6/12/2020.
ప్రతీ రోజుా కవితా పండగే కొరకు
రచన , శ్రీమతి ,
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
8097622021.
ప్రక్రియ: సమ్మొాహనాలు .
------------------------------
శీర్షిక .
నవ్వు-నవ్వించు.
----------------------
చిన్నారి చిరునవ్వు
చిరునవ్వు పుావులను
పుావులను పుాయించు నవ్వులను మిత్రమా ॥
తొలి సంధ్య నవ్వుతో
నవ్వునిడు మొాముతొ
మొాము నందరి జుాచి పలుకుమా మిత్రమా॥
నవ్వులే చిలుకంగ
చిలికి సంతోషంగ
సంతోష సందళ్ళ ముచ్చటలె మిత్రమా॥
ఇక్కట్లు మరచెదరు
మరచియుా మురిసెదరు
మురిసి మదిలో బాధ మరచెదరు మిత్రమా ॥
రోజంత హాయిగా
హాయగా నిండుగా
నుండుగా నవ్వుచుా నవ్వించు మిత్రమా ॥
కష్టాలు మరచెదరు
మరచి మాట్లాడెదరు
మాట్లాడి ఊరటను పొందెదరు మిత్రమా ॥
కలిమి లేముల లోన
లోన కన్నీళ్ళున్న
కన్నీళ్ళు నవ్వులో కరుగన్న మిత్రమా॥
నవ్వులెన్నొ విధములు
విధము నవ్వు ఫలములు
ఫలము సంతోషాలు సందళ్ళె మిత్రమా॥
ఏమున్న లేకున్న
లేకున్న నవ్వున్న
నవ్వున్న చాలునుా జగమందు మిత్రమా ॥
శత్రువులు మిత్రులు
మిత్రులౌబంధములు
బందములు బలపడును నవ్వుతో మిత్రమా॥
నవ్వు మరువకు నెపుడు
ఎపుడు మనసున్నపుడు
మనసుతో నవ్వుచుా నవ్వించు మిత్రమా ॥
నవ్వమని చెప్పితని
చెప్పితని నవ్వమని
నవ్వులాటల నెవరి నిపించకు మిత్రమా ॥
గేలి చేయకు నెవరి
ఎవరి నొప్పించకురి
నొప్పించు విదఫముగా నవ్వకుమ మిత్రమా॥
నీ నవ్వు నిండాలి
నిండాలి పండాలి
పండ మనసుల శాంతి నిండాలి మిత్రమా ॥
No comments:
Post a Comment