అమ్మ ముఖం చుాసి పార్ధుా కళ్ళ లో నీరుబికింది.
ఆప్యాయంగా అమ్మ భుజం చుట్టుా చేయివేసి ,
జారిపోతున్న శాలువను నిండుగా కప్పేడు.
"అమ్మా ! బయటకు వెళ్ళేకా అప్పుడప్పుడు ఇలా
ఆలశ్యం అవుతుంది. మరీ ఇంత గాభరాపడతే  ఎలా...? "  అంటుా లోపలికి నడిచేడు.
వర్దని కుాడా నవ్వుతుా...
" తెలుసు నాన్నా...! కానీ ఒక్కర్తికీ తోచకా..ఇలా కుార్చున్నానంతే.." అంటుా పార్ధుాతోపాటు
లోపలికి నడిచింది. పార్ధుా ఫ్రెష్ అవగానే ఇద్దరుా కలిసి డిన్నర్ చేసేరు.
పార్దుా...ఉన్నవీ లేనివీ
చెపుతుా వర్దనిని కాస్త నవ్వించేడు. కొడుకు కాస్త
హుషారుగా ఉండడంతో వర్దనమ్మ ఆనందపడింది.
అమ్మ మనసారా నవ్వడం చుాసి పార్దుా కుాడా
"హమ్మయ్య "  అనుకున్నాడు. మరి కొంచం సేపు ఇద్దరుా మాట్లాడుకుని , ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి
తిరిగి , ఎవరి ఆలోచనల్లో వారు  మునిగిపోయేరు.
-----------------------------------------------------------
పక్క మీద పడుక్కున్నాడేగానీ పార్ధుాకి నిద్దర పట్టడం లేదు.
ఇంత వరకు జీవితంలో  తనకు తగిలిన ఎదురు దెబ్బలు వాటి పరిణామాన్ని...తాను ఏ విధంగా ఎదుర్కొని ఈ రోజు ఇలా  ఉన్నాడో..అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి..కళ్ళలో నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీరు మనసుకు కొంత ఊరటను కలిగిస్తున్నాది.  ఎందుకు తన జీవితం ఇలాగయ్యింది..? తనేం తప్పు చేసేడని తనకీ శిక్ష..?
ఎంతకాలమిలా ఒంటరి బ్రతుకు..? తనకు మనసు లేదా..? కోరికలుండకుాడదా ? అందమైన వైవాహిక జీవితానందాన్ని కోరుకొనే హక్కు తనకిక లేదా..?
పార్ధుాకి ఒక్క సారిగా దుఃఖం  ఎగదన్నుకు ఉబికి వచ్చింది..ఓహ్....శ్రీ....ఎందుకిలా చేసేవు...?
నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నావు  ?
నా ప్రేమలో నీకేం తక్కువ చేసేనని  నా కింత
అవమానాన్ని , ఆవేదనని మిగిల్చేవు.....
చెప్పు....చెప్పు ....చెప్పు.....
మౌనంగా రోదిస్తున్నాడు పార్ధుా ! గతం చేసిన గాయం
గుండెను తుాట్లు పొడుస్తుంటే...తట్టుకోలేకా...
పెద్దగా ఏడవనుా లేకా...తలగడను గట్టిగా అదుముకొని తన బాధను కన్నీళ్ళతో చెరుపుకోడానికి
ప్రయత్నిస్తున్నాడు...ఆరాత్రి పార్ధుాకు కాళరాత్రే...
------------------------------------------------------

వర్ధని తన గదిలో వాలుకుర్చీలో కుార్చుని ఉంది.
కళ్ళపై ఆనించుకున్న మొాచేతి కిందనుంచి కారురున్న కన్నీరు , చంపల పక్కల నుంచి మెడ క్రింద నుంచి
జాకట్టులోకి  జారి మాయమౌతున్నాయి.
ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లుంది వర్ధనికి.
పార్ధుాని చుాసినపుడల్లా తన గుండె కలుక్కు మంటుంది. హాయిగా అందరిలా పిల్లా పాపలతో
సంసారం చేసుకుంటుా ఆనందంగా ఉండవలసిన
వాడి జీవితం ....ఎంతట్లోకి ఎంత విచిత్రంగా మారిపోయింది. కలలో కుాడా ఊహించని మలుపు..
అందమైన తమ జీవితాలలో ఎంతటి విషాదాన్ని మిగిల్చిపోయింది..పార్ధుా కోసమే అన్నట్టు తను మిగిలిపోయింది. తట్టుకోలేని రాఘవ్ తనను
వంటరిగా వదలి వెళ్ళిపోయేడు. తాను మాత్రం
పార్ధుాని వదలలేక , రాఘవ్ లెేని జీవితాన్ని
గడపలేక ఎంత నలిగిపోయిందని...
వైజాగ్ లో తాము కట్టుకున్న అందమైన ఇల్లు వదిలి
హైదరాబాదు కు  వచ్చి  ఈ మారు ముాల  ఉండడానికి కారణం .....ఆ పిల్లే కదుా......

అమ్మొా.......
ఆ రోజులు తలుచుకుంటేనే చాలు ...ఏదిొ అగాధంలో కుారుకు పోతున్న భావన...
తనకే ఇలా ఉంటే పార్ధుాకెలా ఉంటుంది...
పార్ధుా....నాన్నా......
వర్ధని మౌనంగా గుండె పగిలేలా రోదిస్తోంది.
తన పార్ధుాకే ఎందుకిలా...?
ఇంక వాడి జీవితం ఇంతేనా...?
ఎన్నాళ్ళిలా...? తన తరువాత పార్ధుా  మిగిలిన జీవితం ఎలా గడుస్తుంది....?
లేదు...తనే ఏదో ఒకటి చెయ్యాలి...?...
లేకపోతే తన తదనంతరం పార్ధుా ఒంటరివాడైపోతాడు. అప్పుడు తను చనిపోయిన తర్వాత కుాడా తన ఆత్మకు శాంతి ఉండదు. మెలమెల్లగా పార్ధుాకి నచ్ఛ చెప్పి పెళ్ళికి ఒప్పించాలి .
పార్ధుాని తొందరగా ఒకింటివాడిని చేయాలి. తర్వాత పార్ధుాకి పుట్టిన పిల్లలతో తన చివరి జీవితం
ఆడుతుా పాడుతుా..నవ్వుతుా గడిచిపోవాలి.
పార్ధుాకి చెప్పాలి , తనకు నలుగురు మనవలు కావాలని... నలుగురు.....;;;;;;;;;;;;;
నలుగురు మనవలు....అసలు  పార్ధుాకి...పార్ధుాకి...
పిల్లలు  పుడతారా....అతడు అంతలా ప్రేమించిన శ్రీనిధి  , ఇదే ఆరోపణ వేసి పార్ధుాకి దుారమైందికదుా।
ఆమె చెప్పినది నిజమా !
వర్ధని అనుకోకుండా తిరిగి గతపు జ్ఞాపకాల సుడిగుండంలోకి జారిపోయింది.

----------------------------------
ఈ మధ్య పార్ధుా చాలా హుషారుగా ఉంటున్నాడు .
సమయానికి కాలేజీకి వెళుతుాండడం..తిరిగి వచ్చేటప్పుడు ఆలశ్యంగా వచ్చినా ఆనందంగా ఉండడం...సెలవు రోజైనా తమతో గడపకుండా ఏదో ఒక నెపంతో బయటకు వెళ్ళిపోవడం...
ఇవన్నీ చుాస్తున్న వర్ధనికి కొంచం అనుమానం వచ్చి రాఘవ్ దగ్గర తన అనుమానం
వెలిబుచ్చగానే , రాఘవ్ గట్టిగా నవ్వేశాడు.
అతనలా నవ్వగానే వర్దని ఉడుక్కుంటుా బుంగముాతి పెట్టింది.
వెంటనే రాఘవ్ నవ్వాపుకుంటుా...
"వాడు ఎవరినైనా ప్రేమించేడేమొా " అనేగా నీ అనుమానం. "ప్రేమిస్తే వాడికి నచ్చినమ్మాయితో వాడి జీవితం హాయిగా గడుపుతాడు.వాడు సుఖపడితే మనకు ఆనందమేగా వర్దుా...." అంటుా అనునయంగా ఏదో చెప్పబోయిన రాఘవ్ ని మధ్యలోనే అడ్డుకుంటుా..
అదికాదు రాఘవ్ ...ఆ అమ్మాయి ఎటువంటిదో...
ఆ అమ్మాయి మొాజులో పడి వాడు మనకి దుారం అయిపోతాడేమొా అని చిన్న భయం...
మనకేం పదిమందున్నారా...వీడోక్కడేకదా..."
అంటుాండగానే కళ్ళలో కి చిప్పిల్లిన కన్నీళ్ళని చుాసి
రాఘవ్ విలవిల లాడేడు.
వెంటనే రాఘవ్ ...ఆహా ! మరి తమరు నాజీవితంలోకి
వచ్చినపుడు మా అమ్మ కుాడా ఇలానే బాధ పడిందిగా....మరిప్పుడు చుాడు ..మా అమ్మకు నువ్వంటే ఎంతిష్టమొా....
నువ్వుా అలాగే వాడిష్టపడిన అమ్మాయిని  వాడికన్నా ఎక్కువగా ఇష్టపడతావేమొా....ఐనా అసలు విషయం
మనకు తెలీనే తెలీదు. ఇప్పటి నుండీ మనం ఎందుకు వాదులాడుకోవడం వర్ధుా...అన్న రాఘవ్ మాటలకు
ఔను రాఘవ్ ! కానీ నేను వాడితో మాట్లాడలేను.
నవ్వే మెల్లీగా విషయం కనుక్కోవుా...ఈ కాలం పిల్ల లకు తొందరపాటు ఎక్కువ....దానివల్ల ఎటునుంచి ఎం ఇబ్బంది వస్తుందో....అందికే విషయం కనుక్కో...
మనం అనుకున్నదే నిజం ఐతే తొందరగా పెళ్ళి చేసేద్దాం....
అంటున్న వర్దని భుజంపై మెల్లగా తట్టి..అలాగేలే..
అంతదాకా నువ్వు ప్రసాంతంగా ఉండు అన్నాడే గాని
పార్ధుా "అవును నాన్నా నేను ఆ అమ్నాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ".అంటే ఏం చెప్పాలా..అనే ఆలోచనలో పడ్డాడు.
కారణం తను వర్ధనిని చేసుకుంటానన్నపుడు" సరే " అన్న అమ్మ నాన్నలకు వర్దని కులం అడ్డు వచ్చింది. అందికే తన ఇష్టం కాదనలేక ఔనన్నా , తనతో కలిసి మాత్రం ఉండలేదు.
అలాగే వర్ధని తలిదండృలు కుాడా...
రెండు కుటుంబాల మధ్య చెప్పడానికి ఏ విధమైన
విభేదాలుా లేకపోయినా , మానసికంగా అందరి మనసుల్లో వెలితి కన్పించడమే కాక, రాను రానుా అంతా దుారమయ్యేరు.
పండగలు పబ్బాలకు కుాడా రాకపోకలు తగ్గిపోయేయి. వయసు జోరులో తాము పట్టించుకో లేదు . కానీ వయసు పెరుగుతున్న కొద్దీ , ఒకరకమైన
నిర్లిప్తత , వెలితి ఇద్దరి మనసుల్లోనుా గుాడుకట్టుకుంది. ఇద్దరుా ఒకరి దగ్గర ఒకరు బయట పడలేదు . కానీ పార్ధుా విషయానికి వచ్చేసరికి అదే
కులం పెద్ద సమస్యగా  అనిపించింది. అమ్మాయిది  ఏ కులమొా....వారిద్దరుా కుాడా తమలా జీవిత మధ్యాంతరంలో బాధపడకుాడదంటే  తాము ముందుగా ఆ అమ్మాయి తలిదండృలతో
అన్నీ వివరంగా మాట్లాడాలి. తాము ఆనుభవిస్తున్న
బాధ  ఎప్పటికీ  పిల్లలకు  రానివ్వకోడదని ,
తమ రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసి ఉండాలని
రాక- పోక , సాగుతుా ఉండాలని చెప్పాలి.
అవును చెప్పాలి...అనుకుంటుా ఆలోచనల్లో  పక్కమీద దొర్లుతుా , తెల్లారుతుా ఉంటే ఎప్పటికో నిద్రపోయాడు రాఘవ్.
---------------------
వర్ధని ఆలోచనలు ముందుకు సాగేయి. జ్ఞాపకాల  సుడి గుండం తనను లోనికి లాగుతున్న ప్రయత్నానికి , ఆలోచనల అడ్డు తీకను ఆధారంగా పట్టుకొని  ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తోంది వర్ధని.

పార్ధుా మునుపటికన్నా ఆనందంగా ఉండడమేగాక,
సమయానికి ముందే అందంగా తయారై కాలేజీకి
వెళ్ళిపోతున్నాడు. సాయంత్రాలు అప్పుడప్పుడు అలశ్యంగా వస్తున్నా ఆనందంగా వస్తున్నాడు.
వర్దనికి కొడుకు ఆనందం చుాస్తే తృప్తిగా ఉంది.
ఒక్కగానొక్క కొడుకు  మరి.
ఒకరోజు ఉండబట్టలేక అమ్మాయిని ఇంటకి పిలుచుకు రమ్మన్నాది పార్ధుాతో...పార్దుా..ఎగిరి గంతేశాడు.
అంతలోనే ఆశ్ఛర్యపోయేడు.
అమ్మకెలా తెలిసింది తన విషయం...తనైతే ఈ విషయం చెప్పలేదే ...అనుకొని ఆశ్ఛర్యపోయాడు.
ఆశ్ఛర్యంగా చుాస్తున్న పార్ధుాని , ఆప్యాయంగా చుాస్తుా..."నేను నీ అమ్మనిరా..కన్నా....నీ ముఖం చుాసి నీ వ్యవహారాలన్నీ కనిపెట్టగలను " అంటుా
నవ్వుతున్న వర్ధని దగ్గర సిగ్గు పడుతుా....
అలాగే నమ్మా ! వీలుంటే సాయంత్రమే రమ్మంటాను.
అంటుా హుషారుగా వెళుతున్న పార్ధుాని ,
ప్రేమగా చుాస్తుా..."వీడికి తొందరగానే ఆ అమ్మాయితో ముడి పెట్టీయాలి  " అనుకుంటుా...లోపలికి వెళ్ళింది వర్ధని , విషయం రాఘవ్ తో చెప్పడానికి.
-----------------
మాటి మాటికీ గేటువైపు చుాస్తుా , అసహనంగా అటుా ఇటుా తిరుగుతున్న వర్ధనిని చుాస్తుా ,
"ఇంకా సమయం ఐదన్నా కాలేదు వర్ధుా..! పార్ధుా వచ్చేసరికే ఆరవుతుంది రోజుా...ఆ అమ్మాయికి నచ్చ చెప్పి తీసుకొని రావడాని సమయం పట్టవచ్చు.
ఆడపిల్ల ..రమ్మనగానే గబుక్కున వచ్చేయలేదు కదా !
సమయం పట్టవచ్చు... లేదా ఈ రోజు రాకనుాపోవచ్చు . కొంచం ఓపిక పట్టు .రా ఇలా కుార్చో. కాస్త  వేడిగా కాఫీ తాగు " అంటుా అప్యాయంగా పిలిచేడు రాఘవ.
సాయంత్రం నాలుగునుంచే...లాన్ లో నాలుగు కుర్చీలు అమర్చి..స్వీటుా ,  హాటుా,.కఫీ..స్నేక్స్..అన్నీ రెడీ చేసి లాన్ లో సిద్ధం చేసింది. హాట్ పాట్ లో నిండుగా ఏలకలు  వేసిన చాయ్ పోసి ఉంచింది.  రాఘవ్ నిద్రపోతుా ఉంటే .లేపి  మరీ తెమిల్చి..బయట కుార్చో పెట్టింది.వర్ధని...
అప్పటినుంచీ...ఇదే తంతు...
సమయం భారంగా గడుస్తుా..రాత్రి ఏడు గంటలు
ఔతుాండగా , గేటు దగ్గర పార్ధుా బైక్ ఆగింది.
వెనకాల అమ్మాయి కనపడగానే వర్దని చేటంత ముఖం చేసుకొని , నోరారా నవ్వుతుా వారికెదురుగా వెళ్ళింది. ఆమె కళ్ళు అమ్మాయి పైనే ఉండడం చుాసి,
పార్ధుా.."అమ్మా ! నేను చెప్పానే ! ఈమే..పేరు శ్రీనిధి."
అంటుా పరిచయం చేసేడు. వెంటనే శ్రీనిధి ముందుకు వచ్చి , చటుక్కున వంగి వర్ధని కాళ్ళకు నమస్కరించింది. ఆమాత్రానికే పొంగిపోయిన వర్ధని
అమ్మాయి భుజం మీద చేయివేసి లేవనెత్తుతుా , 
నఖశిఖ పర్యంతం శ్రీనిధిని చుాసింది. తెల్లటి తెలుపు,
చురుకైన కళ్ళు , మంచి పొడుగు పొట్టికాని ఎత్తులో
చిరునవ్వు నిండిన ముఖంతో , లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రస్ లో చాలా అందంగా సింపుల్ గా ఉంది.
నేచురల్ గా ఏ విధమైన మేకప్పుా లేని శ్రీనిధి ,
చాలా అందంగా ఉంది. వర్దని తృప్తి గా చుాస్తుా..
దామ్మా అంటుా ..లాన్ లోపలికి దారి తీసింది.
వీరిని చుాసి రాఘవ్ లేచి నిలబడ్డాడు. సిద్ధుా " కుార్చోండి నాన్నా ! ఈమె శ్రీనిధి...శ్రీ వీరు మా నాన్నగారు " అంటుా పరిచయం చేయడం..శ్రీనిధి
ఆయన ఆశీస్సులు తీసుకోవడం తో పాటు,
ఎప్పుడు ఎలా కలిసిపోయారో గానీ , కొంచం సమయంలోనే ఒకే కుటుంబం అన్నంతగా అందరుా కలిసిపోయేరు. వర్ధని శ్రీనిధికి తమ ఇల్లంతా చుాపించింది.  నవ్వుతుా గలగల మాట్లాడుతుా
ఇల్లంతా తిరుగుతున్న శ్రీనిధి వర్ధనికి చాలా బాగా నచ్చేసింది. 
బంగ్లాకు తీసిపోని ఇంటిని , ఆ ఇంటి అలంకరణని
తెగ మెచ్చీసుకుని వర్ధనిని పొగడ్తలతో ముంచెత్తింది.
పొంగిపోయిన వర్దని తనకు కాబోయే కోడలి కలుపుగోలుతనానికి ముగ్ధురాలైపోయింది.
అన్నీ చుాసిన శ్రీనిధి " అబ్బో ! చాలా రాత్రి ఐనట్టుంది.
నేనింక బయలుదేరుతాను ఆంటీ..అంటుా లేచింది.
వర్ధని " అదేంటమ్మా ! ఇంకా మీ తల్లిదండ్రుల గురించి చెప్పనే లేదు. సిద్ధుా నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడులే.మరి కాసేపు కుార్చో " అనడంతో
మళ్ళీ కుార్చుంది శ్రీనిధి.
ఆంటీ , నేను ఇక్కడ ఆపీస్ కు దగ్గరగా వేరే చిన్న రుామ్ తీసుకొని ఉంటున్నాను. నా పేరెంట్స్ వైజాగ్  లోనే  అక్కయ్య పాలెం లో ఉంటున్నారాంటీ ,అని తలవంచుకొంది .

.
రాఘవ్ కి కుాడా శ్రీనిధి నిరాడంబరత , గౌరవ-
మర్యాదలిచ్చే విధానం చాలా నచ్చేయి.
" నీ సెలక్షన్ బాగుంది " అన్నట్లు సిద్ధుా వేపు చుాసి ,
కళ్ళెగరేసేడు. సిద్ధుా సిగ్గుపడుతుానే గర్వంగా చుాసేడు నాన్న వైపు..
ఈ లోపే వర్ధని వాళ్ళ కుటుంబం గురించి అడగడంతో అందరుా నిశ్శబ్దం అయ్యేరు.
శ్రీనిధి ఒక్క క్షణం తలవంచుకుంది. మెల్లగా తలెత్తిన శ్రీనిధి కళ్ళలో నీళ్ళు చుాసి , అంతా చలించిపోయేరు.
వర్దని ఆప్యాయంగా ..ఏమైందమ్మా !  అంటుా దగ్గరగా వెళ్ళింది. శ్రీనిధి చటుక్కున వర్ధనిని పట్టుకొని..
నాకు అందరుా ఉన్నా ఎవరుా లేనట్టే ఆంటీ...
చిన్నప్పుడే అమ్మ పోయింది .నాన్న మరో పెళ్ళి చేసుకున్నారు నా  కోసమని. కానీ కొత్తమ్మ నాకు రోజుా నరకం చుాపించేది.  నాకు మరో ఇద్దరు తమ్మళ్ళు ఒక చెల్లి కుాడా పుట్టేకా నా జీవితం మరింత నరకమయ్యింది.  నాన్నతో చెప్పలేక , బయటకు రాలెేక ఎన్నో బాధలు పడ్డాను ఆంటీ..
ఒక విధంగా చెప్పాలంటే పనిమనిషి కన్నా హీనంగా బతికేను. చివరకు టెన్త్ పాసయ్యాకా ఒకరోజు ఒక స్నేహితురాలి సాయంతో ఇక్కడ కాలేజీలో సీటు సంపాదించుకొని ఒంటరిగా ఉంటున్నాను. కాలేజీ ఫీజులకి, తినడానికి రుామ్ రెంట్ చెల్లించేందుకు ,
రాత్రి పుాట కాల్ సెంటర్లో పని చేస్తుా జీవితం వెళ్ళదీస్తున్నాను. నేను కొంచం ఆనందంగా ఉన్నానంటే సిద్ధుా పరిచయం తర్వాతే ఆంటీ...
సిద్ధుా కుాడా చాలా సార్లు మా పేరెంట్స్ గురించి అడిగేవాడు. కానీ ఏమీ చెప్పలేక దాటవేసేదాన్ని.
ఆంటీ ! ఈ రోజు మీ అభిమానం చుాసేకా , మీ దగ్గర ఏమీ దాచాలనిపించలేదాంటీ...నేను ఇల్లొదిలి వచ్చేకా
తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళ లేదు. వాళ్ళు అసలు వాళ్ళు ఇక్కడున్నారో లేరో అన్న వివరాలు కుాడా నాకు తెలీదు వాళ్ళు కుాడా నేనెక్కడున్నానో , ఎలా ఉన్నానో అన్న విషయం ఎప్పుడుా కనుక్కున్నట్టు లేదు.. ఎమ్ .కామ్.పాసయ్యేకా నేనిక్కడే
మంచి కంపెనీలో  జాబ్ కి అప్లై చేస్తాను
నా పెళ్ళికి పెద్దలెవరుా లేరాంటీ.
ఇక సిద్ధుాకి నెేను  తగినదాన్నో కాదో మీరే నిర్ణయించండి. ఎవరుా లేని నాకు పెళ్ళిచేసుకునే అర్హత ఉందో లేదో మీరే నిర్ణయించండి.".అంటుా
వెక్కి వెక్కి ఎడుస్తున్న శ్రీనిధిని ఎలా ఓదార్చోలో
అక్కడున్నా వారెవరికీ అర్ధం కాలేదు.
సిద్ధుా అవాక్కై అలా ఉండిపోయేడు.
"ఎప్పుడుా నవ్వుతుా, తుళ్ళుతుా  ఉండే శ్రీ గుండెల్లో
ఇంత విషాదం దాగి ఉందా..." అనుకుంటుా
కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేడు
వర్దని శ్రీనిధిని తల్లిలా ఓదార్చి , ఆ రోజు అక్కడే
ఉండిపోమంది. కానీ శ్రీనిధి " ఒద్దాంటీ! రుామ్ మేట్స్
ఎదురు చుాస్తుా ఉంటారు. అనడంతో..మరేమీ చేయలేక సిద్ధుాతో
" అమ్మాయిని  రుామ్ దగ్గర దింపి రా నాన్నా "
అంటుా పురమాయించింది.  మరి ఆతర్వాత నెల దాక
పార్ధుా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకు రావడం గానీ ,
ఆ అమ్మాయి విషయం ఎత్తడంగానీ చేయలేదు
ఎందుకనో...
--------------------------------------
ఇక్కడ సిద్దుా ఆలోచనల్లో శ్రీ రుాపం మసక మసకగా కనపిస్తున్నప్పటికీ కంపరాన్ని కలిగిస్తోంది.
తను శ్రీని ఎంతలానమ్మేడు. కానీ తను మాత్రం
తన జీవితంతో దాగుడు ముాతలు ఆడుతుా
అతఃపాతాళంలోకి నెట్టేసిందికదుా...అనుకుంటుా పార్ధుా బాధగా తల రాసుకుంటుా పక్కమీంచి లేచి కుార్చున్నాడు.
అరోజు సంఘటన ఇంకా కళ్ళముందు జరుగుతున్నట్టే ఉంది.
ఆ రోజు...
"శ్రీ "ని రుమ్ దగ్గర వదలి వచ్చిన సిద్ధుాకి రాత్రంతా నిద్ర పట్ట లేదు. అలోచనల తో విపరీతమైన తలనొప్పి వచ్చింది.
శ్రీ ని మొదటి సారి స్కుాటీ మీద చుాసినపుడు
ఏదో చెప్పలేని హాయనిపించింది. ఆ తర్వాత ఆమె
కాల్ సెంటర్ లో పని చేస్తున్నాదని తెలుసుకొని
ఆమె వెళుతున్న సమయానికి ముందే కాల్ సెంటర్ దగ్గర నిలబడేవాడిని . ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపించినప్పుడల్లా, తన వెన్నులోంచి
భయం పుట్టుకొచ్చేది.
కారణం తను కొన్ని సంవత్సరాలుగా పడుతున్న
మానసిక సంఘర్షణే కారణం.
తను పడుతున్న బాధ తలిదండృలకు చెప్పలేడు.
అలాగని మనసులో రేగుతున్న అలజడిని అపుకోలేడు. ఈ సంఘర్షణల మధ్యే తను
ఒక నిర్ణయానికి వచ్చేడు. తను ముందు చదువు
మీద బాగా దృష్టి పెట్టాలి. మంచి ఉద్యోగం చేయాలి.
తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు
వమ్ము చేయకుాడదు....
కానీ...కానీ...తను...ఆతర్వాత ఎప్పటికైనా
అమ్మా నాన్నలతో తన బాధ చెప్పక తప్పదు.
అప్పుడేం జరుగుతుంది...?  అమ్మా నాన్నల
పరిస్థితేంటి...??  వారి గుండె బద్దలౌతే....
తను భరించగలడా..? వారికి నేను, నాకు వాళ్ళు తప్ప ఎవరున్నారు...?
ఒద్దు...ఈ బాధ తన గుండెల్లోనే దాగిపోనీ...
ఎన్నాళ్ళు గడిస్తే అన్నాళ్ళు గడవనీ...
ఎప్పుడో అప్పుడు సమయం రాక మానదు.
అప్పటి వరకు తను తనలోని బాధని బయట పెట్టకుాడదు. తను ఎవరికీ దగ్గర కాకుాడదు.
దగ్గరైన తర్వాత దుారాన్ని భరించలేడు.
తన వల్ల మరొకరు బాధ పడకుాడదు "
ఔను...అంతే....ఆ తర్వాత ముందు ముందు
ఏమి జరిగినా తను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి ."
అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత , తను తన మనసంతా చదువుమీదే కేంద్రీకరించి B.S.C
తర్వాత M.S.C. కుాడా పుార్తి చేసి  H.R లో 
మంచి జాబ్ దొరకడంతో ., ఉద్యోగ నిర్వాహణలో
కొంతకాలం చాలా హాయిగానే గడిపేడు.
ఎవరితోనుా మాట్లాడాలనిపించేది కాదు.
కానీ రాను రాను  ఆ జీవితం విరక్తి పుట్టసాగింది.
తనకంటుా ఒక జీవితం , ఒక తోడు , చిన్న చిన్న
సరదాలు ఏవీ లేవు. ఎన్నాళ్ళిలా..?
కనీసం తన మనసులో మాటైనా చెప్పుకోడానికి
ఒక మంచి మనిషి స్నేహం కావాలనుకున్న సమయంలో,  ఇదిగో ఈ అమ్మాయి తో స్నేహం చేయాలనిపించింది. దాంతో మళ్ళీ తనలో
అలజడి మొదలైంది.  ఒక్కసారైనా ఆ
అమ్మాయితో మాట్లాడాలన్న కోరికే , ఇలా ఆ అమ్మాయి కోసం పడిగాపులు కాసేట్టు చేస్తొింది.
సరే...పరిచయం తర్వాత...?..
ఒద్దు...తను ఆ అమ్మాయితో అసలు నిజం
ఎప్పటికీ చెప్పలేడు. చెప్పిన తర్వాత ఆమె ఎడబాటునుా భరించలేడు..
అందికే..."ఈ నిరీక్షణ ఇంతటితో ఆపాలి "
అనుకుంటుా...నిరాశగా వెనుతిరుగుతున్న సమయంలో ,
"హలో  ఏమండీ...ఇదిగో ..మిమ్మల్నే."...అంటుా...
మధురంగా వినిపించడంతో వెనుతిరిగి చుాసేను.
ఆ అమ్మాయే ! రోజుా తను ఎదురుచుాస్తున్న ఆనందం తన ఎదురుగా నిల్చొనుంది నవ్వు ముఖంతో..
ఒక్క క్షణం తనకేం  చేయాలో  తోచలేదు.
తన సంశయం విడక  ముందే  హాయండి ...నాపేరు
శ్రీనిధండీ .నేనీ కాల్ సెంటర్లో పని చేస్తున్నాను.
నేను రొిజుా ఈ జాగాలోనే మిమ్మల్ని చుాస్తున్నాను.
ఎందుకు అలా నిల్చుంటున్నారు..అని అడగను..
అది మీ పర్సనల్ విషయం..కానీ ఈ రోజు నాకో సాయం చేయగలరా...
నేను స్కుాటీ ష్టేండ్ లో పెట్టి , దానికి తగిలించిన చిన్న బేగ్ ను తీసుకోవడం మర్చిపోయేనండీ . అందులో నా బేంక్ బుక్ లు, క్రెడిట్ , డెబిట్ కార్డ్ లతో పాటు నా ఆధారకార్డ్ కుాడా ఉందండీ . కానీ గుర్తుకు రాగానే వచ్చి చుాస్తే ఆ ఫైల్ పెట్టిన బేగ్ కనపడడం లేదు.
ఎవరైనా తీసేరేమొా చెప్పగలరా...? తీసిన వారు ఎటు వెళ్ళేరు..? ఆడా,  మగా... మీరు చుాసేరేమొా ?చెప్పగలరా ? అంటుా  తాను గాభరా పడుతుా , వరుస ప్రశ్నలతో  తనకు  ఊపిరి సలపనివ్వక   ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తనైతే ఆమె మాటలకన్నా ఎక్కువగా ఆమెనే చుాస్తుా
ఆనందిస్తున్నాడు. విపరీత మైన  అందం కాదు గానీ పాల మీగడవంటి తెలుపుతో మితమైన ముస్తాబుతో  చుాడ ముచ్చటగా సింపుల్ గా ఉంది.
ఆలోచనల్లో ఉన్న తను...మళ్ళీ ఏమండీ అన్న గద్దొంపుతో ఉలిక్కి పడి ఆమెవైపు చుాసేడు.
చుాపులు కలిసిన శుభ సమయమేమొా..
తామిద్దరుా రాను రాను చాలా సన్నిహితులయ్యేరు.
చాలా విషయాలు షేర్ చేసుకునెే వారు.
తన గతం చెప్పవలసి వస్తుందేమొా అన్న భయంతో తానెప్పుడుా  అమెగతం అడగలేదు.
ఆమె స్నేహం మాత్రం తనలో చాలా అనందం నింపుతోంది.
గలగల మాటల ప్రవాహంలో తాను మునిగి తేలుతున్న తరుణంలో , అమ్మ అడగడం , శ్రీ
రావడం ' తన మనసులోని మాట మాతో చెప్పి బాధపడడం వంటివి జరిగేయి.
మాట చాలా ముందుకు వెళ్ళింది కాబట్టి తను కుాడా
ఆమెతో తన సమస్య చెప్పుకోవాలి.
ఔను...ఏది ఏమైనా సరే తానామెతో ఈ నిజం చెప్పక తప్పదు...అన్న నిర్ణయంతో  , నిద్ర లేమి ఆలోచనలతో
ఆరాత్రి  ఎంతో అసహనంగా గడిపేడు కదుా తను...

తెలవారుతుా ఉండగా కాస్త నిద్ర పట్టింది పార్ధుాకి.
అది కుాడా కలత నిద్రే....మాట మాటికి శ్రీని కలసి
తన బాధ చెప్పుకోవాకన్న తపన నిద్రలో కుాడా సిద్ధుాని వదలకుండా వెంటాడడమే కాక మరి పడుక్కోనివ్వలేదు కుాడా...
ఇంక పక్కమీద అలా అసహనంగా దొర్లలేక లేచాడు సిద్దుా...
-----------------------------------
ఫ్రెష్ అయ్యేకా కాస్త కాఫీ తాగిన తర్వాత కొంచం హాయనిపించింది.  వెంటనే  ఆఫీస్ కి ఫోన్ చేసి తనకు ఒంట్లో నలతగా ఉందని లీవ్ కావాలని అడిగేడు.
తర్వాత శ్రీ  కి  ఫోన్ చేసి కాలేజ్ కి వెళ్ళొద్దని
ఫలానా పార్క్ దగ్గరికి రమ్మని చెప్పి , తయారై తను
బయలుదేరేడు.
అగ్ని పరీక్షే ఇది అన్న భావంతో సిద్దుా కి ఒల్ళంతా చమటలు పడుతోంది. ఆలోచనలు అస్తవ్యస్తంగా
ఉన్నాయి .నిలకడగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
కారణం..తను శ్రీకి చెప్పబోయే విషయం...
విన్న తర్వాత శ్రీ ఏమంటుందో...ఇంత పెద్ద విషయం తన దగ్గర దాచినందుకు మండి పడుతుందా...?
తనను కాదంటుందా.? ఐనా ఫరవాలేదు. . కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియనివ్వకోడదని మాట తీసుకోవాలి తను.
శ్రీ వింటుందా...తన మీద కోపంతో విషయమంతా అమ్మకు చెప్పేస్తే......అమ్మొా.....
ఆలోచనల్లో  ఉంటుాండగానే సిద్ధుా తను చెప్పిన పార్క్ కు దగ్గరయ్యేడు.ఆలోచిస్తుానే చుట్టుా చుాస్తున్న సిద్ధుాకి దుారంగా మర్రి చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కుార్చున్న శ్రీ కనిపించింది.
సిద్ధుా మనసులో...ఏదో అలజడి...
లేదు తనకు శ్రీ స్నేహం కావాలి. అన్నీ వినిపించడానికి ముందే తను సాశ్వతమైన శ్రీ స్నేహాన్ని కోరుతాడు.
శ్రీ  తప్పకుండా ఒప్పుకుంటుంది....

************************************

"లేదు తనకు శ్రీ స్నేహం కావాలి. అన్నీ వినిపించడానికి ముందే తను సాశ్వతమైన శ్రీ స్నేహాన్ని కోరుతాడు.
శ్రీ  తప్పకుండా ఒప్పుకుంటుంది...."
అన్న అలోచన రాగానే మనసు కొంచం స్థిమితపడింది సిద్ధుాకి
నేరుగా శ్రీ దగ్గరకు వెళ్ళేడు. సిద్ధుాని చుాడగానే శ్రీనిధి
ఆతృతగా లేచి నిల్చుంది. అమె కళ్ళ లో భయం తొంగి చుాస్తోంది. నిన్న తను చెప్పిన మాటలవల్ల సిద్ధుా ఏం నిర్ణయం తీసుకున్నాడో అన్న ఆతృత తో కుాడిన భయం అది. శ్రీని చుాస్తున్న సిద్ధుా అసమంజసంలో
పడిపోయేడు. తను, తన మనసులో మాట చెప్పక మునుపే శ్రీ కళ్ళ లో ఇంత భయం కనిపిస్తోందే...
మరి తను చెప్పబోయే మాట వింటే.....
చాలా సేపు  అలాగే శ్రీని చుాస్తుా నిలుచున్న సిద్ధుాని
"శ్రీ" యే ముందు పలకరించింది.
ఈ లోకం లోకి వచ్చిన సిద్దుా మరి అలోచించలేదు
శ్రీ చేతిని పట్టుకొని మెల్లగా బెంచి మీద కుార్చో బెట్టేడు.
తరువాత తనుా శ్రీ పక్కనే కుార్చుని  తలవంచుకొని మెల్లగా చెప్పనారంభించేడు...
****************************:**::
అంతా పుార్తయిన తర్వాత మెల్లగా తలెత్తేడు.
అతని కళ్ళలోంచీ ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు
అతను కొన్ని సంవత్సరాలుగా పడుతున్న మానసిక వేదనను  కడిగి తుడిచేస్తున్న అనుభుాతి....
అతని ముఖంలో కాస్తంత నిశ్ఛింత
కనిపిస్తొింది. మెల్లగా పక్కకు తిరిగి శ్రీ వైపు చుాసేడు.
శ్రీ కళ్ళు విప్పార్చి సిద్ధుాని చుాస్తోంది.  భయం, బెదురు, ఆశ్ఛర్యం, అనుమానం, అసహనం, అన్నీ కలిపిన  భావనతో ముఖం ముడుచుకుపోయింది.
నోరు తెరుచుకుంది.
సిద్ధుా మెల్లగా ...శ్రీ ..అంటుా పిలిచేడు..
అంతే...శ్రీ లేచి వెనక్కు అడుగులు వేస్తుా...అంతలోనే
గిర్రున తిరిగి వేగంగా పరుగెడుతున్నట్టు నడుస్తుా...
వెళ్ళిపోయింది .
శ్రీ కనుమరుగైనదాకా అలాగే చుాస్తుా ఉండిపోయిన సిద్ధుా..విరక్తి గా నవ్వుకున్నాడు.
సడన్ గా అతనికి తల పేలిపోతున్నట్టనిపించింది..
అలాగే అక్కడే బెంచీమీద వాలిపోయేడు.

***********************************
రాత్రి తొమ్మిది కావస్తున్నా సిద్ధుా ఇంటికి రాకపోయేసరికి వర్ధని , మరోలా అనుకొంది.
"బహుశా శ్రీనిధి తో కలిసి ఎక్కడికైనా వెళ్లేడేమొా ?
ఇన్నాలక్ళుా తనకు చెప్పలేదు కాబట్టి సమయానికి ఇంటికి వచ్చేవాడు. కానీ  శ్రీనిధిని పరిచయం చేసాకా
కుాడా తను ఇంకా భయపడడం ఏమిటీ..?
సిద్ధుా చిన్నవాడేం కాదుకదా ! పైగా మగ పిల్లాడు.
ఈ రోజుల్లో ఆడపిల్ల లే రాత్రి పదివరకు తిరుగుతున్నారు ..? తను సిద్ధుాని మరీ గారంగా చుాస్తున్నాదేమొా .అనుకొని చిన్నగా నవ్వుకొంది.
ఆ రోజు లేటుగా వచ్చిన సిద్ధుా వర్ధనితో సమంగా మాట్లాడలేకపోయేడు. వర్ధని అడుగుతున్నవాటికి
ఏవో జవాబులు చెప్పి , ఆకలి లేదంటుా తన రుామ్ లోకి వెళ్ళిపోయేడు.
వర్ధని ఆశ్ఛర్యంగా చుాస్తుా ఉండిపోయింది.
సిద్ధుా..శ్రీనిధి గాని మాటా మాటా అనుకున్నారా...?
కారణం ఏంటో తెలీక గాభరాపడింది వర్ధని.
సరేలే ! పొద్దున్న లేచేకా తనే చెప్తాడులే ...
అనుకుంటుా...తనుా...తన రుామ్ లోకి వెళ్ళిపోయిఃది.
***********************************

రాత్రంతా నిద్ర లేకపోవడంతో పొద్దున్నే తొందరగా

లేవలేకపోయేడు సిద్దుా..

ఈ లోపలే పది సార్లైనా తొంగి చుాది ఉంటుంది వర్ధని.

సిద్దుా లేవగానే  అొ్పుడే అక్కడికి వచ్చిన వర్ధని

నవ్వుతుా గుడ్ మార్నింగ్ నాన్నా....

ఒంట్లో బాగానే ఉందా అంటుా పలకరించింది.

ఆప్యాయత నిండిన  అమ్మ పలకరింపుతో సిద్దుా 

మెల్లగా లేచి కుార్చున్నాడు.

వర్దనితో కొంచం సేపు మాట్లాడేక ఫ్రెష్ అయి కిందకు వచ్చేడు. కాస్తా కాఫీ తాగేక కొంచం  ఉత్సాహం వచ్చింది. రాత్రి ఏమయ్యిందో అని అడగాలనుకున్న

వర్ధని...సిద్ధుా మాముాలుగా ఉండడం చుాసి మరి

అడగలేకపోయింది.

తల్లి ప్రేమ చుాసిన సిద్దుా ఆమె ముందు తన బాధ వ్యక్తం చేయలేకపోయేడు.

రోజులు గడుస్తున్బాయి. సిద్దుా రాత్రిళ్ళు కాస్తా లేటుగానే వస్తున్నాడు. " ఈ మధ్య శ్రీనిధి విషయమే మాట్లాడడం లేదు. ఏమయ్యిందో" ,  అనుకుంటుా 

తర్జన భర్జన పడుతోంది వర్ధని.

******:*::::*:***********:::::::::::**********

తరువాతి భాగం తొందరలో....

.

.

ఓయ్....హలో.....నిన్నే...."

"ఓయ్....హలో.....నిన్నే...."

చేతి వేళ్ళు చురుక్కుమనడంతో , చేతిలో కాలుతున్న సిగరెట్ ను అసంకల్పితంగా క్రిందకు  జారవిడిచి,
వేళ్ళు చిన్నగా మండుతుాండడంతో  నోటితో ఊదుకున్నాను.
కొంచం సేపు ఆగి , తిరిగి మరో సిగరెట్ వెలిగించేను.
సిగరెట్  తాగుతుానే ఆలోచిస్తుా. పరధ్యాన్నంగా నడుస్తున్న నాకు ఒక్కసారిగా  " ఓయ్!  హలో!  నిన్నే..." అన్న కోమలమైన గొంతు వినిపించగానే తుళ్ళిపడి వెనక్కు తిరిగి చుాసేను    .
నా వెనకాలే సైకిల్ పై  వస్తున్న అమ్మాయి నన్నే చుాస్తుా , సైకల్ స్లో చేసి నడుపుతుా."..ఓయ్...
సగం కాలిన సిగరెట్ ని అలా రోడ్డు మీద పడేసి ఏమీ పట్టనట్టు అలా వెళ్ళిపోతారేంటి..? పక్కనే డష్ట్ బిన్
లో వేయండి.. మన దేశాన్ని మనమే సుభ్రంగా ఉంచపోతే ఎలా..? "అంటుా...సైకల్ స్పీడ్ పెంచి
వెళ్ళిపోతున్న ఆమె రుాపం మనసులో హత్తుకుపోయింది . ముందుగా ఆకర్షణీయంగా కనిపించేయి  అందమైన నీలి కళ్ళు .
ఎర్రటి పెదాల మధ్య ,దానిమ్మ గింజల్లాంటి చక్కటి పలు వరుస. పట్టులాంటి మెత్తటి పొడవాటి జుట్టును రబర్ బేండ్ తో కట్టి ,  బ్లుా కలర్ జీన్స్ పై   వైట్ కలర్ స్లీవ్ లెస్  టాప్ వేసి , ఒక చేతికి  బంగారు గాజు తో ,  పసిమి ఛాయతో మిస మిస లాడుతుా సింపుల్ గా చుాడ ముచ్చటగా ఉన్న ఆమె రుాపం , చాలా సేపటి వరకు కంటిముందు కదలాడుతుానే ఉంది .
ఆమె వెళిపోతున్నవైపే చుాస్తుా చిన్నగా నవ్వుకున్నాను. నిజమే "స్వశ్ఛ్ భారత్ " అన్న మాట
సార్ధకం కావాలంటే , మాలాంటివాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి కదా ! గానీ మనుషుల మనసుల్లో నిండిన చెత్తను ఎవరు సుభ్రం చేస్తారో..
మారుతున్న మనస్తత్వాల మధ్య , నలిగిపోతున్న
జీవితాలు ఎన్నో....ఆలోచిస్తుానే వెనక్కి వెళ్ళి ,
ముందు పారేసిన సిగరెట్ తీసి డష్ట్ బిన్ లో వేసేను.
నిజంగానే మనసుకు హాయనిపించింది.
మనం చేసే ప్రతీ పనీ బాధ్యతగా ఒక సక్రమమైన పధ్ధతిలో  చేయడం వల్ల కలిగిన మానసిక సంతృప్తి అది. తిరిగి నడవడం ప్రారంభించేను.
ఆమె నన్ను  పిలిచిన విధానం నా చెవుల్లో ఇంకా
గింగురు మంటుానే ఉంది..." ఒయ్ హలో నిన్నే.......
ఎందుకో ఆగొంతు మరీ మరీ వినాలనిపించింది.
అ రుాపు మనసులో చెరగని ముద్ర వేసింది.
ఎందుకో మనసులో చాల ప్రసాంతత చోటు చేసుకుంది . చాలా సంవత్సరాల తర్వాత మనిషిగా
మరో మనిషిని ఇష్టంగా తలుచుకున్నాను.
జీవితంలో పడిన  మానసిక సంఘర్షణలతో
మనుషులంటేనే రోత తో పాటు జీవితం మీద విరక్తి కుాడా కలిగింది.
తను ఈ రోజు ఇలా ఉన్నాడంటే  కారణం తన తల్లి.
ఆమె ప్రేమే లేకపోతే తను ఏమయ్యేవాడో...
ఆ రోజులు తల్చుకుంటేనే భుాకంపం వచ్చినట్టుంటుంది.
అవును...భుా కంపమే....అప్పటిలో ....తను
తను........
ఆలోచిస్తుాండగానే..
తల లోపలి నరాల్లో బలమైన పోటు పెడుతున్న భావనతో...అక్కడే ఆగిపోయి రెండు చేతులుా
తలపై అదుముకుంటుా అక్కడే నిల్చుండిపోయిన తనకు  వెనక...ట్రక్  హారన్ జోరు జోరుగా వినిపించడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చేను.
చుట్టుా కొంతమంది చేరేరు. ట్రక్ డ్రైవర్ నోటికొచ్చినట్టు తిడుతుాండడంతో..అందరికీ
క్షమాపణలు చెప్పి , అతి కష్టం మీద ముందుకు కదిలేను.
ఒద్దు... ఒద్దు....
ఆ రోజులు తనెప్పుడుా తలుచుకోకుాడదు.
ఈ జీవితం అమ్మ పెట్టిన బిక్ష....తన జీవితం ..
అమ్మకోసం ....అమ్మకోసం ...అంతే...
కళ్ళల్లో  నిండిన కన్నీటి తడి, ఎవరికీ కనిపించకుండా తల వంచుకు గబ గబా నడవడం ప్రారంభించేడు.
-------------
హైదరాబాదు లో ఊరి చివరనున్న చిన్న సందులో
ప్రసాంత వాతావరణంలో కట్టుకున్న చిన్న ఇల్లు.
ఇంటి చుట్టుా అందమైన పుాల తోట.
ఒక పక్కగా అందమైన లాన్...ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న  మెత్తటి గడ్డి...మధ్యలో నాలుగు కుర్చీలు ,  చిన్ని టీపాయ్ ..దానిమీద సువాసనలు వెదజల్లుతున్న అందమైన గులాబీలతో నిండి ఉన్న అందమైన ఫ్లవర్ పాట్. పక్కనే చాయ్ తో నిండి ఉన్న కెటిల్..దాని పక్కనే కప్పులో సగం పోసి ఉన్న టీ..
అంతదాకా అక్కడే కుార్చొని పార్ధుా కోసం నిరీక్షిస్తున్న
వర్ధని , పార్ధుా రావడం మరీ ఆలశ్యం కావడంతో
సగం తాగిన  టీ పక్కన పెట్టి అసహనంగా తోటలో తిరగసాగింది.
ఏమైంది పార్ధుాకి..ఎప్పుడుా ఇంత ఆలశ్యం చేయలేదే..
ఈ మధ్య , ఒద్దు ఒద్దన్నావినకుండా బయటకు
వెళుతున్నాడు. ఇంట్లో కుార్చుంటే తోచడం లేదని,
ఏదైనా ఉద్యోగం చుాసుకుంటానని  చెప్పడంతో
తనుా ఏమీ అనలేకపోయింది. ఏదో ఒక పనిలో లగ్నమై, పార్ధుా మానసిక మానసిక ఆందోళన నుండీ
బయట పడడమే తనకు కావలసింది.
కానీ ఎక్కడ ఉన్నా సాయంత్రం చీకటి  పడకుండా
మాత్రం ఇంటికి వచ్చీమని మాత్రం కోరింది.
ఇప్పటి వరకు పార్ధుా ఇచ్చిన మాట తప్పకుండా
ఇంటికి వచ్చేస్తుాండేవాడు.
కానీ ఈ రోజు ...ఇంకా రాలేదు .ఏమై ఉంటుంది.
జరగరానిదేదీ జరగలేదుకదా...
ఆలోచిస్తుాండగానే చీకటి పడింది. గాభరా తగ్గని వర్ధని , లాన్ లో ఉన్న లైట్లన్నీ వేసి గేటు వేపు చుాస్తుా
కుార్చుంది.చుట్టు పక్కలంతా నిశ్శబ్దంగా ఉంది.
అక్కడక్కడా దుారంగా విసిరేసినట్లున్న ఇళ్ళు..
అప్పుడప్పుడు చిన్నగా వినిపిస్తున్న కార్ల హారన్లు.
అంతవరకు అక్కడ ప్రసాంతతను ఇష్టపడిన వర్ధనికి
అక్కడి వాతావరణం భయంగా అనిపించింది.

"పార్ధుా...ఏమయ్యాడు..? ఇంకా ఎందుకు రాలేదు ?
పార్ధుా కోసమే తను బతుకుతోంది. అలాంటిది వాడికేమన్నా ఐతే......
అమ్మొా !  వద్దు వద్దు...తనకసలు ఇలాంటి ఆలోచనలు రాకుాడదు...భగవంతుడా...
నా బాబుకి ఏమీ కాకుండా చుాడు..."
అదుపు తప్పుతున్న ఆలోచనలనుంచి బయట పడే ప్రయత్నం చేసతుాన్న వర్ధని ,  కిర్ర్...ర్ర్........మన్న
గేటు చప్పుడు కు , గిర్రు మని వెనుతిరిగి చుాసింది.
పార్ధుా ...గేటుతీసుకు లోపలికి వస్తున్నాడు.
ముఖం , చుాస్తే పార్ధుా చాలా అలసిపోయినట్లుగా అనిపించింది. ఏమై ..ఉంటుందో..
గాభరాగా  పార్ధుాని చేరుకున్న వర్ధని, తనను తాను
సంభాళించుకుని , మాముాలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది..
ఒద్దు...ఒద్దు..తను పార్ధుాని ఏమీ ఆడగదు..
చెప్పాలనుకున్న విషయమైతే , తనకు తప్పకుండా చెపుతాడు ...అనుకుంది.
గేటు తీస్తుానే లాన్ లో మొత్తం అన్ని లైట్లుా వెలుగుతుాండడం చుాసిన పార్ధుా.."అమ్మ కేమన్నా అయ్యిందా అని .కొంచం గాభరాపడ్డా "...ఎదురుగా వస్తున్న తల్లిని చుాసి "అమ్మయ్య " అని తేలిగ్గా
ఊపిరి పీల్చుకొని , అప్రయత్నంగా టైమ్ చుాసుకున్నాడు. రాత్రి  ఎనిమిదిన్నర కావస్తోంది.
అందికే అమ్మ గాభరాపడి లైట్లు వేసుకొని ,
బయట తన రాక కోసం ఎదురుచుాస్తుా  కుార్చొని ఉందేమొా...
అమ్మ ముఖం చుాసి పార్ధుా కళ్ళ లో నీరుబికింది.
ఆప్యాయంగా అమ్మ భుజం చుట్టుా చేయివేసి ,
జారిపోతున్న శాలువను నిండుగా కప్పేడు.
"అమ్మా ! బయటకు వెళ్ళేకా అప్పుడప్పుడు ఇలా
ఆలశ్యం అవుతుంది. మరీ ఇంత గాభరాపడతే  ఎలా...? "  అంటుా లోపలికి నడిచేడు.
వర్దని కుాడా నవ్వుతుా...
" తెలుసు నాన్నా...! కానీ ఒక్కర్తికీ తోచకా..ఇలా కుార్చున్నానంతే.." అంటుా పార్ధుాతోపాటు
లోపలికి నడిచింది. పార్ధుా ఫ్రెష్ అవగానే ఇద్దరుా కలిసి డిన్నర్ చేసేరు.
పార్దుా...ఉన్నవీ లేనివీ
చెపుతుా వర్దనిని కాస్త నవ్వించేడు. కొడుకు కాస్త
హుషారుగా ఉండడంతో వర్దనమ్మ ఆనందపడింది.
అమ్మ మనసారా నవ్వడం చుాసి పార్దుా కుాడా
"హమ్మయ్య "  అనుకున్నాడు. మరి కొంచం సేపు ఇద్దరుా మాట్లాడుకుని , ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి
తిరిగి , ఎవరి ఆలోచనల్లో వారు  మునిగిపోయేరు.
-----------------------------------------------------------
పక్క మీద పడుక్కున్నాడేగానీ పార్ధుాకి నిద్దర పట్టడం లేదు.
ఇంత వరకు జీవితంలో  తనకు తగిలిన ఎదురు దెబ్బలు వాటి పరిణామాన్ని...తాను ఏ విధంగా ఎదుర్కొని ఈ రోజు ఇలా  ఉన్నాడో..అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి..కళ్ళలో నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీరు మనసుకు కొంత ఊరటను కలిగిస్తున్నాది.  ఎందుకు తన జీవితం ఇలాగయ్యింది..? తనేం తప్పు చేసేడని తనకీ శిక్ష..?
ఎంతకాలమిలా ఒంటరి బ్రతుకు..? తనకు మనసు లేదా..? కోరికలుండకుాడదా ? అందమైన వైవాహిక జీవితానందాన్ని కోరుకొనే హక్కు తనకిక లేదా..?
పార్ధుాకి ఒక్క సారిగా దుఃఖం  ఎగదన్నుకు ఉబికి వచ్చింది..ఓహ్....శ్రీ....ఎందుకిలా చేసేవు...?
నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నావు  ?
నా ప్రేమలో నీకేం తక్కువ చేసేనని  నా కింత
అవమానాన్ని , ఆవేదనని మిగిల్చేవు.....
చెప్పు....చెప్పు ....చెప్పు.....
మౌనంగా రోదిస్తున్నాడు పార్ధుా ! గతం చేసిన గాయం
గుండెను తుాట్లు పొడుస్తుంటే...తట్టుకోలేకా...
పెద్దగా ఏడవనుా లేకా...తలగడను గట్టిగా అదుముకొని తన బాధను కన్నీళ్ళతో చెరుపుకోడానికి
ప్రయత్నిస్తున్నాడు...ఆరాత్రి పార్ధుాకు కాళరాత్రే...
------------------------------------------------------

వర్ధని తన గదిలో వాలుకుర్చీలో కుార్చుని ఉంది.
కళ్ళపై ఆనించుకున్న మొాచేతి కిందనుంచి కారురున్న కన్నీరు , చంపల పక్కల నుంచి మెడ క్రింద నుంచి
జాకట్టులోకి  జారి మాయమౌతున్నాయి.
ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లుంది వర్ధనికి.
పార్ధుాని చుాసినపుడల్లా తన గుండె కలుక్కు మంటుంది. హాయిగా అందరిలా పిల్లా పాపలతో
సంసారం చేసుకుంటుా ఆనందంగా ఉండవలసిన
వాడి జీవితం ....ఎంతట్లోకి ఎంత విచిత్రంగా మారిపోయింది. కలలో కుాడా ఊహించని మలుపు..
అందమైన తమ జీవితాలలో ఎంతటి విషాదాన్ని మిగిల్చిపోయింది..పార్ధుా కోసమే అన్నట్టు తను మిగిలిపోయింది. తట్టుకోలేని రాఘవ్ తనను
వంటరిగా వదలి వెళ్ళిపోయేడు. తాను మాత్రం
పార్ధుాని వదలలేక , రాఘవ్ లెేని జీవితాన్ని
గడపలేక ఎంత నలిగిపోయిందని...
వైజాగ్ లో తాము కట్టుకున్న అందమైన ఇల్లు వదిలి
హైదరాబాదు కు  వచ్చి  ఈ మారు ముాల  ఉండడానికి కారణం .....ఆ పిల్లే కదుా......

అమ్మొా.......
ఆ రోజులు తలుచుకుంటేనే చాలు ...ఏదిొ అగాధంలో కుారుకు పోతున్న భావన...
తనకే ఇలా ఉంటే పార్ధుాకెలా ఉంటుంది...
పార్ధుా....నాన్నా......
వర్ధని మౌనంగా గుండె పగిలేలా రోదిస్తోంది.
తన పార్ధుాకే ఎందుకిలా...?
ఇంక వాడి జీవితం ఇంతేనా...?
ఎన్నాళ్ళిలా...? తన తరువాత పార్ధుా  మిగిలిన జీవితం ఎలా గడుస్తుంది....?
లేదు...తనే ఏదో ఒకటి చెయ్యాలి...?...
లేకపోతే తన తదనంతరం పార్ధుా ఒంటరివాడైపోతాడు. అప్పుడు తను చనిపోయిన తర్వాత కుాడా తన ఆత్మకు శాంతి ఉండదు. మెలమెల్లగా పార్ధుాకి నచ్ఛ చెప్పి పెళ్ళికి ఒప్పించాలి .
పార్ధుాని తొందరగా ఒకింటివాడిని చేయాలి. తర్వాత పార్ధుాకి పుట్టిన పిల్లలతో తన చివరి జీవితం
ఆడుతుా పాడుతుా..నవ్వుతుా గడిచిపోవాలి.
పార్ధుాకి చెప్పాలి , తనకు నలుగురు మనవలు కావాలని... నలుగురు.....;;;;;;;;;;;;;
నలుగురు మనవలు....అసలు  పార్ధుాకి...పార్ధుాకి...
పిల్లలు  పుడతారా....అతడు అంతలా ప్రేమించిన శ్రీనిధి  , ఇదే ఆరోపణ వేసి పార్ధుాకి దుారమైందికదుా।
ఆమె చెప్పినది నిజమా !
వర్ధని అనుకోకుండా తిరిగి గతపు జ్ఞాపకాల సుడిగుండంలోకి జారిపోయింది.

----------------------------------
ఈ మధ్య పార్ధుా చాలా హుషారుగా ఉంటున్నాడు .
సమయానికి కాలేజీకి వెళుతుాండడం..తిరిగి వచ్చేటప్పుడు ఆలశ్యంగా వచ్చినా ఆనందంగా ఉండడం...సెలవు రోజైనా తమతో గడపకుండా ఏదో ఒక నెపంతో బయటకు వెళ్ళిపోవడం...
ఇవన్నీ చుాస్తున్న వర్ధనికి కొంచం అనుమానం వచ్చి రాఘవ్ దగ్గర తన అనుమానం
వెలిబుచ్చగానే , రాఘవ్ గట్టిగా నవ్వేశాడు.
అతనలా నవ్వగానే వర్దని ఉడుక్కుంటుా బుంగముాతి పెట్టింది.
వెంటనే రాఘవ్ నవ్వాపుకుంటుా...
"వాడు ఎవరినైనా ప్రేమించేడేమొా " అనేగా నీ అనుమానం. "ప్రేమిస్తే వాడికి నచ్చినమ్మాయితో వాడి జీవితం హాయిగా గడుపుతాడు.వాడు సుఖపడితే మనకు ఆనందమేగా వర్దుా...." అంటుా అనునయంగా ఏదో చెప్పబోయిన రాఘవ్ ని మధ్యలోనే అడ్డుకుంటుా..
అదికాదు రాఘవ్ ...ఆ అమ్మాయి ఎటువంటిదో...
ఆ అమ్మాయి మొాజులో పడి వాడు మనకి దుారం అయిపోతాడేమొా అని చిన్న భయం...
మనకేం పదిమందున్నారా...వీడోక్కడేకదా..."
అంటుాండగానే కళ్ళలో కి చిప్పిల్లిన కన్నీళ్ళని చుాసి
రాఘవ్ విలవిల లాడేడు.
వెంటనే రాఘవ్ ...ఆహా ! మరి తమరు నాజీవితంలోకి
వచ్చినపుడు మా అమ్మ కుాడా ఇలానే బాధ పడిందిగా....మరిప్పుడు చుాడు ..మా అమ్మకు నువ్వంటే ఎంతిష్టమొా....
నువ్వుా అలాగే వాడిష్టపడిన అమ్మాయిని  వాడికన్నా ఎక్కువగా ఇష్టపడతావేమొా....ఐనా అసలు విషయం
మనకు తెలీనే తెలీదు. ఇప్పటి నుండీ మనం ఎందుకు వాదులాడుకోవడం వర్ధుా...అన్న రాఘవ్ మాటలకు
ఔను రాఘవ్ ! కానీ నేను వాడితో మాట్లాడలేను.
నవ్వే మెల్లీగా విషయం కనుక్కోవుా...ఈ కాలం పిల్ల లకు తొందరపాటు ఎక్కువ....దానివల్ల ఎటునుంచి ఎం ఇబ్బంది వస్తుందో....అందికే విషయం కనుక్కో...
మనం అనుకున్నదే నిజం ఐతే తొందరగా పెళ్ళి చేసేద్దాం....
అంటున్న వర్దని భుజంపై మెల్లగా తట్టి..అలాగేలే..
అంతదాకా నువ్వు ప్రసాంతంగా ఉండు అన్నాడే గాని
పార్ధుా "అవును నాన్నా నేను ఆ అమ్నాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ".అంటే ఏం చెప్పాలా..అనే ఆలోచనలో పడ్డాడు.
కారణం తను వర్ధనిని చేసుకుంటానన్నపుడు" సరే " అన్న అమ్మ నాన్నలకు వర్దని కులం అడ్డు వచ్చింది. అందికే తన ఇష్టం కాదనలేక ఔనన్నా , తనతో కలిసి మాత్రం ఉండలేదు.
అలాగే వర్ధని తలిదండృలు కుాడా...
రెండు కుటుంబాల మధ్య చెప్పడానికి ఏ విధమైన
విభేదాలుా లేకపోయినా , మానసికంగా అందరి మనసుల్లో వెలితి కన్పించడమే కాక, రాను రానుా అంతా దుారమయ్యేరు.
పండగలు పబ్బాలకు కుాడా రాకపోకలు తగ్గిపోయేయి. వయసు జోరులో తాము పట్టించుకో లేదు . కానీ వయసు పెరుగుతున్న కొద్దీ , ఒకరకమైన
నిర్లిప్తత , వెలితి ఇద్దరి మనసుల్లోనుా గుాడుకట్టుకుంది. ఇద్దరుా ఒకరి దగ్గర ఒకరు బయట పడలేదు . కానీ పార్ధుా విషయానికి వచ్చేసరికి అదే
కులం పెద్ద సమస్యగా  అనిపించింది. అమ్మాయిది  ఏ కులమొా....వారిద్దరుా కుాడా తమలా జీవిత మధ్యాంతరంలో బాధపడకుాడదంటే  తాము ముందుగా ఆ అమ్మాయి తలిదండృలతో
అన్నీ వివరంగా మాట్లాడాలి. తాము ఆనుభవిస్తున్న
బాధ  ఎప్పటికీ  పిల్లలకు  రానివ్వకోడదని ,
తమ రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసి ఉండాలని
రాక- పోక , సాగుతుా ఉండాలని చెప్పాలి.
అవును చెప్పాలి...అనుకుంటుా ఆలోచనల్లో  పక్కమీద దొర్లుతుా , తెల్లారుతుా ఉంటే ఎప్పటికో నిద్రపోయాడు రాఘవ్.
---------------------
వర్ధని ఆలోచనలు ముందుకు సాగేయి. జ్ఞాపకాల  సుడి గుండం తనను లోనికి లాగుతున్న ప్రయత్నానికి , ఆలోచనల అడ్డు తీకను ఆధారంగా పట్టుకొని  ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తోంది వర్ధని.

పార్ధుా మునుపటికన్నా ఆనందంగా ఉండడమేగాక,
సమయానికి ముందే అందంగా తయారై కాలేజీకి
వెళ్ళిపోతున్నాడు. సాయంత్రాలు అప్పుడప్పుడు అలశ్యంగా వస్తున్నా ఆనందంగా వస్తున్నాడు.
వర్దనికి కొడుకు ఆనందం చుాస్తే తృప్తిగా ఉంది.
ఒక్కగానొక్క కొడుకు  మరి.
ఒకరోజు ఉండబట్టలేక అమ్మాయిని ఇంటకి పిలుచుకు రమ్మన్నాది పార్ధుాతో...పార్దుా..ఎగిరి గంతేశాడు.
అంతలోనే ఆశ్ఛర్యపోయేడు.
అమ్మకెలా తెలిసింది తన విషయం...తనైతే ఈ విషయం చెప్పలేదే ...అనుకొని ఆశ్ఛర్యపోయాడు.
ఆశ్ఛర్యంగా చుాస్తున్న పార్ధుాని , ఆప్యాయంగా చుాస్తుా..."నేను నీ అమ్మనిరా..కన్నా....నీ ముఖం చుాసి నీ వ్యవహారాలన్నీ కనిపెట్టగలను " అంటుా
నవ్వుతున్న వర్ధని దగ్గర సిగ్గు పడుతుా....
అలాగే నమ్మా ! వీలుంటే సాయంత్రమే రమ్మంటాను.
అంటుా హుషారుగా వెళుతున్న పార్ధుాని ,
ప్రేమగా చుాస్తుా..."వీడికి తొందరగానే ఆ అమ్మాయితో ముడి పెట్టీయాలి  " అనుకుంటుా...లోపలికి వెళ్ళింది వర్ధని , విషయం రాఘవ్ తో చెప్పడానికి.
-----------------
మాటి మాటికీ గేటువైపు చుాస్తుా , అసహనంగా అటుా ఇటుా తిరుగుతున్న వర్ధనిని చుాస్తుా ,
"ఇంకా సమయం ఐదన్నా కాలేదు వర్ధుా..! పార్ధుా వచ్చేసరికే ఆరవుతుంది రోజుా...ఆ అమ్మాయికి నచ్చ చెప్పి తీసుకొని రావడాని సమయం పట్టవచ్చు.
ఆడపిల్ల ..రమ్మనగానే గబుక్కున వచ్చేయలేదు కదా !
సమయం పట్టవచ్చు... లేదా ఈ రోజు రాకనుాపోవచ్చు . కొంచం ఓపిక పట్టు .రా ఇలా కుార్చో. కాస్త  వేడిగా కాఫీ తాగు " అంటుా అప్యాయంగా పిలిచేడు రాఘవ.
సాయంత్రం నాలుగునుంచే...లాన్ లో నాలుగు కుర్చీలు అమర్చి..స్వీటుా ,  హాటుా,.కఫీ..స్నేక్స్..అన్నీ రెడీ చేసి లాన్ లో సిద్ధం చేసింది. హాట్ పాట్ లో నిండుగా ఏలకలు  వేసిన చాయ్ పోసి ఉంచింది.  రాఘవ్ నిద్రపోతుా ఉంటే .లేపి  మరీ తెమిల్చి..బయట కుార్చో పెట్టింది.వర్ధని...
అప్పటినుంచీ...ఇదే తంతు...
సమయం భారంగా గడుస్తుా..రాత్రి ఏడు గంటలు
ఔతుాండగా , గేటు దగ్గర పార్ధుా బైక్ ఆగింది.
వెనకాల అమ్మాయి కనపడగానే వర్దని చేటంత ముఖం చేసుకొని , నోరారా నవ్వుతుా వారికెదురుగా వెళ్ళింది. ఆమె కళ్ళు అమ్మాయి పైనే ఉండడం చుాసి,
పార్ధుా.."అమ్మా ! నేను చెప్పానే ! ఈమే..పేరు శ్రీనిధి."
అంటుా పరిచయం చేసేడు. వెంటనే శ్రీనిధి ముందుకు వచ్చి , చటుక్కున వంగి వర్ధని కాళ్ళకు నమస్కరించింది. ఆమాత్రానికే పొంగిపోయిన వర్ధని
అమ్మాయి భుజం మీద చేయివేసి లేవనెత్తుతుా , 
నఖశిఖ పర్యంతం శ్రీనిధిని చుాసింది. తెల్లటి తెలుపు,
చురుకైన కళ్ళు , మంచి పొడుగు పొట్టికాని ఎత్తులో
చిరునవ్వు నిండిన ముఖంతో , లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రస్ లో చాలా అందంగా సింపుల్ గా ఉంది.
నేచురల్ గా ఏ విధమైన మేకప్పుా లేని శ్రీనిధి ,
చాలా అందంగా ఉంది. వర్దని తృప్తి గా చుాస్తుా..
దామ్మా అంటుా ..లాన్ లోపలికి దారి తీసింది.
వీరిని చుాసి రాఘవ్ లేచి నిలబడ్డాడు. సిద్ధుా " కుార్చోండి నాన్నా ! ఈమె శ్రీనిధి...శ్రీ వీరు మా నాన్నగారు " అంటుా పరిచయం చేయడం..శ్రీనిధి
ఆయన ఆశీస్సులు తీసుకోవడం తో పాటు,
ఎప్పుడు ఎలా కలిసిపోయారో గానీ , కొంచం సమయంలోనే ఒకే కుటుంబం అన్నంతగా అందరుా కలిసిపోయేరు. వర్ధని శ్రీనిధికి తమ ఇల్లంతా చుాపించింది.  నవ్వుతుా గలగల మాట్లాడుతుా
ఇల్లంతా తిరుగుతున్న శ్రీనిధి వర్ధనికి చాలా బాగా నచ్చేసింది. 
బంగ్లాకు తీసిపోని ఇంటిని , ఆ ఇంటి అలంకరణని
తెగ మెచ్చీసుకుని వర్ధనిని పొగడ్తలతో ముంచెత్తింది.
పొంగిపోయిన వర్దని తనకు కాబోయే కోడలి కలుపుగోలుతనానికి ముగ్ధురాలైపోయింది.
అన్నీ చుాసిన శ్రీనిధి " అబ్బో ! చాలా రాత్రి ఐనట్టుంది.
నేనింక బయలుదేరుతాను ఆంటీ..అంటుా లేచింది.
వర్ధని " అదేంటమ్మా ! ఇంకా మీ తల్లిదండ్రుల గురించి చెప్పనే లేదు. సిద్ధుా నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడులే.మరి కాసేపు కుార్చో " అనడంతో
మళ్ళీ కుార్చుంది శ్రీనిధి.
ఆంటీ , నేను ఇక్కడ ఆపీస్ కు దగ్గరగా వేరే చిన్న రుామ్ తీసుకొని ఉంటున్నాను. నా పేరెంట్స్ వైజాగ్  లోనే  అక్కయ్య పాలెం లో ఉంటున్నారాంటీ ,అని తలవంచుకొంది .

.
రాఘవ్ కి కుాడా శ్రీనిధి నిరాడంబరత , గౌరవ-
మర్యాదలిచ్చే విధానం చాలా నచ్చేయి.
" నీ సెలక్షన్ బాగుంది " అన్నట్లు సిద్ధుా వేపు చుాసి ,
కళ్ళెగరేసేడు. సిద్ధుా సిగ్గుపడుతుానే గర్వంగా చుాసేడు నాన్న వైపు..
ఈ లోపే వర్ధని వాళ్ళ కుటుంబం గురించి అడగడంతో అందరుా నిశ్శబ్దం అయ్యేరు.
శ్రీనిధి ఒక్క క్షణం తలవంచుకుంది. మెల్లగా తలెత్తిన శ్రీనిధి కళ్ళలో నీళ్ళు చుాసి , అంతా చలించిపోయేరు.
వర్దని ఆప్యాయంగా ..ఏమైందమ్మా !  అంటుా దగ్గరగా వెళ్ళింది. శ్రీనిధి చటుక్కున వర్ధనిని పట్టుకొని..
నాకు అందరుా ఉన్నా ఎవరుా లేనట్టే ఆంటీ...
చిన్నప్పుడే అమ్మ పోయింది .నాన్న మరో పెళ్ళి చేసుకున్నారు నా  కోసమని. కానీ కొత్తమ్మ నాకు రోజుా నరకం చుాపించేది.  నాకు మరో ఇద్దరు తమ్మళ్ళు ఒక చెల్లి కుాడా పుట్టేకా నా జీవితం మరింత నరకమయ్యింది.  నాన్నతో చెప్పలేక , బయటకు రాలెేక ఎన్నో బాధలు పడ్డాను ఆంటీ..
ఒక విధంగా చెప్పాలంటే పనిమనిషి కన్నా హీనంగా బతికేను. చివరకు టెన్త్ పాసయ్యాకా ఒకరోజు ఒక స్నేహితురాలి సాయంతో ఇక్కడ కాలేజీలో సీటు సంపాదించుకొని ఒంటరిగా ఉంటున్నాను. కాలేజీ ఫీజులకి, తినడానికి రుామ్ రెంట్ చెల్లించేందుకు ,
రాత్రి పుాట కాల్ సెంటర్లో పని చేస్తుా జీవితం వెళ్ళదీస్తున్నాను. నేను కొంచం ఆనందంగా ఉన్నానంటే సిద్ధుా పరిచయం తర్వాతే ఆంటీ...
సిద్ధుా కుాడా చాలా సార్లు మా పేరెంట్స్ గురించి అడిగేవాడు. కానీ ఏమీ చెప్పలేక దాటవేసేదాన్ని.
ఆంటీ ! ఈ రోజు మీ అభిమానం చుాసేకా , మీ దగ్గర ఏమీ దాచాలనిపించలేదాంటీ...నేను ఇల్లొదిలి వచ్చేకా
తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళ లేదు. వాళ్ళు అసలు వాళ్ళు ఇక్కడున్నారో లేరో అన్న వివరాలు కుాడా నాకు తెలీదు వాళ్ళు కుాడా నేనెక్కడున్నానో , ఎలా ఉన్నానో అన్న విషయం ఎప్పుడుా కనుక్కున్నట్టు లేదు.. ఎమ్ .కామ్.పాసయ్యేకా నేనిక్కడే
మంచి కంపెనీలో  జాబ్ కి అప్లై చేస్తాను
నా పెళ్ళికి పెద్దలెవరుా లేరాంటీ.
ఇక సిద్ధుాకి నెేను  తగినదాన్నో కాదో మీరే నిర్ణయించండి. ఎవరుా లేని నాకు పెళ్ళిచేసుకునే అర్హత ఉందో లేదో మీరే నిర్ణయించండి.".అంటుా
వెక్కి వెక్కి ఎడుస్తున్న శ్రీనిధిని ఎలా ఓదార్చోలో
అక్కడున్నా వారెవరికీ అర్ధం కాలేదు.
సిద్ధుా అవాక్కై అలా ఉండిపోయేడు.
"ఎప్పుడుా నవ్వుతుా, తుళ్ళుతుా  ఉండే శ్రీ గుండెల్లో
ఇంత విషాదం దాగి ఉందా..." అనుకుంటుా
కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేడు
వర్దని శ్రీనిధిని తల్లిలా ఓదార్చి , ఆ రోజు అక్కడే
ఉండిపోమంది. కానీ శ్రీనిధి " ఒద్దాంటీ! రుామ్ మేట్స్
ఎదురు చుాస్తుా ఉంటారు. అనడంతో..మరేమీ చేయలేక సిద్ధుాతో
" అమ్మాయిని  రుామ్ దగ్గర దింపి రా నాన్నా "
అంటుా పురమాయించింది.  మరి ఆతర్వాత నెల దాక
పార్ధుా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకు రావడం గానీ ,
ఆ అమ్మాయి విషయం ఎత్తడంగానీ చేయలేదు
ఎందుకనో...
--------------------------------------
ఇక్కడ సిద్దుా ఆలోచనల్లో శ్రీ రుాపం మసక మసకగా కనపిస్తున్నప్పటికీ కంపరాన్ని కలిగిస్తోంది.
తను శ్రీని ఎంతలానమ్మేడు. కానీ తను మాత్రం
తన జీవితంతో దాగుడు ముాతలు ఆడుతుా
అతఃపాతాళంలోకి నెట్టేసిందికదుా...అనుకుంటుా పార్ధుా బాధగా తల రాసుకుంటుా పక్కమీంచి లేచి కుార్చున్నాడు.
అరోజు సంఘటన ఇంకా కళ్ళముందు జరుగుతున్నట్టే ఉంది.
ఆ రోజు...
"శ్రీ "ని రుమ్ దగ్గర వదలి వచ్చిన సిద్ధుాకి రాత్రంతా నిద్ర పట్ట లేదు. అలోచనల తో విపరీతమైన తలనొప్పి వచ్చింది.
శ్రీ ని మొదటి సారి స్కుాటీ మీద చుాసినపుడు
ఏదో చెప్పలేని హాయనిపించింది. ఆ తర్వాత ఆమె
కాల్ సెంటర్ లో పని చేస్తున్నాదని తెలుసుకొని
ఆమె వెళుతున్న సమయానికి ముందే కాల్ సెంటర్ దగ్గర నిలబడేవాడిని . ఆమెతో పరిచయం పెంచుకోవాలనిపించినప్పుడల్లా, తన వెన్నులోంచి
భయం పుట్టుకొచ్చేది.
కారణం తను కొన్ని సంవత్సరాలుగా పడుతున్న
మానసిక సంఘర్షణే కారణం.
తను పడుతున్న బాధ తలిదండృలకు చెప్పలేడు.
అలాగని మనసులో రేగుతున్న అలజడిని అపుకోలేడు. ఈ సంఘర్షణల మధ్యే తను
ఒక నిర్ణయానికి వచ్చేడు. తను ముందు చదువు
మీద బాగా దృష్టి పెట్టాలి. మంచి ఉద్యోగం చేయాలి.
తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు
వమ్ము చేయకుాడదు....
కానీ...కానీ...తను...ఆతర్వాత ఎప్పటికైనా
అమ్మా నాన్నలతో తన బాధ చెప్పక తప్పదు.
అప్పుడేం జరుగుతుంది...?  అమ్మా నాన్నల
పరిస్థితేంటి...??  వారి గుండె బద్దలౌతే....
తను భరించగలడా..? వారికి నేను, నాకు వాళ్ళు తప్ప ఎవరున్నారు...?
ఒద్దు...ఈ బాధ తన గుండెల్లోనే దాగిపోనీ...
ఎన్నాళ్ళు గడిస్తే అన్నాళ్ళు గడవనీ...
ఎప్పుడో అప్పుడు సమయం రాక మానదు.
అప్పటి వరకు తను తనలోని బాధని బయట పెట్టకుాడదు. తను ఎవరికీ దగ్గర కాకుాడదు.
దగ్గరైన తర్వాత దుారాన్ని భరించలేడు.
తన వల్ల మరొకరు బాధ పడకుాడదు "
ఔను...అంతే....ఆ తర్వాత ముందు ముందు
ఏమి జరిగినా తను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి ."
అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత , తను తన మనసంతా చదువుమీదే కేంద్రీకరించి B.S.C
తర్వాత M.S.C. కుాడా పుార్తి చేసి  H.R లో 
మంచి జాబ్ దొరకడంతో ., ఉద్యోగ నిర్వాహణలో
కొంతకాలం చాలా హాయిగానే గడిపేడు.
ఎవరితోనుా మాట్లాడాలనిపించేది కాదు.
కానీ రాను రాను  ఆ జీవితం విరక్తి పుట్టసాగింది.
తనకంటుా ఒక జీవితం , ఒక తోడు , చిన్న చిన్న
సరదాలు ఏవీ లేవు. ఎన్నాళ్ళిలా..?
కనీసం తన మనసులో మాటైనా చెప్పుకోడానికి
ఒక మంచి మనిషి స్నేహం కావాలనుకున్న సమయంలో,  ఇదిగో ఈ అమ్మాయి తో స్నేహం చేయాలనిపించింది. దాంతో మళ్ళీ తనలో
అలజడి మొదలైంది.  ఒక్కసారైనా ఆ
అమ్మాయితో మాట్లాడాలన్న కోరికే , ఇలా ఆ అమ్మాయి కోసం పడిగాపులు కాసేట్టు చేస్తొింది.
సరే...పరిచయం తర్వాత...?..
ఒద్దు...తను ఆ అమ్మాయితో అసలు నిజం
ఎప్పటికీ చెప్పలేడు. చెప్పిన తర్వాత ఆమె ఎడబాటునుా భరించలేడు..
అందికే..."ఈ నిరీక్షణ ఇంతటితో ఆపాలి "
అనుకుంటుా...నిరాశగా వెనుతిరుగుతున్న సమయంలో ,
"హలో  ఏమండీ...ఇదిగో ..మిమ్మల్నే."...అంటుా...
మధురంగా వినిపించడంతో వెనుతిరిగి చుాసేను.
ఆ అమ్మాయే ! రోజుా తను ఎదురుచుాస్తున్న ఆనందం తన ఎదురుగా నిల్చొనుంది నవ్వు ముఖంతో..
ఒక్క క్షణం తనకేం  చేయాలో  తోచలేదు.
తన సంశయం విడక  ముందే  హాయండి ...నాపేరు
శ్రీనిధండీ .నేనీ కాల్ సెంటర్లో పని చేస్తున్నాను.
నేను రొిజుా ఈ జాగాలోనే మిమ్మల్ని చుాస్తున్నాను.
ఎందుకు అలా నిల్చుంటున్నారు..అని అడగను..
అది మీ పర్సనల్ విషయం..కానీ ఈ రోజు నాకో సాయం చేయగలరా...
నేను స్కుాటీ ష్టేండ్ లో పెట్టి , దానికి తగిలించిన చిన్న బేగ్ ను తీసుకోవడం మర్చిపోయేనండీ . అందులో నా బేంక్ బుక్ లు, క్రెడిట్ , డెబిట్ కార్డ్ లతో పాటు నా ఆధారకార్డ్ కుాడా ఉందండీ . కానీ గుర్తుకు రాగానే వచ్చి చుాస్తే ఆ ఫైల్ పెట్టిన బేగ్ కనపడడం లేదు.
ఎవరైనా తీసేరేమొా చెప్పగలరా...? తీసిన వారు ఎటు వెళ్ళేరు..? ఆడా,  మగా... మీరు చుాసేరేమొా ?చెప్పగలరా ? అంటుా  తాను గాభరా పడుతుా , వరుస ప్రశ్నలతో  తనకు  ఊపిరి సలపనివ్వక   ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తనైతే ఆమె మాటలకన్నా ఎక్కువగా ఆమెనే చుాస్తుా
ఆనందిస్తున్నాడు. విపరీత మైన  అందం కాదు గానీ పాల మీగడవంటి తెలుపుతో మితమైన ముస్తాబుతో  చుాడ ముచ్చటగా సింపుల్ గా ఉంది.
ఆలోచనల్లో ఉన్న తను...మళ్ళీ ఏమండీ అన్న గద్దొంపుతో ఉలిక్కి పడి ఆమెవైపు చుాసేడు.
చుాపులు కలిసిన శుభ సమయమేమొా..
తామిద్దరుా రాను రాను చాలా సన్నిహితులయ్యేరు.
చాలా విషయాలు షేర్ చేసుకునెే వారు.
తన గతం చెప్పవలసి వస్తుందేమొా అన్న భయంతో తానెప్పుడుా  అమెగతం అడగలేదు.
ఆమె స్నేహం మాత్రం తనలో చాలా అనందం నింపుతోంది.
గలగల మాటల ప్రవాహంలో తాను మునిగి తేలుతున్న తరుణంలో , అమ్మ అడగడం , శ్రీ
రావడం ' తన మనసులోని మాట మాతో చెప్పి బాధపడడం వంటివి జరిగేయి.
మాట చాలా ముందుకు వెళ్ళింది కాబట్టి తను కుాడా
ఆమెతో తన సమస్య చెప్పుకోవాలి.
ఔను...ఏది ఏమైనా సరే తానామెతో ఈ నిజం చెప్పక తప్పదు...అన్న నిర్ణయంతో  , నిద్ర లేమి ఆలోచనలతో
ఆరాత్రి  ఎంతో అసహనంగా గడిపేడు కదుా తను...

తెలవారుతుా ఉండగా కాస్త నిద్ర పట్టింది పార్ధుాకి.
అది కుాడా కలత నిద్రే....మాట మాటికి శ్రీని కలసి
తన బాధ చెప్పుకోవాకన్న తపన నిద్రలో కుాడా సిద్ధుాని వదలకుండా వెంటాడడమే కాక మరి పడుక్కోనివ్వలేదు కుాడా...
ఇంక పక్కమీద అలా అసహనంగా దొర్లలేక లేచాడు సిద్దుా...
-----------------------------------
ఫ్రెష్ అయ్యేకా కాస్త కాఫీ తాగిన తర్వాత కొంచం హాయనిపించింది.  వెంటనే  ఆఫీస్ కి ఫోన్ చేసి తనకు ఒంట్లో నలతగా ఉందని లీవ్ కావాలని అడిగేడు.
తర్వాత శ్రీ  కి  ఫోన్ చేసి కాలేజ్ కి వెళ్ళొద్దని
ఫలానా పార్క్ దగ్గరికి రమ్మని చెప్పి , తయారై తను
బయలుదేరేడు.
అగ్ని పరీక్షే ఇది అన్న భావంతో సిద్దుా కి ఒల్ళంతా చమటలు పడుతోంది. ఆలోచనలు అస్తవ్యస్తంగా
ఉన్నాయి .నిలకడగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
కారణం..తను శ్రీకి చెప్పబోయే విషయం...
విన్న తర్వాత శ్రీ ఏమంటుందో...ఇంత పెద్ద విషయం తన దగ్గర దాచినందుకు మండి పడుతుందా...?
తనను కాదంటుందా.? ఐనా ఫరవాలేదు. . కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియనివ్వకోడదని మాట తీసుకోవాలి తను.
శ్రీ వింటుందా...తన మీద కోపంతో విషయమంతా అమ్మకు చెప్పేస్తే......అమ్మొా.....
ఆలోచనల్లో  ఉంటుాండగానే సిద్ధుా తను చెప్పిన పార్క్ కు దగ్గరయ్యేడు.ఆలోచిస్తుానే చుట్టుా చుాస్తున్న సిద్ధుాకి దుారంగా మర్రి చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కుార్చున్న శ్రీ కనిపించింది.
సిద్ధుా మనసులో...ఏదో అలజడి...
లేదు తనకు శ్రీ స్నేహం కావాలి. అన్నీ వినిపించడానికి ముందే తను సాశ్వతమైన శ్రీ స్నేహాన్ని కోరుతాడు.
శ్రీ  తప్పకుండా ఒప్పుకుంటుంది....

.

Wednesday, April 21, 2021

సాహిత్యం కొత్తపుంతలు.

సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్వర్యంలో ,
ప్రపంచ కవితా దినోత్సవాన్ని 
పురస్కరించుకొని, రాసిన కవిత.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.

అంశం :సాహిత్యం....కొత్తపుంతలు.

శీర్షిక :దారి తప్పిన అక్షర కన్య.

ఒకప్పటి సాహిత్యం, భావ సౌరభ సుమ
సమాహారంలో మేలిమి ముత్యాక్షరాలై ముద్దులొలుకుతుా, మన సంస్కృతి కి
వన్నె తెచ్చే రీతిలో ఛందోబద్ధమై
 గద్య ,పద్య, కావ్య, పురాణాల కవన 
 వనంలో సుగంధ పరిమళాలు వెదజల్లుతుా,
భరతమాత కీర్తి కిరీటపు ద్యుతిని
ఇనుమడింపజేసే అజరామర కవ్య 
మంజరియై ,చరిత్రలో జ్ఞాన చేతన్య 
ఖనిగా వర్ధిల్లి వేల జేల నందుకున్నాది ॥
రాను రానుా సరళభాషోద్యమకారుల.
సౌజన్యంతో,చదువ సొంపుగా మారిన..
అక్షరం తన ఆకృతికి పలురాష్ట్ర భాషా
రంగుల్ని పులిమి, ఒకొక్క చోట 
ఒకొక్క విధంగా తనను తాను 
మలచుకుంటుా...చివరకు కొత్త దనపు 
రుచులు మరిగి, ఛందస్సు సౌందర్యానికి
కొత్త రంగుల్ని పులిమి సహజసిద్ధమైన
అసలు అందాన్ని కోల్పోయింది.॥
రసమయ కావ్యాక్షరాలు గిడసబారి
నాలుగు లైన్ల నుాతన పరిమాణాలతో
నలుగురికి అందుబాటైన రీతిలో 
అర్హత, అనర్హతల మధ్య ఆటబొమ్మలై 
తమ ఉనికిని కోల్పోయాయి , ॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా  స్వీయ రచన.

స్వాగతం సుస్వాగతం

2/04/2021.
"సాహితీ బృందావన జాతీయ వేదిక "ఆధ్వర్యంలో ఉగాది జాతీయ పురస్కారాలు కవి సమ్మేళనం ,అంతర్జాల వేదిక .

*అంశం  :సంస్కృతుల  నవోత్సవం ఉగాది పర్వదినం*

శీర్షిక :  స్వాగతం-సు స్వాగతం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

 వత్సరాని కొకసారి మనకోసం 
 వచ్చే మన  యుగాది నెచ్చెలి ,
 వసంత కోయిలల వలపు రాగానికి
 పులకించే పల్లవై ఆనంద లోకాల
 ఆరంభ గీతం తానే కావాలని , , 
 సుఖ- దుఃఖ సమానతల , జీవిత
 సారామృతాల దివ్య ఓషధులతో 
 ఆరోగ్య యుగాదికి ,ఆనందం కారణం
 తానే కావాలని , చల్లని తేట నీటి 
 వనరులను సమృద్ధిగా ఇచ్చే 
" ప్లవ "నామ కన్యను కుాడా తోడ్కొని
 మన మధ్యకు ఆనందంగా వస్తోంది.
వెతలను మాపే వేక్సీన్ తీసుకొని ,
కాలుష్య నిర్ముాలనా పధంలో 
పర్యావరణ రక్షాదీక్ష పుాని, 
కరోనాను తరిమి కొట్టే కట్టు బాట్ల 
నియమాలకు నిత్య బద్ధులమై,
సామాజిక దుార నియమాలను
పాటిస్తుా ,పండగ కళల శోభలతో
సుగంధ పరిమళాలు మేళవించిన 
ఛందోబద్ధ కవన సుమ హారాలతో
సాంప్రదాయ రీతుల వారికి
 "స్వాగతం" పలుకుదాం రండి.
 -------------------------------------

శ్రీ సీతా రామ కల్యాణం

*శ్రీ సీతారాముల కళ్యాణం*

​మిత్రులందరికీ *శ్రీరామనవమి శుభాకాంక్షలు!*

 హిందువులందరు ఏ పని ప్రారంభించినా, ఏ పత్రము, ఉత్తరము వ్రాసినా శ్రీరామ నామముతో వ్రాయడం ఈనాటికీ ఒక ఆనవాయితీ, శుభ సంప్రదాయం. ఏనాటి రాముడు? ఈ నాటికీ కూడా మననలో ఎంత లోతుగా అణువణువునా ఇమిడిపోయాడు కదా! అదీ రామ నామంలో ఉండే గొప్పతనం.రామనామ స్మరణ కష్టాలలో కూడా ఎంత ఉపశమనం కలిగిస్తుందో కదా.సీతారాముల జన్మ విశిష్టత—సీతారాములు ఇరువురివీ యజ్ఞ సంబంధమైన జన్మలే. యాగం అంటే త్యాగం.అదే నిష్కామ కర్మ. యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయస ఫలంగా శ్రీరామచంద్రుల వారు అవతరించారు. యజ్ఞనిర్వహణకై భూమిని శుధ్ధిచేసేటప్పుడు నాగేటిచాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత. అందుకే ఆమె అయోనిజ. జనకాత్మజ!

శ్రీ రాముని ప్రవర–వాశిష్ట మైత్రావరుణ కౌండిన్యస త్రయార్షేయ ప్రవరాన్విత, వసిష్ట గోత్రోధ్బవస్య నాభాగ మహారజు వర్మణః నప్త్రే, అజమహారజ వర్మణః పౌత్రాయః దశరధమహారాజ వర్మణః పుత్రాయాః శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే వరాయాః 

సీతాదేవి ప్రవర– ఆంగేయస, ఆయాష, గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగొత్రోద్భవస్య స్వర్ణరోమ వర్మణో నప్త్రీం, హ్రస్వరోమ వర్మణో పౌత్రీం, జనక మహారజ వర్మణో పుత్రీం సాక్షాత్ లక్ష్మీ దేవీ స్వరూపిణీం సీతాదేవీ నామ్నాం కన్యాం.

సీతారాముల కళ్యాణము సౌమ్య నామ సంవత్సర ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమా ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యుక్త కర్కాటకలగ్నమందు జరిగింది. కానీ రాముని జన్మదినం నాడే కళ్యాణము ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందామా!అవతార పురుషుడు శ్రీరాముడు జన్మించడమే లోకకళ్యాణం కోసం . అందుకనే శ్రీరామ జన్మదినమైన నవమినాడే అభిజిత్ లగ్నమందు (సూర్యుడున్న రాశినుండి నాలుగవ రాశి). శ్రీరామ కళ్యాణము ఆచరిస్తున్నాము.నేటి మనవివాహ వేడుకలు, ఆచారాలు, నాటి సీతారాముల వివాహమునుండి సంప్రదించినవే! ఈనాటికి వాడవాడల సీతారాముల కళ్యాణోత్సవము జరుపుకుంటున్నాము. మన ఇళ్ళల్లో కూడా అదేరీతిలో వివాహాలు చేస్తున్నాము.

ఉదాహరణకు పెండ్లి శుభలేఖ “జానక్యాః కమలాంజలిపుటే యాః పద్మరాగయితాః… అనే శ్లోకంతొ ప్రారంభమవుతుంది. తరువాత జరిగే స్నాతకం(వరపూజ), సుముహూర్తం, తలంబ్రాలు, కన్యావరణం , పెండ్లికుమారునికి పాద ప్రక్షాళన, అప్పగింతలు వంటి మన సంప్రదాయములోని పెండ్లి వేడుకలు, ఆచారాలు చాలామటుకు సీతారముల కళ్యాణంనుండి పాటిస్తున్నవే. దంపతుల అన్యోన్యతకు కూడా సీతారాముల వంటి దంపతులవాలని ఆశీర్వదిస్తారు.నేటికి కూడా మన ఇళ్ళల్లో జరుగు వివాహ సమయములో కన్యాదాత లక్ష్మీ నారాయణ స్వరూపుడైన వరుని పాద ప్రక్షాళన చేస్తూ చెప్పే మంత్రము ఒక్కసారి చూడండి. “ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ | ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా | పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా  సదా!” రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా!. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో!( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి) ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామా! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామా , ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి!ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది.(ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.) అని జనకుడు చెప్పి రాముని చేతిలో సీతచేతిని ఉంచి మంత్రజలం విడిచి పెడుతాడు .రాముడు అగ్నిసాక్షిగా సీత యొక్క పాణిగ్రహణము చేసాడు .దేవదుందుభులు మ్రోగి పూలవాన కురిసినది. తరువాత జనకుడు లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శతృఘ్నునకు శృతకీర్తిని ఇచ్చి కన్యాదానము చేసాడు! 

శుభం భూయాత్! 

కల్యాణ గుణధాముడు

గోరసం వారి శ్రీరామ నవమి కవితల పోటీ కొరకు ,
పంపిన కవిత.

ప్రక్రియ : గేయ కవిత.
శీర్షిక  : కల్యాణ గుణ ధాముడు.
----------------------------

రామా ! నిను తలచినంత నేమా వెతలన్ని తీరు
నోమారిటు రార ! రామ రవికుల సోమా !॥
బాలా కౌశల్య వర కృపాళా ! శ్రిత పరిపాలా !  
లీలా కరుణాలవాల , మృదు పద జాలా..॥

కామారి వినుత రామ,  ఇనవంశ కుల సోమ
 ధామా ! అయొాధ్య రామ, ముని జన కామా ॥
 శివ ధను భంగానంద ! సీతా-మనార-విందా !
 కైకేయిా వర పాలిత !  పితృ వాక్య సుపాలా ॥

ఆజ్ఞ కారి, వన విహారి ,యజ్ఞ రక్ష ధను ధారీ
కల్యాణ గుణ కారీ  ! భవ సాగర తారీ॥ 
 శిలాహల్య శాప హారి। తాటకాంతకా సౌరీ !   
 రావణాది  సంహారి ! పాప నాసకారీ  ॥ ॥
 
అంగా ! కరుణాంతరంగ. ముని మానస
హృదయ భృంగ ! రాజాధి రాజ రామ !
ధను శర భీమా ॥  గర్వారి, దైత్య దమనా
ధర పాలిత శుభ నామా ! కోదండ రామ -
రామమేయశుభాంగా ॥  

పట్టాభి రామ రామ ! త్రేతాయుగపురుష భీమ!
సుందర సుకుమార సోమ ! మంగళ  కామా ॥
రామా ! శ్రీ రామ రామ ! సీతా ! మనోభి రామ ।
వాతాత్మజ వందిత పద ,నౌమీ .। శ్రీ రామా ॥

--------------------------------------------------------

--------------------------------------------------------

అవతారపురుషుడు.

క్రమ సంఖ్య  127.
*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం లో...పంపినది.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  అవతార పురుషుడు.

దశరధానంద నేత్ర ! కౌశల్యా వరపుత్ర!
భరత లక్ష్మణాది భ్రాత ! రవి కుల జాత॥
కైకేయిా వర పాలిత ! పితృ వాక్య పరిపాలక ,
కానన వనవాస రామ ! ఖలుసాంతక భీమా ॥

శివ ధనుా భంగ రామ ! సీతా మనోభిరామ!
త్రేతాయుగ పరంధామ! పావన ఘన శ్యామా ॥
మాయా మారీచ దమన ! మంగళ శుభ కామనా.. రాక్షసాంతకా ఘనా ! సీతా హృదయ భావన ॥

లంకా ధహనావేశ  ...జానకీ , శోక నాశ !
వాతాత్మజ వందిత పద ! మంగళ కర,చరణా ॥
దశకంఠ...దైత్య దుార। ధర్మ పాల ధను ధీర
మర్యాద పురుషోత్తమ ! మంగళ శుభ చరితా ॥

రాజాధి రాజ రామ ! ముని మానస హృదయ కామ॥
ధామా ! అయొాధ్య పాల  ! రఘు కుల సోమా ॥
ధర పాలిత దివ్య నేత్ర ! రామా వర సుగుణ గాత్ర
కరుణా తరంగ నేత్ర । కామారి మిత్ర ॥

పట్టాభి రామ రామ పావన సీతాభి రామ
పరమాత్మా సుచరిత శుభ సుందర రామా।
దేవాది ముని వందిత నుత పథ, పద గీర్వాణ
జన గణ హిత కల్యాణ ! మంగళ శుభ నామా ॥

*******************:******************-

Tuesday, April 20, 2021

శ్రీ రామ కధ

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*శ్రీ మద్రామాయణం ఈ-కవితా సంకలనం*
అంశము: *రామాయణం*

*10.ఆవిష్కరణ తేది: 25-04-2021,సా॥6-00 గం*

శీర్షిక  : శ్రీ రామ కధ :

రాముడు శ్రీరాముడు దశరధానందుడు
రాజీవ నెేత్రుడు రఘకులవరభుాషణుడు
భరత లక్ష్మణ శతృఘ్నుల భ్రాత పరంధాముడు
స్మిత  సిత వదనారవిందుడు  సీతామనోహరుడు ॥

తల్లి బాస ఎరిగినాడు , తండ్రి మాట జవదాటడు.
ధను శరముల బట్టినాడు.ధరణిజ గొని చిన్నవాడు-
అడవి కేగి అసురుల తెగ ద్రుంచిన రణ భీముడు.
దండకారణ్యములో దైర్య వాసమున్నవాడు ॥

మాత సీత ముచ్చటపడి  మాయ లేడి తెమ్మనడుగ
మాయ దెలిసి మారీచుని తరిమి తరిమి చంపినాడు
అదనుచుాసి రావణుండు అతివనపహరించినాడు
సీత బాసి శ్రీరాముడు సుగ్రీవుని కలసినాడు ॥

కిష్కింధకు రాజతడు రాముని ఋణగ్రస్తుడు
రమణి సీత వెదుకమని కపులనతడు  పంపినాడు॥
సంద్ర మధ్యమున ఘనమౌ సుందర  పురమది లంక, కృుారుడు దశ కంఠుడురావణుడు రేడసురులకు ॥

రామ బంటు హనుమంతుడు సీత వార్త చెప్పినాడు
లంక కేగి రాముడపుడు దశకంఠుని దునిమినాడు.
జనులు సంతసించినారు  సంబరములు జరిపినారు
రామనమి దినమున  శ్రీరామచంద్రు గొల్చినారు.
------------------------------------------------------------

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021

Sunday, April 18, 2021

పాటవెలది లో సుందరాకాండ 120 to 200.

పాట వెలది  పద్య ప్రక్రియలో సుందరాకాండ.
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
రుాపకర్త.: శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
కల్యాణ్. : మహారాష్ట్ర .

120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
భయము చెంది వార భయము కోరె
రాత్రి గడిపి రెటులొ  రణము దలచి
రమణి సీత విడిరి  రగుల భయము ॥
122.
శోక వనిని సీత  శోక మిడుచు
కడగ రాము దలచె కమల నేత్రి 
 ప్రాణ త్యాగ మెంచి  ప్రణతు లిడుచు
మెడకు జుట్టె జడను మేలు ఉరిగ ॥
123. 
కనుల నీరు నిండె  కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత  వనిని జరిగె
శుభ శకునములను  సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి  సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన  రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక  ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
 వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య  పాట రీతి.
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు  రఘుకులజుడు ॥
130.
తండ్రి మాట వినెడు తనయు డతడు
ధర్మ మార్గ మెంచు ధర్మ ధవుకు
జ్ఞాన ధనుడతండు దాన గుణుడు
దశరధాత్మజుండు ధర్మ ప్రభువు ॥
131.
సభను సభికులంత  సమ్మ తిడగ
రాజ పట్టమిడగ రాము నకును
జేయ నిర్ణ యించె జయము గాను 
దశరధుందు ధర్మ దాశరధికి ॥
132.
సంతసమ్ము తోడ సతుల జేర
చిన్న భార్య కైక చిందె విషము
మున్ను బాస లిడిన ముాడ్వరముల
ముందు ఇమ్మ నడిగె ముార్ఖముగను ॥
133.
మాట తప్పనన్న మగని  జుాచి
కరకు కైక కోరె కటు వరములు
వనము కంప మనెను వర సుతుడను
కట్ట వలె భరతుకు  పట్ట మనెను ॥
 134.
రాము వీడ మనెను రాజ్య సుఖము
కడకు పంప మనెను  కాన నముకు
పదియు నాలుగేండ్లు పరిమి తిడెను
కఠిన మనము నిండు  కపటి కైక ॥
135.
దద్దరిల్లె నభము ధరణి పగిలె
మాట విన్న రాజు మదిని రగిలె
ఏమి కోర్కె ఇదని ఏడ్చుచడిగి
దశరధుండు కుాలె ధరణి పైన ॥
136.
ముక్కుపచ్చలారు ముద్దు సుతుని
అడవికంప లేను అడుగ నీవు
కనికరమ్ము తోడ కరుణ గొనుమ
అనుచు ధశరధుండు అడిగి సోలె ॥
137.
కరగ లేదు మనసు కఠిన గుణికి
దీను డతడు వేడ ధక్కరించె
మాట  ఇచ్చితీవు మరల కనుచు
పట్టు బట్టి  కైక పతిని  రోసె ॥
138.
తండ్రి మాట వినెడు తనయు డతడు
తల్లి కోర్కె దీర్చ తరల వనికి
వల్క ధారి యుౌచు వదలె పురము 
చెదర నీక నగవు చేసి నమము ॥
139.
రాము విడవ లేని రమణి సీత
వెంట నడచె నతని వెలుగు వలెను 
రాము గుాడి నడచె లక్ష్మణుండు
రాము డున్న చోటె రక్ష యనుచు ॥
140.
కామ రుాపులైన కర్కసులను 
హతమొనర్చె రాముడడవి లోన
దండకా అరణ్య దాపు నతడు
దానవులను దృంచె, దరిమి తరిమి ॥
141.
 సుారు డతని గనెన సుార్ఫణఖయె
 పెండ్లి యాడ గోరి ప్రేమ దెలిపె
 కోసె ముక్కు చెవులు  కోపి అతడు
 రామ అనుజు డతడు రక్షకుండు
 142.
లక్ష్మణుండు అతడు లక్ష ణుండు.
సీత గాచు నతడు  చిన్న వాడు .
రావణాసు చెల్లి రక్కసామె
రగిలె బాధ తోడ రక్కసామె ॥
143.
అన్న రావణునకు అంత జెప్పె 
 చెల్లి మాట వినుచు చెలగె నతడు
 అనుజు మారి చునకు ఆజ్ఞ జేసె
 మాయ లేడి గాను మార నతడు ॥
 144.
అన్న రావణు మాట నమలు జేసి
మారిచుండు వెడలె మాయ తోడ
మృగము జుాచి మురిసె ముదిత సీత
స్వర్ణ మృగము కోరె స్వయము సీత ॥
145.
సీర కోర్కె దీర్చ సిద్ధ మౌచు
రాము మృగము  తరిమె రమణి కొరకు
మాయ తెలియు రేడు మాటు వేసి
మారిచునను జంపె మహిమ తోడ ॥
146.
జాప్య మగుట గాంచి  జడిసె సీత
పంపె లక్ష్మణునదె పడతి వనికి.
దానవులది మాయ దడవ కనుచు
గీరి దాట కనుచు గీత గీసె ॥
147.
కృుద్ధ రావ ణుండు కృుారు డతడు
మానినపహరింప మాయ పన్నె
సాధు రుాప మెత్తి సమయ మిదని
రమణి దరికి పోయె రావణుండు.॥
148.
బిక్షు వేష కునకు బిక్ష మిడగ
సీత మాట మరచి  గీత దాటె.
 కపట రుాప ధారి కరుణ వీడి
 మాతనపహరించె మాయ తోడ ॥
 149.
ఇంతి బాసి వగచె ఇనకులజుడు
అడవి దారి బట్టె అవనిజ గన.
వృద్ద గ్రద్ద జెప్పి వ్రాలె నంత 
ప్రాణ ములను బాసె ప్రభువు చెంత ॥
150.
లంక పురము వెదుక లక్ష్యమునిడి
రేయి పవలు దిరిగె రేడు విసిగె .
నగవు లేలి నట్టి నాధు డలసె
చిక్కి శల్య మాయె చింత తోడ ॥
151.
వాలి గుాల్చె నతడు  వనమునందు 
వాని తమ్ము జేసె వనికి రాజు
 రామ సుగ్రివులదె రాగ మలర 
 మిగుల ప్రీతి మెలగు మితృలైరి.॥
 152.
 సంత సమున విభుని సత్కరించె
 వానరులకు రేడు వరలు భక్తి .
 సిరుల నేలు ముఖము చిన్న బోవ
 విషయ మేమనడిగె విభుని రేడు ॥
153.
రాముడశృవులతొ , రమణి దలచి
విషయ మంత జెప్పె  వివర ముగను .
విషయ మంత వినిన విభిషణుండు
తరుణి వెదికు దేను ,తప్పకనెను ॥
154.
 ప్రతిగ మేలు జేతు ప్రభువు కనుచు
 కపుల పిలచి జెప్పె కబురు నతడు
 రమణి వెదుక మనెను  రాజ్య మంతా
 రామ కార్య మిదనె , రాజసమున ॥
 155.
కామ రుాపు లైన ఘనులు కపులు
వెదుక నాల్గు దెసలు వెడలి రంత.
పక్షి రాజు మున్ను  పలుకు బాట.
కడకు సాగరమును గనిరి కపులు॥
156..
సాగరమును దాట సాధ్య మౌన
నట్ట నడుమ గలదు నగర లంక 
ఎగుర గలమ మనము, ఏమి దారి..?
చేత నౌన మనకు జేర లంక. ॥
157.
వగచు కపుల జుాచి వాయు సుతుడు
తనదు మాట జెప్పె తరుణ మిదని 
అంజనీసు తుడను హనుమ నేను
కడలి దాటుదేను గన కమలిని ॥
158.
అనుచు పలుకు నాకు  అనుమ తిడెను..
 విభుడు రక్ష నాకు  విడ పదములు .
రామ దాసు డేను  రమణి నమ్ము
అనుచు పలికె హనుమ ఆదరమున ॥
159.
ప్రభువు నాజ్ఞతోడ పయన మైతి
జేర వస్థి లంక జయము తోడ
మాత! సీత వెదుక మదిని దలచి
ఓర్మి శాఖ లందు ఒదిగి యుంటి.॥
160.
అనుచు పలుకు నట్టి , హనుమ జుాచి
విస్మయమ్ము  తోడ వినెను సీత.
వేల కిరణ ద్యుతుల వెలుగు వాని 
కపిని జుాచె సీత కడు ముదమున ॥
********************************
161 :
చిన్నదైన రుాపు చిత్రముగను
శ్రియము గానె తోచె సీత కపుడు
నన్ను తెమ్మ నంపు , నాధు బంటు
నమ్మకస్తు డితడు నరుడు కాదు ॥
162.
వనచరుండు ఇతడు వానరుండు
అసురు డితడు కాడు అతి బలుండు
రామ భక్తి నిండు రక్షకుండు
అనుచు మురిసె సీత హనుమ జుాచి ॥
163.
కనులు చెమ్మగిల్లు కాంత జుాచి
హనుమ పలికె నపుడు అర్ద్రముగను
రక్కసులకు జిక్కు రమణి మణివి
ఎవరు నీవు తల్లి ఏమి గాధ ॥
164.
సర్వ లక్షణ  సార  సగుణ వతివి ,
సిరుల నెలవు సాధ్వి  సీత సతివ ?
రాము బాసి నట్టి రమణి మణివ ?
తెలుపు మమ్మ నీవు తెరలు తొలుగ ॥
165.
అనుచు హనుమ బల్క అవనిజపుడు
కపి కులజుని జుాచి కదలి వచ్చి
పలికె శిరము వంచి భయము వీడి
కనుల నీరిడుచును కమల నయని  ॥
166..
జనక రాజు పుత్రి జానకేను
పుాజ్య దశరధునకు పుత్ర వధువు
ప్రీతి రాఘవునకు ప్రియసతేను
వరలు సీత నేను వానరేంద్ర ॥
167..
కపట వేష మునను కఠిను డౌచు
అపహరించి నాడు అతడసురుడు.
లంక కతడు రాజు లాలసుండు
చెరను బెట్టె నన్ను చెడుపు గుణుడు.॥
168.
గడువు రెండు నెలలు గడచి నంత
దాన వుండు దునుము దయను వీడి
విధి బలీయ మనుచు వివశనౌచు
విధిగ వేచి యుంటి విభుని కొరకు ॥
169.
అనుచు పలికి నట్టి అవనిజ గని
హనుమ చెంత నిలచె అంజలిడుచు.
విభుడు నీదు వార్త  వినగ నెంచి 
నన్ను  పంపి నాడు నమ్మ వమ్మ ॥
170.
నీదు క్షేమ వార్త నిశ్ఛయముగ
దీను డైన విభుకు  దీర్ఛు చింత.
రాముడుండ లేడు రమణి విడచి 
రయము నతడు వచ్చు రాగ మలర ॥
171.
విభుడు కుశల వార్త వినగ నెంచి
వేచి యుండు నవల వేయి కనుల.
వానరులను గుాడి వచ్చు నతడు.
సాగరమ్ము దాటి సాయు ధునిగ ॥
172.
అలరు తేజ ముార్తి అభయకరుడు
అనుజు లక్ష్మణుండు అతని నీడ
కరుణ నేలు వాడు కమల ముఖుడు
రామచంద్రుడతడు రఘుకులజుడు॥
173.
రామ కధలు పలుక రమ్య ముగను
హర్ష మిడుచు  సీత హాయి నొందె
భయము విడెను సీత భక్తు గనుచు 
నమ్మె హనుమ మాట నాధు దలచి ॥
174.
ముదము నిండు సీత ముఖము గాంచి
హనుమ పలికె మరల అలరు భక్తి
రామ దుాత నేను రాసి సుగుణి
కులజు డతడు విభుడు కుశల మమ్మా ॥
175.
అనుజు లక్ష్మణు డంపె ఆది నమము
దీవెనిడెను విభుడు దీర్ఘ శుభము
మదిని  కోరె కపులు మంగళములు
శుభము నీకు తల్లి శుభము గల్గు ॥
176.
మిమ్ము జేర వారు మించు గతిని
కమ్ము కొనిరి దిశల నమ్మవమ్మ 
అన్న రాముడిచ్చె ఆనవాలు
అంగుళీక మిదియె అంబుజాక్షీ ॥
177.
 అమృత తుల్య మాయె హనుమ పలుకు
 విన్న సీత మురిసె విభుని మాట
 ఆనవాలు గొనెను అవని జాత
 కారె కంట నీరు  కలుగ సుఖము ॥
 178.
చుట్టు ముట్టి లంక మట్టు బెట్ట
వానరులను గుాడి వచ్చు నెపుడు..?
రాము డెపుడు వచ్చు రధము నెక్కి
రావణాసు గుాల్చ రణము నందు ॥
179.
బ్రతుక జాల నేను బ్రతుకు బరువు
ఎదురు జుాతు నేను ఎదరు జుాతు
గడువు ముగిసి నంత గాన క్షణము
అనుచు సీత పలికె హనుమ తోడ ॥
180.
అన్నపాన ములను అన్ని విడచి
అహరహములు నిన్నె అతడు తలచు.
శోక తప్తు డౌచు సొమ్మసిల్లు 
నిత్య వేద నొందు నీ విభుండు ॥
181.
మదిని కలచు మాట  మాత  సీత
వినగ లేక  వగచె వివర మింక 
వేగ పోవు మయ్య వేగ హనుమ 
అనుచు తొందరించె  అవని జాత ॥.
182.
విచలితాయె సీత  విభుని గతికి
చేత కనులు ముాసె భీత హరిణి 
నాదు కుశల వార్త నాధు దెలిపి
అర్తి దీర్చు మయ్య హనుమ నీవు ॥
183.
 మారు మాట రాక మానినిచ్చె...
మాత కురుల ముడియు మాన్య మణిని
నాదు జ్ఞాపి కిదని నాధు కొసగు
అనుచు జెప్పె సీత ఆర్ద్ర ముగను ॥
184.
జడుడు నన్ను జేరి జంప మున్నే
నాధు జేరి జెప్పు నాదు వినతి
విభుకు దెల్పి రమ్ము వివరముగను
వేచి యుందు నేను వేగ రమ్ము ॥.
185.
పలికి తివిగ హనుమ భక్తి తోడ
ఓర్మి రామ కధను ఒద్దికగను
నిండె మదిని శాంతి నిజము హను
ధైర్య మిపుడు కలిగె కార్య సుార ॥
186.
ముఖ్యుడ వని ఎరిగి మురియు చుంటి
వేగ పోయి రమ్ము వేచి యుందు.
మాసము లవి రెండు మరువ బోకు
తొలుత గడువు దెల్పి తోడ్క రమ్ముబ॥
187.
అనుచు కంట నీరు అదె శ్రవింప
భారమాయె మనసు భక్తవరుకు 
శోక మేల నమ్మ  శోభ నయని
భీతి వీడు మమ్మ  భీత హరిణి.॥
188.
సంశయమ్ము వీడి సంతసమున
ముాపు నెక్కుమమ్మ ముప్పు తొలగ
తోడ్క పొిదు నిన్ను తొందరగను
చెరను విడచి రమ్ము చేర విభుని ॥
189.
అనుచు పలికె హనుమ ఆదరమున 
నవ్వె  సీత వాని నాత్రముగని
కనగ బాలు డంటి కపివి నీవు
పట్టి ఎగుర గలవ పవన మందు ॥
190.
నింగి నెగుర బోవ నీకు వశమా ..
జలధి దాట గలవ జక్కగాను.
జార్చి వేతు వేమొ జలధి నన్ను
జంకు చుంటి నేను  జడియు చుంటి ॥
200.
 అనుచు సీత పలికె నలర నగవు
 ముదము నొంది మదిని మురిపెముగను
 చిన్న బోయె హనుమ చిందె సిగ్గు
 కామ రుాపు  విడచె కాంత ఎదుట ॥
 
 ******************************

Tuesday, April 13, 2021

గడ్డు రోజులు..కవిత

శార్వరి వీడ్కోలు - శ్రీప్లవ  స్వాగతం 

తేగీ 
చేదు గుర్తులశార్వరి చెల్లుచెల్లు 
నీదు గమనాన సౌఖ్యంబు లేదు లేదు
మాబ్రతుకులెల్లకష్టాల మ్రగ్గిమ్రగ్గి
బుగ్గి యయ్యేను శార్వరి పోయిరమ్ము

తేగీ 
నిజము నిత్యావసరధరల్ నింగితాకె
అభ్యుదయమెల్లదూరానఆగిపోయె
జీవితాలువిస్తరలయ్యిచెదరిపోయె
శార్వరీవేయిదండాలు సాగి పొమ్ము

తేగీ 
సన్నుతాంధ్రులహక్కువిశాఖ ఉక్కు 
వ్యక్తి పరముజేయప్రభుతయుక్తిపన్నె
అన్నదాతలయగచాట్లుమిన్నుముట్టె
గడ్డురోజులుచేకొనికదలవమ్మ

తేగీ //కర్కశకరోన క్రిమిని నీ కాలరాసి
నింగినంటినధరలను నేలదించి
కొత్త ఆశల్ నునుచిగురులొత్తగాను 
ఇలకు శ్రీప్లవ వర్షమా యేగుదెంచు

తేగీ 
గతము కష్టాల కడగండ్ల గడిచిపోయె
లేశమైననుసౌఖ్యముల్ లేకపోయె
ఆత్మ దైర్యమునందించి హాయి గూర్చి
శ్రేయములనీయ శ్రీప్లవ చేరరమ్ము

తేగీ /కరుణ చూపించి తరగని సిరులనీయ
వెతలు పోగొట్టి బ్రతుకుల వెలుగునింప
ఆయురారోగ్య ధాయివై యరుగుదెంచు
సకల శుభధాయి శ్రీప్లవ స్వాగతంబు

తేగీ /గండుకోయిల పాటలో కమ్మదనము
మంచి మావిచిగురులో యమలగుణమ్ము
నింపి చైతన్య ధాయియై నేడుధరకు
వచ్చు శ్రీప్లవ వర్షమా స్వాగతంబు
✍️Pranisad 
SRRZPHS, NUZVID.

Thursday, April 8, 2021

పాటవెలది సుందరాకాండ 61 to 100

61.
వానప్రస్థ మేల వాయు సుతుడు
నిత్య నియమ మేలె  నిష్ట తోడ
చంద్ర, సుార్యు లాది జయ గ్రహములు
ప్రబలు గౌరవముల పణతు లిడెను ॥
62.
వనము లెన్నొ తిరిగి వడలి -జేరె 
శోభ లలరు వని కశోక వనికి
విరిగ కురియు తేనె విందు జేయ
గ్రోలు భృంగము లవె గోల గాను ॥
63.
పక్షి గుంపు లెల్ల పరవశమున
కిచల రవము జేసె కీచు గాను
నెమలు లాడె నచట నేర్పు కళల
గంధ వీచి సోకె గాడముగను ॥
64.
రాలు పుాల పండ్ల రసము గ్రోలి
కపి వరుండు ఆడె కడు విధముల
ఆట పాట తోడ అరచి విరచె
మంచి మేలు తరుల మర్కటుండు.॥
65.
పుావులనిన పుాల తావులనిన
పరవసించు నెంతొ పసిడి కాంత
తేనెలుారు వనము తేట వీచి
తధ్య మిచటె నుండు తరుణి సీత ॥
66.
అనుచశోక వనము నదెగ జుాచి
చెట్టు నెక్కె హనుమ  గుట్టు గాను
నేల వాలి కుంగి ఏడ్చు చున్న
యువతి గాంచె నతడు ఉత్సు కతను ॥
67.
చిక్కి శల్య మైన చిన్న దాని
గనెను హనుమ నామె కరుణ తోడ
 జుట్టు ముట్టి రామె జట్టు గాను
 లంక సురుని చరులు లంఖిణీలు ॥
 68.
వృక్ష శాఖ లందు వరుస సరులు
మణులు మరకతముల మాల లెన్నొ
కర్ణ వేష్ట హస్త కంకణములు
హనుమ జుాచె వాటి నచ్చెరువున ॥
69.
రమణి వీడి నట్టి రతన ధనము
గురుతు పట్టి హనుమ మురిసె మదిని
సర్వ లక్షణముల సార సుగుణి
సీత దక్క ఎవరు సిరుల నెలవు ॥
70.
జానకమ్మ ఒకతె జగతి లోన
రామ మదిని దోచు రమణి సాధ్వి
పదియు నాలు గేండ్లు పావనిచట
దుర్దయెంత గనెనొ దుఃఖ పడెనొ ॥
71.
అనుచు దలచి మదిని హనుమ వగచె
తల్లడిల్లె హనుమ తరుణి జుాచి 
జయము కలుగు నీకు జగతి ననుచు 
శుభము పలికె హనుమ సుఖము లేలు ॥
72.
కఠిన కాల మిదియె కష్ట ములకు
తొలగి పోవు నమ్మ త్వరిత గతిని
నీదు జాడ తెలియ నిక్క ముగను
రావణునదె చంపు రామ శరము ॥
73.
అనుచు హనుమ సోలె నచటె నిలచి
 ఝాము లాయె ముాడు జాగ రణతొ 
మధుర వాద్య ఘోష మంగళములు
ఆలకించె హనుమ హాయి మీర ॥
74.
మరపు రాని సీత,  మదిని కలచ
మేని తాప మలర మేలు కొనిన
రావణుండు నెరపె  రాజ సమున
శాస్త్ర యుక్త ముగను సర్వ విధుల ॥
75.
అప్సరసల బోలు అతివలతని
సేవ జేయ వచ్చి చెంత  నిలచె
సార భుాషణముల సరిగ దాల్చి
వెడలశోక వనము  వేగ తెమిలె ॥
76.
సతులు నుార్గు రతని సరస జేిరి
మెరయు సరుల జుాచి మెచ్చి రతని
రమణి దలచి మదిని రక్కసుండు 
నవ్వి రావణుండు నడచె వనికి ॥
  77.
రామ గుణ గణముల రాత్రి పవలు
జపము జేయు పుణ్య చరిత జుాడ
రావణుండు కదలె రాజసమున
మేని సరుల జాపి మెప్పు పొంద ॥
78.
మసక రుాపు తోడ మసలె హనుమ
రావణాసు గాంచి రగిలె మనము
శింశుపావనమున  సీత సాధ్వి
 ఏక వస్త్ర అమె ఎరుగ దేమి ॥
 79.
అనుచు తలచి హనుమ అదె పరుగున
వనము జేరె నంత పలుక హితము
విషయ మెల్ల జెప్ప వివర ముగను 
లంక సురుకు బోధ లదెగ జేయ. ॥
80.
దాన సామ భేద దండములతొ
సానుకుాల పరచ సాధ్వి దరికి
జనెను రావణుండు జతన ములతొ
జేరి సీతను గని జెప్పె మనసు ॥
81.
ఏలుకొందు నిన్ను ఏల చింత
రాణి వాస మేలు రమణి నీవు
లోక సుందరీవు లోల నేత్రి
వన  నివాస మొదులు వనజ నేత్రి ॥
82.
వనము లేలు వాని వశము గాదు
వలయు సుఖము లిడగ , వట్టి మాట
నన్ను జేర రమ్ము నమ్మ కమున
సుఖము లేల గలవు సుందరాంగీ ॥
83.
అడవి దిరుగు రాము డల్పు డతడు
నన్ను గెలవ తరమ నరుడతండు
ఇంద్ర దేవతలను  ఇట్తె గెలిచి
ధామ సర్గ మేలు ధవుడ నేను ॥
84.
మరచి పొమ్ము వాని మరచి రమ్ము 
సర్గ సుఖము లిత్తు సరసి జాక్షి
అనుచు వాతలాప మధిగ జేసె 
చెడుపు మాట లనుచు జేర వచ్చె ॥
85.
సీత ధవుని దలచి శిరసు వంచి
నమము జేసె మదిని నాధు దలచి
గరిక మించు హీన గుణుడ వనుచు
పెరికి గడ్డి పరక పెట్టె నడ్డు.॥
86.
పిరికి పంద వలెను ప్రియుని చాటు
అపరించి తీవు యడవి జొచ్చి
కపట వేస మునను కరుణ లేక
పట్టి తెచ్చి తీవు పలికి కల్ల ॥
87.
వదరు బోతు వీవు వంచకుడవు
పనికి రాని వట్టి పలుకు లాపు 
శరణు వేడు మతని శరణటంచు
రాము డతడు ఘనుడు రక్ష కుండు ॥
88.
భీతి నొందు వట్టి  భీరు డీవు
నీతి లేని గుణము నీచ బుద్ధి
గుణుడు రాము డొచ్చి గుాల్చు నిన్ను 
లంక దగ్ధ మొౌను శంక లేదు ॥
89.
అనుచు సీత బల్క నదిరె నతడు
కోప మాప లేని  క్రోధి యగుచు
ఎంత జాణ వీవు యెంచ తరమా !
కరకు మాట నీదు కనివినెరుగ ॥
90.
నీదు మాటలు విని  నిలువ జాల
గడువు రెండు నెలలు గడచి నంత
కనికరించ నేను కాంత వనుచు
చంపి వేతు నిన్ను చపల నేత్రి॥
91.
రాను ఇచటి కింక రానటంచు
 అరచె రగుల నతడు అదరె లంక
 క్రొవ్వు దేరు మేను క్రోధ మునకు
 కరిగి కారె చమట కరకు మేని ॥
 92.
రాము నాజ్ఞ  లేక రక్ష లేక
పలుకు లేక యుంటి పరుష మొప్ప
పరమ సాధ్వి నేను పతివ్ర తేను  
తృణము బోలు నిన్ను తృటిని గుాల్తు ॥
93.
కలికి పలుకు లోన కఠిన ముగని
రగిలె రావణుండు రమణి జుాచి
నివురు గప్పు నట్టి నిప్పు యట్లు
మాట లాడె సీత మాయ  గాదె ॥
94.
అనుచు పలికి నతడు అవని గాచు
అక్కసు నదె పిలచె రక్కసులను
రాయి వంటి దైన రమణి మనసు 
మార్చు మనుచు  జెప్పి మరలె నతడు ॥
95.
గడువు రెండు నెలలు  గడచి నంత
వినదు అన్న మాట విననటంచు
మాట వినగ జేయ మసలు మనుచు 
కరుగ జేయ మనెను కాంత మనసు ॥
96.
అటుల జేయకున్న ఆగ్రహింతు
అబల లనియు జుాడ నాగ్ర హింతు
శిక్ష వేదు జంపి శిలువ వేతు
అనుకు క్రోధి వెడలె  అవనిజదరె ॥
97.
మరలె రావణుండు మదిని కృంగి
కొరకొరనుచు జుాచి కోమలి దెస
ఎర్రనైన కనుల నెగుర వేసె
ఆగి తొడను చరచె  నహము తోడ ॥
98.
కనికరమ్ము వీడి కరుణ లేని 
 రక్కసుల్లు జేరి రమణి రోసె
 కంట ధార లాయె కనుల నీరు
 బేల యౌచు వాలె బెదరి సీత ॥
 99.
ముదుసలైన త్రిజట ముప్పు నెరిగి
మాతకడ్డు నిలచె మండి పడుచు
సీత జేరి నంత సీమ లంక
దగ్ధమౌనటంచు దరిమి గొట్తె ॥
100.
ప్రళయ కాల మిదియె ప్రాణ ములకు
దానవులకు కీడు దాపు రించె
అనుచు త్రిజట పలుక అదరసురిలు
బెరకు తనము తోడ బెదరి చెదరె ॥
------------------------------------------------

పాటవెలది ప్రక్రియలో సుందరాకాండ..120 to 130

120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
భయము చెంది వార భయము కోరె
రాత్రి గడిపి రెటులొ  రణము దలచి
రమణి సీత విడిరి  రగుల భయము ॥
122.
శోక వనిని సీత  శోక మిడుచు
కడగ రాము దలచె కమల నేత్రి 
 ప్రాణ త్యాగ మెంచి  ప్రణతు లిడుచు
మెడకు జుట్టె జడను మేలు ఉరిగ ॥
123. 
కనుల నీరు నిండె  కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత  వనిని జరిగె
శుభ శకునములను  సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి  సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన  రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక  ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
 వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య పాట రీతి
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు  రఘుకులజుడు ॥
130.
పితృ వాక్య పాల పిబరుడతడు
ధర్మ మార్గ మెంచు ధరణి  ధవుడు
రాజ్య మప్పగింప రాజ విధుల
ధశరధుండు తలచె ధర్మ మదని ॥

Wednesday, April 7, 2021

పాట వెలదిలో సుందరాకాండ..111 to 121.

111.
సుారు డతడు యెక్కె సుాకరమును
ఒరిగె కుంభకర్ణు డొంటె పైన
మదము నింద్రజిత్తు మకరమెక్క
దక్షిణంబు దెసగ తరలి ,  పడిరి ॥
112.
అసురు లదెగ జచ్చె అవని నిండె
మట్టి గలిసి రంత మహిమ గాదె
భయము భీకరమ్ము , బడక బాధ 
కదలి పారి పొండు వదలి లంక ॥
113.
అనిన త్రిజట తోడ అసురు నాజ్ఞ
చెప్పి రపుడు వారు చేయు పనిని
సీత మనక యున్న  శీఘ్ర గతిని
చంపు రావణుండు చరచి మమ్ము ॥
114.
నీదు మాట వినిన నీల ఘనుడు
రాము డొచ్చి చంపు రమణి రోయ
ఏమి సేయ వలయు ఏది సబబు
తెలియ జెప్పు మాకు తెలివి మీర ॥
115.
అనిన త్రిజట జెప్పె అసలు మాట
రాము డొచ్చు మాట   రక్క సులకు
తెల్ల గంధము నదె దేహ మలది
వచ్చె వేల్పు లిటకు  వనిత వెదుక ॥
116.
తెలుపు వలువ లిడిరి తెలుపు సరులు
ధారణమ్ము జేసి , ధాశరధులు
చంద్ర కాంతి జిమ్ము ఛత్రము గల
తెల్ల కరిని ఎక్కి తేలి ఎగిరె ॥
117.
మంగళములు  మ్రొాగె మధుర గతిని
దండ మిడుచు వచ్చె దనుజు డొకడు
వినయ ముగను రామ విభుని కడకు
వీరుడతడు గనవి  భీషణుండు.॥
118.
విశ్వ కర్మ జేయు విజయ లంక
అమరెనందముగను అదియె నిజము
రావణుండు రసిక రాజ విభుడు
ఏక ఛత్ర ముగను ఏలె లంక ॥ 
119..
రామ దుాత యొకడు రాత్రి జేరె
 తిక్క వానరుండు  తిరుగు బోతు
 వాలమంట నిప్పు  వాడె గాల్చె
 మంట లెగసె మారె మసిగ  లంక ॥
120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥

Tuesday, April 6, 2021

తెలుగు సామెతలు.

[4/6, 16:00] +91 90190 38596: సామెతలు 🚩
🚩అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
.
అంకపొంకాలు లేనిది శివలింగం
అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి
అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు
అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు
అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని
అంగట్లో అరువు - తల మీద బరువు
అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం
అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది
అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
అంగడి బియ్యం - తంగేటి కట్టెలు
అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
అంగిట బెల్లం - ఆత్మలో విషం
అంగిట విషం - మున్నాలిక తియ్యదనం
అంచుడాబేగానీ పంచడాబు లేదన్నట్లు
అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు
అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట
అంటే ఆరడి - అనకుంటే అలుసు
అండలుంటే కొండలు దాటవచ్చు
అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం
అండ వున్నవానిదే అందలం
అంత వురిమీ యింతేనా కురిసేది!
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత
అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?
అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?
అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?
అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు
అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు
అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట
అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు
అందని ద్రాక్షపండ్లు పుల్లన
అందముంటే సరా! అదృష్టముండొద్దూ!
అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు
అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు
అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు
అందరికీ అన్నం పెట్టే వాడు రైతే
అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ
అందరినీ మెప్పించడం అలవి గాని పని
అందరూ అందల మెక్కేవారే, మోసే వారెవరు?
అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోయినాయ్‌
అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది
అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు
అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట
అందాలు నావి - సంబరాలు నీవి అందిట
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
అందితే తియ్యన అందకుంటే పుల్లన
అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు
అంధునికి అద్దం చూపినట్లు
అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు
అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు
అంబలి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడా?
అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు
"అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము
అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు
అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు
అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు
అక్క పగ, బావ మంచి
అక్క మనదైతే బావ మన వాడవుతాడా?
అక్క మొగుడు కుక్క
అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ
అక్కరకురాని చుట్ట మెందుకు?
అక్కరకు వచ్చినవాడే మనవాడు
అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు
అక్కరకు రానిది అవనిలో లేదు
అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం
అగసాలిని, వెలయాలిని నమ్మరాదు
అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు
అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది
అగ్గిమీద గుగ్గిలం లాగా
అగ్గువ అయితే అంగడికి వస్తుంది
అగ్గువ కొననీయదు ప్రియం అమ్మనీయదు
అగ్నికి వాయువు తోడైనట్లు
అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు
అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు
అగ్నిలో ఆజ్యం పోసినట్లు
అగ్నిలో మిడత పడ్డట్లు
అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు
అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది
అచ్చట్లు - ముచ్చట్లు - ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు
అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు
అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు
అచ్చు పోసిన ఆఁబోతువలె
అజీర్ణానికి లంఖణం మందు
అటైతే కందిపప్పు - యిటైతే పెసరపప్పు
అటైతే వైద్యకట్నం - యిటైతే వైతరిణీ గోదానం
అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు
అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి
అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు
అడకత్తెరలో పోకచెక్కవలె
అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడన్నట్లు
అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది
అడగనిదే అమ్మయినా పెట్టదు
అడవి ఉసిరికాయకు, సముద్రపు ఉప్పుకు జత కలసినట్లు
అడవి పత్రి - వాన నీరు
అడవి గాచిన వెన్నెల - ముదిమిన చేసిన పెళ్ళి ఒక్కటే
[4/6, 16:00] +91 90190 38596: అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు
అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు
అడిగింది రొట్టె - యిచ్చింది రాయి
అడిగితే చిరాకు - అడగకపోతే పరాకు
అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అడవిలో పడ్డట్లుగా
అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు
అడుక్కుతినేవాడికి అరవై ఆరు కూరలు
అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు
అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప
అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది
అడుగు దాటితే అక్కర దాటుతుంది
అడుగున ఎరువుకొద్దీ పైన పంట బంగారం
అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు
అడుసు త్రొక్కనేల - కాలుకడగనేల?
అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు బిడ్డలా?
అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?
అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు?
అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట
అడ్డేటు మీద గుడ్డేటు
అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న
అత్యాశ నిత్య దరిద్రం
అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?
అతి చేస్తే మతి చెడుతుంది
అతితెలివికి ఆకలెక్కువ
అతితెలివికి మగబుద్ధి అన్నట్లు
అతిరహస్యం బట్టబయలు
అతివినయం ధూర్త లక్షణం
అతివృష్టి - అనావృష్టి
అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు
అతి సర్వత్ర వర్జయేత్‌
అతి సుకుమారం - కటిక దరిద్రం
అతుకుల కాపురం - చితుకుల మంట
అతుకుల బొంత - గతుకుల బాట
అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?
అత్త అప్పుతీరే - అల్లునికి భ్రమతీరే
అత్త కాలము కొన్నాళ్ళు - కోడలి కాలము కొన్నాళ్ళు
అత్తకు అల్లుడాశ - అల్లుడికి అత్తాశ
అత్తకు మంచి లేదు - చింతకు పచ్చి లేదు
అత్తకు మొగుడు అల్లుడు
అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట
అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ
అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు
అత్తను ఉంచుకున్నవాడు ఆయుష్మంతుడు
అత్తను కొట్టి అటకెక్కింది - మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది
అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు
అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు
అత్త మంచీలేదు - వేప తీపీలేదు
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్తముండ కన్న ఉత్తముండ మేలు
అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు
అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట
అత్త లేని కోడలుత్తమురాలు - కోడలు లేనత్త గుణవంతురాలు
అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు
అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి
అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు
అత్తవారింటి లేమి అల్లుడెరుగు
అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
అత్తా ఒకింటి కోడలే - మామా ఒకింటి అల్లుడే
అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే
అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది
అతి తెలివి అరవై రకాలు
అతిథి కోసమే తిథులు వున్నట్లు
అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే
అదుగో అంటే ఆరునెలలు
అదుగో పులి అంటే యిదిగో తోక అన్నట్లు
అదును గాని పదును
అదును చూచి పొదలో చల్లినా పండుతుంది
అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు వేయాలి
అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పును విడవాలి
అదుపులేని గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
అదృష్టం వుంటే పోయిందికూడా చేతికి వస్తుంది
అదృష్టం చెప్పిరాదు - దురదృష్టం చెప్పిపోదు
అదృష్టం పండితే ఆరు నూరవుతాయి
అదృష్టవంతుడ్ని చెరిపేవారూ, దురదృష్టవంతుడ్ని బాగుచేసేవారూ లేరు
అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నట్లు
అద్దం మీద ఆవగింజ పడ్డట్టు
అద్దంలో చూసుకుంటూ అందం అడిగినట్లు
అద్దంలోని మూట అందిరాదు
అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
అధమునికి భార్య అయ్యేదానికన్నా బలవంతునికి బానిసయ్యేది మేలు
అధికారం ఆరుపాళ్ళు - అహంకారం అరవై పాళ్ళు
అధికారం బంగారు గొలుసుల పంజరం
అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌
అధికారి మూరెడు - బంటు బారెడు
అధికాశ లోక దరిద్రం
అనంతయ్య చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నట్లు
అనగా అనగా రాగం - తినగా తినగా రోగం
అని అనిపించుకోవలెనా అత్తగారూ!
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు
అనుభవం ఒకరిది - ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివి
అనుమానం ప్రాణ సంకటం / అనుమానం పెనుభూతం
అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది
అనువు గాని చోట అధికుల మనరాదు
అనువుగాని చోట పుండు - అల్లుడి వైద్యం
అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది
అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి
అనూరాధలో అడిగినంత పంట
అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది
అన్నం అరిగిపోతుంది - ఆదరణ శాశ్వతంగా వుంటుంది
అన్నం కన్నా ఆదరణ ముఖ్యం
అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు
అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు
[4/6, 16:00] +91 90190 38596: ఆ యింటికి తలుపూ లేదు, ఈ యింటికి ద్వారబంధమూ లేదు
ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
ఆకతాయి కోరికల ఆకలి కేకలే సోయగాల విహారాలన్నట్లు
ఆకలి అవుతోంది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట
అకలి ఆకాశమంత - నోరు సూది బెజ్జమంత
ఆకలిగొన్న కరణం పాత కవిలి బయటకు తీసాడట
ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు
ఆకలి తీరేందుకు అర్ధగంట పోరు చాలు అన్నదట
ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖ మెరుగదు
ఆకలిలేనివానికి అజీర్ణం సంగతి ఏమి తెలుస్తుంది?
ఆకారం వుంటే శ్రీకారం ఉండొద్దూ!
ఆకారం చూసి ఆశ పడటమేగానీ, 'అందులో' పసలేదు అయ్యకు అందట
ఆకారం వికారంగా వున్నా బుద్ధి సూరేకారంగా వుంది
ఆకార పుష్టి - నైవేద్యనష్టి
ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు
ఆకాశమంత గొప్ప అన్నట్లు
ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు
ఆకు యిస్తే అన్నం పెట్టినంత పుణ్యం
ఆకుకు అందక - పోకకు పొందక
ఆకు చుట్టను - ఆడదానిని నమ్మరాదు
ఆకుతోట సేద్యం అన్ని అవసరాలనూ తీరుస్తుంది
ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టినట్లు
ఆకులు నాకే వాళ్ళింటికి మూతులు నాకే వాళ్ళు వచ్చినట్లు
ఆకులో అంతా పెట్టి అంచున పెంట పెట్టినట్లు
ఆకూ పోకా అందిస్తే అందాలన్నీ వడ్డిస్తా అందట
ఆగభోగాలు - అంకమ్మ శివాలు
ఆగభోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి
ఆ గొడ్డు మంచిదయితే ఆ వూళ్ళోనే అమ్ముడయ్యేదిగా
ఆచారం అన్నంభొట్లూ అంటే పెద్ద చెరువును కుక్క ముట్టుకుపోయిందన్నాడట
ఆచారం ఆరుబారులు - గోచీపాత మూడుబారలు
ఆచారం ముందు - అనాచారం వెనుక
ఆచారానికి అంతం - అనాచారానికి ఆది లేవు
ఆచారాలు నిలుస్తాయి - అర్థాలు పోతాయి
ఆటా పాటా మా యింట - మాపటి భోజనం మీ యింట
ఆడంగులలో పెదబావ
ఆడంబరానికి అంటకత్తెర వేసినట్లు
ఆడ చెత్త - మగ బంగారం
ఆడదానికి అలుసిస్తే తలకెక్కి కూర్చుంటుంది
ఆడదాని కౌగిలి సుఖాల లోగిలి
ఆడదానిచేతి అర్థం - మగవాడిచేతి బిడ్డ మనవు
ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు
ఆడదాని బుద్ధి అపరబుద్ధి
ఆడదాని బ్రతుకూ - అరిటాకు బ్రతుకూ ఒక్కటే
ఆడదాని మాట ఆపదలకు మూలం
ఆడదాని మాట నీటి మూట
ఆడదాన్ని చూచినా, అర్థాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
ఆడది తిరిగి - మగాడు తిరక్క చెడతారు
ఆడది అబద్ధమాడితే గోడపెట్టినట్లు, మగాడు అబద్ధమాడితే తడికె పెట్టినట్లు
ఆడది లేనిది అడవి - మగాడు లేనిది మఠం
ఆడదే అమృతమూ, హాలాహలమూ
ఆడదై పుట్టేకంటే అడవిలో మ్రానై పుట్టేది మేలు
ఆడపిల్ల పరువాలు సంబరాల జాతరలు అన్నట్లు
ఆడపడచు ఉసూరుమంటే ఆరు తరాలు అరిష్టం
ఆడపిల్ల పుట్టిందంటే, ఆయువు సగం క్రుంగిందన్నమాటే
ఆడపిల్ల పెళ్ళి - అడుగు దొరకని బావి ఒకటే
ఆడ పెత్తనం - తంబళ్ళ దొరతనం
ఆడ బిడ్డ అర్ధమొగుడు
ఆడబిడ్డ కత్తికి ఇరువైపులా పదునే
ఆడబోతే చూడబుద్ధి - చూడబోతే ఆడ బుద్ధి
ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు
ఆడలేక మద్దెల ఓడన్నట్లు
ఆడశోకం - మగ రాగం ఒక్కటే
ఆడి తప్పితే అపకీర్తి
ఆడిది ఆట - పాడింది పాట
ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి? ఇంతేమిటి?
ఆడబుద్ధి కంటే అపర బుద్ధి లేదు
ఆడే కాలూ - పాడే నోరూ వూరుకోవు
ఆ తండ్రికి కొడుకు కాడా!
ఆ తుష్టికీ, ఈ నష్టికీ సరి
అత్రగాడు ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నాట్ట
ఆత్రగాడికి బుద్ధి తక్కువ
ఆత్రానికి పోతే ఆడపిల్ల పుట్టినట్లు
ఆదర్శాలు శిఖరమెక్కితే, అవసరాలు అగాధంలోకి తోస్తాయి
ఆదాయంలేని శెట్టి వరదకు పోడు
ఆదిలోనే హంసపాదన్నట్లు
ఆ పడుగులోనిదే ఈ పీలికా
ఆపదకు పాపం లేదు
ఆపద మ్రొక్కులు - సంపద మరపులు
ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
ఆపదలో అడ్డుపడే వాడే చుట్టము
ఆపదలో ఆదుకోవాలి, ఆస్థిలో పంచుకోవాలి
ఆమడ నడిచినా ఆరిక కూడు తప్పలేదు
ఆమని సోయగాలు అందాలు విందులు అన్నట్లు
ఆ మాటా ఈ మాటా యింటి పెద్దకు
ఆమాటకూ, ఈ మాటకూ పెద్దకోడలు - ఆచేతి తుడుపుకూ, ఈచేతితుడుపుకూఅడ్డుగోడ
ఆముదాల బేరం - కామెర్ల రోగం నమ్మరానివి
ఆయ మెరిగి వ్యయం చేయాలి
ఆయాసాల మొగుడికి రేసు గుర్రంలాటి భార్య అన్నట్లు
ఆయుర్దాయం గట్టిగా వుంటే అడవిలో వున్నా బ్రతకవచ్చు
ఆయుర్దాయం వున్న రోగి హస్తవాసి వున్నా వైద్యుడి దగ్గరికే పోతాడు
ఆయువు గట్టిదయితే చాలు అన్ని రోగాలు పోతాయి
ఆయుష్యం ఆరుపాళ్ళు - యాతన ఏడు పాళ్ళు
ఆయుష్షు లేక చచ్చాడు గానీ వైద్యం లేక కాదు
ఆయెనమ్మా పెండ్లి - అణిగెనమ్మా రంధి
ఆరంభ శూరుడికి ఆర్భాటాలెక్కువ
ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా!
ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట
ఆరాటమేగానీ పసలేదన్నట్లు
ఆరాటాల పెళ్ళాం - ఆయాసాల మొగుడు
ఆరికకు చిత్త గండం - ఆడదానికి పిల్ల గండం
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె
ఆరుద్ర కార్తె విత్తనానికీ - అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి
ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి
[4/6, 16:00] +91 90190 38596: ఆరుద్రతో అదను సరి
ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది
ఆరుద్ర వాన అదను వాన
ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి
ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు
ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు
ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు
ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం
ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు
ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు
ఆలికి అదుపు - ఇంటికి పొదుపు
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
ఆలికి లొంగినవాడూ, అరగాణిలో పడినవాడూ ఉక్కిరి బిక్కిరి అవుతాడు
ఆలిని అదుపులో పెట్టలేడు గానీ, మందిని అదుపులో పెడతాడట
ఆలిని విడిస్తే హరిదాసు - సంసారం విడిస్తే సన్యాసి
ఆలి మాట విన్నవాడూ - అడవిలో పడ్డవాడూ ఒక్కడే
ఆలి వంక వారు ఆత్మ బంధువులు
ఆలి శుచి ఇల్లు చెబుతుంది
ఆలి ఏడ్చిన ఇల్లు - ఎద్దు ఏడ్చిన సేద్యం కలసిరావు
ఆలి చచ్చిన వారికి ఆలి బంగారం
ఆలి బెల్లం - తల్లి విషం
ఆలుమగల కలహం అద్దం మీద ఆవగింజ వేసినంతసేపే
ఆలుమగల కలహం అన్నం తినేదాకానే
ఆలుమగల కలహం కౌగిళ్ళలోకి చేరే వరకే
ఆలు లేత - నారుముదురు
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు
ఆవగింజంత సందు వుంటే అరవై గారెలు తిననా? అన్నాడట
ఆవాలు ముద్ద చేసినట్లు
ఆవాహనా లేదు, విసర్జనా లేదు
ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా?
ఆవు తొలి చూలు - గేదె మలిచూలు మంచిది
ఆవునిచ్చి పలుపు దాచుకున్నట్లు
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు
ఆవు పాడి ఎన్నాళ్ళు? ఐశ్వర్య మెన్నాళ్ళు?
ఆవులను మళ్ళించినవాడే అర్జునుడు
ఆవులలో ఆబోతై తినాలి - అత్తవారింట అల్లుడై తినాలి
ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టినట్లు
ఆవులూ ఆవులూ పోట్లాడుకుంటూ లేగల కాళ్ళు విరగత్రొక్కినట్లు
ఆవు లేని యింట అన్నమే తినరాదు
ఆవేశం ఆకాశమంత - ఆలోచన ఆవగింజంత
ఆశకు అంతు లేదు - గోచీకి దరిద్రం లేదు
ఆశకు అంతం లేదు - నిరాశకు చింత లేదు
ఆశకు పోతే గోచీ వూడిందట
ఆశకు మించిన దూరం - వడ్డీకి మించిన వేగం లేవు
ఆశకు ముదిమి - అర్థికి సౌఖ్యం లేవు
ఆశ గలమ్మ దోష మెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు
ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది
ఆశబోతు బాపనికి గోచీపాతే సంచి
ఆశలు తగ్గించుకుంటే అశాంతికి తావులేదు
ఆశ సిగ్గెరుగదు - నిద్ర సుఖ మెదుగదు
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యమంటారు
ఆశ్లేష వర్షం అందరికీ లాభం
ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది
ఆశ్లేష ముసలి కార్తె - ఆగి ఆగి తుంపర తుంపరగా కురుస్తుంది
ఆశ్లేషలో అడుగుకొక చినుకు పడినా అడిగినన్ని వడ్లు
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
ఆశ్లేషలో ఊడ్చినట్లయితే అడిగినంత పంట
ఆశ్లేషలో తడిస్తే ఆడది మగవాడౌతుంది
ఆశ్లేషలో పూస్తే అంతులేని పంట
ఆషాఢమాసంలో అరిశెలు వండను ప్రొద్దు వుండదు
ఆషాఢానికి ఆకుపోతలు
ఆసక్తి మారకం - అనాసక్తి తారకం
ఆసనంలో పుండు - అల్లుడి వైద్యం
ఆసులో పుల్లలా తిరిగినట్లు
ఆస్థికొక కొడుకు - ప్రేమకొక కూతురు

ఓం నమః శివాయ🙏
[4/6, 16:00] +91 90190 38596: అయితే అమీరు లేకపోతే ఫకీరు
అయిదవతనం లేని అందం అడుక్కు తిననా?
అయిదు శిఖలున్నా యిబ్బందిలేదు కానీ మూడుకొప్పులు చేరాయంటే ముదనష్టమే
అయినకాడికి జమాబందీ
అయినవాణ్ణి అడిగేకంటే కానివాడి కాళ్ళు పట్టుకోవడం మంచిది
అయిన పెళ్ళికి మేళాలా?
అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట
అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు
అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ
అయోమయం అడవి మొద్దు
అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది
అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు
అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?
అరగని కూడు - జరగని మాట
అరఘడియ భోగం - ఆరు నెలల రోగం
అరిచే కుక్క కరవదు
అరచేత వెన్న పట్టుకొని నేతి కోసం ఏడ్చినట్లు
అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్లు
అరచేతిలో వైకుంఠం చూపినట్లు
అరచేవాడి పంచన చేరవచ్చు గానీ, నాలిముచ్చు గడప త్రొక్కరాదు
అర్ధరాత్రి యుద్ధం ఎక్కడంటే మల్లెల మంచం మీద అన్నదట
అరటి కఱ్ఱు - జ్ఞాతి గుఱ్ఱు పోవు
అరటికాయ ఆరు నెలల రోగం
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు
అరణం కంటే మరణమే మేలు మగాడికి
ఆరణ్య రోదనం లాగ
అరనిమిషం తీరికలేదు - దమ్మిడీ ఆదా లేదు
అరమనిషి సత్తువ - ఆరుగురి కోపం
అరవ లేని దేశం - కాకి లేని వూరు లేదు
అరవై ఆరు పిండివంటలూ ఆవు చంటిలోనే వున్నాయి
అరవై వూళ్ళ అమలుదారు ఆలికి దాసుడు
అరవైఏళ్ళునిండినవాని ఆలోచన అడక్కు - ఇరవైఏళ్ళు నిండనివానికి పెత్తనం ఈయకు
అరవైఏళ్ళ అన్నంభొట్లు అద్దాన్ని చూచి బిద్దం అంటే వాళ్ళమ్మకు ఆశ్చర్యం వేసిందట
అరవై వరహాలిచ్చినా అత్తవంటి బానిస దొరకదు
అరిశె ఆరు నెలల రోగం బయట పెడ్తుంది
అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి
అరుంధతీ, గిరుంధతీ కనపడ్డంలేదు గానీ అప్పు మాత్రం కనబడుతోంది అన్నాడట
అరువు సొమ్ము బరువు చేటు
అరువుగా యిస్తానంటే ఆరు ఏనుగులు పంపమన్నట్లు
అర్ధంకాని మాట - అల్లిబిల్లి మాట
అర్ధబలం కంటే - అంగబలం ముఖ్యం
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు
అర్ధరాత్రివేళ మద్దెల దరువులు అన్నట్లు
అర్జీలకు పనులూ కావు - ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు
అలంకారం కంటే అయిదవతనం మేలు
అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు
అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?
అలక మీరితే అమృతమైనా విషమే
అలికిన యింట ఒలికినా అందమే
అలిగే బిడ్డతోనూ - పొడిచే గొడ్డుతోనూ కష్టం
అలిగి అత్తవారింటికి - చెడి చెల్లెలింటికి పోరాదు
అలుపుల మాటే లేదు గెలుపుల వూసేలేదు రసరాజ్య జాతరలో అన్నట్లు
అల్పవిద్యా మహాగర్వీ
అల్ప విద్వాంసుడు ఆక్షేపణలకు పెద్ద
అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
అల్పుని చేరదీస్తే అధిక ప్రసంగం - కుక్కను చేరదీస్తే మూతి నాకుడు
అల్లుడని పేరుపెట్టి పుల్ల విరిచి వేస్తే ఎగిరి పడుతుంది
అల్లుడా ఎప్పుడొచ్చావని అడిగితే రాత్రి వండిన గారెల సంగతి చెప్పనా అన్నాడట
అల్లుడి కత్తికి రెండు వైపులా పదునే
అల్లుడికి చేసినవంట అతిథికి కూడా వచ్చినట్టు
అల్లుడికి నెయ్యి లేదు అల్లుని వెంట వచ్చిన వానికి నూనె లేదు
అల్లుడికి పెట్టినట్లు కొడుక్కి పెడితే యిల్లు గుల్లవుతుంది
అల్లుడి గుణం అనుభవంలో గానీ తెలీదు
అల్లుడితో గిల్లుడన్నట్లు
అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు
అల్లుడంటే చాలు - వంకర తాడి కూడా నిఠారుగా నుంచుంటుందట
అల్లుడలిగితే కూతుర్ని తీసుకుపోతాడు అంతేగా?
అల్లుడికి బెట్టు - యిల్లాలికి గుట్టు వుండాలన్నట్లు
అల్లుడు చుట్టమూ గాదు - ఆముదపు చెట్టు చెట్టూకాదు
అల్లుడు దశమగ్రహం
అల్లుని గుడ్డి తెల్లవారితే తెలుస్తుంది
అవలక్షునికి అక్షింతలిస్తే అవతలికెల్లి నోట్లో పోసుకున్నాడట
అవతార పురుషుడు అమ్మల్లుడు - అంతకంటే చక్కని వాడు పిన్నల్లుడు
అవివేకితో చెలిమికంటే - వివేకితో విరోధం మేలు
అవ్వకు ఆవలింతలు నేర్పినట్లు
అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు
అవ్వా కావాలి - బువ్వా కావాలి
అశుద్ధం మీద రాయి వేస్తే ముఖమంతా చిందుతుంది
అశ్వత్థ ప్రదక్షిణం చేసి కడుపు తడిమి చూసుకున్నట్లు
అశ్వమేధ యాగం చేయవచ్చుగానీ ఆడపిల్ల పెళ్ళి చేయలేం
అశ్వని కురిస్తే అంతా నష్టం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు
అష్ట భాగ్యాలున్నా అత్తగారిల్లే - పురిటి కూర తిన్నా పుట్టిల్లే
అసత్యం సంపాదించిన పలుకుబడి సత్యం బయటపడే వరకే
అసత్యం చెప్పటం పిరికి లక్షణం
అసలు కంటే వడ్డీ ముద్దు
అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు
అసలు పిసలయ్యే, గొంగళి భారమయ్యె
అసలు మూడు పాళ్ళు, వడ్డీ ఆరుపాళ్ళు
అసలే అయోమయం అందులో అంధకారం
అసలే కోతి, దానికి తోడు కల్లు త్రాగింది ఆ పైన తేలు కుట్టింది
అసిమిలో దొకటి, అమ్మేదొకటి
అసూయ ముందు - ఆడది వెనకాల
ఆఁ అంటే అపరాధం - కోఁ అంటే బూతుమాట
ఆఁ అంటే ఆరు నెలలు
ఆ యింటికి ఈ ఇల్లెంత దూరమో ఈ యింటికాయిల్లూ అంతే దూరం