/12/2020.
ప్రతీ రోజుా కవితా పండగే కొరకు..
అంశం : ఆళ్వారులు.
ప్రక్రియ : వచనం.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
పార్వతీ పరమేశ్వర కల్యాణ సమయంలో
విశ్వకర్మకు, అగస్త్యునకు జరిగిన వాగ్వివాదాలకారణంగా నిరసనకు గురైన ద్రవిడభాషను పునరుద్ధరించడానికై శ్రీమన్నారాయణుని ఆదేశానుసారం, అతని దేవేరులు ఆయుధ పరివారాలతో కలసి దక్షిణ భారత దేశాన అళ్వారులుగా జన్మించారని ,
భూదేవి గోదాదేవిగానూ, ఇతరులు వేరు వేరు ఆళ్వారులుగానూ అవతరించగా, విష్ణువు శ్రీదేవీ సమేతుడై శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అవతరించి వారి సేవలను అందుకొన్నాడని చెపుతారు.
పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా
ఆళ్వారులంతా విష్ణుసేవకుని అంశలని చెబుతారు.
స్వతః విష్ణు పరివారకులైన వీరు తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారువీరు రచించి పాడిన పాశురాలు అన్నీ దివ్య ప్రబంధనాలుగా వెలువడి, ద్రవిడ వేదం గా పిలువబడుతున్నాయి.
. భక్తి, పారవశ్యము, శరణాగతి - అనేవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, ప్రముఖంగా కానవచ్చే అంశాలు.
ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.
గురుపరంపర అనుగ్రంథము లో వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి అని అంటారు.
ఆముక్త.మాల్యద (గోదాదేవి ), పెరియాళ్వార్,
విప్రనాయాయణుడు , విష్ణు చిత్తుడు ,
కులశేఖరాళ్వార్ లేకాక , దైవ దర్శనానంతరం మన శిరస్సుపై ఊంచబడే శఠకోపం కుాడా విష్ణు భక్తుడైన ఆళ్వారులే అని ప్రతీతి.
నమ్మాళ్వారుగా పేరొందిన శఠకోపముని రచించిన నాలుగు దివ్య ప్రబంధాలు నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రసిద్ధి చెందేయి.
ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించగా మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడని,
కులశేఖరాళ్వార్ శ్రీరాముని భక్తుడని, తిరుమల లో
బంగారు వాకిలివద్దనున్న మొదటి మెట్టు ఇతని పేరుమీదే కులశేఖర పడిగా ప్రసిద్ధి చెందినదని చెపుతారు.
పన్నెండుమంది ముఖ్యమైన ఆళ్వారులుగా పిలువ బడుతున్న వీరందరు విష్ణు భక్తి తో తరించిన మహాత్ములు. వీరందరినీ స్మరించుకొనే అవకాశం మనకు కలిగించిన వారికి సదా కృతజ్ఞతలతో
నమః సుమాంజలులు.
No comments:
Post a Comment