[8/6, 17:58] iswarimurthy: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
---------------------
1 ఇష్టపది.
శీర్షిక.
నీవే శరణం.
---------------
ఆది,అంతము లేని ఆది దేవుడ వీవు
అవతారములనెత్తి అవని కాపాడేవు.||
పరమ పురుషా నీవు పద్మనాభుడవయ్య
పాలించి మమ్మేల. పరుగు నదె రావయ్య.||
నిన్నె నమ్మీ యుంటి నీవె దైవమనంటి
నీదు నామస్మరణె నిత్య సత్యమనంటి ||
నీరాజనాలివే నిత్య నిర్మల ముార్తి.
జగదీశ్వరిని బ్రోవ. జగదీశ్వరా రార ||
--------------------------------------------------------
2..ఇష్టపది.
-------------------
శీర్షిక-
సైనికుడు.
-------------
దేశమును రక్షీంప. దేహ సుఖముల వీడి,
ప్రాణములనర్పించు పరమ త్యాగులు వీరు.||
శాంతి , భద్రత నిలుప సరిహద్దులో నిలచి,
ఎండవానలుయనకన ఎదురొడ్డి పోరెదరు.||
భార్య, పిల్లల విడచి బహుదుారమేగెదరు.
తల్లి భారతి ఋణము తీర్చుకొన యొాధులై
వీర మరణము నొందు వీర సేవలు వేలు
ఈశ్వరిదె అర్పించె ఇలలోన అంజలులు ..|||
-------------------------------------------------------
------------------------------------------------------
[8/6, 18:03] iswarimurthy: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
---------------------
1 ఇష్టపది.
శీర్షిక.
నీవే శరణం.
---------------
ఆది,అంతము లేని ఆది దేవుడ వీవు
అవతారములనెత్తి అవని కాపాడేవు.||
పరమ పురుషా నీవు పద్మనాభుడవయ్య
పాలించి మమ్మేల. పరుగు నదె రావయ్య.||
నిన్నె నమ్మీ యుంటి నీవె దైవమనంటి
నీదు నామస్మరణె నిత్య సత్యమనంటి ||
నీరాజనాలివే నిత్య నిర్మల ముార్తి.
జగదీశ్వరిని బ్రోవ. జగదీశ్వరా రార ||
--------------------------------------------------------
2..ఇష్టపది.
-------------------
శీర్షిక-
సైనికుడు.
-------------
దేశమును రక్షీంప. దేహ సుఖముల వీడి,
ప్రాణములనర్పించు పరమ త్యాగులు వీరు.||
శాంతి , భద్రత నిలుప సరిహద్దులో నిలచి,
ఎండవానలుయనకన ఎదురొడ్డి పోరెదరు.||
భార్య, పిల్లల విడచి బహుదుారమేగెదరు.
తల్లి భారతి ఋణము తీర్చుకొన యొాధులై
వీర మరణము నొందు వీర సేనలు వేలు
ఈశ్వరిదె అర్పించె ఇలలోన అంజలులు ..|||
-------------------------------------------------------
[10/2, 23:06] iswarimurthy: "ఇష్టపదుల" ప్రక్రియలో " శ్రీమద్భగవద్గీత" ను రాయ సంకల్పించిన , శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి యైన నేను,
నా తల్లిదండ్రులు , గురువులు , శ్రేయొాభిలాషులు,నా రచనకు సహకారమందించిన ఇంటి వారలకు, పెద్దలందరకుా మనఃపుార్వక ధన్యవాదాములతో పాదాభివందనాలు సమర్పిస్తుా, నేను రచియించిన "ఇష్టపది గీతా కావ్య" మునకు ముందుగా జేసిన తొలి వందనములు.
శ్రీమద్భగవద్గీతా కావ్యము.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------
॥ తొలి వందనం ॥
జన్మ నిచ్చిన తల్లి జగమునామె వేల్పుగ
అమృతమయి ఆమ్మకును ఆమె చుాపు ప్రేమకు॥
పావని పాదములకు పాదాభి వందనం
తల్లీ గొను వందనం తరచి తరచి వందనం ॥
పెంచి పోషించుటకు పంచి జన్మ నంతయు
ఎలమి నున్నతి కోరి , నెరపు కర్మ, ధ్యేయకు
జగతి మసలు బాటను జయము దీవెన లొసగు
తండ్రి పాదములకుా తరచి తరచి వందనం ॥
మార్గదర్శి తానై మము మలచు విశ్వ కర్మకు
విద్య దాత గురువుకు వినయముతో వందనం ॥
--------------------------------------------------------------
ఇష్టపది సృష్టి కర్త ఇల సదయ్య భ్రాతగ
మేటి బిరుదు లందిన మేలు గురుకు వందనం ॥
ధర్మ సార బోధకు కర్మ గీత సారకు
చదువరులకు, హితులకు, సాదర ఘన వందనం॥
సంకల్ప సిద్ధిడిన సద్భాగ్య దాతకుా
సహకారమందించు సజ్జనులకు వందనం ॥
జయ గీత రచనతో జన్మ ధన్య మాయెను
ఈశ్వరిడె భక్తి తో ఇష్ట దైవ వందనం॥
-------------------------------------------------------
[10/3, 08:06] iswarimurthy: ఇష్టపదులు.
"శ్రీమద్భగవద్గీత"
--------------------------.
సర్వ దేవతా ప్రార్ధన.
1.గణపతి వందనం.
------------------------
అంబ ఈశుని పుత్ర ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు నార్తిబాపగదయ్య ॥
ఆది -అంత్యము లేని ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి ఆపదలు బాపయా ॥
ముజ్జగమ్ముల ఒజ్జ ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి విఘ్నేశ్వరుడవయ్య॥
ఇష్టపదులను రాయు నిచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి ఈశ్వరిని బ్రోవరా ॥
2.గురు వందనం.
.---------------------
శ్రితజనుల బ్రోవగా షిరిడి పురమునందున
శ్రీశ నీ వాసమే శ్రీ నిలయమై ఒప్ప-॥
సర్వ మత సమ్మతిని సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని నీదరినె జుాపేవు..॥
.
ఖండయొాగివి నీవు ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు కమలనయన సునేత్ర॥
కలత లన్నియు బాపి కావుమయ్యా మమ్ము
శ్రీ షిరిడి శ్రీ వాస శ్రీ పదాంబుజయుగళ ॥
వందనము శ్రీసాయి వందనము గురుదేవ
వందనము చేకొనగ వేగ రావగదయ్య ॥
వేడుచుంటిని నిన్ను వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ వరలు సాయిాశ్వరా ॥
నింబ వృక్షము నీడ నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద సామరస్యపు భావ-॥
మలరు సాయిాశ్వరా మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప ఈశ్వరిని బ్రోవరా..॥
[10/3, 23:42] iswarimurthy: .సరస్వతీవందనం.
------------------------
విద్యలకు కొలువైన విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు విశ్వ జన శ్రీ వల్లి ॥
విద్య- బుద్ధుల నెల్ల విశ్వ వేదిక కొసగు
తల్లి శారద నీవె తరుణి బ్రాహ్మ్మీ శివే ॥
నా పుాజలను కొమ్మ నగుమొాము పుాబోణి
వివరములు నాకొసగు విజయ పథ సామ్రాజ్ఞి.
నాదు జిహ్వను నిలచి నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య నీరాజనములమ్మ ॥..
4.అంబికా వందనం.
------------------------
గణ నాధ షణ్ముఖా ఘన పుతృలకు తల్లి
గణనలే లేనట్టి గుణ కల్పవల్లివిగ॥
గౌరవర్ణముతోడ గౌరివై భాసిల్లు
ఘన సింహ వాహినీ గావు ఈశ్వరి నిలను ॥
దుష్టులను , దైత్యులను దునుమాడి గాచేవు
దశరుాపములతోడ ధరణిలో వెలసేవు॥
దివ్య శక్తుల నేలు దీనార్తులను బ్రోవు
ఈశ్వరీ నుత పాద ఈశు రాణివి నీవు. ॥
హిమగిరిసు పుత్రికవు హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి హరి భగిని పార్వతివి॥
హంస వాహిని సఖివి హరునర్ధరుాపిణివి
అంబ, జగదీశ్వరిని అహరహము కావవే॥
--------------------------------------------------------------------
[10/4, 20:43] iswarimurthy: శ్రీమద్భగవద్గీత -ఆరంభము.
( పంచమ వేదము.).
ధ్యానం
సంఖ్య 8.
గీత వర్ణ సారపు గీతాక్షర సుమములు
సుాత్ర ధర్మమందిడి మాత్ర మాలగ వేయ॥
వాగ్దేవతల గొలిచి వ్రాయ గోరితి నేను
గీతార్ధ సారమును గీర్వాణ వేదమును॥
కోటి మదన సుందర కోమలుని శ్యామలుని
ఆపద్బాంధవుండు అవని యదు నందనుని॥
దీప జ్యోతుల జుాపి దీవెనలను కోరితి
అవతారపురుషుని ఆది నారాయణుని ॥
సంఖ్య 9
1 వ అధ్యాయము.
.అర్జున విషాద యొాగము.
ధర్మ క్షేత్రమునందు ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన పరమేశుడవునీవు.
స్వఫలా పేక్ష కై స్వజన సంహారమ్ము
జేయనని పార్ధుడదె ధ్యేయమును విడనాడె ॥
వేద సారము మెండు వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత కావ్య ఘనుడవునీవు
శ్రీ కృష్ణ రుాపాన శ్రితునర్జునకు నీవు
ఘనయొాగ ములనెంచి గీత బోధించేవు. ॥
నిఖిల లోకోధ్భవుడ నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు నీదె బాధ్యతటంచు
నిస్సహాయత తోడ నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ ఫలము నెరిగించేవు.॥
కులధర్మ ములు వీడు కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల కుాల్చ తప్పదు పార్ధ .
యనుచు పలికెను విభుడు-యదునందనందనుడు.
యుద్ధముకు లెమ్మనెను యుాధమునుఛేధింప॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
[10/5, 00:24] iswarimurthy: శ్రీమద్భగవద్గీత "ఇష్టపది" ప్రక్రియలో,
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక
శ్రీమద్భగవద్గీత -ఆరంభము.
( పంచమ వేదము.).
ధ్యానం
సంఖ్య 8.
గీత వర్ణ సారపు గీతాక్షర సుమములు
సుాత్ర ధర్మమందిడి మాత్ర మాలగ వేయ॥
వాగ్దేవతల గొలిచి వ్రాయ గోరితి నేను
గీతార్ధ సారమును గీర్వాణ వేదమును॥
కోటి మదన సుందర కోమలుని శ్యామలుని
ఆపద్బాంధవుండు అవని యదు నందనుని॥
దీప జ్యోతుల జుాపి దీవెనలను కోరితి
అవతారపురుషుని ఆది నారాయణుని ॥
1 వ అధ్యాయము.
. అర్జున విషాద యొాగము. (సంఖ్య 9).
ధర్మ క్షేత్రమునందు ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన పరమేశుడవునీవు.
స్వఫలా పేక్ష కై స్వజన సంహారమ్ము
జేయనని పార్ధుడదె ధ్యేయమును విడనాడె ॥
వేద సారము మెండు వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత కావ్య ఘనుడవునీవు
శ్రీ కృష్ణ రుాపాన శ్రితునర్జునకు నీవు
ఘనయొాగ ములనెంచి గీత బోధించేవు. ॥
నిఖిల లోకోధ్భవుడ నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు నీదె బాధ్యతటంచు
నిస్సహాయత తోడ నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ ఫలము నెరిగించేవు.॥
కులధర్మ ములు వీడు కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల కుాల్చ తప్పదు పార్ధ .
యనుచు పలికెను విభుడు యదునందనందనుడు.
యుద్ధముకు లెమ్మనెను యుాధమును ఛేధింప॥
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము ॥
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
[10/5, 19:22] iswarimurthy: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక:గీత-సాంఖ్యయోగము (10)
పోరి గురులను జంపి పోరు ననుజుల గుాల్చి
పొందురాజ్యములేల పొలయు సుఖ మేలా
రక్త సిక్తము లైన రాజ్య సంపద లేల
రథము తిప్పుము కృష్ణ రణము వీడెదనయ్య
అని పల్కునర్జనుని అజ్ఞానమును బాప
ఆది దేవుడు పల్కె అనునయము తోడ నదె
పుట్టి -గిట్టుటె రీతి పుడమియందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు శంకలనుబాపేను
శోత్రుడవు నీవనుచు శోకింపతగదనుచు
సాంఖ్యయొాగపు నామ శాస్త్రమును తెలిపేను
సరి దుఃఖ -సుఖములను సమముగా చుాచేటి
స్థిర తత్త్వజ్ఞానియె స్థితప్రజ్ఞుడగుననియె
.
కర్తవ్య కర్మలను కడదాక పాటించి
సమబుద్ధియుక్తవై సమరమును సలుపమని
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా
[10/6, 05:43] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక : గీత- కర్మయొాగము 3 ( 12&13)
యొాగముల పాటించి యొాగ కర్మల నేలు
యొాగ నిష్టాపరులు యొాగులిల పార్ధా
ఇంద్రియపు లోలుడై ఇలను చింతల పొందు
మానసిక ముాఢుడే మాన మిధ్యాచరుడు
పరమాత్మ ప్రాప్తి నదె ఫలముగా నొందేటి
నిష్ట పుార్ణుడె యొాగి నిత్య సంతుష్టుడు
ఆశక్తిరహితుడవై ఆచరింపగ కర్మ-
పరమ శ్రేష్టుడ వగుచు పరము నొందెదవు
పరధర్మ గుణములను పాటించుటలు కన్న
స్వీయ ధర్మము లిలను స్వీకరించుటె మిన్న
కామ క్రోధము లిలను కడు పాప ప్రేరణలు
బుద్ధి తోడ విడుమా బద్ధుడవై మెలగుమా
జ్ఞానమ్మె శాస్త్రమని జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల ఘన లోక హితములని
కర్మలకు బాధ్యుడవు కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి జయమొంద మంటివి
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
[10/7, 07:46] iswarimurthy: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.(14- 15- 16)
శీర్షిక :4-జ్ఞాన కర్మ సన్యాస యొాగము
ధ్యాన యొాగము లనెడు జ్ఞాన, కర్మల ఫలము
ఒక్కటిగ చుాడుమా ఒనరు భావముతోడ.॥
ఏ కాంక్షయుా లేని ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె కాంచ ఫల రుాపమ్ము.॥
నిష్కామ కర్మములు నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను శాంతి పొందెదరు.॥
సర్వత్ర సమభావ సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణ పాత్రులు॥
ప్రకృతి కర్మల నేలు పెక్కు జన్మలు నీవి
ప్రబలు భవ బంధముల పట్టి జిక్కితి వీవు
పెక్కు జన్మలు నావి పెక్కు అవతారములు
పేర్మి నెత్తితి నేను పెకిలింప పాపములు
నాల్గు వేదములైన నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా నట సుాత్రధారుడను
అజ్ఞాన మును వీడి అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే కడు శ్రేష్టమని యెంచు
కర్మ తత్వమునెరిగి కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ ఉత్తమంబెరిగి
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా
---------------------------------------
[10/8, 13:49] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
గీత-5 కర్మ సన్యాస యొాగం ( 16-17).
కర్మ సన్యా సములు కనిన రెండును వేరు
కాని రెండిటి ఫలము కల్యాణ దాయకమె
అవనిని ద్వేషములను అధిగమించిన వాని
సాధనల సమకుారు సార బ్రహ్మపు పథము
అతఃకరణ సుద్ధి ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును పలుకు జ్ఞానులగుదురు
బాహ్య విషయములంచు భవభోగవిషయముల
చింతన ను చేయకయె చింతా ముక్తుడగును
ఆత్మ స్థిత ధ్యానులు అనాశక్త విషయులు
అక్షయానందములను అనుభవించెదరిలను॥
ఏక భావ స్థితులును ఏ మొాహమ్ములకును
వివశులేటికి కాక విజయ సాధకులౌను
చిత్త వృత్తుల జయము చిరముగా సాధించి
పరమ శాంతి నొందియు పరము నొందెదరుగద
తామరాకు పై నదె తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు స్వ భయంబు వీడుమని
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగను ------------------------------------------------------------
[10/9, 17:16] iswarimurthy: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి (15-16-17)
శీర్షిక :4-జ్ఞాన కర్మ సన్యాస యొాగము
ధ్యాన యొాగము లనెడు జ్ఞాన, కర్మల ఫలము
ఒక్కటిగ చుాడుమా ఒనరు భావముతోడ.॥
ఏ కాంక్షయుా లేని ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె కాంచ ఫల రుాపమ్ము
నిష్కామ కర్మములు నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను శాంతి పొందెదరు
సర్వత్ర సమభావ సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణ పాత్రులు
ప్రకృతి కర్మల నేలు పెక్కు జన్మలు నీవి
ప్రబలు భవ బంధముల పట్టి జిక్కితి వీవు
పెక్కు జన్మలు నావి పెక్కు అవతారములు
పేర్మి నెత్తితి నేను పెకిలింప పాపములు
శిష్ట రక్షణ జేసి దుష్టులను శిక్షించి
ధర్మ స్థాపన జేయ ధరను అవతరింతును
నాల్గు వేదములైన నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా నట సుాత్రధారుడను
అజ్ఞాన మును వీడి అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే కడు శ్రేష్టమని యెంచు
కర్మ తత్వమునెరిగి కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవగుమ ఉత్తమంబెరిగనుచు
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా
---------------------------------------
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
గీత-5 కర్మ సన్యాస యొాగం ( 18-19).
కర్మ సన్యా సములు కనిన రెండును వేరు
కాని రెండిటి ఫలము కల్యాణ దాయకమె
అవనిని ద్వేషములను అధిగమించిన వాని
సాధనల సమకుారు సార బ్రహ్మపు పథము
అతఃకరణ సుద్ధి ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును పలుకు జ్ఞానులగుదురు
బాహ్య విషయములంచు భవభోగవిషయముల
చింతన ను చేయకయె చింతా ముక్తుడగును
ఆత్మ స్థిత ధ్యానులు అనాశక్త విషయులు
అక్షయానందములను అనుభవించెదరిలను
ఏక భావ స్థితులును ఏ మొాహమ్ములకును
వివశులేటికి కాక విజయ సాధకులౌను
చిత్త వృత్తుల జయము చిరముగా సాధించి
పరమ శాంతి నొందియు పరము నొందెదరుగద
తామరాకు పై నదె తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు స్వ భయంబు వీడుమని
పార్ధునకు బోధించు పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగను ------------------------------------------------------------
[10/9, 22:48] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక
గీత -6 - ఆత్మ సంయమ యొాగము (20-21)
సంకల్ప త్యాగముల సహనశీలత నొదులు
సాధు చిత్తుడె యగును సన్యాస యొాగిగను
సంసార సంద్రాన సాధు చింతన లేని
మనిషి తనకే తాను మది మిత్ర శతృడును
శీతోష్ణ సుఖ -దుఃఖ శీల మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు నిత్య లగ్నుడె యొాగి
చిత్తేంద్రియమ్ములను చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె లక్ష్యసాధకుడిలను
అనంత చైతన్య స్థిత ఆత్మ రుాపమునదె
సకల ప్రాణులయందు సమానమని యెంచును
సర్వ భుాతములందు సమ దృష్టి కల్గుటను
పరమ శ్రేష్ఠులు వారు పరమాత్మ రుాపముల
పర స్వర్గ సుఖములను పుణ్య పురుషులుపొంది
మరల జన్మింతురుా మహి పవితృలుగాను
విరాగులకు జన్మ విధిగ ప్రాప్తంబౌను
ధర దుర్లభమ్మైన ధన్య యొాగిగ జనును
అట్టి యొాగము తోడ ఆత్మ యొాగిగ మనుచు
శ్రేయ శ్రద్ధను కొమ్ము శ్రేష్ట కార్యము జేయ
అని పలికె శ్రీకృష్ణు డవని అంతర్యామి
ఫల గీత సారమ్ము పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా ॥
[10/10, 17:00] iswarimurthy: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక - గీత
7 జ్ఞాన విజ్ఞాన యొాగము(సంఖ్య 22-23)
తత్త్వ జ్ఞానపు మహిమ తనిగ తెలిపెద పార్ధ
తద్ద్యాన్న మగ్నవై తథ్యముగ వినుమా
యొాగమాయను కమ్ము యొాని జన్ములకెల్ల
తనిగ నీశుని తెలియ తరముకాదిలలోన
రాగద్వేషము వలన రగులు సుఖ- దుఃఖములు
మొాహమును విడలేరు మొాహ బుద్ధి హీనులు
ప్రకృతి పరా, చేతన ప్రకృతి జడపరాదులు,
పుట్టుకలు, ప్రళయముల పుార్ణ రుాపిని నేనె
వేద రుాప ఓంకార వేల గుణ తేజమును
త్రిగుణాత్మ భావముల త్రిగుణతీతుడ నేను
గత, వర్తమానాల గుణ, మొాహ ముక్తులదె
నన్ను శరణని నమ్మి నను చేరెదరు తుదకు
అని పలికె కృష్ణుడు అవని అంతర్యామి
ఫల గీత సారమిదె పంచమపు వేదమ్ము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగా
[10/11, 09:05] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత (సంఖ్య 24-25 -26 )
8. అక్షర బ్రహ్మయొాగము
కన బ్రహ్మ మన నేమి కర్మ మనగా నేమి
తెలియ జెప్పెద వినుమ తెలుసుకొనుమొా పార్ధ
పగలు బ్రహ్మకాలము ప్రారంభ సమయముగ
వ్యక్తమౌ జీవులుా వ్యవహార ప్రకటితము
అదె రాత్రి సమయమున అవ్యక్తమునందున
జీవులన్నియు మరల లీనమౌటనుగనుమ
సర్వ శ్రేష్టుడు బ్రహ్మ సృష్టి కర్మలె కర్మ
అభ్యుదయొాత్పత్తిని అలరు కర్మలు ఇలను
అఖిల చరాచరములు అవ్యక్త ప్రకటములు
సుాక్ష్మదేహోత్పన్న సుాన్య లీనములు
అధి భుాత, అధి దైవ అధి యజ్ఞ ,జీవాత్మ
సృష్ట్యాది సారముల సృజనాత్మకుడ నేను
చివరి ఘడియల లోన చెదరు మానసు లిలను
ఏ స్మరణ చేయునో ఆ జన్మ పొందెదరు
బ్రహ్మ పథమును ప్రాప్తి బ్రహ్మ యొాగులకునుా
స కామ కర్మయొాగి సర్గ లోక వాసిగ
దేవయాన మార్గుల దేహమేలును పరము
పితృయాన దేహులకు పిదప జనన భ్రమణము
అని తెలియుమర్జునా అక్షరుడను నమ్ముమ
ఫల పుణ్యము పొందుమ పరమపదము నొందుమ
అని పలికె కృష్ణుడు డవని అంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవరా
[10/11, 22:12] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత (సంఖ్య:27-28-29 )
9.రాజ విద్యా, రాజ గుహ్య యొాగము
దోష దృష్థియె లేని యొాగ్య భక్తుడనవీవు
విజ్ఞాన సహితములు ఇవి గోప్య జ్ఞానములు
ఎరుగుమివి అర్జునా ఎరుగ దుఃఖము దాటి
సంసార సంద్రమును సరి దాటి ముక్తవౌ
తలమానికమ్మైన తత్వముత్తమొాత్తము.
సమస్త గోప్య విషయ సత్ శిరో భుాషణము
జగతి భుాత నిలయము జలపుార్ణ మీ జగతి
నా సంకల్పములివి నాలో నిండున్నవి
కల్పాది సృజనుడను కల్పాంతకుడనేను
కర్మానుసారముా కలిగింతు జన్మలను
అద్యక్షుడ సృష్టికి ఆశక్తి రహితుడను
లోక కల్యాణార్ధ లోకావతారుడను
క్రతు యజ్ఞ స్వధ నేను క్రతు వేద సారమును
హోమ క్రియ మంత్రాగ్ని ఓషధీ, ఘృతాగ్నిను
సత్తునసత్తును నే సర్వ మృత్యు కారకను
అప్రాప్త యొాగముల ఆరక్షక క్షేమమును
నిష్కామ భక్తితో నిత్యమునర్చించుము
ప్రీతి పత్ర ఫలముకే ప్రియమొందు వాడను
క్షణ భంగుర జీవములు క్షణమౌ సుఖ,హితములు
శరణము కోరినవారు సవ్యులు నను చేరెదరు
అని పలికె కృష్ణుడు అవనినంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ నను బ్రోవ
[10/12, 10:40] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత (సంఖ్య: 30-31-32 )
10. విభుాతియొాగము
దేవతలు మహర్షులు తెలుసుకొన లేనట్టి
లీలా విశేషములు ఇంకెన్నియొా గలవు
ముల్లోకములకునుా ముాలమ్ము నేననుచు
ముందెరరగు జ్ఞానులే ముక్తులగుదురువారు
జన్మరహితుడననియు జ్ఞాని ఎరుగును నన్ను
వివిధ భావపు గతులు విధి నాచే కలుగును
స్వయంభుావ మనువులు స్వయమునాదు భక్తులు
సమస్త ప్రాణి కోటుల సంకల్పుడ నేనెగ
నాయందు మనసుంచి నాయందే రమించు
నిత్య ధ్యానులకు నే నిచ్చు ధనము జ్ఞానము
పరబ్రహ్మవు నీవెగా పరమాత్మవు నీవుగ
నీ తత్త్వము నెరుగను నీ విభుాతి తెలుపుము
అను పార్ధుని గని హరి అనునయమున పలికెను
సమస్త ప్రాణ సృష్టి కి సకల లయము తాననె
ప్రాణ చైతన్యమును ప్రాణ శక్తిని నేను
ఓంకార శబ్దమయ ఓజ తేజము నేను
ఆది మధ్యాంతముల ఆది పురుషుడ నేనె
విశ్వతోముఖుడ నుా విరాట్పురుషుడనే
యొాగ శక్తి అంశను యొాగ కారకుడేను.
తేజ సంభవుడను తేజైశ్వర్యుడను
అని పలికె శ్రీకృషు డవనినంతర్యామి
సార భగవద్గీత సరి పంచమ వేదము
ఇల వ్రాలు ఈశ్వరీ ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార శ్రీ కృష్ణ బ్రోవగను
[10/12, 21:59] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత (సంఖ్య: 33 , 34, 35 )
11.విశ్వరుాపసందర్శనయొాగం.
--------------------------------------------
శక్తి బలైశ్వర్యములు జ్ఞాన తేజ మయములు
సత్యము నీ హితములు సందేహము లేనివి
ప్రాణోత్పత్తి సహిత ప్రళయ విస్తారముల
శాశ్వతము నీరుాపము జగతి నిత్య సత్యము
తొలగె సంశయమ్ములు తొలగె నజ్ఞాననమదె
నాజన్మ ధన్యముగ నను నడుపుమ కృిష్ణా
షడ్గుణైశ్వర్యాల సంపన్న మైయున్న
నిజ దర్శనమిమ్మా నిఖిల లోక పావన
ప్రాకృతపు దృష్టి నను పార్ధ చుాడగలేవు
దివ్య దృష్టి నిత్తు నా దివ్య దర్శనము గన
అసంఖ్యాకములు పెక్కు ఆకృతులలౌకికము
అట్టిది నా రుాపము అపుార్వము అదిగనుము
అని దివ్య రుాపమును ఆది దేవుడు చుాపె
అనంత భ్రహ్మాండము అందు నిండి యుండెను
పెక్కు ముఖముల వాని పెక్కు కర, అస్త్రములు,
జగతి నిండుదరములు జల ప్రళయ భీకరము
వేల సుార్య కాంతిని వెలుగు విరాట్ రుాపము
గాంచి ధన్యుడు నరుడు ఘనమునంజలులిడెను
దుర్నిరీక్ష్యమైన దివ్యరుాపుని గాంచి
కమ్ము భయముతోడను కడు ప్రసన్ను కమ్మనె
సౌమ్యముార్తిగ యైన స్వామి రుాపము గనిన
సవ్యసాచి హరి గని సాదర ప్రణమిల్లెను
అట్టి భాగ్యముపొంద అహరహము ధ్యాన్నింతు
అనుచు శరణము వేడె అవనిలోనీశ్వరి
[10/13, 15:31] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత ( సంఖ్య 36,37 )
12. భక్తి యొాగము.
అనన్య భక్తి సేవ అత్యంత భక్తి సేవ
ఏది శ్రేష్టమైన దొ ఎంచి చెప్పుము కృష్ణ
సగుణ రుాప ధ్యానులు సర్వ యొాగ శ్రేష్టులు
సమ సమాన దృష్టులు సత్య సిద్ధ యొాగులు
అవ్యక్త పరబ్రహ్మ ఆశక్తచిత్తులు
పరగుటకు సాధనలు పరమ కష్టతరములు
మత్పరాయణ భక్తులు అనన్య భక్తి కాములు
నన్ను నమ్ము వారినే నట్లె ఉద్ధరింతును
అభ్యాస యొాగమదె అత్యంత సులభము
మత్ప్రాప్తికై చేయు మదె సాధన పార్ధా
కర్మ ఫల త్యాగములె కన మిక్కిలి శ్రేష్టము
ఫల త్యాగము చేయుట పరమ శాంతి యొాగము
ఏ ద్వేషములు లేని ఏ స్వార్ధములు లేని
మనోబుద్ధి అర్పణుడు మత్ ప్రీతి పాతృడుా
అని పలికెను శ్రీహరి అవనినుద్ధారకుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఈప్సిత వర వేల్పుడు
[10/13, 15:32] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత ( సంఖ్య 38,39 )
13. క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యొాగము.
జీవులు ఎన్నున్నను జీవాత్మను నేనే॥---
క్షేత్ర త్రిగుణ తత్త్వము క్షేత్రజ్ఞుడను నేనే.
బ్రహ్మసుాత్ర పదములు బహు ఇంద్రియ దశలును- ధృతి వికార మయమును ధృఢ క్షేత్ర స్వరుాపము ॥
జన్మ జరా దుఃఖము జన్మ రాగమొాహము
విని యుంటివి అవె గద వివిధ దేహ దశలిల
ఇంద్రియ వైరాగ్యము ఇల మమతల త్యాగము
మన భావ సు చిత్తుడు మన వికార ముక్తుడు
నిత్యనన్య భక్తుడు నిత్య సుస్థిర చిత్తుడు
సుతత్త్వ జ్ఞానార్హుడు సత్ అసత్ ల కతీతు
డిహ పర నిరాశక్త ఇంద్రియ వైరాగ్యుడు
బహు విధ స్వరుాపుడుా బాహ్యాంతరశుద్ధుడు
పరమాణు స్వరుాపుడు పలు విధ గోచరుడుా
పరంజ్యోతి రుాపుడు పరమాత్మయౌనతడు
జ్ఞాన బోధ జేయుచు జ్ఞేయము నెరిగించిన
ఈశ్వరీ నుతుడతడు శ్రీశుడు శ్రీ కృష్ణుడు
[10/14, 16:55] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత ( సంఖ్య 40, 41, 42 ).
14. గుణత్రయవిభాగయొాగము.
---------------------------------------------
ఉత్తమ మౌ జ్ఞానము ఉద్యుక్తుడవై విను
పరమ సిద్ధి పొందెడు పరమొాత్తమ యొాగము
నిత్యులు చేతనులుా నిజ వికార రహితులు
నన్నాశ్రయింతురుా నా స్వరుాపులౌదురు.
సంసార బంధముల సరిముక్తు లౌదురు
సృష్ట్యాదులయందును పృధ్విని జన్మించరు
ప్రకృతి సంభవములగు ప్రళయ వ్యధ లొందరు
పునౕర్జన్మలుండని పుణ్య ప్రాప్తులౌదురు
ముాల ప్రకృతి స్థానము మద్బ్రహ్మ స్వరుాపము
జడ సంయమ యొాగము జగముత్పత్తి స్థలము
విశ్వ ప్రకృతి తల్లిగ విత్తు తండ్రి నేనుగ
త్రిగుణ క్షేత్ర మునందు తిరుగు జీవాత్మగను
త్రిగుణములవి ముాడును తిప్పును జీవాత్మను
కామ క్రోధాదులకు కారణమౌ బంధము.
సత్త్వ గుణము సుఖమగు సర్గ లోక ప్రాప్తము
రజో గుణమశాంతిని రగుల జేయు స్వార్ధము
తమగుణమజ్జానము తథ్యమతి ప్రమాదము
గుణములే గుణములను గుాడుచు వర్తించును.
శ్రేష్టమైన కర్మల శ్రేష్ఠుడాచరించును
జన్మ మరణాదులా జగతి ముక్తుడగుచును
ఇచ్ఛా ద్వేషములకు ఇల అతీతుడు వాడు
అపరబ్రహ్మ ప్రాప్తికి అట్టి వాడు అర్హుడు
అని పలికెను కృష్ణుడు అఖండ ఆనందుడు .
ఈశ్వరి హృత్సదనుడు ఇహ పరావతారుడు॥