Tuesday, May 9, 2023

వృత్త పద్యాలు......గణములు...ఉదాహరణలతో



*గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు
*ఏకాక్షర గణాలు*

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.
U, U, U
ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్

*మూడక్షరాల గణాలు*  :- 
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:
*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
*సూర్య గణములు* . *ఇవి రెండు.*
న = న = III
హ = గల = UI
*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
************

[08/05, 5:56 am] 
+91 99634 18686:
కనకలత వృత్తము

6 నగణములు1గ..యతి13

మగువగ జననము వడసియు
మరుని శరమువై
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు
సవము వడసియున్
జగడములెరుగక సతము సు
చరితగను సుధీ!!
****************
 +91 99634 18686:
 విచికిలిత వృత్తము
7..నగణములు1గ..13 యతి

నినుగని మురిసిరిలను జనని జనకులు తనయుడనుచున్
నినుగొని మురిసెవనితయు పెనిమిటి వనుచును మదిలో
మనవలె నిరువురికెపుడును
మనసులు వరలు విధి నీ
కును జయమగును మనెదవిక
కొడుకుగ పతిగ సుధీ!!
*****************::::

+91 99634 18686: 
నర్తకీ వృత్తము...
భ భ భ భ న న న న గ 13 

సర్వ ప్రపంచము పుస్తక మందున సలలితముగ గలదు  కనగ నో
పర్వపు కాంతులు భవ్య వినో దము పరపతిసహితము దొరుకునుగా
నుర్వి నిగర్విగనుంచును వేడ్క గ నురుగతి దనరగ ప్రగతిగనో
శార్వరి బాపెడి శస్త్రమె పొత్తము సవినయముగవిను
మికను సుధీ .
***************
 +91 99634 18686:
 కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర  యతి 13

అక్షయమయిన కార్యములకు
పునాదిగ నిల్వవలెన్ జుమీ
లక్షణముగ విరాజిలెదవిక రమ్యసుగతిని,ధాత్రి లో
సాక్షిగ వరలు మంచితనమను
సద్గుణమునకు మాను దు
ర్లక్షణములను వేగమె విను దురాత్ముల గలువకో సుధీ!!

*************************

 +91 99634 18686: 
హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి

పుస్తకంబన భవ్యమౌ బుధ వర్గంబౌ పుడమిన్ సదా
మస్తకంబున నుండుసుమ్మ 
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిది మానవా!ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!  

*********************
+91 99634 18686: 
ప్రశాంతి వృత్తము
ర జ ర జ ర 9 యతి

వృద్ధులన్న జ్ఞానయుక్త వేదికల్ గనండయా
బుద్ధి తోడవారి మాట ముద్దుగా 
వినండయా!
పెద్దలెప్డు మంచిమాట పేర్మిగా
వచింతురే
యిద్ధరిత్రి లోన వారినెప్డు దిట్టకో సుధీ!!

**********************
*+91 99634 18686: 
వంశపత్ర పతిత వృత్తము
భ ర న భ న వ  11యతి

కార్మికులే,ప్రపంచమునకున్
ఖనిజములుకదా!
కార్మిక వర్గమే సతము ధీగతిని
పనులహో
యోర్మిగ జేయగా వరలెనో నురుగతిని సదా
యర్మిలి దేశదేశములహో యరయగను సుధీ!!

*********************::::
 +91 99634 18686:
 శాలిని వృత్తము
ర జ ర జ ర..యతి 9
పారిశుద్ధ్య కార్మికుల్ దివాకరుం దయించు ముం
దే!రమారమిన్ సుమీ!ప్రతిష్ట గాను,నిత్యమో
ఊరువాడ శుద్ధి జేతురోయి నీటుగానహో
వారికిన్ నమస్కరింతు భక్తి గానికన్ సుధీ!! 

************::**********:
 +91 99634 18686: 
సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!

********************::::
+91 99634 18686: 
భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!

****************************
+91 99634 18686: 
మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!

***********************
+91 99634 18686: 
నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!!
****************************::**:

+91 99634 18686: 
కనకలత వృత్తము
6 నగణములు1గ..యతి13

మగువగ జననము వడసియు
మరుని శరమువై
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు
సవము వడసియున్
జగడములెరుగక సతము సు
చరితగను సుధీ!!]
******************
 +91 99634 18686: 
విచికిలిత వృత్తము.

7..నగణములు1గ..13 యతి
నినుగని మురిసిరిలను జనని జనకులు తనయుడనుచున్
నినుగొని మురిసెవనితయు పెనిమిటి వనుచును మదిలో
మనవలె నిరువురికెపుడును
మనసులు వరలు విధి నీ
కును జయమగును మనెదవిక
కొడుకుగ పతిగ సుధీ!!
********************
+91 99634 18686: 
నర్తకీ వృత్తము...
భ భ భ భ న న న న గ 13 

సర్వ ప్రపంచము పుస్తక మందున సలలితముగ గలదు  కనగ నో
పర్వపు కాంతులు భవ్య వినో దము పరపతిసహితము దొరుకునుగా
నుర్వి నిగర్విగనుంచును వేడ్క గ నురుగతి దనరగ ప్రగతిగనో
శార్వరి బాపెడి శస్త్రమె పొత్తము సవినయముగవిను
మికను సుధీ !!
****************
91 99634 18686: 
కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర  యతి 13

అక్షయమయిన కార్యములకు
పునాదిగ నిల్వవలెన్ జుమీ
లక్షణముగ విరాజిలెదవిక రమ్యసుగతిని,ధాత్రి లో
సాక్షిగ వరలు మంచితనమను
సద్గుణమునకు మాను దు
ర్లక్షణములను వేగమె విను దురాత్ముల గలువకో సుధీ!!

***************:*::::
 +91 99634 18686:
 హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి

పుస్తకంబన భవ్యమౌ బుధ వర్గంబౌ పుడమిన్ సదా
మస్తకంబున నుండుసుమ్మ 
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిది మానవా!ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!  

*********************

మాతృ దేవోభవ ..(కవిత ).

08/05/2023
కలం స్నేహంలో 
మాతృ దినోత్సవ కవితల పోటీ కొరకు ,

అంశం :  మాతృదేవోభవ .
శీర్షిక :  అమ్మకు, అమ్మే సాటి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కనిపించే దైవం దేముడైతే
కని పెంచే దేవం అమ్మ ॥
సృష్టించే వాడు దేముడైతే ..
ఆ సృష్టి కి ముాలం అమ్మ ॥

తొమ్మది నెలల భారం తనలో మొాస్తుా 
 ప్రసవ వేదనలో కుాడాప్రతి క్షణం ఎదురుచుాస్తుా
 తన రక్తమాంసాల ఆకృతిని  ఆత్రంగా ముద్దాడే
 అది చైతన్య ముార్తి , ఆర్తి నిండిన అమ్మ ॥

ఆఁ వుాఁ ల వుాసులకు అర్ధం అమ్మ పలుకే
ఆడుగులేయడం నేర్చేది, అమ్మ ఆసరాతోనే 
ప్రపంచ వార్తా విశేషాలెన్నో,అమ్మ ఒడి బడిలోనే
ప్రపంచాన్ని గెలిచే ధైర్యం  అమ్మ చెప్పే కధల్లోనే..॥

ఆకలేస్తే  అడిగేంతలోనే సాక్షాత్కరిస్తుంది అమ్మ
నిద్దరొస్తే , జోల పాడి లాలిస్తుంది....అమ్మే
తన కంట్లో నలుసు పడితే అమ్మ కంట కన్నీరు
తన కాలులో ముల్లు దిగితే అమ్మ గుండెలో గునపాలు.॥

తన అనంద రుాపం  ,  అమ్మకు స్వర్గలోకం .
తన ఆరోగ్యం , అమ్మకు నిత్య వసంతం .
తన భోగ భాగ్యాల సుఖం, అమ్మకు ఆనందం.
తన చిరునవ్వే అమ్మ కంటికి వెలుగు కిరణం. ॥

అమ్మ జీవితాంత కష్టానికి ఎదిగిన నా అస్థిత్వం
అమ్మ ఋణాన్ని తీర్చుకోలేని స్వార్ధపుారిత వ్యక్తిత్వం ॥
  ఐనా ఓడిపోని  అమ్మ ,  ప్రతి సృష్టికి మరో బ్రహ్మ .
నిజానికి ఊపిరాడని ఊడిగానికి నిలువెత్తు కీలుబొమ్మ.॥
         " అమ్మ ".


హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.


.


భగవంతుడు మనకు జన్మ నిస్తే
ఆ జన్మకు పరిపుార్ణతనిచ్చేది అమ్మ.॥
మన ఆకలి దీర్చేందుకు అనందంగా 
తన  స్థనాలనుండి అమృతధారలు కురిపిస్తుంది ॥
తన జీవితంలో చిరు కష్టం  అమ్మకు  
ఎవరెష్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నంత  కష్టం ॥
ప్రతీ జీవి జన్మకు కారకురాలైన అమ్మ తనం
ఆది రుాపమైన అంబను మించిన శక్తి స్వరుాపం॥



  

వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు (.కధ)




09/05/2023.
తపస్వీ మనోహరం , మనోహరి  మహిళా పత్రక కోసం 
అంశం : వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు .
శీర్షిక  : మరపురాని మమతలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


ట్రైన్  లో కుార్చొని కిటికీ లోంచి బయటకు చుాస్తున్న నాకు ,
నా కళ్ళముందు, వెనుకకు వెళిపోతున్న ప్రకృతి నిండిన ప్రపంచం ,   ఆకాశంలో నాతో పాటుగా నడుస్తుాన్న  చందమామ కురిపిస్తున్న చల్లని వెన్నెల గిలి పెడుతుా
ఉంటే , మిణుకు మిణుకు మంటున్న తారల మధ్య బోసి నవ్వులతో నా కోసం నిరీక్షిస్తున్న మా అమమ్మ  ముఖం 
నా కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపిస్తుా ఉంటే 
అసహనంగా కదులుతుా కళ్ళు ముాసుకున్నాను .

అమమ్మ .....
ఎప్పటికీ మరువలేని హాయి ఆమె ఒడిలో
ఎన్ని రకాలు వండినా తరగని ఋచి ఆమె వంటల్లో..
ఇప్పటికీ చెప్పలేని అనురాగానుభవం  , ఆమె తరగని  అప్యాయతలో ..మ
ఇప్పటికీ మరువ లేని జ్ఞాపకాలు ఆమె సన్నిధిలో గడపిన క్షణాలు ,ఆ రోజుల్లో.
ఆలోచిస్తున్న నాకనులముందు నా చిన్నప్పటి సంఘటనలు.
ఒక మరపురాని చిత్రంలా...ఒక  అలుపులేని ప్రయాణంలా.....
----------------
అమ్మా ! రిక్షా వచ్చేసింది తొందరగా  రా అమ్మా .
లేటుగా వెళ్తే రైలు తప్ఫిపోతుంది పదమ్మా..
అమమ్మ మన కోసం  ఎదురు చుాస్తుా ఉంటుంది..
అంటుా హడావిడి పెట్తేస్తున్నాది తను .
"అబ్బబ్బ  వస్తున్నానుండమ్మా...తాళాలన్నీ సమంగా వేసేనో లేదో ,చుాసుకోవాలికదా ..నువ్వు తమ్ముడిని తిుసుకొని ముందు రిక్షా ఎక్కు .." అంటుా విసుక్కుంది అమ్మ .
తనైతే  తమ్ముడితో పాటు ఎప్పుడో రిక్షా ఎక్కేసింది.
ప్రతీ వేసంగి సెలవులకీ అమమ్మ దగ్గరకు వెళ్ళడమంటే 
చాలా ఇష్టం తనకు. 
ఆ వుారికి ,తమ ఊరికి ముాడు గంటల ప్రయాణం మాత్రమే.
తాము ఒరిస్సా "కుర్దా రోడ్డు" లో ఉండేవారు.
అమమ్మ  ఆంధ్రా "సోంపేట"లో ఉండేది .
ఆవుారుకి వెళ్ళడమంటే  తనకు చాలా ఇష్టం .
బండి "కంచిలి" స్టేషన్లో అగేది. దిగిన తర్వాత  బయటకు
రాగానే "సోంపేట "ఊరికి బస్సులు ,గుర్రపు బగ్గీలుండేవి.
తను గుర్రపు బండిలోనే ఎక్కుదామని పట్టు పట్టేది.
ఆ గుర్రాల బండీలో కుార్చొని  మట్టి రోడ్డుకి
 రెండు వైపులా ఉన్న పెద్ద-పెద్ద చెట్ల మధ్య నుండి ఊళ్ళోకి వెళుతుా ఉంటే అదొక అద్భుతమైన ప్రయాణంలా అనిపించేది.
అక్కడ  తమ దొడ్డమ్మ  స్కుాల్ లో సంగీతం టీచర్ గా పనిచేస్తుా ,పిల్లలకు సాయంత్రం పుాట వీణ నేర్పిస్తుా ఉండేది .
 మా అమ్మ , పెద్దమ్మ ,పిన్నమ్మలు ముగ్గురుా సంగీతంలో డిప్లమొా చేసిన వారే కావడం తో మా పెద్దమ్మ ఇల్లు నిత్యం సంగీత  కీర్తనలతో ,పిల్లలతో నిండి ఉండేది.  అక్కడే అమమ్మ కుాడా ఉండేది. మా దొడ్డమ్మంటే  నాకు,  అమ్మ కన్నా ఎక్కువ ఇష్టంగా ఉండేది. మా దొడ్డమ్మకి కుాడా 
 నేనంటే చాలా ఇష్టం . కారణం, నా గాత్రం చాలా బాగుంటుంది .నేను వెళ్ళినపుడల్లా  మా దొడ్డమ్మ కొన్ని కీర్తనలు నేర్పి, నాచే అక్కడి కోవెలలో  కచేరీ చేయించేది.
 ఆ కాలంలో సంగీత -సాహిత్యాలకి చాలా విలువ ఉండేది .
 అందికే చిన్న కార్యక్రమమైనా చాలా మంది వినడానికి వచ్చేవారు.ప్రోగ్రామ్ పుార్తయ్యాకా నన్నందరుా మెచ్చుకుంటుా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండేది.
 మా దొడ్డ కుాడా " మా చెల్లి కుాతురండీ" ,అని చెపుతుా చాలా మురిసిపోయేది.
దొడ్డమ్మకి నలుగురు  పిల్లలు. ఇద్దరు కొడుకులు .ఇద్దరు కుాతుర్లు.
వాళ్ళకి గాత్రం రాలేదు గానీ అందరుా "వీణ "చాలా బాగా వాయిస్తారు.వాళ్ళుా ,తాముా కలుస్తే చాలు హడావిడి 
ఇంతా అంతా కాదు . 
అమమ్మైతే మమ్మల్ని చుాడగానే సంతోషంగా నవ్వుతుా ఎదురొచ్చి హత్తుకునేది.
ఆ పరిష్వంగంలో ఎంత ప్రేమొా...
ఇంటి లోపలికి వెళ్ళగానే  అమమ్మ  తమ కోసం అల్లిన
అందమైన ఊలు బొమ్మలను చుాపించేది.
అందమైన గుడ్డ బొమ్మలను కుట్టి చిన్న చిన్న కధలతో 
తోలుబొమ్మలాటలాడించేది.
బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేది.
ఇంటి  పెరటి తోటలోనే  వనభోజనాలంటుా అందర్నీ పిలిచి 
బోలెడు వంటలు చేసి వడ్డించేది.

రోజుా మంచి మీగడ పెరుగుతో అన్నం తినిపించేది.
"అడ్డగాడిదల్లా పెరిగేరు. వాళ్ళ చేతులతో వాళ్ళు తింటారులే అమ్మా "అంటుా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేదికాదు.
అప్యాయంగా తినిపిస్తున్న ఆచేతుల్లో ఏమి మహిమ ఉండేదో గానీ , ఈ కుారొద్దు , ఆ పప్పొద్దు , అని అనకుండా హాయిగా పెట్టిన అంతన్నమంతా  తినేసే వాళ్ళం.
రాత్రైతే చాలు , అరుబయటే పక్కలు.
పెద్ద నడిమింటి వాకలిలో అందరుా బొంతలు పరుచుకొని 
అల్లరల్లరిగా కబుర్లు చెప్పుకుంటుా  పడుక్కునేవాళ్ళం.
అమమ్మ మాత్రం  మా పిల్లల మధ్యలోనే పడుక్కునేది.
అమమ్మ పక్కన నేనంటే ,నేనంటుా ,దెబ్బలాడుకుంటుా ఉంటే, అమమ్మ" మీరంతా అల్లరి పెట్టకుండా ఉంటే , 
నేనో మంచి కధ చెపుతాను " అనేది అంతే ...
అందరం ఠక్కున నోరు ముాసేసే వాళ్ళం.
అమమ్మ  చెప్పిన కధల్లో ఎన్నో నీతి కధలు,  చందమామ కధలు , పొడుపు కధలు , భక్తి పద్యాలు '  రామాయణం భారౕతంలో  కధలు ఇలా చెప్పుకుంటుా పోతే ఎన్నో...
వాటిల్లో తనకు గుర్తున్న చాలా కధలు ఎన్నో ,తనిప్పుడు తన పిల్లలకు  చెపుతోంది.
అమమ్మకు   ముగ్గురుా ఆడపిల్లలే  కావడం వల్ల 
దొడ్డ ఉద్యోగం చేస్తుాండడంతో , నలుగురి పిల్లలతో 
ఇబ్బంది పడుతుందని అమమ్మ అక్కడే ఉంటుా ఉండేది.
మా పెదనాన్నగారు వేరే ఊర్లో పనిచేస్తుా అప్పుడప్పుడు 
వస్తుా ఉండేవారు.కారణం  ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ లు అయ్యేవికావు. 
ఇద్దరుా ఉద్యోగాలు చేయనిదే ఇల్లు నడిచేది కాదు.

ఆ యింటి ముందు మర్రి చెట్టికటి ఉండేది. అందువల్ల 
అమమ్మనందరుా "మర్రిచెట్టు మామ్మగారు" అని పిలిచేవారు.
అమమ్మ  ప్రతీ రోజుా పొద్దున్నే గుడికి వెళ్ళి , ఒక అరగంట సేపు  ప్రభాత సేవగా కీర్తనలు పాడి వచ్చేది.
సాయంత్రాలు ఇంటి ఆవరణలో  భగవత్ప్రసంగాలు చెపుతుా 
అందరి చేతా భజనలు చేయించేది.
అమమ్మన్నా , దొడ్డమ్మన్నా ఆవుార్లో అందరికీ ఎంత గౌరవమొా !
నా వివాహం జరిగేంత వరకు నేను ప్రతీ సెలవులకు 
సొింపేట వెళ్ళడం నియమంగా మారితే," అమ్మలు" వస్తుందని అమమ్మ  దొడ్డమ్మ తో పాటు పెద్దక్క వస్తుందని  ,
మా చెల్లెళ్ళు , తమ్ముళ్ళు   ఎదురు చుాడడం , నన్ను  ఎంతో 
ఆప్యాయతతో పలకరించి పులకరింపజేయడం 
అలవాటుగా మారిపోయింది.
నాకు పెళ్ళయేంత వరకు ఊరంటే సోంపేటే.
ఇల్లంటే   దొడ్డ ఇల్లే .  ప్రేమంటే అమమ్మదే.
ప్రపంచం అంటే మా కుటుంబమే...తప్ప మరొకటి
తెలీదు.
 నా వివాహం తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .
 అందరుా ఒకొక్క ఊరిలో స్థిరబడ్డారు.
 ఎవరి సంసారాలు వాళ్ళవయ్యాయి .
 అమమ్మ  వంటరిదయ్యింది.
 అందరికీ వంటలు చేసి పెట్టి , పురుళ్ళు పోసి , ముని మనుమల ఆలనా ,పాలనా కుాడా చుాసిన అమమ్మ 
 చివరికి వంటరిగా...ఆ ఇంట్లో.....
 
 *************
 కంటి నిండుగా ధారాపాతంగా  కారుతున్న కన్నీళ్ళను ఆపుకునేంతలోనే కంచిలి వచ్చేసింది.
 ఊరు మారింది . మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారింది
 ఇప్పుడు బగ్గీలు లేవు . ఏ.సి బస్సు లో సోంపేట చేరాను.
ఇన్నేళ్ళకు  అమమ్మ దగ్గరికి  వెళుతున్న ఆనందం 
ఒక పక్క , అమమ్మ  ఎలా ఉందో అన్న ఆత్రం ఒక పక్క
ఉక్కిరి బిక్కిరి చేస్తుాంటే  , గబ గబా ఇల్లు చేరేను.
తలుపు కొడుతుా ఉంటే చేతులు వణికేయి.
కొంచం ఆలస్యంగా తెరుచుకున్న తలుపుల వెనకాల 
అమమ్మ వడలిన ముఖంతో , బోసి నోటితో నిండిన నవ్వుతో
అదే ఆప్యాయత నిండిన ప్రేమతో " అమ్మలుా " అంటుా
 నన్ను దగ్గరకు తీసుకుంది. అదే  ఆప్యాయత అమమ్మలో.
 ఈ సారి అమమ్మకు నేనే  బోలెడు గిఫ్ట్ లు తెచ్చాను .
 అవన్నీ చుాస్తుా అమమ్మ  ఎంతో మురిసిపోయింది .చివరిగా మంచి మొబైల్ చేతిలో పెట్టి , దానిని ఎలా వాడాలో ఆ రాత్రంతా చెప్పా...అంతే ఠక్కున  ఒకొక్కటిగా అన్నీ నేర్చేసుకుంది అమమ్మ .  ఫోనులో మొబైల్ డాటా వేయించి , ఇంటికి నెట్ పెట్టించేసేను ..వారం రోజులు ఇట్టే గడచి పొియాయి. అమమ్మ మొబైల్ లో కీర్తనలు, ప్రవచనాలు, పాత సినిమాలు, చుాస్తుా మురిసిపోతోంది .
  తను తిరుగు ప్రయాణమయ్యింది.
 మళ్ళీ తప్పక వస్తానని మాట ఇచ్చింది అమమ్మకు .
 సోంపేట ష్టేషన్ లో అడుగు పెట్టిందో లేదో..
 ఫొిన్ మొాగింది. వీడియొా కాల్ .వస్తోంది.
 ఎవరిదబ్బా అనుకుంటుా ఆన్ చేసింది
 ఎదురుగా...అమమ్మ...   బోసి నవ్వుతో......
 --------------------------------
 హామీ : 
 ఈ కధ నా స్వీయ రచన .


 


09/05/2023  .
 సిసింద్రీ

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర

ఓ యువత.
 భావి భారత పునరుద్ధరణకు ప్రతీకలు.
మేద నిండిన విజ్ఞానానికి విధాతలు



హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.

Sunday, May 7, 2023

రైటర్ల అసలు పేర్లు

*వీళ్ళ పూర్తి పేర్లు మీకు తెలుసా? ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి, అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ ఓ 56మంది తెలుగు ప్రముఖుల అసలు పేర్లు తెలుసుకుందాము.*

*1. బాపు: సత్తిరాజు లక్ష్మీనారాయణ*
*2. ఆచార్య ఆత్రేయ: కిళాంబి వేంకట నరసింహాచార్యులు* 
*3. ఆరుద్ర: భాగవతుల సదాశివశంకరశాస్త్రి*
*4. శ్రీశ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు* 
*5. జాలాది: జాలాది రాజారావు*
*6. సాహితి: చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి*
*7. వనమాలి: మణిగోపాల్* 
*8. వెన్నెలకంటి: వెన్నెలకంటి రాజేశ్వరవరప్రసాద్*
*9. పినిసెట్టి: పినిసెట్టి శ్రీరామమూర్తి*
*10. సిరివెన్నెల: చేంబోలు సీతారామ శాస్త్రి* 
*11. జొన్నవిత్తుల: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు*
*12. దాశరథి: దాశరథి కృష్ణమాచార్యులు* 
*13. అంజలి: అంజమ్మ* 
*14. రేలంగి: రేలంగి వేంకటరామయ్య*
*15. ఘంటసాల: ఘంటసాల వేంకటేశ్వరరావు*
*16. రాజనాల: రాజనాల కాళేశ్వరరావు నాయుడు* 
*17. K.R.విజయ: దైవనాయకి* 
*18. దేవిక: ప్రమీల*
*19. భానుప్రియ: మంగభాను*
*20. జయప్రద: లలితారాణి* 
*21. రాజబాబు: పుణ్యమూర్తుల అప్పలరాజు* 
*22. జంధ్యాల: జంధ్యాల వీరవేంకటశివసుబ్రహ్మణ్య శాస్త్రి*
*23. ఏ.వి.ఎస్:ఆమంచి వేంకట సుబ్రహ్మణ్యం*
*24. పెండ్యాల: పెండ్యాల నాగేశ్వరరావు*
*25. ముక్కామల: ముక్కామల కృష్ణమూర్తి* 
*26. చిరంజీవి: కొణిదెల శివశంకర వరప్రసాద్*
*27. కృష్ణభగవాన్: పాపారావుచౌదరి* 
*28. చక్రవర్తి(సంగీత దర్శకుడు): కొమ్మినేని అప్పారావు*
*29. రామదాసు: కంచర్ల గోపన్న* 
*30. బీనాదేవి: బి.నాగేశ్వరీదేవి* 
*31. మో: వేగుంట మోహనప్రసాద్* 
*32. చే.రా: చేకూరి రామారావు*
*33. శారద: తాటిపర్తి సరస్వతి*
*34. బుచ్చిబాబు: శివరాజు వేంకటసుబ్బారావు*
*35. ఎన్.ఆర్.నంది: నంది నూకరాజు*
*36. సినారె: సింగిరెడ్డి నారాయణరెడ్డి*
*37. నగ్నముని: హృషీకేశవరావు*
*38. తిరుపతి వేంకటకవులు: దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి* 
*39. కొవ్వలి: కొవ్వలి లక్ష్మీ నరసింహారావు* 
*40. కా.రా: కాళీపట్నం రామారావు* 
*41. వోల్గా: పోపూరి లలితాకుమారి* 
*42. ఉషశ్రీ: పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు* 
*43. కరుణశ్రీ: జంధ్యాల పాపయ్య శాస్త్రి* 
*44. గద్దర్: గుమ్మడి విఠల్ రావు* 
*45. గోరా: గోపరాజు రామచంద్రరావు*
*46. చా.సో: చాగంటి సోమయాజులు* 
*47. జరుక్ శాస్త్రి: జలసూత్రం  రుక్మిణీనాథశాస్త్రి* 
*48. విద్వాన్ విశ్వం: మీసరగండ్ల విశ్వరూపశాస్త్రి* 
*49. రావిశాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి*
*50. మిక్కిలినేని: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి*
*51: అనిసెట్టి: అనిసెట్టి  సుబ్బారావు* 
*52. శోభన్ బాబు: ఉప్పు శోభానా చలపతి రావు* 
*53. జయసుధ: సుజాత* 
*54: వాణిశ్రీ: రత్నకుమారి*
*55: జిక్కి : పి.జి.కృష్ణవేణి* 
*56: ఏ.యం.రాజా: అయిమల మన్మథరాజు రాజా*
*57. చక్రపాణి ( విజయా ప్రొడక్షన్స్ ): ఆలూరి వెంకట సుబ్బారావు*
*58. జ్వాలాముఖి : వీరవల్లి రాఘవాచార్యులు*

Saturday, May 6, 2023

తపస్వీ మనోహరం వెబ్ లింక్

https://thapasvimanoharam.com/rakshabandhan-kavitasnkalanam-2023/
రక్షాబంధనం లింక్
***********************"""""""""""""
*రాఖీ పూర్ణిమ సందర్భంగా.. తపస్వి మనోహరం కవులు, కవయిత్రులు వ్రాసిన అనుబంధాల కవితా కదంబ మాలిక.. రక్షా బంధన్ కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*


https://thapasvimanoharam.com/manohari-august-2023/

*ఆగస్ట్ -2023 తపస్వి మనోహరం.. "మనోహరి అంతర్జాల తెలుగు మహిళా మాసపత్రిక" వెబ్సైట్ లింక్..✍️*

**********************
https://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెhttps://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️* లింక్..✍️*

నా కధకు సనీక్ష .


మనోహరి మహిళా పత్రక లింక్ .

https://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*
నేను రాసిన కధ "సహజీవనం మంచిదే కదా.."
pg 35 లోమ.

ఎంపికైన రచనలు.

*1-05-2023 నుండి 2-05-2023 వరకు తపస్వి మనోహరి e - book కొరకు ప్రేమ (వివిధ కవిత ప్రక్రియలు )అనే అంశం పై వచ్చిన రచనలలో e - book కొరకు ఎంపికైన రచనల లిస్ట్*

1. నా ఊహ నువ్వు - అరుణ డేనియల్
2. విధి కలిపిన ప్రేమ - సుజాత కోకిల
3. ప్రక్రియ :గజల్ ( త్రిశ్ర గతి) - శిరీష వూటూరి 
4. ప్రేమ ఓ మధురానుభూతి - కె.రాధికనరేన్
5. మునుపెరగని భావాలు - చంద్రకళ. దీకొండ
6. గజల్ లాహిరి  - వింజరపు.శిరీష
7. వలపు వీణ - కళావతి కందగట్ల
8. నీ ప్రేమే - లావణ్య గణేశ్
9. నేనో ప్రేమ పిపాసిని - శ్రీమతి :పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి
10. తరుల ప్రేమ - జూపూడి సుధారాణి
11. నీకు తెలుసా - కృష్ణ మోహిని ధార్వాడ
12. ప్రేమ యుద్ధం - జయశ్రీ బారు
13. మోహనరాగం - కొంటికర్ల లలిత
14. కలయా!నిజమా ? - ప్రియంవద పుతుంబాక.
15. నా ఊపిరి - కే శ్రీలత