Wednesday, April 21, 2021

కల్యాణ గుణధాముడు

గోరసం వారి శ్రీరామ నవమి కవితల పోటీ కొరకు ,
పంపిన కవిత.

ప్రక్రియ : గేయ కవిత.
శీర్షిక  : కల్యాణ గుణ ధాముడు.
----------------------------

రామా ! నిను తలచినంత నేమా వెతలన్ని తీరు
నోమారిటు రార ! రామ రవికుల సోమా !॥
బాలా కౌశల్య వర కృపాళా ! శ్రిత పరిపాలా !  
లీలా కరుణాలవాల , మృదు పద జాలా..॥

కామారి వినుత రామ,  ఇనవంశ కుల సోమ
 ధామా ! అయొాధ్య రామ, ముని జన కామా ॥
 శివ ధను భంగానంద ! సీతా-మనార-విందా !
 కైకేయిా వర పాలిత !  పితృ వాక్య సుపాలా ॥

ఆజ్ఞ కారి, వన విహారి ,యజ్ఞ రక్ష ధను ధారీ
కల్యాణ గుణ కారీ  ! భవ సాగర తారీ॥ 
 శిలాహల్య శాప హారి। తాటకాంతకా సౌరీ !   
 రావణాది  సంహారి ! పాప నాసకారీ  ॥ ॥
 
అంగా ! కరుణాంతరంగ. ముని మానస
హృదయ భృంగ ! రాజాధి రాజ రామ !
ధను శర భీమా ॥  గర్వారి, దైత్య దమనా
ధర పాలిత శుభ నామా ! కోదండ రామ -
రామమేయశుభాంగా ॥  

పట్టాభి రామ రామ ! త్రేతాయుగపురుష భీమ!
సుందర సుకుమార సోమ ! మంగళ  కామా ॥
రామా ! శ్రీ రామ రామ ! సీతా ! మనోభి రామ ।
వాతాత్మజ వందిత పద ,నౌమీ .। శ్రీ రామా ॥

--------------------------------------------------------


--------------------------------------------------------

No comments:

Post a Comment