-------------------------------------------------------
*విశేష వృత్తము : మందాక్రాంతము (శ్రీధరా)*
`శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం' - అనే ప్రసిద్ధమైన శ్లోకము మందాక్రాంత ఛందస్సులో వ్రాసినదే.
కాళిదాసు మహాకవి మేఘసందేశం అనే కావ్యమును కేవలము మందాక్రాంతములతోనే రచించెను.
*లక్షణములు :*
4 పాదములు ఉండును
గణములు - మ భ న త త గ గ
యతి - 11వ అక్షరము
ప్రాసనియమము కలదు
మం.
గోపాలా! గోకుల తిలక!హే గోపికాలోల! కృష్ణా!
తాపమ్మేమో! మృదువచనమే తన్మయత్వమ్ము,నాథా!
కోపమ్మేలా? ననుఁ గనుమ! నీ కోసమే వేచినానే!
శాపమ్మౌ నాకిది, కినుకలే చాలురా! ముద్దు కృష్ణా!
-------------------------------------------------------
No comments:
Post a Comment