Friday, December 18, 2020

భగవద్గీత

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక -గీత  ( సంఖ్య 40, 41, 42 ).
14. గుణత్రయవిభాగయొాగము.
---------------------------------------------

ఉత్తమ మౌ జ్ఞానము ఉద్యుక్తుడవై విను
పరమ సిద్ధి పొందెడు పరమొాత్తమ యొాగము

నిత్యులు చేతనులుా నిజ వికార రహితులు
నన్నాశ్రయింతురుా నా స్వరుాపులౌదురు.

సంసార బంధముల సరిముక్తు లౌదురు
సృష్ట్యాదులయందును పృధ్విని జన్మించరు

ప్రకృతి సంభవములగు ప్రళయ వ్యధ లొందరు 
పునౕర్జన్మలుండని పుణ్య ప్రాప్తులౌదురు 

ముాల ప్రకృతి స్థానము మద్బ్రహ్మ స్వరుాపము
జడ సంయమ యొాగము జగముత్పత్తి స్థలము 

విశ్వ ప్రకృతి తల్లిగ విత్తు తండ్రి  నేనుగ
త్రిగుణ క్షేత్ర మునందు తిరుగు జీవాత్మగను

త్రిగుణములవి ముాడును తిప్పును జీవాత్మను
కామ క్రోధాదులకు కారణమౌ బంధము.

సత్త్వ గుణము సుఖమగు సర్గ లోక ప్రాప్తము
రజో గుణమశాంతిని  రగుల జేయు స్వార్ధము

తమగుణమజ్జానము తథ్యమతి ప్రమాదము
గుణములే గుణములను గుాడుచు వర్తించును.

శ్రేష్టమైన కర్మల శ్రేష్ఠుడాచరించును
జన్మ మరణాదులా జగతి ముక్తుడగుచును

ఇచ్ఛా ద్వేషములకు ఇల అతీతుడు వాడు
అపరబ్రహ్మ  ప్రాప్తికి అట్టి వాడు అర్హుడు

అని పలికెను కృష్ణుడు అఖండ ఆనందుడు .
ఈశ్వరి హృత్సదనుడు ఇహ పరావతారుడు॥

No comments:

Post a Comment