Monday, November 20, 2023

పత్రికకు సెలెక్ట్ ఐన సిసింద్రీలు.

*20-11-2023 తేదీన  " వేడుక " అనే అంశం పై వచ్చిన సిసింద్రీలలో తపస్వి మనోహరం వారి పత్రికల కొరకు ఎంపిక చేసిన సిసింద్రీలు*

1. అంజనీ గాయత్రి
2. కనకరాజు గనిశెట్టి
3. పి.లక్ష్మీ ప్రసన్న
4. చింతా రాంబాబు
5. E.V.V.S. వర ప్రసాద్
6. శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
7.. జగదీశ్వరి కందికుప్ప@రాణి

Wednesday, November 8, 2023

చరిత్రలో ఈ రోజు..Good

*🌏చరిత్రలో ఈ రోజు/*
*2023 నవంబర్ 08📝*

*🗒️సంఘటనలు🔍*

🌾1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.

🌾1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.

🌾2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.


*🎂జననాలు🎂*

💞1656: ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)

💞1884: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922).

💞1893: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964).

💞1896: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972).

💞1908: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).

💞1917: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008).

💞1918: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007).

💞1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.

💞1936: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.

💞1968: చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత .

💞1969: ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు.

💞1986 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.

💞1991: అక్షా పార్థసాని , తెలుగు, తమిళ, మళయాళ చిత్ర నటి,మోడల్.

*💐మరణాలు💐*

🌺1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892).

🌺1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908).

🌺2012: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1930)

🌺2013: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957).

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌏*

*🍂వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే*

*🍂అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం*

Monday, November 6, 2023

అంశం : కళ్ళుళ అబద్ధం చెప్తాయి.
శీర్షిక  : మబ్బులు వీడిన ఆకాశం.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
 కళ్యాణ్ : మహారాష్ట్ర
 
ఆఫీసు నుంచి అరగంట ముందే ఇంటికి వచ్చిన రమేష్ అసహనంగా హాల్లో. పచార్లు చేస్తున్నాడు ఈరోజు కూడా తన భార్య రాధా ఇంట్లో లేదు .
ఇద్దరి దగ్గర రెండు తాళాలు ఉండడంతో, తను తాళం తీసుకుని ఇంటి లోపలికి వచ్చాడు .
కానీ అతని మనసంతా అశాంతిగా ఉంది.
 కారణం తన భార్య రాధ ప్రవర్తన.
 గత రెండు నెలలుగా రాధ ఇంట్లో అన్యమనస్కంగా, పరధ్యాన్నంగా ఉంటోది. చాలాసార్లు కారణం అడిగినా, రాధ తనకు జవాబు చెప్పలేదు .సరికదా చిన్నగా నవ్వేసేది.
 అసలే అతి తక్కువగా మాట్లాడే రాధ, ఈ మధ్యన మాటలు మరీ తగ్గించేసింది.
 
పెద్దలు కుదిర్చిన సంబంధమే ఐనా, రాధను చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు రమేష్.
రమేష్ కు రాధకు పెళ్లి ఆరు నెలలు అయింది.  వివాహనంతరం తనతో చాలా ప్రేమగా ప్రవర్తించేది రాధ .తనకు ఏ విధమైన లోటు లేకుండా చూసుకునేది . అన్నివిధాలా  ఉత్తమ ఇల్లాలుగా రాధను చెప్పుకోవచ్చు 
కానీ గత రెండు నెలలుగా తన భార్య ప్రవర్తనలో చాలా మార్పు చూసాడు తను..
రాను రాను, తన దగ్గర  రాధ, ఏదో దాచుతోందన్న అనుమానం కలిగేది రమేష్ కి.
దానికి కూడా తగిన కారణం ఉంది.
తన స్నేహితుడు రాజేష్ ఒకసారి తన ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తానని ఒక పార్కుకి పట్టుకెళ్లాడు.
అది లవర్స్ పార్కుట .అక్కడికి లవర్లు తప్ప, మరెవరరూ రారట.
పార్క్ అంతా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది. చెట్లకి చుట్టి ఉన్న సిమెంట్ చట్టాల మీద అక్కడక్కడ కొన్ని జంటలు కూర్చుని ఉన్నారు.
ఆ పార్క్ లో ప్రేమ జంటలు తప్ప, ఎక్కడా పిల్లల జాడగానీ, పెద్దలజాడ గానీ కనిపించలేదు.
పార్క్ పేరు కూడా "లవర్స్ పార్క్."
పేరు విన్నాడే కానీ, తను ఎప్పుడూ ఆ పార్క్ కి వెళ్ళలేదు.
రాజేష్ ,తన లవర్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ,చుట్టూరా చూస్తున్న తనకు ,ఒక బెంచి పై తన భార్య రాధ, ఎవరితోనో కూర్చుని మాట్లాడుతూ కనిపించింది.
ఒక్క క్షణం నివ్వెరపోయాడు రమేష్.
రాధా అతని చేతులు పట్టుకుని కన్నీరు కారుస్తోంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె తన పర్స్ నుంచి, కొంత పైకం తీసి అతని చేతిలో పెట్టింది .
అతను రాధను దగ్గరకు తీసుకున్నాడు.
కొంతసేపటికి అతను లేచి వెళ్లిపోయాడు. 
రమేష్, రాధ కంట పడకుండా పక్కకు తప్పుకున్నాడు.
కొంత సమయం దాటాక ,రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటిదారి పట్టింది.
రమేష్ మనసు మనసులో లేదు. రాధ ఇక్కడేం చేస్తోంది.
అతను ఎవరు ? చాలా అందంగా కనిపిస్తున్నాడు.
రాధా అతను ఎందుకు కలిసింది ?అతనికి  డబ్బు ఎందుకు ఇచ్చింది?
కొంపదీసి ఇతను రాధ ప్రేమికుడా ?  పెళ్లికి ముందు రాధ ఇతన్ని ప్రేమించిందా? 
అయితే రాధ, ఇతనితో పారిపోతుందా? 
అప్పుడు నలుగురిలో  తన పరువేం కాను ?
తన వాళ్లంతా, తనను వదిలి "రాధ ఎందుకు వెళ్ళిపోయింది "అని అడిగితే " తనందరికీ ఏం జవాబు చెప్పాలి..?
దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు గానీ ,పక్కన రాజేష్ ఉండడంతో ,ఏం చేయాలో తెలియక , రాజేష్ ని  తప్పించుకుని, ఇంటిదారి పట్టాడు.
నడుస్తున్నాడే కానీ ,అతని ఆలోచనలు, అతనిని విడలేదు
రాధను తనెంతో  ప్రేమించాడే...
 మరి రాధ లేకుండా తను ఉండగలడా...?
 లేదు ,లేదు ."తను చూసింది నిజం కాదు ."
 రాధ అసలు అలాంటిది  కానే కాదు.
 తను ఇంటికి వెళ్ళగానే రాధ తనకంతా చెప్పేస్తుంది.
  అతను ఎవరో ఏంటో తొందర్లోనే తనకు తెలిసిపోతుంది.
  రమేష్ , అస్తవ్యస్తమైన ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు.
  అప్పటికే రాధ, కడిగిన ముత్యంలా తయారై, చిరునవ్వుతో ఎదురొచ్చింది.
  తను ఫ్రెష్ అయి రాగానే  ,స్నాక్స్ తో పాటు కమ్మటి " టీ"
   తెచ్చి పెట్టింది.
   రమేష్ చాలాసేపు ఎదురు చూసాడు. రాధ తనతో ఏమైనా చెప్తుందేమో అని.
    కానీ రాధా ఏమీ చెప్పలేదు. ఎప్పటిలాగే ర మౌనంగా, తన పనులు తాను చేసుకుపోతోంది.
    రమేష్ కూడా తనంతట తానుగా బయట పడదలచుకోలేదు. 
    ఇదిగో ఇప్పటినుంచే మొదలైంది రమేష్ లో అనుమానం.
    అప్పటినుంచి అడపా దడపా ఆఫీసు నుంచి తొందరగానే ఇంటికి వచ్చేస్తున్నాడు .చాలాసార్లు రాధ లేకుండానే ఇంట్లోకి వెళ్ళాడు.
  మరికొన్నిసార్లు ఆత్రుత భరించలేక, 
  "లవర్స్ పార్క్ కి" వెళ్లి అక్కడ రాధ , అతనితో కూర్చుని మాట్లాడుతూ ఉండడం చూశాడు.
  అటుపై అతడు ఆఫీసు నుంచి సమయం దొరికినప్పుడల్లా, ,పార్క్ వైపు వెళ్లడం మొదలెత్తాడు.
  రోజుజూ కాకపోయినా, రెండు మూడు రోజులకు ఒకసారై నా, రాధ అతనితో కనిపించేది.
  రమేష్ కి ఏం చేయాలో తెలియడం లేదు. రాధ తనతో ఏమి చెప్పడం లేదు. 
  అతనెవరు..? అసలు రాధ అతనిని ఎందుకు కలుస్తున్నాది.?
   కలిసినప్పుడల్లా అతనికి డబ్బులు  ఎందుకు ఇస్తున్నాది  ? ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాది..?
   అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
   
************
రోజులు గడుస్తున్నాయి. రమేష్ కి ఓపిక నశిస్తున్నాది.
ఈ విషయమై తానే, " రాధను నిలదీద్దాం" అనుకున్నాడు  రమేష్.
ఆరోజు ఆఫీసుకు వెళ్లడం మానేసాడు రమేష్.
సదా సిదాగా తయారైన రాధ" రమేష్ ఆఫీస్ కు ఎప్పుడు వెళతాడా "అని చూస్తున్నట్టుగా అనిపించింది రమేష్ కు.
ఇంక రమేష్ తాత్సారం చేయలేదు.
 రాధ దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు
 సోఫాపై కూర్చున్న తర్వాత , ఒక్కొక్కటిగా తను చూసినవన్నీ రాధ ముందు బయటపెట్టి ,విషయం ఏంటని నిలదీశాడు.
 రాధ ముందు తెల్లబోయింది .తర్వాత ఆశ్చర్యపోయింది.
 ఆమె నుదుటినిండా ముచ్చెమట్లు పట్టేయి. శరీరం అంతా మెల్లగా కనిపించ సాగింది.
   "ఏమిటి? రమేష్, నెల్లాళ్లుగా, తనను వెంబడిస్తున్నాడా...?"
   "తను ప్రేమించేది ఎవర్ని" అని నిలదీసి అడుగుతున్నాడే,. "తను ఏం చెప్పగలదు ? ఎలా చెప్పాలి? "
  " నిజం తెలిస్తే, రమేష్ తనను తిరిగి ఎలుకుంటాడా?"
 " అసలు తను పెళ్లికి ముందే,  ఈ విషయం రమేష్ తో చెప్పేయవలసిందేమో? "
"  కానీ తన తల్లిదండ్రులు, ఈ విషయం బయటకు చెప్పవద్దని, తనను ఎంత నిర్బంధించారని.
  వారి మనస్థాపం చూసి, తను మౌనంగా ఈ పెళ్ళికి 
  అంగీకరించింది . రాను రాను పరిస్థితులు అన్నీ ,చక్కపడతాయి అనుకుంది .
  కానీ తన అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి..?"
  ఇంక, ఈ విషయం దాచి లాభం లేదు ,ఏదైతే  అదే అవుతుంది.
  " తను రమేష్ కు ,అసలు నిజాన్ని చెప్పేస్తుంది.."
   మనసులో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చిన రాధ 
   తలవంచుకుని,   మెల్లగా   చెప్పడం మొదలెట్టింది.
    
  ********************** ****************
సావిత్రి కి ,ప్రభాకర్ కి వైభవంగా పెళ్లి జరిగింది.
 ఇరుపక్షాల వారి  నవ్వులతో ,ఆనందంగా పెళ్లి ముగిసింది.
 చాలా సంతోషంగా గడుస్తుంది కానీ మూడు సంవత్సరాలైనా సావిత్రి కడుపు పండలేదని 
 అటు వారు, ఇటు వారు, కూడా, ఈ విషయమై డాక్టర్లను సంప్రదించారు.
 హార్మోన్స్ లోపం అంటూ వాళ్ళు ఏవేవో మందులిచ్చారు.
 చాలా పరీక్షలు చేశారు ఇద్దరికీ.
 మరో రెండు సంవత్సరాల తర్వాత ,వీరి ప్రార్థనల ఫలితమా అన్నట్టుగా , సావిత్రికి నెల తప్పింది.
 ఇరు కుటుంబాల వారి ఆనందానికి అంతులేదు.
 సావిత్రి ,ప్రభాకర్లు కూడా చాలా ఆనందంగా ఉన్నారు..
 నెలలు నిండాయి .పండంటి కొడుకు పుట్టాడు.
 ప్రభాకర్ కు , ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చి, మరో ఊరికి ట్రాన్స్ఫర్ అయింది . 
 సావిత్రికి  సీ.సెక్షన్ అయిన కారణంగా, రెండో సంతానానికి ఐదేళ్లు సమయం ఇద్దామనుకున్నారు.
-----------------
కొడుకుని ముద్దుగా "కృష్ణయ్య" అని పిలుచుకుంటూ, మురిసి పోయారు.
 పసిపిల్లాడి ఆట-పాటలతో ,సావిత్రి -ప్రభాకర్ ల జీవితం.
 చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది . కృష్ణయ్యకు ఆరేళ్లు వచ్చాయి.
 ఈ లోపల సావిత్రికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది.
 అందమైన ఆడపిల్ల పుట్టింది. ముద్దుగా "రాధ" అని పిలుచుకుంటూ ,ఇద్దరు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచసాగారు.
కృష్ణయ్య ఆనందం అంతా ఇంతా కాదు. ఒంటరిగా ఉన్న తనకు చెల్లి రూపంలో ఒక తోడు దొరికిందని చాలా సంతోషించాడు. ఇప్పుడు కృష్ణయ్యకు ఆమె తోడితే జీవితం అయిపోయింది .ఆట- పాటగా ,ఇద్దరూ  పెరుగుతున్నారు.
 
చూస్తుండగానే సంవత్సరాలు గడిచాయి.
ఐదేళ్ల రాధ , నట్టింట తిరుగుతూ ఉంటే ఇంట, లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టే ఉండేది.
ఇక ఆ అన్న చెల్లెళ్ల ప్రేమ అయితే చెప్పలేం. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతగా మసలే వారు.
చెల్లెమ్మ ఏడిస్తే , తట్టుకోలేకపోయేవాడు కృష్ణయ్య. కృష్ణయ్యను కసురుతే ఒప్పుకునేది కాదు రాధమ్మ.
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్న కొలదీ ముచ్చటతీరా ఆనంద పడుతున్నారు సావిత్రి, ప్రభాకర్లు.
అదిగో...అప్పుడే ,వారి జీవితంలో చీకట్లు కమ్ముకోవడం 
ప్రారంభమైంది.
ఏడవ క్లాసు చదువుతున్న కృష్ణయ్యకు  రాను రానూ , నడకలోనే కాక ,శరీర భాగాల్లో కూడా చిన్న చిన్న మార్పులు కనిపించ సాగాయి. అతడికి చెల్లెలికి కొన్న గాజులు ,తిలకం, కాటుక ,వంటివి చాలా నచ్చేవి. ఒకనాడు అతడు అడగలేక అడగలేక అమ్మను పట్టీలు కావాలని అడిగాడు.
ముందు సావిత్రి కేమీ అర్థం కాలేదు. మనసులో చిన్న అనుమానం మొదలైంది. 
ఎవరితోనూ చెప్పుకోలేదు, మానలేదు.
చివరికి మానసిక వేదన భరించలేక , భర్తతో ఈ విషయాన్ని గూర్చి విపులంగా వివరించింది.
 ఆందోళనకు గురైన ఇద్దరూ కలిసి, కృష్ణను డాక్టర్లకు చూపించేరు. , వాళ్ళు చెప్పిన విషయం విని, 
ఇద్దరూ, నిర్గాంత పోయారు. సావిత్రి అనుమానం నిజమైంది
లేక లేక పుట్టిన మగపిల్లవాడికి , ఈ విధమైన మార్పునిచ్చి భగవంతుడు తమకెందుకీంత అన్యాయం చేశాడో, 
 తాము ఏ పాపం చేశామో" అని లోలోనే ఇద్దరూ కుమిలిపోసాగారు.
 కృష్ణ కన్నా ఆరు సంవత్సరాలు చిన్నదైన రాధ , పెరుగుతున్న కొలది, ఈ ప్రభావం ఆమె మీద కూడా పడుతుందేమో? ఎందుకంటే "సమాజం చాలా చెడ్డది.
 ఉన్నవి లేని ఊహించి ప్రపంచమంతా చాటుతారు. దాంతో ఆడపిల్లకు పెళ్లి కాకుండా పోతుందేమో" అన్న భయం పట్టుకుంది సావిత్రి ప్రభాకర్లకు.
 కొంతకాలానికి తాము ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు  ,   ఈ విషయం నలుగురికి తెలియక ముందే,   పిల్లాడిని ఎక్కడో దూరంగా  పెట్టాలి. లేక లేక పుట్టిన ఈ పిల్లాడిని తాము వదులుకోలేరు అలాగని ఇంట్లో ఉంచి, అవమానాలు పడలేరు .
  ముందుగా తాము, ఈ ఊరు వదలి ఎక్కడికైనా వెళ్లిపోవాలి",
 అన్న ఆలోచన రాగానే ప్రభాకర్ ముందుగా, తను పని చేస్తున్న చేస్తున్న జాబ్ కు రిజైన్ చేసేసి, ఒక చిన్న కుగ్రామానికి  మకాం మార్చాడు.
 అక్కడ కొన్ని ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం మొదలెట్టి, కష్టించి పనిచేసే జీవితానికి  అలవాటు పడ్డాడు.
 
 12 సంవత్సరాలు నిండుతున్న  కృష్ణయ్యకి, తను పడుతున్న బాధ కన్నా, తన తల్లి తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలు, తనవల్లే, అన్న బాధ ఎక్కువైంది.
 దాంతో కృష్ణయ్య తను అచ్చంగా మగపిల్లాడులా ఉండడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తూ, తన  మనసు చదువుపై  లగ్నం చేయసాగాడు. 
 
 రాను రానూ, కృష్ణయ్య లో శారీరకంగా ఆడ లక్షణాలు కనిపించసాగాయి. 
 దాంతో సావిత్రి ప్రభాకర్లు కృష్ణయ్య  సంగతి అందరికీ తెలిసిన తర్వాత పుట్టిన ఆడపిల్ల
(రాధ ) జీవితం ఏమవుతుందో, ఆమెకు పెళ్లి అవుతుందో, లేదో అని  బాధపడుతూ  కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవారు.
 ఈ విషయం గ్రహించిన కృష్ణయ్య ,ఇంక తాను ఈ ఇంట్లో ఉంటే వీళ్ళందరి జీవితాలు దుఃఖమయం అవుతాయని తలచి, ఒకనాటి రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు.
  పొద్దున లేవగానే కనపడని కొడుకు కోసం, ఎంతో గాలించి పోలీసులు రిపోర్ట్ ఇవ్వలేక ,నలుగురిలో చెప్పుకోలేక, మధనపడుతూ, సావిత్రి మంచం పట్టింది. పొలం కౌలుకు తీసుకుని, వచ్చిన డబ్బులతో సావిత్రి కి సరైన వైద్యం చేయించలేకపోయాడు ప్రభాకర్.. మంచం పట్టిన సావిత్రి కోలుకున్నా. ఇదివరకులా తిరగలేకపోయింది  .
  చూస్తుండగానే సంవత్సరాలు గడిచాయి.
  ప్రభాకర్ ,సావిత్రి ఇంక ఆ ఊర్లో కూడా ఉండలేక ,తమ సొంతూరైన  సాలూరు  చేరుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు
 తాము , పుట్టిన ఊరు .. తమ తల్లిదండ్రులున్నప్పటి 
 వారెవరూ ఇప్పుడు  లేరు  .అక్కడెవరికీ ,తమకు కొడుకుకున్న సంగతి  తెలియనందున , కొన్ని నెలలకే కాస్త తేరుకున్నారు.
  ప్రభాకర్ తనకు  తెలిసిన  ఓ స్నేహితుని షాపులో ఉద్యోగానికి కుదిరాడు  రాధ బాధ్యత తమపై ఉన్నందున ,ఏదోలా జీవితం గడపసాగారు.
  రాధకు 18 సంవత్సరాలు వచ్చాయి. పల్లెటూరు కావడంతో రాధ , చాలా క్రమశిక్షణతో పెరిగింది.
అప్పుడపుడు రాధ ,తన అన్న కృష్ణయ్య, ఎక్కడ ఉన్నాడో తెలియక  మధన పడుతూ ఉండేది.
కానీ అమ్మా,నాన్నలు ఈ ఊరికి వచ్చే ముందు తనతో, తనకో అన్నయ్య ఉన్నట్టుగా ఎవరికీ తెలియనివ్వకూడదని గట్టిగా చెప్పినందువల్ల ,తన మనసులోని బాధ ఎవరితోనూ చెప్పలేకపోయింది . అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయిన కారణం తెలుసుకున్న రాధ మనసు విలవిలలాడింది
తన అన్నయ్య ఎప్పటికైనా ఇంటికి వస్తాడేమో నన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండేది.
కానీ వారెవరికీ కృష్ణయ్య ఆచూకీ తెలియలేదు .ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు.
రాధకు పెళ్లీడు వచ్చింది
  రోజురోజుకు అందంగా తయారవుతున్న రాధకు  వరుసగా
 సంబంధాలు, వాటంతటవే  రాసాగాయి.
 అలా వచ్చిన వాటిలో, ప్రభాకర్ సంబంధం ఒకటి.
 తమకున్న స్తోమతకు ఒప్పుకొని , రాధను నచ్చి, పెళ్లి చేసుకున్నాడు ప్రభాకర్. 
 రాధ ,పెళ్లిలో కూడా అన్నయ్య వస్తాడేమో అని, ఆశగా ఎదురు చూస్తూనే ఉంది.
 బయటకు చెప్పకపోయినా,  సావిత్రి ప్రభాకర్ల పరిస్థితి కూడా అదే  .ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎక్కడున్నాడో ? ఈ సంతోష సమయంలో తమకున్న ఒక్కగానొక్క కొడుకు ,దగ్గర లేకపోవడం వల్ల , వారి మనసు బాధతో నిండిపోయింది.
 మరి రెండు రోజుల తర్వాత రాధ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళిపోయింది.
 సావిత్రి, ప్రభాకర్లు మానసికంగా కుంగిపోయిన మనసుతో ఒంటరిగా మిగిలిపోయారు.
రాధ కూడా పెళ్ళ్లై వెళ్ళిపోవడంతో , సావిత్రి జబ్బు తిరగబట్టింది. సావిత్రి ఆరోగ్యం , రోజురోజుకు క్షీణిస్తున్నాది.
ఆమెకు కేన్సర్ వ్యాధి సోకింది.
భార్యకు వైద్యం చేయించే స్థితిలో లేని ప్రభాకర్, మౌనంగా 
రోదించడం తప్ప , ఏమీ చేయలేకపోయాడు.
వయసు మీద పడి, ఇంటి పనులు బయట పనులు చేయలేక,  నీరసించి పోయిన ప్రభాకర్ ని పక్షవాతం దెబ్బతీసింది.
విషయం తెలిసిన రాధ ,  భర్త అనుమతితో , కొన్నాళ్లపాటు తల్లిదండ్రులకు సేవ చేసేందుకు సాలూరు వచ్చింది. 
ఇంట్లో ధన లేమి బాగా కనిపిస్తున్నది.
ఒకప్పుడు బాగా బతికిన తల్లి, తండ్రి, ఈ పరిస్థితికి దిగజారిన సందర్భాలు తలుచుకొని రాధ కన్నీరు మున్నీరైంయింది. 
ఇంత దయానీయ పరిస్థితులలో ఉన్న తల్లిదండ్రులను,
మరో రెండు రోజులలో తన దగ్గరకు, అంటే హైదరాబాద్ తీసుకెళ్లి పోవాలని నిశ్చయించుకుంది.
రాధ ,ఇక్కడికి విషయాలన్నీ భర్తతో చెప్పగా, అతను వెంటనే వారిని ఇంటికి తెచ్ఛీమని ,  ఇక్కడికి వచ్చేక, వారిని  మంచి డాక్టర్లు చూపిస్తానని. చెప్పాడు.
ఆరోజు సాయంత్రం రాధ ,  భర్త ,తన ఖర్చులు కోసం ఇచ్చిన డబ్బుల్లో,  కొంత డబ్బు తీసుకొని  "వెచ్చాలు" కొని తేవడానికి , మార్కెట్ కు వెళ్ళింది.
సామాన్లన్నీ తీసుకుని, డబ్బులు" పే' "చేస్తున్న సమయంలో "చెల్లీ "అన్న పిలుపు ,పక్కనే వినబడడంతో, రాధ తుళ్ళిపడి వెనుకకు తిరిగింది.
తన వెనకాతలే హుందాగా, సూటు- బూటుతో, నిలబడిన అందమైన వ్యక్తి కనిపించాడు .రాధ తేరపారి చూసింది. సందేహం లేదు అతడు కచ్చితంగా తన క్రిష్ణన్నయ్యే...
అన్నని చూసిన రాధ మనసు , సంతోషంతో తబ్బుబ్బైయింది.
ఆత్రుత ఆపుకోలేక "అన్నయ్యా "అంటూ ,గట్టిగా అరచి,
కృష్ణయ్యను హత్తుకుపోయింది.
కృష్ణకు కూడా, గొంతుకలో ఏదో  అడ్డం పడినట్టై , 
మాటాడలేకపోయాడు.. కొన్ని సంవత్సరాల తరువాత కనిపించిన చెల్లెలు ,తన ఎదురుగా ఉండడంతో , అతను కూడా ఆనందంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు
కృష్ణన్న  ఇల్లు విడిచి వెళ్లిపోయిన తర్వాత, చాలా కష్టాలు పడ్డాడట.  
కానీ, ముందు కష్టాలు పడ్డా ,తరువాత చదువు మీద దృష్టి పెట్టి , పట్టుదలగా చదవి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, పిహె.చ్ డీ కూడా చేయడం తో, బ్యాంకులో మేనేజర్ గా ఉంటూనే, అంచలంచలుగా  ఎదిగి, చాలా పెద్ద పోస్టులో, ఉద్యోగం  సంపాదించి, ప్రపంచమంతా  ఉద్యోగరీత్యా చుట్టి వస్తున్నాడని , హెడ్ ఆఫీస్ హైదరాబాదులోనే  ఉందని, చెప్పగా, రాధ చాలా సంతోషించింది.
చెల్లెలు భర్తతో హైదరాబాద్ లోనే ఉంటుందన్న విషయం తెలిసి కృష్ణ కూడా చాలా ఆనందపడ్డాడు.
అటు పై రాధ ,కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ,ఇంటి పరిస్థితులు ఎలా మారిపోయాయో, తర్వాత తన వివాహమెలా జరిగిందో, అనంతరం , అమ్మా- నాన్నల దైన్యస్థితి ,ఇప్పుడు ఈ సాలూరులో అమ్మ ,నాన్నలకున్న అనారోగ్య పరిస్థితి,  నాన్నకున్న. అసహాయపరిస్థితుల  గురించీ ,,అన్నీ వివరించి చెప్పింది .
అన్నీ విన్న కృష్ణయ్య ,తాను "అమ్మ నాన్నల  గురించి, తన వివాహం గురించి, గత. సంవత్సరం బట్టి, కనుక్కుంటూనే ఉన్నాడని,  తల్లిదండ్రులను చూడాలన్న ఉద్దేశంతోనే తను సాలురుకు వచ్చానని , అనుకోకుండా తనను కూడా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని ,కంటనీటితో చెప్పాడు. 
తర్వాత రాధ, అన్నయ్యను ఇంటికి రమ్మన్నాది .
కానీ కృష్ణ తను తల్లిదండ్రులకు ఎప్పటికీ ఎదురు పడలేనని, నిజం తెలిస్తే వారు తనను విడిచిపెట్టరని, తను తన " గే" సమాజంలో ఒకడుగా ఎప్పుడో కలిసిపోయి, వారి చలవ వల్లే   పై చదువులు చదవగలిగి, ఈ స్థితికి చేరుకున్నానని,
తాను వచ్చినందువల్ల, సుఖంగా ఉన్న నా జీవితం కూడా అస్తవ్యస్తమవచ్చని తెలిపి బాధపడ్డాడు..
అమ్మానాన్నలను తనతో హైదరాబాద్ తీసుకెళ్లిపోమని వారిని మంచి హాస్పిటల్ లో చేర్పించమని, వారు కోరుకునే వరకు ఐన ఖర్చులన్నీ తానే భరిస్తానని, ఆమెను" దిగులు పడవద్దు" అని చెప్పి ,తిరిగి  త్వరలోనే "హైదరాబాదులో కలుసుకుందాం "అని చెప్పి, తన ఫోను నెంబరు రాధకిచ్చి, రాధ  ఫోన్ నెంబర్ తను తీసుకుని వెళ్ళిపోయాడు.
రాధ, అన్నయ్యని చూసిన సంతోషంతో, ప్రశాంతమైన మనసుతో ఇల్లు చేరింది.
అనుకున్నట్టుగానే రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులను తీసుకుని హైదరాబాదు బయలుదేరింది.
అనుకున్నట్టుగానే మంచి ఆసుపత్రిలో తల్లిని ,తండ్రిని ఇద్దర్ని చేర్పించింది.
భర్త రమేష్ ,ఆమెకు అన్నింటా చేదోడువాదోడుగా ఉంటూ ఆమె మనసు కష్టపడకుండా చూసుకుంటున్నాడు.
మరొక నాలుగు రోజుల్లోనే హైదరాబాద్ చేరిన కృష్ణ , తల్లిదండ్రులను హాస్పిటల్ లో చేర్పించిన విషయం తెలుసుకొని  ,ఆసుపత్రి ఖర్చులన్నీటికి సరిపడా డబ్బును ఏదో ఒక చోట కలిసి, చెల్లెలకు అందిస్తున్నాడు.
రాధా అన్నతో ,అతని విషయం రమేష్ తో చెప్తానని ,ఇంటికి రమ్మని చాలాసార్లు పిలిచింది.
కానీ కృష్ణ ,తాను ఈ ఊర్లో ఉన్నట్టుగా గానీ , ఆమెకు డబ్బు ఇస్తున్న విషయం గానీ, రమేష్ కు తొందరగా చెప్పవద్దని, తానే కొంతకాలం పోయిన తర్వాత రమేష్ ని కలిసి విషయాలన్నీ మాట్లాడతానని, చెల్లెలు దగ్గర మాట తీసుకోవడంతో, రాధ ఆ ప్రకారంగానే భర్తలేని సమయంలో అన్నని కలిసి డబ్బు తీసుకొని ఇంటికి వస్తున్నాది.
************
రాధ నోట్లో నుండి వస్తున్న ఈ విషయాలన్నీ ఆశ్చర్యంగా వింటున్న, రమేష్. , చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు.
తను రాధను పెళ్లి చేసుకునేటప్పుడు, వాళ్లకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని, ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాడని, వారు తెలియపరచనందున ,తను రాధను అపార్థం చేసుకున్నాడు.
సొంత అన్నను కలుస్తున్న రాధ గురించి తను ఏదో ఊహించేసుకుని ,మరోలా అపార్థం చేసుకుని  రాధను అనుమానించాడు. 
" కళ్ళు  అబద్ధం చెప్తాయి" అన్నమాట. 
అందుకే అన్నారు పెద్దలు ,చూసేవన్నీ నిజం కావని, విషయం తెలుసుకోనిదే ఎవరినీ నిందించవద్దని.
ఇక్కడ కృష్ణ,
ఒక కొడుకుగా తన తల్లిదండ్రుల ఎదుట పడాలన్న తపనతో కృష్ణ "ట్రాన్స్ జెండర్ "గా మారకుండా, తన జీవితమంతా కష్టాలను అనుభవిస్తూ, పెద్ద చదువులు చదివి, ఒక మగాడిగా నిలబడి, తన బాధ్యతను  నిర్వర్తిస్తున్నందుకు , కృష్ణను చాలా అభినందించాడు రమేష్.
ఇన్నాళ్లు ఈ బాధలు మనసులోనే దాచుకొని నలిగిపోతున్న రాధను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాడు రమేష్.
అతను మెల్లగా లేచి, రాధ దగ్గరికి వెళ్లి, చేతులు పట్టుకున్నాడు "రాధా కంటితో చూసిన వన్నీ నిజం కావు" అన్న విషయం, నీ మాటల ద్వారా నాకు అర్థమైంది .ఎప్పుడు ఏ విషయాన్ని చూసినా, దాని వెనుకనున్న పరిస్థితులు, నిజా -నిజాలు తెలుసుకోకుండా మనుషుల్ని అపార్థం చేసుకోకూడదు అన్న విషయం నాకు బోధపడింది.
ఈనాటికైనా నువ్వు నాకు నిజం చెప్పినందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది .ఇక నువ్వు ఏం బాధ పడకు .
కృష్ణను నా స్నేహితునిగా ఇంటికి పిలుద్దాం .అమ్మ నాన్నల్ని అతనికి చూపిద్దాం.
మనమంతా ఎప్పుడూ ఒక కుటుంబం వాళ్ళమే.
ట్రాన్స్ జెండర్ గా పుట్టడం కృష్ణ తప్పు కాదు. 
నేను రేపే మీ అన్నను కలుస్తాను" అంటూ రాధను దగ్గరికి తీసుకున్నాడు రమేష్.
తనను ఎంతో అపార్థం చేసుకుంటాడనుకున్న రమేష్ ఈ విధంగా మాట్లాడడంతో రాధా ఆశ్చర్యానికి గురైంది .
తర్వాత ఆనంద పడింది .అతని మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించింది.
ఇన్నాళ్లూ మనసులో అణచుకున్న బాధ, కన్నీటి రూపంలో బయటకు ఉబుకుతూ ఉంటే,, భర్తను గట్టిగా కౌగిలించుకొని ,భర్త  రమేష్ గుండెల్లో తలదాచుకుంది రాధ.
****""""""""
--------------
 
 
 
 
 
 
 
  
  
  
  
 
 
 
 
 
   
   
 

Monday, October 30, 2023

ఛందస్సు

11.
విభా -త, ర, గ, గ.

తీరంగ కోర్కెలున్ లోకుల్
జేరంగ నిన్ను గొల్వంగన్
భారంబు దీర్చునిన్ దల్తున్
శ్రీరంగ శాయిగన్ కృష్ణా!//

12.

వాంతభారః -న, త, గ, గ.

హరిహరీ!నిన్ను వేడన్
గరిని రక్షించినావా!
మొరల నాలింప లేవా!
సురవరా!రావ!కృష్ణా!//

13.
తుంగా -న, న, గ, గ.

పరమ పురుష!విష్ణూ!
గరుడ గమన శౌరీ!
నిరతము నిను గొల్తున్
పరము నిడుమ!కృష్ణా!//

14.
వృత్తముఖీ -న, భ, గ , గ.

నియతిగా నిను దల్తున్
భయము బాపగ రావా!
శ్రయము నీయుమ!నాపై
దయను జూపుమ!కృష్ణా!//

15.
 గోపనదీ -    న,మ,గ,గ.

ప్రణతితో నీ పాదంబుల్
వినతిగా మ్రొక్కంగా నిన్
ఘనముగా కీర్తించన్ స
ద్గుణములే కల్గున్ కృష్ణా!//

16.

పాంచాలాంఘ్రి -న, య, గ, గ.

గిరిధర గోపాలా!నీ
చరణములే దిక్కంచున్
సురలట చేరంగా నిన్
సురతుడ వంచున్ కృష్ణా!.//

17.

కరరికా -న,ర, గ, గ.

విరసమెందుకోయీ!నా
కరము వీడకోయీ!సుం
దరముఖారవిందా!నీ
కరుణ జూపూమా!కృష్ణా!.//

18.
రుద్రాళీగణలయనీ - న, స, న, గ.

ఘనుడ వని నిన్ దల్తున్
క్షణికమగు భాగ్యంబుల్
కనను హరి!నీ రూపున్
గన నిలిచితిన్ కృష్ణా!.//

19.
కృష్ణగతికా -భ,జ,గ,గ.

పాదములు పట్టి కొల్తున్
వేదనలు తీర్చ వయ్యా!
నీదయను జూప రాదా!
నాదరికి రావ!కృష్ణా!.//

20.

చిత్రపదా-భ, భ, గ, గ.

కోరను గోర్కెలు శౌరీ!
భారము నీదని దల్తున్
సారెకు మ్రొక్కుచు నిన్నే
చేరితి నీదరి కృష్ణా!.//

Sunday, October 22, 2023

తపస్వీ. మనోహరం పత్రికకు సెలెక్ట్ అయిన రచనలు, సిసింద్రీ లు.


[07/04, 1:24 am] +91 81850 13581: *తపస్వి మనోహరం పత్రికల కొరకు మరియు మనోహరం వెబ్సైట్ కొరకు 6-04-2023 తేదీన ఎంపిక చేసిన సిసింద్రీలు*

1. జి.కె.నారాయణ
2. కె.కె.తాయారు
3. శనగపల్లి ఉమామహేశ్వరరావు
4. అంజనీ గాయత్రి
5. సావిత్రి కోవూరు
6. పి. వి. యన్. కృష్ణవేణి
7. సుజాత కోకిల
8. ఎం.వి.చంద్రశేఖరరావు
9. పంతుల లలిత
10. మక్కువ.అరుణకుమారి
11. జూపూడి సుధారాణి
12. కాటేగారు పాండురంగ విఠల్
13. గంటి. మీనాకుమారి
14. శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
15. యాంబాకం
16. వి విజయశ్రీదుర్గ
17. వనపర్తి గంగాధర్
18. బాలపద్మం
19. కార్తీక్ దుబ్బాక
20. శారద కెంచం
21. రాధా సురేష్ యర్జల్
22. వి.వి.వి.కామేశ్వరి (v³k)
23. శ్రీ విజయ దుర్గ. ఎల్
24. పద్మావతి పి
25. శ్రీసుధ కొలచన
26. దొడ్డపనేని శ్రీ విద్య
[21/04, 1:12 am] +91 81850 13581: *తపస్వి మనోహరం పత్రికల కొరకు మరియు మనోహరం వెబ్సైట్ కొరకు 20-04-2023 తేదీన ఎంపిక చేసిన సిసింద్రీలు*


1. ఆకుమళ్ల కృష్ణదాస్
2. ప్రక్షిత ప్రవి.
3. అద్దంకి లక్ష్మి
4. జయశ్రీ బారు
5. జి.కె.నారాయణ
6. మక్కువ.అరుణకుమారి
7. సుజాత కోకిల.
8. అంజని గాయత్రి
9. బాలపద్మం
10. గంటి .మీనాకుమారి
11. పద్మావతి పి
12. యాంబాకం
13. రాధా సురేష్ యర్జల్
14. సావిత్రి కోవూరు,
15. పంతుల లలిత.
16. శనగపల్లి ఉమామహేశ్వరరావు
17. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
18. -వి.వి.వి.కామేశ్వరి (v³k)
19. చింతా రాంబాబు
20. కాటేగారు పాండురంగ విఠల్
21. ఎం.వి.చంద్రశేఖరరావు
22. తాయారు కె.కె
23. విస్సాప్రగడ పద్మావతి
24. శారద కెంచం


[22/10, 10:27 pm] బుజ్జి...✍️ స్వప్న: 
*03-10-2023 నుండి 07-10-2023 తేదీ వరకు "పురాణాలలో మహిళల ప్రాముఖ్యత (వ్యాసం)"అంశంపై వచ్చిన రచనలలో పత్రికకు సెలక్ట్ చేసినవి..*✍️

1. దీరవనితలు -  మామిడాల శైలజ
2. శాపగ్రస్త అహల్య - చంద్రకళ. దీకొండ
3. సహనానికి మారుపేరు - పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
4. మంధర మంత్రాంగం -ఎం. వి. ఉమాదేవి.
-----------------------------------------------------------

[22/10, 10:39 pm] బుజ్జి...✍️ స్వప్న
: *12-10-2023 నుండి 14-10-2023 వరకు
 గ్రూప్ లో వచ్చిన ఐచ్చిక వ్యాసాలలో,
 పత్రికకు సెలక్ట్ చేసినవి..* ✍️

1. సంక్షిప్త తిరుమల చరిత్ర -  పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
2. శ్రీరంగం పుణ్యక్షేత్రం - పొన్నూరి భారతలక్ష్మి
3. లక్ష్మీనారాయణ బిర్లా మందిర్ -అద్దంకి లక్ష్మి

Saturday, October 21, 2023

అమ్మా.....నువ్వెక్కడ...?

మగువ మహారాణిలో
14/05/2023
అంశం : అవనికి అమ్మే ఆధారం* 
శీర్షిక  : అమ్మా ! నువ్వెక్కడ..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


అవనిలో అలిగా ,అక్కగా, చెల్లిగా ,
చెలిగా..,అల్లుకున్న బంధాలకు 
ఆత్మీయతను,అనురాగాన్ని పంచి,
విలువలు నేర్పిన కొమ్మ అమ్మ॥

మన ఉనికికి ఆధారం అమ్మ .
 మన నోట తొలి పలుకు అమ్మ .
 మన తొలి అడుగుకు ఆసరా అమ్మ.
అక్షరాలకు అర్ధం చెప్పన తొలి గురువమ్మ. -॥

మన బాటకు మార్గదర్శై, 
మన కష్టానికి తోడై, మన-
ఇష్టాలకు వరమై, నీడలా 
మన వెన్నంటి ఉండి మనలను 
గాచే- ఇల వెలసిన దేవత  అమ్మ ॥
 
 అమ్మ గురించిన కవితలు కొల్లలు
 అమ్మ గురించిన భాష్యాలు వేలు
 మన కవితల్లో  జీవం అమ్మ .
నిజానికి మన స్వార్ధానికి-
 బలౌతున్న బ్రతుకు అట బొమ్మ ॥
 
 నేడు అమ్మలు, గుండెలు పగిలి -
చిందర-వందరైన  గాజు దీపాలు.
వృద్ధాశ్రమాల్లో ఉనికి మరచిన 
బ్రతుకు పొిరాటాల తోలు జీవాలు॥


హమిపత్రం : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

Tuesday, August 22, 2023

పద్య కధా సౌరభం.లో సెలెక్ట్ అని కధలు.

ప్రస్తుతం వరకు కవులు ఎంపిక చేసుకున్న పద్యాల వివరములు
1. వినదగునెవ్వరు చెప్పిన-వేమన శతకం-వైరాగ్యం ప్రభాకర్
2. అనగనగా మతి శయిల్లుచునుండు-వేమన శతకము-సునీత ప్రయాకర్ రావు
3. తన కోపమే తన శత్రువు-సుమతి శతకము-దుబ్బాక శివ కళ్యాణి
4. విద్య నిగూడ గుప్తమగు విత్తము-భర్తృహరి శతకం-గుండమీది కృష్ణమోహన్
5. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు--రాజకుమారి
6. మేడిపండు చూడు మేలిమై ఉండు-వేమన శతకం-గుండవరం కొండలరావు
7. ఆత్మలోన శివుని అనువుగా శోధించి-వేమన శతకము-గోనెల రాజేశ్వరి
8. మధుర భాషణమే మణి భూషణం-ఉమర్ ఖయాం-(కరుణశ్రీ)-చౌడూరి నరసింహారావు
9.అల్పబుద్ధివానికధికారమిచ్చిన-వేమన శతకం-పి.ఉమాపతి
10.ఉపకారికినుపకారము-వేమన శతకం-కాండూరి వెంకటేశ్వర్లు.
11.పట్టుచుదండ్రి యత్యథము- భాస్కర శతకము -వేలూరి ప్రమీలాశర్మ.
12.పట్టు పట్టరాదు పట్టి విడువరాదు -వేమన శతకం -డా.పోల(కొండూరు)సాయి జ్యోతి
13.పుత్రోత్సాము తండ్రికి -వేమన శతకం-మలిచెట్టి శ్రీనివాసులు
14.మాటలాడనేర్చి మనస్సు- వేమన శతకం - పున్నంచందర్ నాగమల్ల
15.వంపుకర్ర గాచి వంపు తీర్చగవచ్చు-వేమన శతకం-బి.రత్న కుమారి
16.వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు-వేమన శతకం-యన్.కె.నాగేశ్వరరావు
17.ఉప్పులేని కూర -వేమన శతకం -ఉమాదేవి ఇల్లెందుల
18.మాటలాడ వేరే మనసు కొలదియు వేరే-వేమన శతకం -దారం గంగాధర్
19.హరికి దొరికె నందురాసిరి- వేమన శతకం -ఆవలకొండ అన్నపూర్ణ
20.చదువది యెంత గల్గిన రసజ్ఞత -భాస్కర శతకం -నండూరి సుందరీ నాగమణి
21.చాకి కోకలుతికి-వేమన శతకం -ఎ.పి.వేంకటరెడ్డి
22.ఆకలన్నవాడికాహారమందించి-స్వీయ శతకం- చల్ల సునితా సంపత్
23. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు- వేమన శతకం- అద్దంకి లక్ష్మి
24. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు- బర్తృహరి శతకం - రుక్మిణి శేఖర్
25.బలవంతుడ నాకేమని-వేమన శతకం- అయ్యల సోమయాజులు ప్రసాద్
26.ధనము కూడబెట్టి -వేమన శతకం- గుంజ శ్రీను
27.నిక్కమైన నీలమొక్కటి చాలు-వేమనశతకం- బండారి సుజాత.
28. అలిగిన నలుగక యొగ్గులు -నన్నయ్య మహాభారతం- చింతల కమల.
29 పాలను కలసిన జలములు- సుమతి శతకం- పాడి కవిత.
30. ఆకొన్న కూడే యమృతం- సుమతి శతకం- ఎం వీర కుమారి.
31. అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప- వేమన శతకం- డాక్టర్ నన్నపురాజు విజయశ్రీ.
32. సిరి దా వచ్చిన వచ్చును- సుమతి శతకం- బిరుదుల ప్రవీణ్ కుమార్.
33. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు- వేమన శతకం- కె. అమృత జ్యోత్స్న
34.పగలుడగ నాసలుడుగును  -వేమన శతకం- రాపోలు శ్రీదేవి
35. ధనపతి సఖుడై యుండియు -సుమతి శతకం -సుజాత తిమ్మన
36. ఇచ్చు వాని వద్ద ఈనివాడుండిన -వేమన శతకం- సూర్య గండ్రకోట.
37. నడవకుమీ తెరువొక్కట- సుమతి శతకం- పుల్లాభట్ల జగదీశ్వరి.
38. ఆపదలందు ధైర్య గుణ సంచిత- భర్తృహరి శతకం- దాసు శ్రీహవిష.
39. చంపదగిన శత్రువు తన చేత-వేమన శతకం- దూత కావ్య కళ్యాణి.
40. కమలములు నీట బాసిన కమలాత్ముని- సుమతి శతకం- వడలి రాధాకృష్ణ.
41. పరనారీ సోదరుడై- సుమతి శతకం- కలకుంట్ల జలజ.
42. గంగి గోవు పాలు గరిటడైనను చాలు- వేమన శతకం- పొర్ల వేణుగోపాలరావు.
43. ఓరులేయవి ఒనరించిన-తిక్కన మహాభారతం- యనమండ్ర వరలక్ష్మి
44.వెలుగు రాకముందె వేగ నిదురలెమ్ము-తెలుగు పూలు-నార్ల చిరంజీవి-దూత రామ కోటేశ్వరరావు 
45.నేరిచి బుద్దిమంతుడతి-భాస్కర శతకం-వి.విజయ శ్రీ దుర్గ.
46.కష్టపెట్టవద్దు కన్నతల్లి మనసు-మంగ శతకం(పురం మంగ)-బొట్ల అయిలయ్య
47.ఆజ్ఞలందు వెలుగునల్ప విజ్ఞానుండు-తోకల రాజేశం-తోకల రాజేశం
48.చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె-వేమన శతకం-పద్మజా ముడుంబై
49.మానవుండే మాధవుండను-గాంధీతాత శతకం(శిరిశినగల్ కృష్ణమాచార్యులు)కొంటికర్ల లలిత
50.బలవంతుడ నాకేమని-వేమన శతకం-రాధికా రాణి
51.అల్పుడెపుడు పల్కు-వేమన శతకం-వురిమళ్ళ సునంద
52.కోపమునను ఘనత కొంచెమైపోవును -వేమన శతకం-వేంకటలక్ష్మీ గాయత్రి
53.ఎప్పుడు సంపద కలిగిన -సుమతి శతకం-బద్దెన భూపాలుడు -ఎన్.శ్రీనివాస రెడ్డి
54.నీళ్ళలోని చేప నెరిమాంసమాశించి-వేమన శతకం-పేరి భార్గవి
55.చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు -వేమన శతకం-శిరిశినహళ్ నీళాదేవి
56.భవదీయార్చన చేయుచో- సర్వేశ్వర శతకం-యథావాక్కుల అన్నమయ్య-అనాసి జ్యోతి
57.తరువులతిరసఫలభార గురుత గాంచు-భర్తృహరి సుభాషితాలు -లలితావర్మ
58.ఉరు గుణవంతుడు -భాస్కర శతకం-కర్నేన జనార్ధన రావు
59.సాయి జ్యోతి(బత్తుల మేఘన)
60.పనియు చిన్నదనుచుభావించి-తెలుగుబిడ్డ శతకం(డా.బల్లూరి ఉమాదేవి)-ఆకొండి(ముద్దు) వెంకటలక్ష్మి
61.సద్గోష్ఠియు సిరియునొసగు-కుమార శతకం-సుకన్య వేదం
62. అనువుగానిచోట అధికులమనరాదు – వేమన శతకము – దొంతరబోయిన దైవాధీనం
63.రుధిరమిచ్చె మనకు - సాయి నీతి శతకం -అరుణ బట్టువార్
64.దానము సేయగోరిన -భాస్కర శతకం-సిరిపురం వాణిశ్రీ
65.చిత్తశుద్ధి కలిగి చేసిన-వేమన శతకం-జి.సత్యవతి
66.గురువు మెప్పు పొందిన -గురుదేవోభవ శతకం-దుబ్బ భాస్కరరావు
67.సిరికలవాడికెయ్యన-భాస్కర శతకం-మారద వెంకయ్య -సరస్వతి కరవది
68.ఆటలాడు వేళలయందునాడవలయు –రాజేశ్వరి రాంచందర్ 
69.శీలను ప్రతిమజేసి చీకటింటనుబెట్టి – వేమన శతకము –కొయ్యడ మల్లిక్ 
70.నిక్కమైన మంచి నీలమోక్కటి చాలు – వేమన శతకము –వావిలిపల్లి రాజారావు 
71.వినదగునెవ్వరు చెప్పిన – వేమన శతకము -వి.వి.వి.కామేశ్వరి 
72.తమ కార్యంబు బరిత్యజించియు – సుభాషితా రత్నావళి-ఏనుగు లక్ష్మణ కవి - ఏ.రాజ్యలక్ష్మి

Wednesday, July 19, 2023

చందస్సు నియమాలు

[17/05, 8:18 am] +91 77998 86016: *హంసికలు నియమాలు*
[18/05, 10:20 am] +91 77998 86016: అందరికీ అభివందనం🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    ఇన్ని రోజులు మనం ఛందస్సులో పలు పలు గణాలను తీసుకొని కావ్యాలు రచించాము. ఇక నేడు వృత్తాలలో ఒకటైన *ఉత్పలమాల*  పద్య రీతిలో  నేటి మన రచనలు చేద్దాము.

నేటి ఛందస్సు ప్రయోగం :- *ఉత్పలమాల పద్య రీతిలో  పరస్పరం సంబంధం కలిగిన రెండు వాక్యాలు.* 

 *ఉత్పలమాల :-  భ , ర, న, భ, భ, ర, వ అను గణాలు ఉంటాయి. యతి స్థానం 10 వ అక్షరం . యతి ప్రాస చెల్లదు.*



మీ
*ప్రదన్య సాహితీ వేదిక బృందం*
[18/05, 10:20 am] +91 77998 86016: *గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు

*ఏకాక్షర గణాలు*


ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, U, U

ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్


*మూడక్షరాల గణాలు*  :- 

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

*సూర్య గణములు* . *ఇవి రెండు.*

న = న = III
హ = గల = UI

*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*

నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*

భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
[18/05, 2:25 pm] +91 94418 71767: *ప్రదన్య సాహితీ వేదిక* 
 *18-05-2023* 

నేటి ఛందస్సు ప్రయోగం :- *ఉత్పలమాల పద్య రీతిలో  పరస్పరం సంబంధం కలిగిన రెండు వాక్యాలు.* 
*ఉత్పలమాల :-  భ , ర, న, భ, భ, ర, వ అను గణాలు ఉంటాయి. యతి స్థానం 10 వ అక్షరం . యతి ప్రాస చెల్లదు.*
----------------------------------------

 1)

శ్రీహరి! నీదు లీల బహు
 U I I    UI    UI    I I
   
 చిత్రముగా నగుపించు చున్నదే
  U I  I    U  I I   U   I    U I U

2)
ఈశ హరీశ నిన్నొదల
U I   I  U I  U I   I  I

నెప్పుడునూ కలనందు
U  I    I   U   I  I  U  I    
 గూడనూ
 U   I  U

----------------------------------------    
తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు
రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్,
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, షార్
సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా
చర వాణి : *9441871767*
[13/06, 10:04 am] +91 77998 86016: అందరికీ అభివందనం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿


 *సరళములు* :- 


హాల్లులలో సులభంగా పలకగలిగేవి .

అవి *గ , జ, డ , ద, బ*  లు.


   ఇక నేడు వాటితో పనేముంది అని అనుకుంటున్నారా చెప్తా చూడండి , *శ్రీ పదాలు*  అనే ప్రక్రియలో మనము ఇంతకు మునుపే ఎన్నో కావ్యాలను రచించాం కదా. ఆ ప్రక్రియను నేడు ఆధారంగా చేసుకొని కేవలం సరళములతో మొదలయ్యే పదాలను ఉపయోగించి నేటి మన కావ్యాలను రచించాలి.
[13/06, 10:06 am] +91 77998 86016: *శ్రీపదాలు*

1,మూడు పాదాలుంటాయి
2.ప్రతీ పాదంలోనూ మూడే పదాలుంటాయి
మొత్తం తొమ్మిది పదాల్లో శ్రీపదం పూర్తవుతుంది..
3x3=9-- లో పూర్తవ్వాలి
3. అక్షరనియమం లేదు
4. ప్రాస నియమం లేదు



సులభంగా సౌకర్యంగా భావప్రకటనకు అనుకూలంగా ఉంటుంది...!
[13/06, 10:09 am] +91 77998 86016: ఉదాహరణ :- 
డబ్బు గబ్బు జబ్బు 
దాసోహమనునుగా జగతి దానికి
జరుగునుగా గమ్మత్తులెన్నో దానికై

Saturday, June 17, 2023

శీర్షిక : గుడి లేని దేవుడు. కవిత

17/06/2023.

మనుమసిద్ధి  కవన వేదిక ,
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా..
వచన కవితల పోటీ కొరకు ,
అంశం :  నాన్న చిటికెన వేలు.
శీర్షిక : గుడి లేని దేవుడు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


అమ్మ మనకు జన్మనిస్తే -
ఆ జన్మకు, జీవితాన్నిచ్ఛేది నాన్న!
అమ్మ ప్రేమ, ఆకాశమైతే -
నాన్న ప్రేమ , అనంతం.!
అమ్మ ఒడి ఒక ప్రపంచం అయితే ,
 ఆ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నాన్న!
అమ్మ  ఒడి ఒక  బడైతే -
ఆ బడి వైపుకు వేసే -
అడుగుల ఆసరా నాన్న!
అమ్మ అన్న పదం నా తొలి పలుకైతే-
ఆ పదానికి అక్షర శ్రీకారం నాన్న.!
తడబడే అడుగులకు మార్గదర్శకం నాన్న.
కష్టంలో నేనున్నానన్న భరోసా నాన్న .!
జీవిత అవసరాల  అంగడి నాన్న. 
అడుగడుగు విజయాలకు ఆసరా నాన్న !
 నేను గెలిస్తే గర్వపడేది నాన్న .
 ఓడిపోతే  వెన్ను తట్టి ఓదార్చేదీ  నాన్నే !
 అమ్మ మనసు వెన్న అయితే 
ఆ వెన్న కాచితే వచ్చే నేతి సుగంధం నాన్న!
అమ్మ మనకు చందమామను చూపిస్తే
మా చందమామ పంచే వెన్నెల వెలుగు నాన్న !
ఆనందమే జీవితమైతే 
ఆ ఆనందానుభూతిని పంచే నిత్య శ్రామికుడు నాన్న !



ఈ కవిత నా స్వీయ రచన

శీర్షిక. : నా ఉనికి చిరునామా! కవిత

17/06/2023.
తపస్వి మనోహరం పత్రిక కొరకు
అంశం : నాన్న.
విభాగం :  కవిత.
శీర్షిక. : నా ఉనికి చిరునామా!

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


నవమాసాలూ మోసేది  అమ్మే అయినా
నన్ను ఎప్పుడు చూస్తానా అన్న 
ఆత్రుతతో నిరీక్షిస్తున్న నాన్న !
అప్పుడే పుట్టిన నా బుగ్గలను-
 ఆప్యాయంగా తడుముతూ-
 ఆనందాశృవులతో,గంభీరంగా నాన్న! 
 నాకు తెలియని ప్రపంచాన్ని
 నాకై పరిచయం చేస్తూ,  నాన్న !
 నా ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుని-
 పగలు రాత్రుల కష్టానికి-
  కావిడి బరువు మోస్తున్న నాన్న!
ఒడిదుడుకుల జీవిత  సాగరంలో,
ఓలలాడుతున్న సంసార  నావను-
 ఒద్దికగా తీరం చేర్చే ,చుక్కాని నాన్న !
 నా దివ్యమైన భవిత  కోసం ,
బాధ్యతల "బరువు " మోస్తున్న నాన్న !
గెలుపులో నా మొదటి ఆనందం నాన్న .
 ఓటమిలో నా కన్నీటి ఓదార్పు నాన్న !
 నా తప్పటడుగుల తలపు జోరుకు, 
 మార్గదర్శక దండన నాన్న !
  అవివేకం నిండిన అజ్ఞానానికి, 
 విజ్ఞాన గీతను  బోధించే 
 విష్ణు స్వరూపం నాన్న !
నా అంతరంగ ఆలోచనలకు
ఆదర్శం నిండిన ఆచరణ నాన్న.!
నా ఉన్నత జీవిత సాఫల్యానికి
అక్షర  శ్రీకార సారం నాన్న !
నా ఉనికి గుర్తింపు జయానికి
చెరగని చిరునామా నాన్న !!


ఈ కవిత నా స్వీయ రచన.

Tuesday, June 13, 2023

అన్నీ నేనే..అంతా నేనే..కవిత

[13/06, 7:54 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక : అన్నీ నేనే ...అంతా నేనే..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


నేను..
నాదమైనా ,  నినాదమైనా 
వేదమైనా , వివాదమైనా
నిజాల దోపిడీకి నీ నీడగా, సాక్షిని
ఆత్మ ఘోషల అక్షర కుక్షిని॥

ఉరుము లేని మెరుపులేదు
భుామి లేని ఆకాశం లేదు.
చినుకు తడిలేని మేఘం లేదు.
భావోద్వేగం లేనిదే కవి కాడు.॥

మట్టి కణాలతో మలచిన దేహం
తాత్కాలికపు ఉనికికి తార్కాణం.
తమస్సు నిండిన మనస్సులో మలినం
వెలిగించు జ్ఞాన సముపార్జనతో దీపం ॥

నేను..
అరుణోదయ శాంతి కిరణాన్ని
ప్రాణ స్పందనల ప్రకృతి వరాన్ని .
అక్షరకోట్ల అనంత భావాకృతికి-. 
వెలుగై వ్యాపించే చింతామణి ద్వీపాన్ని॥

భయాన్ని నేనే , బాధనుా నేనే
గిరి గీసుకున్న గాధనుా,  నేనే...
గుండె గుడిలో వెలిగే జ్యోతిని నేనే
 ఓ న మః లు నింపుకున్న బడిని నేనే॥

విప్లవాల బాటలో  వీర గతిని నేనే
విశ్వ శాంతి బాటలో విజయ కేతనం నేనే ॥
నన్ను నన్నుగా  మలచుకునేవారికి 
శాంతి జీవితాన్ని నేనే...
వ్యక్తిత్వం లేని వారి జీవితాలకు
 వెలుగునివ్వని శాపాన్ని  నేనే.॥
 
 నేను , పాత కొత్తలతో ప్రవహించే 
అనంతాక్షర అమృత వాహినిని..
ఆర్చుకుపోతున్న గుండె మడులలో తడినై 
విప్లవ విత్తులు నాటించే  కలం హలాన్ని ॥

*************************
[13/06, 7:57 pm] +91 93224 00551:
 సూపర్ కవిత మేడం 👌👌👌💐💐💐
[13/06, 8:01 pm] +91 93235 64359: 
భలే 👏👏👏 
ఎంత బలాన్ని పుంజుకుని వ్రాసారో 👍👍🙏
[13/06, 8:06 pm] +91 96193 06414: 
గుండె మడులలో తడినై
విప్లవ కత్తులు నాటించే
కలం హలాన్ని.. సూపర్ 👌👍🙏
[13/06, 8:11 pm] +91 98190 96949: 
మీ కలం హలానికి హ్యాట్స్ ఆఫ్ మేడం 👏
[13/06, 8:22 pm] +91 97698 55645:
 👏👏👏👌👌👌 కలం హలం మీ బలం
🙏🙏🙏

Tuesday, June 6, 2023

ఎందరో మహానుభావులు

*క్షంతవ్యం* ....  అసందర్భం అయినప్పటికీ సమూహ సభ్యులతో పంచుకోవాల్సిన విషయం అనిపించి ఇది పోస్ట్ చేస్తున్నాను🙏🙏🙏   

ప, ఫ, బ, భ, మ లను ఏమంటారు… అవి లేకుండా రామాయణం రాశారని మా నాన్న గారు నా చిన్నప్పుడు చెప్పినట్టు గుర్తు… ఎంత మంది ని అడిగినా సరి అయిన జవాబు లేదు.. (రామ పదానికి బదులు దశరధ నందనుడు లాంటివి వాడారని విన్నాను) నిజమేనా ?

*మరింగంటి సింగరాచార్యులు* అనే గొప్ప కవి “నిరోష్ఠ్య రామాయణం” రచించాడు. ఆయన చాలా సుప్రసిద్ధుడు.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా, దేవరకొండ ప్రాంతానికి చెందిన 16వశతాబ్దపు కవి. ఆయన వైష్ణవ బ్రాహ్మణుడు. ఇతని తండ్రి వేంగళాచార్యులు. తాత తిరుమలాచార్యులు. 

కవిత్వం ఒక శిల్పం.. మేధావులు తమ నైపుణ్యం చూపుతూ ఇలాంటి రచనలు చేస్తారు. 19 వ శతాబ్దం చివరి వరకూ కూడా ఈ రచనలకు ఆదరణ ఉండేది. ఇవి డిగ్రీలో  పాఠ్యాంశాలు గా కూడా ఉండేవి. వీరేశలింగం గారి *శుద్ధాంధ్ర నిర్వచన నిరోష్ఠ్య నైషధము* ఇందుకు ఒక చక్కని ఒక ఉదాహరణ. “ఓష్ఠము” అంటే పెదవి... ప,ఫ,బ,భ,మ లు ఓష్ఠ్యాలు. ఇవీ మరియు వీటి గుణింతాలూ ఎక్కడా రాకుండా కావ్యం అంతా వ్రాయడం…. ..పైగా “రామాయణం” లో ఎంతో విశేషం. ఇలాంటివే 16 గొప్ప గ్రంథాలు చిత్ర బంధ కవిత్వాలతో కూడినవి రచించి పండితాదరణ పొందాడు సింగన్న.
1520–90 ప్రాంతాలలో  జీవించిన  ఈ కవి ఇబ్రహీం కుతుబ్ షాహీ చేత ఘన సన్మానాలు పొందాడు. *నల యాదవ రాఘవ పాండవీయము* అనే చతురర్థి (ప్రతి పద్యంలోనూ నాలుగు అర్థాలు వస్తూ, నాలుగు కథలు సమాంతరంగా ఒకే కావ్యంలో నడవడం) ఆయన ప్రజ్ఞకు కొలమానంగా నిలుస్తుంది.

Sunday, June 4, 2023

ద్వాదశ జ్యోతర్లిఅగాలు.

అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.

పాతాళ  గంగయైన క్రిష్ణానదీ తీరము.

ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.

అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.

మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని  ఆవిర్భావము.

శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥

**************************************
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3

మధ్యప్రదేశ్‌ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.

గర్భగుడిలో  తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము.     దక్షిణాభిముఖ ముఖద్వారం  ప్రత్యేకము.

తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.

మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో  ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.

అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥

*****************:::::*************

అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.

వింద్య పర్వత సానువుల్లో
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .

రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్న జ్యోతిర్లింగాకారుడు.

ఓంకారేశ్వర  ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .

అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో
అన్నపుార్ణ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ .

*****************************:*****

అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5

మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.

రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.

జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .

కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.

శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥

*********************************::::
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*

సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.

మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
 
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో  ప్రసిద్ధికెక్కిన ఆలయం.

నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా
పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .

.దారుకావనంలో  వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥

*********************************::

అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*

ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం

మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.

అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం  తెరచి ఉంచబడే మందిరం.

చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.

చార్‌ధామ్‌ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..

***************************************
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*

బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .

సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.

స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.

లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.

"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥

***************************************
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*

"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.

శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర
పుణ్య క్షేత్రమట.

"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.

హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.

రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥

*************************************
అంశం: *శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం-10*

సహ్యాద్రి కొండ‌ల్లో కృష్ణానది ఉపనదిగా భీమా నదీ ప్రవాహం .

భీమానది ప్రాంతం మైన భావగిరి గ్రామంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .

కుంభకర్ణుని పుత్రుడైన భీమాసురుని భస్మం
చేసిన ఈశ్వరుడి స్వరూపం.

మహారాష్ట్రలోని పుాణేకు సమీపంలో వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం .

శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో నిత్యముా సేవించబడుతుా ఉన్న శ్రీ
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥

*****************************:*::*****

అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం-11*

ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం  .

అక్షత్రయంలో ఒకటైన విశాలాక్షి వెలసిన
అష్టాదశ శక్తి పీఠం, అచటనే నెలకొన్న అన్నపుార్ణాలయం.

వరుణ’, ‘అసి’ నదుల సంగమ గంగలో  
పవిత్ర స్నానం సకల పాప ప్రణాశనం ॥

మొాక్ష  క్షేత్రంమైన కాశీపురిలో, మరణం, అంతిమ
సంస్కారాలు, ముక్తికి సోపానం.॥

విశ్వేశ్వరాన్నపుార్ణలుగా కాశీలో వెలసిన ఆ
శివపార్వతులను దర్శించి తరించుమీశ్వరీ ॥

***********************************

అంశం : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం(.12)

ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ కు సమీపంలో వెలిసిన అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం.

ఎర్రని రాళ్లపై, పురాణేతిహాస శిల్పకళలు చెక్కిన  24 స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండప నిర్మాణం.

పైన ఐదంచెల శిఖర నిర్మాణం , క్రింద నందీశ్వరుని ఏకశిలా విగ్రహ దర్శనం .

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన
అద్భుత శివక్షేత్రం .
,
ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ శ్రీ ఘృష్ణేశ్వరుని దర్శనం చేసుకోనిదే జ్యోతిర్లింగయాత్ర పరిపుార్ణముగాదటీశ్వరీ ॥

****************************************

Tuesday, May 9, 2023

వృత్త పద్యాలు......గణములు...ఉదాహరణలతో



*గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు
*ఏకాక్షర గణాలు*

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.
U, U, U
ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్

*మూడక్షరాల గణాలు*  :- 
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:
*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
*సూర్య గణములు* . *ఇవి రెండు.*
న = న = III
హ = గల = UI
*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
************

[08/05, 5:56 am] 
+91 99634 18686:
కనకలత వృత్తము

6 నగణములు1గ..యతి13

మగువగ జననము వడసియు
మరుని శరమువై
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు
సవము వడసియున్
జగడములెరుగక సతము సు
చరితగను సుధీ!!
****************
 +91 99634 18686:
 విచికిలిత వృత్తము
7..నగణములు1గ..13 యతి

నినుగని మురిసిరిలను జనని జనకులు తనయుడనుచున్
నినుగొని మురిసెవనితయు పెనిమిటి వనుచును మదిలో
మనవలె నిరువురికెపుడును
మనసులు వరలు విధి నీ
కును జయమగును మనెదవిక
కొడుకుగ పతిగ సుధీ!!
*****************::::

+91 99634 18686: 
నర్తకీ వృత్తము...
భ భ భ భ న న న న గ 13 

సర్వ ప్రపంచము పుస్తక మందున సలలితముగ గలదు  కనగ నో
పర్వపు కాంతులు భవ్య వినో దము పరపతిసహితము దొరుకునుగా
నుర్వి నిగర్విగనుంచును వేడ్క గ నురుగతి దనరగ ప్రగతిగనో
శార్వరి బాపెడి శస్త్రమె పొత్తము సవినయముగవిను
మికను సుధీ .
***************
 +91 99634 18686:
 కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర  యతి 13

అక్షయమయిన కార్యములకు
పునాదిగ నిల్వవలెన్ జుమీ
లక్షణముగ విరాజిలెదవిక రమ్యసుగతిని,ధాత్రి లో
సాక్షిగ వరలు మంచితనమను
సద్గుణమునకు మాను దు
ర్లక్షణములను వేగమె విను దురాత్ముల గలువకో సుధీ!!

*************************

 +91 99634 18686: 
హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి

పుస్తకంబన భవ్యమౌ బుధ వర్గంబౌ పుడమిన్ సదా
మస్తకంబున నుండుసుమ్మ 
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిది మానవా!ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!  

*********************
+91 99634 18686: 
ప్రశాంతి వృత్తము
ర జ ర జ ర 9 యతి

వృద్ధులన్న జ్ఞానయుక్త వేదికల్ గనండయా
బుద్ధి తోడవారి మాట ముద్దుగా 
వినండయా!
పెద్దలెప్డు మంచిమాట పేర్మిగా
వచింతురే
యిద్ధరిత్రి లోన వారినెప్డు దిట్టకో సుధీ!!

**********************
*+91 99634 18686: 
వంశపత్ర పతిత వృత్తము
భ ర న భ న వ  11యతి

కార్మికులే,ప్రపంచమునకున్
ఖనిజములుకదా!
కార్మిక వర్గమే సతము ధీగతిని
పనులహో
యోర్మిగ జేయగా వరలెనో నురుగతిని సదా
యర్మిలి దేశదేశములహో యరయగను సుధీ!!

*********************::::
 +91 99634 18686:
 శాలిని వృత్తము
ర జ ర జ ర..యతి 9
పారిశుద్ధ్య కార్మికుల్ దివాకరుం దయించు ముం
దే!రమారమిన్ సుమీ!ప్రతిష్ట గాను,నిత్యమో
ఊరువాడ శుద్ధి జేతురోయి నీటుగానహో
వారికిన్ నమస్కరింతు భక్తి గానికన్ సుధీ!! 

************::**********:
 +91 99634 18686: 
సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!

********************::::
+91 99634 18686: 
భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!

****************************
+91 99634 18686: 
మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!

***********************
+91 99634 18686: 
నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!!
****************************::**:

+91 99634 18686: 
కనకలత వృత్తము
6 నగణములు1గ..యతి13

మగువగ జననము వడసియు
మరుని శరమువై
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు
సవము వడసియున్
జగడములెరుగక సతము సు
చరితగను సుధీ!!]
******************
 +91 99634 18686: 
విచికిలిత వృత్తము.

7..నగణములు1గ..13 యతి
నినుగని మురిసిరిలను జనని జనకులు తనయుడనుచున్
నినుగొని మురిసెవనితయు పెనిమిటి వనుచును మదిలో
మనవలె నిరువురికెపుడును
మనసులు వరలు విధి నీ
కును జయమగును మనెదవిక
కొడుకుగ పతిగ సుధీ!!
********************
+91 99634 18686: 
నర్తకీ వృత్తము...
భ భ భ భ న న న న గ 13 

సర్వ ప్రపంచము పుస్తక మందున సలలితముగ గలదు  కనగ నో
పర్వపు కాంతులు భవ్య వినో దము పరపతిసహితము దొరుకునుగా
నుర్వి నిగర్విగనుంచును వేడ్క గ నురుగతి దనరగ ప్రగతిగనో
శార్వరి బాపెడి శస్త్రమె పొత్తము సవినయముగవిను
మికను సుధీ !!
****************
91 99634 18686: 
కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర  యతి 13

అక్షయమయిన కార్యములకు
పునాదిగ నిల్వవలెన్ జుమీ
లక్షణముగ విరాజిలెదవిక రమ్యసుగతిని,ధాత్రి లో
సాక్షిగ వరలు మంచితనమను
సద్గుణమునకు మాను దు
ర్లక్షణములను వేగమె విను దురాత్ముల గలువకో సుధీ!!

***************:*::::
 +91 99634 18686:
 హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి

పుస్తకంబన భవ్యమౌ బుధ వర్గంబౌ పుడమిన్ సదా
మస్తకంబున నుండుసుమ్మ 
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిది మానవా!ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!  

*********************

మాతృ దేవోభవ ..(కవిత ).

08/05/2023
కలం స్నేహంలో 
మాతృ దినోత్సవ కవితల పోటీ కొరకు ,

అంశం :  మాతృదేవోభవ .
శీర్షిక :  అమ్మకు, అమ్మే సాటి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కనిపించే దైవం దేముడైతే
కని పెంచే దేవం అమ్మ ॥
సృష్టించే వాడు దేముడైతే ..
ఆ సృష్టి కి ముాలం అమ్మ ॥

తొమ్మది నెలల భారం తనలో మొాస్తుా 
 ప్రసవ వేదనలో కుాడాప్రతి క్షణం ఎదురుచుాస్తుా
 తన రక్తమాంసాల ఆకృతిని  ఆత్రంగా ముద్దాడే
 అది చైతన్య ముార్తి , ఆర్తి నిండిన అమ్మ ॥

ఆఁ వుాఁ ల వుాసులకు అర్ధం అమ్మ పలుకే
ఆడుగులేయడం నేర్చేది, అమ్మ ఆసరాతోనే 
ప్రపంచ వార్తా విశేషాలెన్నో,అమ్మ ఒడి బడిలోనే
ప్రపంచాన్ని గెలిచే ధైర్యం  అమ్మ చెప్పే కధల్లోనే..॥

ఆకలేస్తే  అడిగేంతలోనే సాక్షాత్కరిస్తుంది అమ్మ
నిద్దరొస్తే , జోల పాడి లాలిస్తుంది....అమ్మే
తన కంట్లో నలుసు పడితే అమ్మ కంట కన్నీరు
తన కాలులో ముల్లు దిగితే అమ్మ గుండెలో గునపాలు.॥

తన అనంద రుాపం  ,  అమ్మకు స్వర్గలోకం .
తన ఆరోగ్యం , అమ్మకు నిత్య వసంతం .
తన భోగ భాగ్యాల సుఖం, అమ్మకు ఆనందం.
తన చిరునవ్వే అమ్మ కంటికి వెలుగు కిరణం. ॥

అమ్మ జీవితాంత కష్టానికి ఎదిగిన నా అస్థిత్వం
అమ్మ ఋణాన్ని తీర్చుకోలేని స్వార్ధపుారిత వ్యక్తిత్వం ॥
  ఐనా ఓడిపోని  అమ్మ ,  ప్రతి సృష్టికి మరో బ్రహ్మ .
నిజానికి ఊపిరాడని ఊడిగానికి నిలువెత్తు కీలుబొమ్మ.॥
         " అమ్మ ".


హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.


.


భగవంతుడు మనకు జన్మ నిస్తే
ఆ జన్మకు పరిపుార్ణతనిచ్చేది అమ్మ.॥
మన ఆకలి దీర్చేందుకు అనందంగా 
తన  స్థనాలనుండి అమృతధారలు కురిపిస్తుంది ॥
తన జీవితంలో చిరు కష్టం  అమ్మకు  
ఎవరెష్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నంత  కష్టం ॥
ప్రతీ జీవి జన్మకు కారకురాలైన అమ్మ తనం
ఆది రుాపమైన అంబను మించిన శక్తి స్వరుాపం॥



  

వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు (.కధ)




09/05/2023.
తపస్వీ మనోహరం , మనోహరి  మహిళా పత్రక కోసం 
అంశం : వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు .
శీర్షిక  : మరపురాని మమతలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


ట్రైన్  లో కుార్చొని కిటికీ లోంచి బయటకు చుాస్తున్న నాకు ,
నా కళ్ళముందు, వెనుకకు వెళిపోతున్న ప్రకృతి నిండిన ప్రపంచం ,   ఆకాశంలో నాతో పాటుగా నడుస్తుాన్న  చందమామ కురిపిస్తున్న చల్లని వెన్నెల గిలి పెడుతుా
ఉంటే , మిణుకు మిణుకు మంటున్న తారల మధ్య బోసి నవ్వులతో నా కోసం నిరీక్షిస్తున్న మా అమమ్మ  ముఖం 
నా కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపిస్తుా ఉంటే 
అసహనంగా కదులుతుా కళ్ళు ముాసుకున్నాను .

అమమ్మ .....
ఎప్పటికీ మరువలేని హాయి ఆమె ఒడిలో
ఎన్ని రకాలు వండినా తరగని ఋచి ఆమె వంటల్లో..
ఇప్పటికీ చెప్పలేని అనురాగానుభవం  , ఆమె తరగని  అప్యాయతలో ..మ
ఇప్పటికీ మరువ లేని జ్ఞాపకాలు ఆమె సన్నిధిలో గడపిన క్షణాలు ,ఆ రోజుల్లో.
ఆలోచిస్తున్న నాకనులముందు నా చిన్నప్పటి సంఘటనలు.
ఒక మరపురాని చిత్రంలా...ఒక  అలుపులేని ప్రయాణంలా.....
----------------
అమ్మా ! రిక్షా వచ్చేసింది తొందరగా  రా అమ్మా .
లేటుగా వెళ్తే రైలు తప్ఫిపోతుంది పదమ్మా..
అమమ్మ మన కోసం  ఎదురు చుాస్తుా ఉంటుంది..
అంటుా హడావిడి పెట్తేస్తున్నాది తను .
"అబ్బబ్బ  వస్తున్నానుండమ్మా...తాళాలన్నీ సమంగా వేసేనో లేదో ,చుాసుకోవాలికదా ..నువ్వు తమ్ముడిని తిుసుకొని ముందు రిక్షా ఎక్కు .." అంటుా విసుక్కుంది అమ్మ .
తనైతే  తమ్ముడితో పాటు ఎప్పుడో రిక్షా ఎక్కేసింది.
ప్రతీ వేసంగి సెలవులకీ అమమ్మ దగ్గరకు వెళ్ళడమంటే 
చాలా ఇష్టం తనకు. 
ఆ వుారికి ,తమ ఊరికి ముాడు గంటల ప్రయాణం మాత్రమే.
తాము ఒరిస్సా "కుర్దా రోడ్డు" లో ఉండేవారు.
అమమ్మ  ఆంధ్రా "సోంపేట"లో ఉండేది .
ఆవుారుకి వెళ్ళడమంటే  తనకు చాలా ఇష్టం .
బండి "కంచిలి" స్టేషన్లో అగేది. దిగిన తర్వాత  బయటకు
రాగానే "సోంపేట "ఊరికి బస్సులు ,గుర్రపు బగ్గీలుండేవి.
తను గుర్రపు బండిలోనే ఎక్కుదామని పట్టు పట్టేది.
ఆ గుర్రాల బండీలో కుార్చొని  మట్టి రోడ్డుకి
 రెండు వైపులా ఉన్న పెద్ద-పెద్ద చెట్ల మధ్య నుండి ఊళ్ళోకి వెళుతుా ఉంటే అదొక అద్భుతమైన ప్రయాణంలా అనిపించేది.
అక్కడ  తమ దొడ్డమ్మ  స్కుాల్ లో సంగీతం టీచర్ గా పనిచేస్తుా ,పిల్లలకు సాయంత్రం పుాట వీణ నేర్పిస్తుా ఉండేది .
 మా అమ్మ , పెద్దమ్మ ,పిన్నమ్మలు ముగ్గురుా సంగీతంలో డిప్లమొా చేసిన వారే కావడం తో మా పెద్దమ్మ ఇల్లు నిత్యం సంగీత  కీర్తనలతో ,పిల్లలతో నిండి ఉండేది.  అక్కడే అమమ్మ కుాడా ఉండేది. మా దొడ్డమ్మంటే  నాకు,  అమ్మ కన్నా ఎక్కువ ఇష్టంగా ఉండేది. మా దొడ్డమ్మకి కుాడా 
 నేనంటే చాలా ఇష్టం . కారణం, నా గాత్రం చాలా బాగుంటుంది .నేను వెళ్ళినపుడల్లా  మా దొడ్డమ్మ కొన్ని కీర్తనలు నేర్పి, నాచే అక్కడి కోవెలలో  కచేరీ చేయించేది.
 ఆ కాలంలో సంగీత -సాహిత్యాలకి చాలా విలువ ఉండేది .
 అందికే చిన్న కార్యక్రమమైనా చాలా మంది వినడానికి వచ్చేవారు.ప్రోగ్రామ్ పుార్తయ్యాకా నన్నందరుా మెచ్చుకుంటుా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండేది.
 మా దొడ్డ కుాడా " మా చెల్లి కుాతురండీ" ,అని చెపుతుా చాలా మురిసిపోయేది.
దొడ్డమ్మకి నలుగురు  పిల్లలు. ఇద్దరు కొడుకులు .ఇద్దరు కుాతుర్లు.
వాళ్ళకి గాత్రం రాలేదు గానీ అందరుా "వీణ "చాలా బాగా వాయిస్తారు.వాళ్ళుా ,తాముా కలుస్తే చాలు హడావిడి 
ఇంతా అంతా కాదు . 
అమమ్మైతే మమ్మల్ని చుాడగానే సంతోషంగా నవ్వుతుా ఎదురొచ్చి హత్తుకునేది.
ఆ పరిష్వంగంలో ఎంత ప్రేమొా...
ఇంటి లోపలికి వెళ్ళగానే  అమమ్మ  తమ కోసం అల్లిన
అందమైన ఊలు బొమ్మలను చుాపించేది.
అందమైన గుడ్డ బొమ్మలను కుట్టి చిన్న చిన్న కధలతో 
తోలుబొమ్మలాటలాడించేది.
బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేది.
ఇంటి  పెరటి తోటలోనే  వనభోజనాలంటుా అందర్నీ పిలిచి 
బోలెడు వంటలు చేసి వడ్డించేది.

రోజుా మంచి మీగడ పెరుగుతో అన్నం తినిపించేది.
"అడ్డగాడిదల్లా పెరిగేరు. వాళ్ళ చేతులతో వాళ్ళు తింటారులే అమ్మా "అంటుా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేదికాదు.
అప్యాయంగా తినిపిస్తున్న ఆచేతుల్లో ఏమి మహిమ ఉండేదో గానీ , ఈ కుారొద్దు , ఆ పప్పొద్దు , అని అనకుండా హాయిగా పెట్టిన అంతన్నమంతా  తినేసే వాళ్ళం.
రాత్రైతే చాలు , అరుబయటే పక్కలు.
పెద్ద నడిమింటి వాకలిలో అందరుా బొంతలు పరుచుకొని 
అల్లరల్లరిగా కబుర్లు చెప్పుకుంటుా  పడుక్కునేవాళ్ళం.
అమమ్మ మాత్రం  మా పిల్లల మధ్యలోనే పడుక్కునేది.
అమమ్మ పక్కన నేనంటే ,నేనంటుా ,దెబ్బలాడుకుంటుా ఉంటే, అమమ్మ" మీరంతా అల్లరి పెట్టకుండా ఉంటే , 
నేనో మంచి కధ చెపుతాను " అనేది అంతే ...
అందరం ఠక్కున నోరు ముాసేసే వాళ్ళం.
అమమ్మ  చెప్పిన కధల్లో ఎన్నో నీతి కధలు,  చందమామ కధలు , పొడుపు కధలు , భక్తి పద్యాలు '  రామాయణం భారౕతంలో  కధలు ఇలా చెప్పుకుంటుా పోతే ఎన్నో...
వాటిల్లో తనకు గుర్తున్న చాలా కధలు ఎన్నో ,తనిప్పుడు తన పిల్లలకు  చెపుతోంది.
అమమ్మకు   ముగ్గురుా ఆడపిల్లలే  కావడం వల్ల 
దొడ్డ ఉద్యోగం చేస్తుాండడంతో , నలుగురి పిల్లలతో 
ఇబ్బంది పడుతుందని అమమ్మ అక్కడే ఉంటుా ఉండేది.
మా పెదనాన్నగారు వేరే ఊర్లో పనిచేస్తుా అప్పుడప్పుడు 
వస్తుా ఉండేవారు.కారణం  ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ లు అయ్యేవికావు. 
ఇద్దరుా ఉద్యోగాలు చేయనిదే ఇల్లు నడిచేది కాదు.

ఆ యింటి ముందు మర్రి చెట్టికటి ఉండేది. అందువల్ల 
అమమ్మనందరుా "మర్రిచెట్టు మామ్మగారు" అని పిలిచేవారు.
అమమ్మ  ప్రతీ రోజుా పొద్దున్నే గుడికి వెళ్ళి , ఒక అరగంట సేపు  ప్రభాత సేవగా కీర్తనలు పాడి వచ్చేది.
సాయంత్రాలు ఇంటి ఆవరణలో  భగవత్ప్రసంగాలు చెపుతుా 
అందరి చేతా భజనలు చేయించేది.
అమమ్మన్నా , దొడ్డమ్మన్నా ఆవుార్లో అందరికీ ఎంత గౌరవమొా !
నా వివాహం జరిగేంత వరకు నేను ప్రతీ సెలవులకు 
సొింపేట వెళ్ళడం నియమంగా మారితే," అమ్మలు" వస్తుందని అమమ్మ  దొడ్డమ్మ తో పాటు పెద్దక్క వస్తుందని  ,
మా చెల్లెళ్ళు , తమ్ముళ్ళు   ఎదురు చుాడడం , నన్ను  ఎంతో 
ఆప్యాయతతో పలకరించి పులకరింపజేయడం 
అలవాటుగా మారిపోయింది.
నాకు పెళ్ళయేంత వరకు ఊరంటే సోంపేటే.
ఇల్లంటే   దొడ్డ ఇల్లే .  ప్రేమంటే అమమ్మదే.
ప్రపంచం అంటే మా కుటుంబమే...తప్ప మరొకటి
తెలీదు.
 నా వివాహం తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .
 అందరుా ఒకొక్క ఊరిలో స్థిరబడ్డారు.
 ఎవరి సంసారాలు వాళ్ళవయ్యాయి .
 అమమ్మ  వంటరిదయ్యింది.
 అందరికీ వంటలు చేసి పెట్టి , పురుళ్ళు పోసి , ముని మనుమల ఆలనా ,పాలనా కుాడా చుాసిన అమమ్మ 
 చివరికి వంటరిగా...ఆ ఇంట్లో.....
 
 *************
 కంటి నిండుగా ధారాపాతంగా  కారుతున్న కన్నీళ్ళను ఆపుకునేంతలోనే కంచిలి వచ్చేసింది.
 ఊరు మారింది . మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారింది
 ఇప్పుడు బగ్గీలు లేవు . ఏ.సి బస్సు లో సోంపేట చేరాను.
ఇన్నేళ్ళకు  అమమ్మ దగ్గరికి  వెళుతున్న ఆనందం 
ఒక పక్క , అమమ్మ  ఎలా ఉందో అన్న ఆత్రం ఒక పక్క
ఉక్కిరి బిక్కిరి చేస్తుాంటే  , గబ గబా ఇల్లు చేరేను.
తలుపు కొడుతుా ఉంటే చేతులు వణికేయి.
కొంచం ఆలస్యంగా తెరుచుకున్న తలుపుల వెనకాల 
అమమ్మ వడలిన ముఖంతో , బోసి నోటితో నిండిన నవ్వుతో
అదే ఆప్యాయత నిండిన ప్రేమతో " అమ్మలుా " అంటుా
 నన్ను దగ్గరకు తీసుకుంది. అదే  ఆప్యాయత అమమ్మలో.
 ఈ సారి అమమ్మకు నేనే  బోలెడు గిఫ్ట్ లు తెచ్చాను .
 అవన్నీ చుాస్తుా అమమ్మ  ఎంతో మురిసిపోయింది .చివరిగా మంచి మొబైల్ చేతిలో పెట్టి , దానిని ఎలా వాడాలో ఆ రాత్రంతా చెప్పా...అంతే ఠక్కున  ఒకొక్కటిగా అన్నీ నేర్చేసుకుంది అమమ్మ .  ఫోనులో మొబైల్ డాటా వేయించి , ఇంటికి నెట్ పెట్టించేసేను ..వారం రోజులు ఇట్టే గడచి పొియాయి. అమమ్మ మొబైల్ లో కీర్తనలు, ప్రవచనాలు, పాత సినిమాలు, చుాస్తుా మురిసిపోతోంది .
  తను తిరుగు ప్రయాణమయ్యింది.
 మళ్ళీ తప్పక వస్తానని మాట ఇచ్చింది అమమ్మకు .
 సోంపేట ష్టేషన్ లో అడుగు పెట్టిందో లేదో..
 ఫొిన్ మొాగింది. వీడియొా కాల్ .వస్తోంది.
 ఎవరిదబ్బా అనుకుంటుా ఆన్ చేసింది
 ఎదురుగా...అమమ్మ...   బోసి నవ్వుతో......
 --------------------------------
 హామీ : 
 ఈ కధ నా స్వీయ రచన .


 


09/05/2023  .
 సిసింద్రీ

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర

ఓ యువత.
 భావి భారత పునరుద్ధరణకు ప్రతీకలు.
మేద నిండిన విజ్ఞానానికి విధాతలు



హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.

Sunday, May 7, 2023

రైటర్ల అసలు పేర్లు

*వీళ్ళ పూర్తి పేర్లు మీకు తెలుసా? ఎన్టీఆర్ అనగానే నందమూరి తారక రామారావు అని టక్కున చెప్పేస్తాం. ఎఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పేయచ్చు. కానీ, ఇలా కొందరు ప్రముఖుల పేర్లు పూర్తిగా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు నిక్ నేమ్ ఫ్యామస్ అయిపోయి, అసలు పేరు తెలియని పరిస్థితి. బాపు బొమ్మ అందరికీ తెలుసు. కానీ బాపూ అసలు పేరు ఎందరికి తెలుసు? ఇక్కడ ఓ 56మంది తెలుగు ప్రముఖుల అసలు పేర్లు తెలుసుకుందాము.*

*1. బాపు: సత్తిరాజు లక్ష్మీనారాయణ*
*2. ఆచార్య ఆత్రేయ: కిళాంబి వేంకట నరసింహాచార్యులు* 
*3. ఆరుద్ర: భాగవతుల సదాశివశంకరశాస్త్రి*
*4. శ్రీశ్రీ: శ్రీరంగం శ్రీనివాసరావు* 
*5. జాలాది: జాలాది రాజారావు*
*6. సాహితి: చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి*
*7. వనమాలి: మణిగోపాల్* 
*8. వెన్నెలకంటి: వెన్నెలకంటి రాజేశ్వరవరప్రసాద్*
*9. పినిసెట్టి: పినిసెట్టి శ్రీరామమూర్తి*
*10. సిరివెన్నెల: చేంబోలు సీతారామ శాస్త్రి* 
*11. జొన్నవిత్తుల: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు*
*12. దాశరథి: దాశరథి కృష్ణమాచార్యులు* 
*13. అంజలి: అంజమ్మ* 
*14. రేలంగి: రేలంగి వేంకటరామయ్య*
*15. ఘంటసాల: ఘంటసాల వేంకటేశ్వరరావు*
*16. రాజనాల: రాజనాల కాళేశ్వరరావు నాయుడు* 
*17. K.R.విజయ: దైవనాయకి* 
*18. దేవిక: ప్రమీల*
*19. భానుప్రియ: మంగభాను*
*20. జయప్రద: లలితారాణి* 
*21. రాజబాబు: పుణ్యమూర్తుల అప్పలరాజు* 
*22. జంధ్యాల: జంధ్యాల వీరవేంకటశివసుబ్రహ్మణ్య శాస్త్రి*
*23. ఏ.వి.ఎస్:ఆమంచి వేంకట సుబ్రహ్మణ్యం*
*24. పెండ్యాల: పెండ్యాల నాగేశ్వరరావు*
*25. ముక్కామల: ముక్కామల కృష్ణమూర్తి* 
*26. చిరంజీవి: కొణిదెల శివశంకర వరప్రసాద్*
*27. కృష్ణభగవాన్: పాపారావుచౌదరి* 
*28. చక్రవర్తి(సంగీత దర్శకుడు): కొమ్మినేని అప్పారావు*
*29. రామదాసు: కంచర్ల గోపన్న* 
*30. బీనాదేవి: బి.నాగేశ్వరీదేవి* 
*31. మో: వేగుంట మోహనప్రసాద్* 
*32. చే.రా: చేకూరి రామారావు*
*33. శారద: తాటిపర్తి సరస్వతి*
*34. బుచ్చిబాబు: శివరాజు వేంకటసుబ్బారావు*
*35. ఎన్.ఆర్.నంది: నంది నూకరాజు*
*36. సినారె: సింగిరెడ్డి నారాయణరెడ్డి*
*37. నగ్నముని: హృషీకేశవరావు*
*38. తిరుపతి వేంకటకవులు: దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి* 
*39. కొవ్వలి: కొవ్వలి లక్ష్మీ నరసింహారావు* 
*40. కా.రా: కాళీపట్నం రామారావు* 
*41. వోల్గా: పోపూరి లలితాకుమారి* 
*42. ఉషశ్రీ: పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు* 
*43. కరుణశ్రీ: జంధ్యాల పాపయ్య శాస్త్రి* 
*44. గద్దర్: గుమ్మడి విఠల్ రావు* 
*45. గోరా: గోపరాజు రామచంద్రరావు*
*46. చా.సో: చాగంటి సోమయాజులు* 
*47. జరుక్ శాస్త్రి: జలసూత్రం  రుక్మిణీనాథశాస్త్రి* 
*48. విద్వాన్ విశ్వం: మీసరగండ్ల విశ్వరూపశాస్త్రి* 
*49. రావిశాస్త్రి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి*
*50. మిక్కిలినేని: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి*
*51: అనిసెట్టి: అనిసెట్టి  సుబ్బారావు* 
*52. శోభన్ బాబు: ఉప్పు శోభానా చలపతి రావు* 
*53. జయసుధ: సుజాత* 
*54: వాణిశ్రీ: రత్నకుమారి*
*55: జిక్కి : పి.జి.కృష్ణవేణి* 
*56: ఏ.యం.రాజా: అయిమల మన్మథరాజు రాజా*
*57. చక్రపాణి ( విజయా ప్రొడక్షన్స్ ): ఆలూరి వెంకట సుబ్బారావు*
*58. జ్వాలాముఖి : వీరవల్లి రాఘవాచార్యులు*

Saturday, May 6, 2023

తపస్వీ మనోహరం వెబ్ లింక్

https://thapasvimanoharam.com/rakshabandhan-kavitasnkalanam-2023/
రక్షాబంధనం లింక్
***********************"""""""""""""
*రాఖీ పూర్ణిమ సందర్భంగా.. తపస్వి మనోహరం కవులు, కవయిత్రులు వ్రాసిన అనుబంధాల కవితా కదంబ మాలిక.. రక్షా బంధన్ కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*


https://thapasvimanoharam.com/manohari-august-2023/

*ఆగస్ట్ -2023 తపస్వి మనోహరం.. "మనోహరి అంతర్జాల తెలుగు మహిళా మాసపత్రిక" వెబ్సైట్ లింక్..✍️*

**********************
https://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెhttps://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️* లింక్..✍️*

నా కధకు సనీక్ష .


మనోహరి మహిళా పత్రక లింక్ .

https://thapasvimanoharam.com/weekly07-05-2023/

*07-05-2023 తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రిక వెబ్సైట్ లింక్..✍️*
నేను రాసిన కధ "సహజీవనం మంచిదే కదా.."
pg 35 లోమ.

ఎంపికైన రచనలు.

*1-05-2023 నుండి 2-05-2023 వరకు తపస్వి మనోహరి e - book కొరకు ప్రేమ (వివిధ కవిత ప్రక్రియలు )అనే అంశం పై వచ్చిన రచనలలో e - book కొరకు ఎంపికైన రచనల లిస్ట్*

1. నా ఊహ నువ్వు - అరుణ డేనియల్
2. విధి కలిపిన ప్రేమ - సుజాత కోకిల
3. ప్రక్రియ :గజల్ ( త్రిశ్ర గతి) - శిరీష వూటూరి 
4. ప్రేమ ఓ మధురానుభూతి - కె.రాధికనరేన్
5. మునుపెరగని భావాలు - చంద్రకళ. దీకొండ
6. గజల్ లాహిరి  - వింజరపు.శిరీష
7. వలపు వీణ - కళావతి కందగట్ల
8. నీ ప్రేమే - లావణ్య గణేశ్
9. నేనో ప్రేమ పిపాసిని - శ్రీమతి :పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి
10. తరుల ప్రేమ - జూపూడి సుధారాణి
11. నీకు తెలుసా - కృష్ణ మోహిని ధార్వాడ
12. ప్రేమ యుద్ధం - జయశ్రీ బారు
13. మోహనరాగం - కొంటికర్ల లలిత
14. కలయా!నిజమా ? - ప్రియంవద పుతుంబాక.
15. నా ఊపిరి - కే శ్రీలత

Sunday, March 26, 2023

తపస్వి మనోహరం వెబ్సైట్*

https://thapasvimanoharam.com/snehamadhuryam-06-08-2023/
*****************

https://thapasvimanoharam.com/snehamadhuryam-06-08-2023/
ఆండాళ్ళమ్మ చివరి భాగం లింక్
********************************

తపస్వి మనోహరం*
*తపస్వి మనోహరం సంస్థ వివిధ వాట్సప్ గ్రూప్స్ లింక్స్*

*తపస్వి మనోహరం*
https://chat.whatsapp.com/EExThqeLycEGn7SqF8hlyW
(తపస్వి మనోహరం మెయిన్ గ్రూప్ ఇది. తపస్వి మనోహరం వార, మాస పత్రికలలో రచనల కొరకు టీమ్ వారు టాస్క్ ఇస్తుంటారు.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి సిసింద్రీ* (లఘు ప్రక్రియ) గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/LTLVEzMFCz5HXhWqUtKt6L
(తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తిక్ గారు రూపొందిన సిసింద్రీ ప్రక్రియకు సంబంధించిన గ్రూప్ ఇది. తపస్వి మనోహరం వార, మాస పత్రికలలో ఇవి ప్రచురితం చేస్తాము.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి ఆప్ ఆడియో కథలు* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/EkdqE0SqLJcKdqkF70sqFU
(తపస్వి మనోహరం కొత్తగా రూపొందించే *తపస్వి ఆప్* కొరకు ఆడియో కథలు సేకరించడం జరుగుతుంది.)
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*మనోహరి మహిళా పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/DgKxV8NwimT887E6I6eTfZ
(తపస్వి మనోహరం మహిళా మాస పత్రిక *మనోహరి* కోసం రచనలు సేకరించే గ్రూప్ ఇది. పత్రికలో రచనల కొరకు టీమ్ వారు టాస్క్ ఇస్తుంటారు. *ఈ గ్రూప్ లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంది.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

*తపస్వి కళింగ మాస పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/EdyupFN8sU49yDJQ0f14FO

(తపస్వి మనోహరం *కళింగ మాస పత్రిక* గ్రూప్ ఇది. ఈ పత్రికలో రచనల కొరకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. *ఇందులో ఉత్తరాంధ్ర ప్రాంతం వారు మాత్రమే జాయిన్ అవ్వాలి.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
*తపస్వి గోదారి ఊసులు మాస పత్రిక* గ్రూప్ లింక్
https://chat.whatsapp.com/I6CbzpbcrMF8kf2qkoCSkF
(తపస్వి మనోహరం *గోదారి ఊసులు మాస పత్రిక* గ్రూప్ ఇది. ఈ పత్రికలో రచనల కొరకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. *ఇందులో ఉభయ గోదావరి జిల్లాల వారు మాత్రమే జాయిన్ అవ్వాలి.* )
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
మీ సందేహాలు సూచనలు ఆయా గ్రూప్స్ లో అడగవచ్చు లేదా క్రింది నంబర్స్ లో సంప్రదించవచ్చు.
*ఫోన్, వాట్సప్ నంబర్స్* 
+91 9059690733,
+91 7893467516.
*మెయిల్ ఐడి*
manoharam.editor@gmail.com
*తపస్వి మనోహరం వెబ్సైట్*
https://thapasvimanoharam.com/
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••