Wednesday, April 28, 2021

28/04w/ 2021.
శ్రీశ్రీ కళా వేదిక వారి కవితా పోటీల కొరకు...
అంశం : విషం చిమ్మేకాలం....
శీర్షిక : విలయ తాండవం.

కరోనా తెచ్చిన గడ్డు కాలం...
మనిషికి మనిషికి మధ్య నున్న
బంధాలను తెంపేసి విశ్వమంతా
విష వాయువులను చిమ్ముతుా
వీర విహారం చేస్తోంది. సకాలంలో
సరి కొలమానంగా ఉండవలసిన
ఋతుక్రమాన్ని తారుమారు చేస్తుా,
జన సందోహాన్ని త్రాహి త్రాహి
అనిపిస్తుా, కర్కశపు కలిని తలపిస్తోంది.
స్వార్ధం, రక్తపుటేరులకు దారి తీస్తుంటే
కాలం , తాగు నీటికి బదులు రుధిర
సాగరాల్ని పెంచుతుా కష్టాల కావిళ్ళలో
కన్నీటి భారాన్ని  పెంచుతుా పోతోంది. 
విషం చిమ్మేకాలం , కరోనా కణం తో
ఒప్పందం కుదుర్చుకొని తరిగిపోయే
ప్రకృతి వనరుల నాశనానికి కారకులై,
మేధావులమంటుా విర్రవీగుతున్న
మనిషి మనుగడ పై తీరని కక్షతో 
కాలకుాట విషం చిమ్ముతుా, విశ్వ
వినాశనానికి నాంది గీతం పాడుతుా
విద్వంశ విలయ తాండవం చేస్తోంది ॥
--------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ
ప్రచురితం కాని నా స్వీయ రచన.


No comments:

Post a Comment