Sunday, May 16, 2021

బిరుదులు.

*బిరుదులు* : 
2020. నాటి బిరుదులు.
---------------------------------

1. సాహిత్య చక్రవర్తి.

2. స్వర మయుారి. 

3.వెలుగు దివ్వె. 

4.శత తేనియ పురస్కారము  

5. మధుర కవి భుాషణ.
 
6. పద ముత్యం బిరుదు.
 
7.  అక్షర ఝరీ రత్న  ..2021.

 8."సాహిత్య కళానిధి" బిరుదు.( 2021.)

9.. అద్వైత పురస్కారం . 

10. రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ .

11. సమాజ సార్థక్ అవార్డ్  --2020..నాడు 

12. విశిష్ట మహిళా శిరోమణి...బిరుదు.2021

13. రవీంద్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం

 14. విశిష్ట మహిళా శిరోమణి 
 
 15. ఇష్టపది శ్రేష్ట.
 

Friday, May 14, 2021

న్యస్థాక్షరి

[5/8, 14:47] p3860749: వాగ్దేవీ కళాపీఠం లో...
7/05/2021
అంశం :  న్యస్తాక్షరి
బె  జ వా  డ

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ : తేటగీతి.

(బె)కబె కలుఆడు నుగనుాతి నొక కప్ప.
పదుగు  రెదుటను దాగునది ఒదుగు తోడ
గలగ లనిమాట లాడగా ఫల మేమి?
మాట తీరు లేని మనిషి మనుగడేల ?
[5/8, 14:59] p3860749: వాగ్దేవీకళాపీఠం.
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : శాంతి కపోతం.

రచన.. శ్రీమతి,  పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
            కల్యాణ్. మహారాష్ట్ర .

ఆకాశం లో అందమైన  హరివిల్లు.
ఎన్నో ఊహలతో మదిలో విరిజల్లు.
మాటలకందని మధురానందం.
ఏడురంగులు ఏకమైన కాంతి .
మదిలో భావాల మధురుాహలకు
 రెక్కలు  మొలిచి విహరింప చేసే
 తెల్లని శాంతి కపోతమై  ఆకాశంలో
నీ, నా భేదాలు లేనిచోట
నిర్మలమైన తెల్లని మనసుతో హాయిగా
విహరిస్తొింది. కవన వనంలో చల్లని
వెన్నెలను పంచు భావ గీతంలా ॥
[5/14, 16:11] p3860749: వాగ్దేవీ కళాపీఠం
న్యక్తాక్షరి  : రా  వే పో  వే.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : రాక్షస రాజ్యం.

రాక్ష సత్వమేలె కేంద్రంపు  రాష్ట్ర ములను
వేల శవములు కుప్పదేల  వేడ్క గనిరి
పోవ దారిలేదు కరోన  పోదు వదలి
వేద నలబడె జనులదే  వెతల బాట ॥
[5/14, 17:06] p3860749: వాగ్దేవీ కళాపీఠం
న్యక్తాక్షరి  : రా  వే పో  వే.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : రాక్షస రాజ్యం.

రాదు రామ రాజ్యము లేదు  రాజ నీతి
వేల్పులు  శిలగ  మారెగా వేడ మనము
పోవ కలికాల ముదాపున పొంచె  నేమొ
వెతల బడిరి  జనులు కణ  వేగ మునకు ॥

Wednesday, May 12, 2021

దత్తపది.

మహతీ సాహితీ కవిసంగమం- కరీంనగర్  ప్రతిరోజూకవితా పోటీల ---
పర్యవేక్షణ: డా౹౹శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు
సమీక్ష  : శ్రీ కొనింటి రమేష్ గారు
తేది: 05-05-2021 (బుధ వారం)


 రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
అంశం : దత్తపది  : అల వల కల తల.
శీర్షిక :  పాపం పండింది.
ప్రక్రియ : ఇష్టపది.

అలవాటు లేని ఈ ఆచారములనెల్ల
కణ రోగమ్ము వలన కడకాచరించిరిగ॥

కల నైన తలవనిది గడ్డు కాలము కదర
తలరాత మారనిది ధర పాప ఫలమిదిర ॥

అల తరువులను గుాల్చి ఆక్సిజను కరువౌగ
వల వేసి వాయువును బట్టి, పడి యాతనల॥

వేరు చేసిరకటా వెర్రి మానవులు గద
పీల్చు గాలి కొరకై  పిచ్చిగాదే ఇచట॥
----------------------------------------------

రామ రాజ్యమే కల  రాదు ఎప్పటికినీ
తలలు మారిన గాని తరుణమిది  మారదుర॥

వడి వడిగ వచ్చె కలి  వచ్చి నాశము జేయు
రాక్షసత్వము దునిమి రక్షీంప అవనినీ॥

అలవోకగా చుాచి వల విసిరి పట్టు కొని
కల కలము సృష్టించు కడు ఘోరముగనిలను ॥

తలచు కొను మిపుడైన ధర్మ దేవతలను
జగదీశ్వరిడుమాట జనులార వినరయ్య ॥
-----------------------------------------------------

[5/12, 18:22] p3860749: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ప్రతిరోజు కవితా పండుగే.

పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు.

నిర్వహణ: యాంసాని లక్ష్మీ రాజేఃదర్ గారు
తేది: 12-05-2021.

అంశము: దత్తపది.
మది   హృది  గది  నది..

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

ప్రక్రియ : ఆట వెలది.

మదిని కలత రేపె మహినున్న  దికరోన
హీన  దీన గతులె  హృదిని కలచె
గదిని వీడ భయము గననేమి శాపమొా
నదులు శవము లేలె నరక మిలను ॥
[5/12, 18:25] p3860749: మది   హృది  గది  నది.

ప్రక్రియ :తేట గీతి. 

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శరణు కోరితయ్యశరణు శరణు శ్రీశ
మదిని నీనామమెమహిని మనన జేస్తి  
హృదిని గదిజేసి నీముార్తి  యే నిలిపితి
భయము నదెబాపు మయ్యరో పరమ పురుష.॥

మనిషి మారాలన్న..

మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ డా.శ్రీ .అడిగొప్పులసదయ్యగారు
నిర్వహణ.శ్రీ .ముక్కా సత్యనారాయణ గారు
సమీక్షణ.డా.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
అంశం మనిషి  మనసు
తేది 06  05  2031 గురువారం
ప్రక్రియ : ఇష్టపది. 

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  మనిషి మారాలన్న.


మనసు మనసో యనుచు  మన నెేమి లాభమది
మనసు మాటను విన్న  మనిషెవడు ధరలోన॥

మనసు మంచిని చెప్ప  మనిషి బుద్దెరుగదుగ 
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥

నా ఇల్లు నా వాళ్ళు  నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె  సొమ్ము  సోకుల కన్న

స్వార్ధ మదె పెరుగగా  వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి  వెతలెన్నొ పడుదురుగ ॥

-------------------------------------------------------

ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
 జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥
 
ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥

 మితిమీరె పరిధులు అతివ కవమానములు 
 కన్నీటి కార్చిచ్చు  కరిగె సిరి సంపదలు॥
 
 నాడున్న సుఖ శాంతి  నేడు జగతిని లేదు
 అన్ని తెలిసీ మనిషి   ఆశ వీడుట లేదు ॥

---------------------------------------------------

చదువున్న వారేమొ  చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె  చక్క పాలకులైరి ॥

అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల  జడులైరి జడిసి పాలకులకుా॥

మానవత్వము తరిగె  దానవత్వము పెరిగె
మమతానురాగాలె  మట్టికలిసీపోయె॥

మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట  ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------

దత్తపది : అల వల కల తల. (ఇష్టపది ).

మహతీ సాహితీ కవిసంగమం- కరీంనగర్  ప్రతిరోజూకవితా పోటీల ---
పర్యవేక్షణ: డా౹౹శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు
సమీక్ష  : శ్రీ కొనింటి రమేష్ గారు
తేది: 05-05-2021 (బుధ వారం)


 రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
అంశం : దత్తపది  : అల వల కల తల.
శీర్షిక :  పాపం పండింది.
ప్రక్రియ : ఇష్టపది.

అలవాటు లేని ఈ ఆచారములనెల్ల
కణ రోగమ్ము వలన కడకాచరించిరిగ॥

కల నైన తలవనిది గడ్డు కాలము కదర
తలరాత మారనిది ధర పాప ఫలమిదిర ॥

అల తరువులను గుాల్చి ఆక్సిజను కరువౌగ
వల వేసి వాయువును బట్టి, పడి యాతనల॥

వేరు చేసిరకటా వెర్రి మానవులు గద
పీల్చు గాలి కొరకై  పిచ్చిగాదే ఇచట॥
----------------------------------------------

రామ రాజ్యమే కల  రాదు ఎప్పటికినీ
తలలు మారిన గాని తరుణమిది  మారదుర॥

వడి వడిగ వచ్చె కలి  వచ్చి నాశము జేయు
రాక్షసత్వము దునిమి రక్షీంప అవనినీ॥

అలవోకగా చుాచి వల విసిరి పట్టు కొని
కల కలము సృష్టించు కడు ఘోరముగనిలను ॥

తలచు కొను మిపుడైన ధర్మ దేవతలను
జగదీశ్వరిడుమాట జనులార వినరయ్య ॥
-----------------------------------------------------

కలిసి ఉంటే కలదు సుఖం ( ఉమ్మడి కుటుంబం )

తెలుగు భారతి ఎస్.వి ఫౌండేషన్ , జనదీపిక-
సాహిత్య సేవా సంస్థ --
సంయుక్తంగా నిర్వహిస్తున్న  కవితా సమ్మేళనం .

అంశం : ఉమ్మడి కుటుంబం.

శీర్షిక :

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

క్రమ సంఖ్య: 127.

ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల సందళ్ళు
కలిసున్న ఉత్సాహపు ఆనంద పరవళ్ళు.
అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలు
కలిసి పంచుకున్న కుటుంబ బాధ్యతలు.
ఇంటి పెద్దల మాటకు ఇచ్చే విలువలు.
బంధు జనుల రాకలుా పొికలు .
అతిధి సత్కారాల ఆప్యాయతాలింగనాలు
పంచలుా , చీరలుా కట్టే పెద్దరికాలు.
అందరుా కలిసి తినే పంక్తి భోజనాలు.
బావా మరదళ్ల  ప్రమ నిండిన గిల్లికజ్జాలు.
ఆడపిల్లలకు నేర్పిన సాంప్రదాయపు అలవాట్లు.
కళలు నిండు సాంప్రదాయ సంగీత సాహిత్యాలు.
దానధర్మాలు నిండు దైవ కార్యాలి.
పాదాభివందనాలకు పెద్దలిడు అశీర్వచనాలు.
వేద మంత్రాల ఘోషల సుార్యోదయాలు.
పాడి, పంటల సిరులు నిండిన ఆనందాలు.
కష్టసుఖాలు కలిసి పంచుకొనే కలుగోలుపులు.
ఇరుగు పొరుగుల  సఖ్యతల సందళ్ళు.
ఒద్దికగా ఒదిగి ఉండే ఉమ్మడి కుటుంబాలు

.

హామీ:
ఈ కవిత ఏ మాధ్యము నందునుా  ప్రచురితం కాని నా స్వీయ రచన.


.

రవీంద్రనాథ్ టాగుార్.

తెలుగు భారత ఎస్.వి ఫౌండేషన్  జనదీపిక  ఆద్వర్యం లో..పంపినది.
అంశం : రవీంద్రనాధ్ ఠాగూర్ .
శీర్షిక : జాతీయ గీత కర్త.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన లెన్నొ చేసి  రంజింప జేసేటి
సార సద్గు ణాల సత్య వాది
ఘనపు కీర్తి నిడెను కావ్య గీతాంజలి
నోబులు బహుమతిని  ఒసగి రంత॥

మాన వత్వ మున్న మంచి మనిషితడు.
కావ్య రచన జేయు  కళల ప్రియుడు
పద్య, వ్యాస రచన బహుప్రీతిగాజేయు
కవివ రేణ్యు డితడు ఘను డతండు ॥

విశ్వ భారతనెడు విశ్వవిద్యాలయం
స్థాప నతడు జేసె స్థాన కళకు
సర్వ మతము లన్ని ససమాన మనిచాటు
శ్రీని  కేత నమ్ము  సర్వులకును ॥

ఉత్త మంబు లైన  ఉచ్ఛ సందేశముల
"గోర" నామ రచన కోరి జేసె.॥
నాటకంబు లెన్నొ నవలలింకెన్నియొా
రాసినట్టి ఘనుడు రవిగ వెలిగె ॥

జనగణమన గీతి  జాతీయమాయెను.
జనులు మెచ్చ నొందె  జగతి కీర్తి.
అతని కీర్తు లెల్ల అవనిలో ఘనములు
ఘన రవీంద్రు డితడు గవుర వుండు ॥

ఆత్మ కధను రాసి అంతిమశ్వాశను
విడచె విశ్వ ఘనుడు విజయ బాట.॥
అతడు ఎవరొ కాదు  ఆరవిం ద్రఠగుారు
గౌర వమ్ము నిడెద ఘన నివాళి. ॥
(ఆదరమున జేతు నంజలులను) ॥

అంశం- గీతాంజలి కావ్యం రవీంద్రనాథ్ టాగుార్ రచన

సాహితీబృందావనవేదిక
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
అంశం- గీతాంజలి కావ్యం
తేదీ07-05-21.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :స్ఫుార్తి రచన గీతాంజలి

1.
రవీంద్రనాథ్ టాగుార్ నోబుల్
బహుమతి అందుకున్న అద్భుతమైన
పద్య కావ్యరచన గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
2.
దేశభక్తి నిండు అక్షరారాధన
ప్రకృతి ఆరాధనల సాధన .
గీతాంజలి కావ్య రచనాభావన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
3.
నిర్భయమైన మానసిక స్థితి
సమత  నిండిన  దేశప్రగతి
స్వాతంత్ర్యతా స్ఫుార్తి గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
4.
పరిపుార్ణత నిండిన స్నేహనిరతి
స్వచ్ఛత నిండిన మనోగతి
మేల్కొలుపుల  గీతి  గీతాంజలి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
5.
ఆలోచనల్లో ప్రగతి తలపు
ఆవేశం, దేశవికాశ పిలుపు
ఆచరణలో సమానత్వపు గెలుపు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

Friday, May 7, 2021

ప్రక్రియ : తొణుకులు నియమాలు.


తొణుకులు ప్రక్రియ .
*నియమాలు* 
*1. నాలుగు పాదాలు* 
*2. ప్రతీపాదములో 9నుండి 11 అక్షరాలు మాత్రమే ఉండాలి.*
*3. 1,3 పాదాలలో మాత్రమే మొదటి అక్షరం ఒకేలా ఉండాలి.*
*4.  2,4 పాదాలలో మాత్రమే చివర అంత్య ప్రాస ఉండాలి.*

Thursday, May 6, 2021

నిత్య శ్రామికుడు.

మే డే సందర్భంగా..
శీర్షిక  : నిత్య శ్రామికుడు

తరాలు మారుతున్నా 
తలరాతలు మారని ఒకే ఒక్క
బడుగు జీవి కార్మికుడు.
అంటరాని వాడిగా అగౌరవ పరుస్తున్నా 
అందరి ఇంటి వాడిగా , మన ఇంటి
చెత్తను ,తీసి మన ఒంటి బట్టను 
ఉతికి ఆరేసే ఏకైక శ్రమజీవి కార్మికుడు.
భుా గర్భ గనుల నుండి , అంతరిక్ష
క్షిపణులవరకు గల అన్ని పనుల్లోనుా 
తమ వంతుగా కష్టపు చమటను 
చిందస్తున్న ఏకైక  జీవి కార్మికుడు.
అంగడి అమ్మకాల నుండి
అకాశహార్మ్యాలవరకు  గల అన్ని
రంగాల లోనుా  శ్రమిస్తుా, ఎదుగు
లేని జీవితాన్ని ఒదుగుతుా 
గడుపుతున్న నిత్య జీవన పోరాటకుడు.
ఎలక్షన్ల సమయంలో ఏలికల
స్వార్ధ పుారిత బాసలు నమ్మి ,
ఏనాటికైనా ,తమ బతుకులు 
బాగుపడవా...అన్న ఆశతో బ్రతుకుతుా
తమ విధ్యక్త ధర్మాని నీతిగా నిర్వర్తిస్తున్న
నిత్య ధర్మ పోరాటకుడు, శ్రామికుడు.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

మానవీయశక్తి

హంస వాహినీ కవితా సముాహ ఆధ్వర్యంలో..
భువన సాహిత్య విజ్ఞాన వేదిక తెలంగాణ
వారి కవితా పోటీల కొరకు
అంశం : రవీంద్ర నాథ్ ఠాగుార్.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : మానవీయ శక్తి.

పుట్టిన ప్రతీ ఒక్కరుా,ఏదో ఒకటి
సాధిద్దామనుకొంటారు .
కొందరు కీర్తి మంతులౌతారు
కొందరు నీతిమంటులౌతారు.
కొందరు మాత్రమే చరిత్ర లో నిల్చిపోతారు.
అటువంటి వారిలో
శ్రీ...రవీంద్రనాథ్ టాగుార్ ఒకరు.
స్వతహాగా కవియైన రవీంద్రనాధుని
  సాహిత్యంలోపద్య ,గద్య,కావ్య
  నాటకాలు ఎంతో ప్రసిద్ధి గాంచినా..
గీతాంజలి కావ్య రచనతో నోబెల్
హుమతిని గెలుచుకొన్నాడు.
మానవీయతగల రవీంద్రులు
జాతి, కుల, మతాలకు అతీతమై
శాంతినికేతన్ గా పేరుగాంచిన
విశ్వ భారతి, విశ్వ విద్యాలయాన్ని 
స్థాపించి  విశ్వ కీర్తిని పొందేడు.
సంగీతం ,చిత్రకళలన్న మక్కువ .
జాతీయ భావోద్వేగుడైన ఠాగుార్
అనేక దేశ భక్తి గీతాలను ఆలపిస్తుా
ఉద్యమాలకు ఊపురిపోసేవాడు.
అదే ఉద్వేగంతో అతడు రాసిన
జన గణ మణ గీతం జాతీయ గీతమై
ప్రజల గుండెల్లో నేటికి నిలచిపోయింది..
అతని రచనలు మానవత్వానికి
ఉదాహరణలు. గాయకునిగా భారతీయ
సంగీతంలో "రవీంద్ర "సంగీతమనే
శాఖకు ఊపిరిపోసి..చరిత్రలో
నిలిచిపోయిన.,మానవీయ శక్తి ..
మహా మనీషి.."శ్రీ రవీంద్రనాథ్ ఠాగుార్"..॥

చిత్ర కవిత.

చిత్ర కవిత.
ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.


మట్టి లోన పుట్టి   మట్టిలో  పెరగావు
మధ్య వచ్చెను సిరి మాయ గాను
మట్టి కుండను జూాచి  మరిముాతి  ముడిచేవు
మట్టిలో  కలియును   మనిషి జన్మ ॥

మట్టి కుండ నున్న మంచి చల్లనిజుాచి
పారి పోవ నేల పాడి గాదు.
మండు వేసవి నిది మంచిమేలునుచేయు  
దివ్య ఔషధమ్ము దివిని  సుమ్మ ॥






చద్ది అన్న  మదియె చలువదేహముకదె

Wednesday, May 5, 2021

ఇష్టపదిలో దత్తపది.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
అంశం : దత్తపది  : అల వల కల తల.
శీర్షిక :  పాపం పండింది.
ప్రక్రియ : ఇష్టపది.

అలవాటు లేని ఈ ఆచారములనెల్ల
కణ రోగమ్ము వలన కడకాచరించిరిగ॥

కల నైన తలవనిది గడ్డు కాలము కదర
తలరాత మారనిది ధర పాప ఫలమిదిర ॥

అల తరువులను గుాల్చి ఆక్సిజను కరువౌగ
వల వేసి వాయువును బట్టి, పడి యాతనల॥

వేరు చేసిరకటా వెర్రి మానవులు గద
పీల్చు గాలి కొరకై  పిచ్చిగాదే ఇచట॥
----------------------------------------------

రామ రాజ్యమే కల  రాదు ఎప్పటికినీ
తలలు మారిన గాని తరుణమిది  మారదుర॥

వడి వడిగ వచ్చె కలి  వచ్చి నాశము జేయు
రాక్షసత్వము దునిమి రక్షీంప అవనినీ॥

అలవోకగా చుాచి వల విసిరి పట్టు కొని
కల కలము సృష్టించు కడు ఘోరముగనిలను ॥

తలచు కొను మిపుడైన ధర్మ దేవతలను
జగదీశ్వరిడుమాట జనులార వినరయ్య ॥
-----------------------------------------------------

రవీంద్రనాథ్ టాగుార్ కవిత

సాహితీ బృందావనం జాతీయ వేదిక కవితల పోటీ కొరకు 
పేరు: యెనుగందుల శంకర్ 
ఊరు :ఉప్లూర్  
జిల్లా :నిజామాబాద్ 
అంశం :రవీంద్రుని సాహిత్యం 
శీర్షిక :విశ్వకవి సాహిత్య కిరణం 
🥦💐💐💐💐🥦
దేవేంద్రనాథ్, శారదాదేవి మాతృమూర్తుల కానుక 
కాళిదాస్,షేక్స్పియర్ ప్రియుడుగా 
కలకత్తా లో కను తెరిచిన కవీంద్ర 
మీ కవి కిరణాల ప్రకాశమే గీతాంజలి 

జాతీయ గీతాన్ని సృష్టించి భారతీయులచే జనగణమన అనిపించిన రవీంధ్రా ll
మృణాళినిని మనువాడి, భగ్న హృదయ కావ్యాన్ని సృష్టించి, సంధ్యా గీత్, విర్గారేర్ స్వప్న భంగ,ల సంగీత ప్రియుడా ll

నిరాశ నిస్పృహ లను, సకల సృష్టిని ప్రేమ భావంతో 
చూచి శ్రమకు సందేశమే గీతాంజలి అని భారత జాతికి నోబెల్ బహుమతి అందించిన విశ్వకవి ll
శాంతినికేతన్ నెలకొల్పిన శాంతి ప్రదాత ll

విశ్వభారతి తో విశ్వ వ్యాప్తమైన విశ్వ కవి 
మతాలు వేరైనా స్నేహం ముఖ్యమని"గోరా"లో తెలిపి 
పోస్టాఫిస్, శరధోత్సవ్, కచదేవయాని, విసర్జన, ముక్తధార నాటకాల మేళవింపుగా "మై రెమిని సెన్సెస్ "ఆత్మకథా రచయితా ll

కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజమహల్ అని 
అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తున్నాయన్నావ్.. 
పేమించేవ్యక్తికే దండించే అధికారముందన్న తత్వ  వేత్త 
                     రచన :యెనుగందుల శంకర్ 
                                       M.Sc(Org.chem)
                          ఆరోగ్య విస్తరణ అధికారి 
                                     ఉప్లూర్ 
                              నిజామాబాదు 
                              9440747614
మహాత్మా జ్యోతిభా ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత 
పి.వి.నరసింహారావు స్మారక జాతీయ అవార్డ్ గ్రహీత
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ గ్రహీత 
మన తెలుగు తేజం జాతీయ పురస్కార గ్రహీత 
కవితేజ జాతీయ పురస్కారం గ్రహీత

Tuesday, May 4, 2021

దత్తపది.

[5/5, 06:22] p3860749: వాగ్దేవీ కళాపీఠం.. వారి
దత్తపది  పుారణ
ధనము   ధాన్యము   పాడి...పంట


శీర్షిక : హిట్లర్  జ్ఞాపకాలు .

ప్రక్రియ : మినీ కవిత.

ఇంధనము కోసం చెట్లు నరికేరు.
అన్యాయపు భుా ఆక్రమణలతో
ధాన్యము పండించే రైతన్నల
వెన్నాముకను విరిచేరు.
పాడినిచ్చే ఆవులను పైశాచికంగా
అమ్మి సొమ్ము చేసుకున్నారు.
పంట భుాములను, ప్లాంట్లను
 ప్రేవేటీ కరణ చేయాలన్న తలంపుతో
పాలకులు పై దేశాలతో
పొత్తు కుదుర్చుకొని దేశ ప్రగతిని 
 దైన్య స్థితికి తీసుకెళ్తున్నారు.
 అన్నివిషయాల లోనుా స్వాతంత్ర్యం
 కోల్పోయిన ప్రజలు  బ్రతుకు 
 భారమై హిట్లర్ పాలనను 
 జ్ఞప్తి చేసుకుంటున్నారు.
 ------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.
[5/5, 06:36] p3860749: వాగ్దేవీ కళా పీఠం లో

బుధవారము - దత్తపది._

*అభము - శుభము - నభము - విభవము*

శీర్షిక  :  వికటించిన వైభవం.

ప్రక్రియ : మినీ కవిత.

అభం -శుభం ఎరుగని
పసి బాలల మాన భంగాలు.
వయసు అంతరాలు మరచిన
స్త్రీ -పురుషుల కామ క్రీడలు.
నభానికి ఎగసి వ్యాపిస్తున్న
పర్యావరణ కాలుష్యం తో
విస్తరిస్తున్న  విష కణాలు-
వికటిస్తున్న విభవాలు, 
క్షణం క్షణం భయం భయంగా
మారుతున్న  ప్రజా జీవితాలు.॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )

నిలువు దోపిడీ..

వారం వారం కవిత లో...
అంశం  :  దోపిడీ.
శీర్షిక  : నిలువు దోపిడీ.

కాలం గమనంలో మారుతున్న
మనుషుల అంతరంగాల
మానసిక బలహీనతల దోపిడీ ॥
   
వివేకం కోల్పోతున్న యువతను
పెడబారి పట్టించి భావి భారత
భవితను దోచుకుంటున్న
డ్రగ్ మాఫియాకోరుల దోపిడీ ॥
   
కల్తీ బాసల తో నోట్లకు ఓట్ల కొనుగోలునీ
కల్తీ విక్రయాలతో జనాల నమ్మకాన్ని
సొమ్ము చేసుకుంటున్న సత్తా , --
తొత్తుల సాధింపుల దోపిడీ॥
   
వావి వరుసలు మరచిన
కామాంధుల వికృతి చేష్టలకు
పసి నుండి ముసలి వరకు గల
స్త్రీల  మాన-ధన దోపిడీ..॥
   
లేని రోగాన్నిఆపాదించి
వైద్యం పేరుతో అంగాంగాలను
అమ్ముకుంటున్న వక్ర ఆలోచనల
వైద్య  దేవుళ్ళ  దోపిడీ ॥
 
కరోనా కాటుకు ఊపిరందక...
ఆక్సిజన్ కరువై అంతమౌతున్న
జనాల చితిమంటలకు వెలకట్టి
విస్తృతంగా  దోచుకుంటున్న
కార్చిచ్చు రేపిన కన్నీటి దోపిడీ ॥

అధికార బలంతో న్యాయానికి
రెక్కలు విరిచి సామాన్యుల 
బ్రతుకు భారాన్ని పెంచిన
చచ్చు రాజకీయాల చిచ్చు
వేటల  నిలువు దోపిడీ ॥
-----------------------------
   రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ
ప్రచురితం కాని నా స్వీయ రచన.

   

Saturday, May 1, 2021

మొగ్గలు ప్రక్రియ లక్షణాలు

మొగ్గలు ప్రక్రియ లక్షణాలు

మొగ్గలు మూడు పాదాల ప్రక్రియ ‌

మొదటి పాదం కొనసాగింపుగా ఉండి 
రెండవ పాదంలో ముగించాలి 

పై రెండు పాదాలలో చెప్పిన దానికి సమర్థింపు‌ వాక్యంగాను, 
సూక్తిగాను, ‌సామెతగాను,జాతీయంగాను ఏదో ఒకటి
మూడవ పాదం రాయాలి

దీనికి ఎటువంటి ఛందస్సు లేదు

Example

మొగ్గ 

నాయిన  ఎండిన నీ ఎదబొక్కల మీద
ఎన్నో గాయాలు అనుభవాలై పూసినయి
రాలిన వయస్సుకు కాసిన అనుభవాలు
 ✍️ బోల యాదయ్య

కార్మిక దేవా నమో!(ఇష్టపది మాలిక)

rఅవని కడుపులు నింపు అన్నదాతా నrrrrrrrfrrrfffrమో!
rrrrrrrrrrrrr
తనువునింజను చేసి తపసుతో వస్త్రాలు
నేసి మానము గాచు నేతగాడా నమో!

అరచేత బ్రాణాల నెరి తాటి మొగిలెక్కి
కల్లు కుండలు దింపు గౌడవీరా నమో!

తిరిగి వచ్చెదనన్న భరవసము లేకున్న
భూగర్భ గనిజొచ్చు బొగ్గుకార్మిక నమో!

సతము చోదనమందు సరుకులను,యానికుల
పదిలంగ చేర్పించు వాహ్య చోదక నమో!

కురుమ! గోపాలకా! కుమ్మరీ!కమ్మరీ!
చాకలీ!మంగళీ! చర్మకారీ! నమో!

భట్రాజ! ముదిరాజ! భవనకార్మిక రాజ!
చలనచిత్రపు రంగ శ్రమవీరుడా నమో!

వేలాయుధము దాల్చి విద్యార్థులందరను
సన్మార్గమున నడుపు సత్త గురుడా నమో!

విశ్వ బ్రాహ్మణ నమో! విశ్వ కర్మా నమో!
యంత్రకారీ నమో! చిత్రకారీ నమో!

సకలకుల వృత్తులను సాదరించుతు జగతి
కల్యాణమున వరలు కర్మ దేవా నమో!

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట, కరీంనగర్
9963991125