Thursday, April 8, 2021

పాటవెలది ప్రక్రియలో సుందరాకాండ..120 to 130

120.
స్వర్గ  మంటి లంక స్వర్ణ లంక
మసిగ మారి కలసె మట్టి లోన
ముద్దు లొలుకు లంక మునిగి పోయె
కలసె  సాగరమున కల్ల గాదు ॥
121.
అనుచు జెప్పె త్రిజట అసురి నులతొ
భయము చెంది వార భయము కోరె
రాత్రి గడిపి రెటులొ  రణము దలచి
రమణి సీత విడిరి  రగుల భయము ॥
122.
శోక వనిని సీత  శోక మిడుచు
కడగ రాము దలచె కమల నేత్రి 
 ప్రాణ త్యాగ మెంచి  ప్రణతు లిడుచు
మెడకు జుట్టె జడను మేలు ఉరిగ ॥
123. 
కనుల నీరు నిండె  కఠిన గతికి
దుఃఖ మినుమడించ తుాలె సీత
అంత లోనె వింత  వనిని జరిగె
శుభ శకునములను  సుదతి గాంచె ॥
124.
సీత జేయు పనిని చిత్రముగను
గనిన హనుమ మదిని కలవరపడె
ఆలసింప అగును అశుభ మనుచు
తరుణి  సీత గావ తలపు నెంచె॥
125.
రామ బంటు ననిన  రమణి మనదు
రక్కసుండ వనుచు రగులు సీత
వేష ధారి వనుచు వేయు నింద
ఏమి చేదు నింక  ఎరుక జేయ ॥
126.
యొాచ నెంచి అతడు యొాగ్యమైన
రామ కధను పాడె రమణి వినగ
పావనమ్ము గాధ పరమ శుభము
పలుక తేనె లొలుకు భవుని చరిత ॥
127.
 వినియు రామ చరిత వివశయౌచు
సీత అగి చుాచె చిత్ర ముగను
ఉరిని వేయుటాపి ఉరికె సీత
పాట వినిన దెసకు పరుగు లిడగ ॥
128.
సీత వినుట గనుచు శీఘ్ర గతిని
రామ గుణము లెల్ల రసము లొలుక
పలికె హనుమ శ్రావ్య పాట రీతి
సంత సించ సీత సరసి జాక్షి ॥
129.
సత్య వంతుడతడు సర్వ శుభుడు
యశము లేలువాడు యజ్ఞ ఫలుడు
ధశరధాత్మజుండు ధరణి నేలు
రామచంద్రుడతడు  రఘుకులజుడు ॥
130.
పితృ వాక్య పాల పిబరుడతడు
ధర్మ మార్గ మెంచు ధరణి  ధవుడు
రాజ్య మప్పగింప రాజ విధుల
ధశరధుండు తలచె ధర్మ మదని ॥


No comments:

Post a Comment