Monday, August 31, 2020
అడిగొప్పుల సదయ్యగారి కవిత. గురుభ్యోనమః
చిలకపలుకులు ఆగష్ట్ అంశాలు.
చిలక పలుకులు ఆగష్ట్ అంశాలు.
------------------------------------------------
*నూతన సాహిత్య ప్రక్రియ.. చిలక పలుకులు* 🌹 *సృష్టికర్త .. చిలక మారి తిరుపతి*
964090849
.చదువు
2. పదవి
3. అందం
4. ఆనందం
5. ఉద్యోగం
6. వ్యాపారం
7. ప్రేమ
8. స్నేహం
9. మౌనం
10. వివాహం
11. గౌరవం
12.. ఐశ్వర్యం
13. సేద్యం
14.చెరువు
15. తరువు
16. గురువు
17. భక్తి
18.అభిమానం
19. ఆరాధన
20. ఓదార్పు
21.సెలయేరు
22. ఐక్యత
23. కుటుంబం
24. కవిత్వం
25. శిల్పం
26. స్వదేశం
27. విదేశం
28.అమ్మ
29. నిరీక్షణ
30. పరిక్ష
31. ఆవేధన
---------------
.చదువు.
-----------
జ్ఞానం పెంచేటిది చదువు.
వెల లేని నిధి నిక్షేపాల కొలువు.
సంస్కార, జ్ఞాన వికాశానికి నెలవు.
సాహిత్య సంస్కృుతి ఇల తీపి మధువు.
__---------------------------------------
రచన, శ్రీమతి.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర.
8097622021
---------------------------
2. పదవి.
. ------------
పదవి, సామాజిక రక్షణ కై చేపట్టేది.
ప్రజల అభ్యున్నతి కై ఆరాట పడేది .
బాసల బాటలో నిష్ట పాటించేది
ఆదర్శపు పోరాటంలో ఆహుతయ్యేది.
----------------------------------------------
రచన, శ్రీమతి.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర
8097622021.
3. అందం
-------------
సౌందర్యానికి మించినది, సంస్కారం .
చెప్పే మాటకు,తీయని పలుకు అందం.
బాహ్య రుాపానికి మించిన అందం ,సద్గుణం,
అందరి లో గౌరవింపబడేది, వ్యక్తిత్వం .
--------------------------------------------------
రచన, శ్రీమతి.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర
8097622021.
4.ఆనందం
--------------------
ఎల్లలు లేనిది అమ్మ అనురాగం.
పరీక్షల్లో పాసైతే ఎంతో ఆనందం.
చిన్న నాటి జ్ఞాపకాలు అపుార్వం.
పవిత్రమైనది వివాహ బంధం.
---------------------------------------
రచన, శ్రీమతి.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర
8097622021.
------------------------
5.ఉద్యోగం.
------------------
అదృష్టం ఒక యొాగం.
నేను చేసేది చిన్న ఉద్యోగం.
తెలివి బతుకు తెరువుకు ఉపయొాగం.
జ్ఞానం ఉంటే అనుభవిస్తావు భోగం.
5. ఉద్యోగం.
----------------------
ధనార్జనకై చేసేది ఉద్యోగం .
జీవనాధారమై తృప్తినిచ్చేది.
ధనార్జన ఒక యొాగం.
ఆత్మ విశ్వాసాన్ని పెంచేది.
--------------------------------------
రచన, శ్రీమతి.
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర
8097622021
---------------------
6.వ్యాపారం.
-----------------
శీర్షిక.
వ్యాపారం.
-------------
నేడు ప్రతీదీ వ్యాపారమయం.
ప్రతి ఒక్కరి లో ధన దాహం.
న్యాయాన్యాయాల ప్రసక్తి సుాన్యం.
లాభ నష్టాల రిబేజే జీవితం.
--------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
----------------------
7. ప్రేమ.
------------
ప్రేమ , నేటి యువత భ్రమించే అంగడి .
చెట్టా పట్టా లేసుకు తిరగడం సందడి.
పెళ్ళి పేరుతో మొదలయ్యే అలజడి.
జీవితాల , చితుకు బాటల ఒరవడి.
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
-----------------------
ప్రేమ ,రెండు మనసుల కలయిక .
సుఖ దుఃఖాలు పంచుకునే భావిక.
జీవిత సహచర్యపు ప్రణయ దీపిక.
ఆనందపు ఆగమనాల జ్ఞాపిక.
-------------------------------------
శీర్షిక.
8..స్నేహం.
---------
అన్ని బంధాలకుా అతీతమైనది స్నేహం.
కుల మత బేధాలెరుగని ఆత్మానుబంధం.
ఒంటరివైన క్షణం "ఒదార్చే హస్తం" స్నేహం.
కష్టం వస్తే నేనున్నాననే "ధైర్యం" స్నేహం.
-----------_------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
-----------------------
9.మౌనం.
----------
నిండుకుండ తొణకదన్న సత్యం.
మౌనం, జ్ఞానులకు నిలువెత్తు భుాషణం.
మౌనం , శాంతియుత పోరాటం.
ఎన్నో సమస్యలను ఖండించే ఆయుధం.
---------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
------------------------
10 . వివాహం.
---------------------
వివాహం,సమాజపరమైన ఒప్పందం .
పరస్పర అవగాహనల సంబంధం.
రక్షణ, సంరక్షణ ,బాధ్యతల బంధం.
ఒకరికి ఒకరమన్న, నమ్మక ధైర్యం.
-------------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
----------------------
11. గౌరవం.
--------------------
గౌరవం , ఇచ్చి ,పుచ్చుకునేది.
సత్ ప్రవర్తనతో సాధించుకొనేది.
అహంకారం తో, డబ్బుతో కొనలేనిది.
మాట తీపి, మంచితనం తో వచ్చేది.
-------------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
------------------------
12. ఐశ్వర్యం.
-------------------
స్త్రీ కి అణకువ ,అందం,ఐశ్వర్యం.
చదువు , జ్ఞానసముపార్జనైశ్వర్యం.
సంస్కారం , సమాజవ్యవహారావసరం.
ఐశ్వర్యం (ధనం) బతకడానికి అవసరం.
------------------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
--------------------
13..సేద్యం.
------------------
రైతు చేసేది సేద్యం.
డాక్టర్లు చేసేది వైద్యం.
ప్రకృతి లో పచ్చదనం ఆరోగ్యకరం
మితి మీరిన తిండి రోగ లక్షణం .
----------------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
-------------------4
.14. చెరువు.
--------------------
మంచి నీటి కై చెరువుల ఉపయొాగం.
అఖిల జనావళి కి జీవామృత పానం.
జల -జీవ -జంతువులకు ధామం
గంగా జలం ప్రకృతి సంపదలకు వరం.॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
15. తరువు.
------------------
తరువులు ఇల కల్ప వృక్షాలు.
పచ్చదనం పంచే ప్రకృతి అందాలు.
ప్రాణ వాయువు నిచ్చే జీవామృతాలు
పచ్చని పంటలు, బతుకు సారాలు॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
16.. గురువు.
----------------
గురువులు విద్యా బోధకులు.
నిరక్షరాస్యత ను దుారంచేసేవారు.
భావి జీవిత మార్గ దర్శకులు.
బంగరు భవిష్యత్ప్రదాతలు..॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
17..భక్తి.
--------------------_----
భక్తి , శ్రధ్ధాభిమానాలకు మించినది .
భగవంతుని పై నమ్మకం కలిగించేది.
తల్లిదండృల ఋణం తీర్చుకోగలిగేది.
గురువులపై గౌరవాన్ని చుాపించేది.॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
18.అభిమానం.
---------------------
మనసులో, మమత సారం అభిమానం.
అమ్మా- నాన్నలతో ఉన్న ప్రేమ పాశం.
అక్కా చెల్లెళ్ళ మనసు నొప్పించని బంధం.
స్నేహితులతో ఏర్పడిన అనుబంధం.
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
19. అంశం.
ఆరాధన
----------
పెంచి పోషించిన దేముడి రుాపాలైన-
అమ్మా ,నాన్నంటే అనురాగం నిండిన ప్రేమ.
తలిదండృల రుాపంలో తరలి వచ్చిన-
దైవం అంటే భక్తి నిండిన ఆరాధన.
20. ఓదార్పు.
-------------
కష్టాల్లో, సాయం చేసే చేయి ఓదార్పు.
బాధల్లో, ధైర్యం నింపే స్నేహం ఓదార్పు.
విపత్తులో, విత్త దానం మనిషికోదార్పు.
అనారోగ్యం లో, వైద్యుల వైద్యమొాదార్పు.
------------------------------------------------------+
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------
21 .సెలయేరు.
--------------------
స్వచ్ఛమైన తేనీటి సెలయేళ్ళు.
పచ్చని పంటల నిండు కళ-కళలు
పుాల పరిమళపు మేలి ఘుమ-ఘలు.
పల్లెలో నిండిన పారవశ్యపు అందాలు.॥
---------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహరాష్ట్ర .
8097622021.
---------------------
22.శీర్షిక .
ఐకమత్యం.
----------------
ఐకమత్యం మహాబలం .
కలసి ఉంటే కలదు సుఖం.
భన్నత్వం లో ఏకత్వం.
అందికే , చుాపించకు ఎన్నడుా బేధ భావం.॥
.---------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------
23. కుటుంబం.
----------------------
భారతదేశం , మన సమిష్టి కుటుంబం.
ప్రతీ స్త్రీ కీ , ఇవ్వాలి గౌరవం.
అదరం కలిసుంటే ,ఆనంద నిలయం.
భరత మాత బిడ్డలం, .మనమందరం.
------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------
24..కవిత్వం.
-------------------
హృదయ భావాల దర్పణం , కవిత్వం.
సాటివారి ఆటు-పోట్ల స్పందన చిత్రం
ఆలోచింపజేసే అక్షరం తుాణీరం.
చైతన్య , సమాహారం, కవితోద్యమం.
-----------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
25 . శిల్పం
-------------------
.రాయిని, కాలితో తన్నిన వారే
చెక్కిన రాయిని దైవంగా పుాజిస్తారు.
చదువు , సంస్కారం లేనపుడు తిట్టే వారే
హోదాలో ఉన్నపుడు సలాం కొడతారు.॥
---------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------
26. స్వదేశం.
------------------------
స్వ దేశంలో స్వతంత్రంగా బతకొచ్చు.
బతుకు భారం., అనువు కాని చోటే.
మనింట్లో, కాళ్ళు జాపుకు పడుకోవచ్చు.
వేరే వారింట్లో భోగం, ముాణ్ణాళ్ళ ముచ్చటే.
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
27..విదేశం.
----------------
విదేశ వస్తు వ్యామొాహం విడవాలి.
స్వ దేశ భక్తి తో మెలగాలి.
అన్ని భాషా, మతాలనుా, ఆదరించాలి.
మన మాతృభాషను గౌరవించాలి.
--------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
-------------------------------------------
28. అమ్మ.
----------------
అమ్మ , అమృత తత్త్వానికి నిదర్శనం .
సృష్టి కి ప్రతి సృష్టి అమ్మన్నది వాస్తవం.
మనందరం భరత మాత బిడ్డలం.
ఇద్దరినీ గౌరవించి తీర్చుకుందాం ఋణం.॥
------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
29. నిరీక్షణ.
----------------
కాలం స్తంభించింది కరోనా కాటుకు,
మనుషుల మధ్య దుారం పాటించనందుకు-
కేసులు ఎక్కువయ్యేయి , నిర్ణక్ష్యం వేటుకు.
అసహనపు నిరీక్షణ వేక్సిన్ రాకకు .
--------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
----------------------
30.పరీక్ష.
-------------
జీవితమే ఒక రంగుల వలయం.
కాలం పెట్టిన పరీక్షా సమయం .
కరోనా విఝృంభణ ,జవాబు లేని భయం.
సుచి,- సమయపాలనలే మన- కభయం.
----------------------------------------------**
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
31.ఆవేదన.
-----------------
అంతరించిపోతున్న విలువల వలన,
మనోవ్యధ నిండిన హృదయావేదన.
నా,నీ ల మధ్య నలుగుతున్న భావన.
ఆనందాగమనాల ఆశల నిరీక్షణ ॥
----------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
1.మలయసమీరం.
----------------------
మధురానగరిలొ మలయసమీరం
మొాహన మురళీ గాన విలోలం.
బృందావన తీర కేళీ వినోదం.
గోపీ లోలం కృష్ణం , గోపాల బాలం.॥
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
మహమ్మద్ రఫీ గారికి పంపిన కవిత
ఈ వేమన కవితా నిలయంకు పంపినవి.
"పింగళి వెంకయ్య ఝండా"... వాట్సప్ కు పంపిన కవితలు.
112 రామాయణ పుస్తకాల లింక్
పున్నమి పత్రిక కొరకు పంపినది.
Sunday, August 30, 2020
వాట్సప్ లో" కృష్ణాష్టమి" కు పంపిన కవిత
108 ఇషటపదుల సంకలనానికై...అడిగొప్పుల సదయ్య....అనే వాట్సప్ కు పంపినవి.
మహతీ సాహితీ ఇష్టపదులకు పంపినవి.
తెలుగు భాష లో పదాల రకాలు
Friday, August 28, 2020
మణిపుాసలు నియమాలు
Wednesday, August 26, 2020
తేనియయలు
చిరంజీవి.మెగాష్టార్
పున్నమి వారి గుగుల్ ID
PNM5241000182.
సాహితీ పున్నమి - మెగాస్టార్ చిరంజీవి జన్మదినం (ఆగష్టు 22)
*స్వయంకృషి కి మారు పేరు చిరంజీవి*
=======================================
ఉన్నత చదువులు కొరకు మద్రాస్ వెళ్లి సినీ రంగంలో శిక్షణ తీస్కొని శివ శంకర వర ప్రసాద్ పేరుని చిరంజీవిగా మార్చుకొని తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్లడమే కాకుండా దాదాపు తన కుటంబ సభ్యులందరినీ ఇండస్ట్రీ కు పరిచయం చేసిన రాజకీయాల్లో కూడా క్రీయాశీల పాత్ర పోషించిన పద్మభూషణ్ చిరంజీవి గారి గురించి ఆసక్తి వున్న కవులు కవియిత్రులు తమ కవితల ద్వారా తెలియజేయవాల్సింది
మీ కవితలు పంపవలసిన లింక్
https://forms.gle/d9o3eYJZo9furgq6A
ఏదైనా సాంకేతిక కొరకు 8074497926, 9121240066 సంప్రదించండి
******
సర్వేపల్లి కోటేశ్వర రావు
ఎడిటర్
పున్నమి దిన పత్రిక
9440275034
తెలంగాణ తొలిపొద్దు* కాళోజీ ఉద్యమ కవి
నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు అంటుా నినదించిన కాళోజీ...
తెలంగాణ తొలిపొద్దు*
*e కవితా సంకలనం*
శీర్షిక .
ఉద్యమ పోరాటకుడు.
--------------------------------
కాళోజీ..
తెలంగాణా ఉద్యమ ప్రతిధ్వని.
రాజకీయ చైతన్య సమాహార ప్రజాకవి.
, అనుభవం ఒక చోట, అధికారం ఇంకొకచోట..
అంటుా నిజాం నిరంకుశత్వ పాలనకు
వ్యతిరేకంగా పోరు సల్పిన
స్వాతంత్ర్య సమర యొాధుడు.
"ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ళ కలయిక"-
అంటుా అక్షర జ్యోతిని ప్రజ్వలించిన---
"ఆంధ్ర సారస్వత పరిషద్ వ్యవస్థాపక " సభ్యుడు.
చావు పుట్టుకల మధ్య బ్రతుకంతా , దేశంకోసమే..
అంటుా ఉద్యమించిన "పద్మవిభూాషణుడు".
అతని దేశభక్తి కై తెకంగాణా ప్రభుత్వం ,ప్రజలు,
అతని జన్మదినాన్ని "భాషోత్సవదినోత్సవంగా "
జరుపుకుంటుా అతని దేశభక్తికి పట్టంగట్టేరు.
"నా గొడవ", కావ్యంతో ' అక్షర తుాణీరాలను
సంధించిన తెలంగాణ" ప్రజా ఉద్యమ పోరాటకుడు---
రచయిత కాళోజీ .
----------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------------
టంగుటుారి ప్రకాశం.భారత సమర సింహం.
టంగుటుారి ప్రకాశం.
భారత సమర సింహం.
శీర్షిక .
భారత సమర సింహం.
-------------------------------
తుాటాలకు భయపడని
మహోగ్ర సమర సింహం.।
"సైమన్ " కమీషన్ వ్యతిరేక
ప్రదర్శనల పోరాటాలకు బలం.॥
ప్రత్యేకాంధ్ర సాధనలో
ముందుండి పోరాడిన వీరుడు. ।
సహాయ నిరాకరణోద్యమాల
ప్రదర్శనా సమర్ధుడు.॥
అవక-తవకల సవరింపుల
విచార సంఘాద్యక్షుడు.
యుద్ధ వ్యతిరేకతకై పోరాడిన-
"సత్యాగ్రహ "నాయక ప్రముఖుడు.॥
"క్విట్ ఇండియా" ఉద్యమ యొాధుడు.
అసమాన త్యాగ నిరతుడు.
నమ్మిన సిద్ధాంతాలకు
కట్టుబడి నిలచిన త్యాగముార్తి.॥
భుాస్వాముల అక్రమాలు
అరికట్టిన పౌరుష పోరుల పులి.
ఆత్మాభిమానం అతని వ్యక్తిత్త్వం.
టంగుటుారి ప్రకాశం పంతులు-
స్వాతంత్ర్య పోరాటాల "అంద్ర కేసరి."
---------------------------------------------
రచన, శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------
జీవితాల్ని మలచిన విశ్వకర్ముడు.
ఈ వేమన కవితా నిలయం లో అహ్వాన పత్రిక....మెయిల్ కి పంపినది.
గురు వందనం.
24/8/2020
శీర్షిక .
జీవితాల్ని మలచిన విశ్వకర్ముడు.
--------------------------------------------
ప్రతీరోజుా పొట్ట కుాటికై వేట.
నాన్న లేని నాపై బాధ్యతల ముాట.
భారమైన బతుకు ముళ్ళ బాట.
పధ్నాలుగేళ్ళకే పేపర్ బోయ్ గా
ఇంటింటి గుమ్మాల వేట.॥
రోజుా నన్ను గమనిస్తున్న ఆగంతకుడు .
నన్ను స్కుాలులో తిరిగి చేర్పించిన దేముడు.
అతనే మా పాఠశాల లో, మంచి ఉపాధ్యాయుడు.
ఫీజు అడగక నా జీవితాన్ని మలిచిన విశ్వకర్ముడు.॥
ప్రతీ అనాధనుా దగ్గర చేర్చుకొన్న వైనం-
అతని హృదయ వైశల్యానికి నిదర్శనం..
ఆగని చదువుల బాటలో అతడే
అందరి ఆశల సోపానం.॥
ఉన్నత పదవుల కలల సాకారం ,
అతని విద్యా- వినయ బోధనల, జ్ఞాన కారణం.
మా అందరి మనసుల్లో ఉత్తమ గురువుగా
నిలిచిపోయిన వందనీయమైన ఆతని చిత్రం .
ఏనాటికీ మర్చిపోలేని జీవిత ఋణానుబంధం
----------------------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
--------------------
Tuesday, August 25, 2020
SP..బాలసుబ్రహ్మణ్యం గురించి
Sunday, August 23, 2020
*మధురిమలు* నూతన కవితా ప్రక్రియ .నియమాలు.
*మధురిమలు* నూతన కవితా ప్రక్రియ
రూపకర్త: *ఈర్ల సమ్మయ్య*
నియమాలు:
1. ఇందులో 4 పాదాలు ఉంటాయి.
2. 7 - 12 మాత్రల్లో ఏదైనా ఒక సంఖ్యను మాత్రమే ఉపయోగించాలి.
3. 1,3 & 2,4 పాదాల్లో అంత్యానుప్రాసను వాడాలి.
4. 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.
5. అన్ని పాదాల్లో అంత్యానుప్రాసను వాడవచ్చు.
6. లఘువు (I) ను ఒక మాత్ర గాను, గురువు (U) ను రెండు మాత్రలు గాను లెక్కించాలి.
7. రోజుకు ఒక కవిత మాత్రమే రాయాలి.
గురుదేవోభవ మంచి కవిత
మెరుపులు...ఉదాహరణ
Saturday, August 22, 2020
"తేనియలు" అనే సాహిత్య ప్రక్రియ నియమాలు
Thursday, August 20, 2020
ఈ కవిత ఎక్కడకు పంపనిది . కరోనా పై కవిత.
శీర్షిక .
కఠిన సత్యం.
------------------
అనందంగా సాగుతున్న జీవితాల్లోకి
అర్ధాంతరంగా ప్రవేశించిన అపశృతి.
చేసిన అకృత్యాల, నిష్క్రుతి లేని
పాప ఫల ఉధృతి.॥
నిర్ముాలన కానరాని కణ జాల విస్తృుతి.
ముాగ జీవుల బాధా భరిత కన్నీటి
ఆక్రోశాల మృత కణాల ఆకృతి.
కరోనా మహమ్మరీ విఝృంభణల వ్యాప్తి.॥
దేశ -విదేశాల్లో మారణ హోమాల స్థితి .
వందలు, వేలు, లక్షల్లో శవ దహనాల దుస్థితి.
బయ కంపనాల, గృహ నిర్బంధాల లో
దేశ జనాభా పరిస్థితి.॥
మాస్క్ చాటు ముాతులు
,నిర్మానుష్య బాటలు ,
స్తంభించిపోయిన వేటలు,
కర్మాగారాల ముాతలు.॥
మనిషి -మనిషికి మధ్య నిలిచిపోయిన
బంధానుబంధాల రాకపోకలు.॥
స్వార్ధం నిండిన మనిషి అలోచనలకు -
వినిపించే గీతార్ధసారాల నీతులు.
సంప్రదాయ ఆచరణల,
శుచి శుభ్రతల బాటలు.॥
ఎవరికి ఎవరుా లేరన్న నిజం
అంట రాని వారుగా మిగిలిపోయిన సత్యం
మన ఆచరణలే మనకు ఆరోగ్యదాయకం.
మత ద్వేషాలు లేని సమానత్వ జీవనం.
మన ఆనందాల జీవ సంజీవనం ॥
అహింసాచరణల ఆదర్శ జీవితమే
శాంతి సౌఖ్యాల బాటకు సోపానం.
నిత్య నియమాల స్వశ్ఛ జీవనం
ఆరోగ్య నిలయమైన దేశోన్నతికి కారణం.
----------------------------------------------------
రచన, శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహారాష్ట్ర .
8097622021.
-----------------------
వందే మాతరం..ఎక్కడకు పంపనిది
ఉదయ దీపావళి పోటీకి పంపినది.
శీర్షిక
వందే మాతరం నినాదం-
శాంతి పోరాట ఆయుధం.
----------------------------------
ఈ నాడు, సంవత్సరానికి ఒక్క సారి
మనం చేసే ,స్వాతంత్ర్య దినోత్సవం.
వందే మాతరం నినాదాలతో సాధించిన
శాంతియుత పోరాట సందేశాల సంబరం ॥
.ఈ నాడు మనం ఎగరేసే "ఝండా" చరిత్ర వాస్తవం---
ఆలనాటి ఎందరో త్యాగ ముార్తుల స్వాతంత్ర్య పోరాటాల -జీవిత బలిదానాలకు "సాక్షి చిహ్నం".॥
దేశ, మత విభజనలకు ,వ్యతిరేకంగా ,చేసిన నిరసనోద్యమ పోరాటాల స్ఫుార్తి-
"వందే మాతరం".దేశభక్తి గీతం.
బానిసత్వపు సంకెళ్ళను ఛేదించి
భారత దేశానికి పుార్తి స్వాతంత్ర్యాన్ని
సమకుార్చిన శాంతి ఉద్యమాల శక్తి
ప్రకంపనం "వందే మాతరం నినాదం".
నా దేశం...సమత మమతల నిలయం.
ఎందరో త్యాగముార్తుల జ్ఞాపకాల-నిత్య నిర్మల సకారాత్మక వలయం.ముాడు రంగుల మువ్వన్నెల కేతనం మన దేశపు కీర్తి -కిరీటం.
-------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021.
----------------------
గురువందనం...మెయిల్ చేసిన కవిత.
గురుదేవోభవ.
శీర్షిక .
గురు దక్షిణ.
--------------------
చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.
స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.
హోమ్ వర్క్ చేయలేదని
మాష్టగారు వేయించే గోడకుర్చీ..
నాన్నగారు,,మాష్టగార్ల మధ్య నున్న
స్నేహబంధపు బాధ్యతాయుత అలోచన-
నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.
ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.
నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడి
మాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.
నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.
పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.
మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .
తప్పక చదివిన చదువుకు సార్ధకత.
ఉత్తమ ఉద్యోగ సాధకత.
లక్షల జీతానికి వలస ప్రయాణం.
ఐనవారందరికీ చేసిన దుారం.
ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.
మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.
జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.
ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి పాప ప్రక్షాళన.
ఈ నాడు కనిపించని నా గురువుకు
నేను చేస్తున్న మనఃపుార్వక పాదాభి వందనార్చన..
నా పిల్లలను గురు భక్తి పరాయణులుగా
తీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .
----------------------------------------------------------------
చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------
అటల్ బిహారీ వాజ్పేయి.జయ శంకర్ సారస్వత సమితికి పంపినది.
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు, తెలంగాణ .
8097622021.
శీర్షిక .
అటల్ జీ.
-------------
భారతికి రత్నమై భాసిల్లు రేడితడు
దేశమేలిన మంత్రి దీన జన బాంధవుడు.
పార్లమెంటుకు ప్రాతినిధ్యతను వహియించి
రాజ్యసభను ఏలె జనసంఘ అద్యక్షులు.
భరతావనికి మేలు సేవలందించి, ఘన
"భరతరత్నమై "వెలిగె "రాజకీయ భీష్ముడు."
సాహిత్య రంగాన సార కవితలనల్లు
సరళ కవి శ్రేష్ఠుడీ "పద్మభుాషణుడు".
పురస్కారములనెన్నొ పుర్ణుడై గ్రహియించె
పుణ్య చరితుడు అటల కార్యదీక్షాపరుడు.
గౌరవమ్ముల నొందు లోకమాన్యులు వీరు.
"అటల్ బిహారి వాజ్పేయి" కీర్తి సంపన్నులు.
---------------------------------------------------------
హామీ...
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని ,
నా స్వీయ రచన.
-----------------------
పింగళి వెంకయ్య. ఝండా రుాపకర్త.
రచన ,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ..మహారాష్ట్ర .
8097622021
---------------------
శీర్షిక.
ఝండా సృష్టికర్తకు-
వేల జే జేలు.
--------------------
పలు భాషలను నేర్వ పరదేశములకేగి
మేటి విద్యల నేర్చె కీర్తి ఘనుడు.
భుాగర్భ శాస్త్రము ల పరిశోధనలు జేసి
కీర్తి కెక్కిన మేటి చారిత్ర కారుడు.
జాతీయ ఝండాకు రుపకల్పన జేసి
జాతి గౌరవము నిలుపు ఖ్యాతి గౌరవుడు.
"జాతీయ పతాక" మను గ్రంధ రచనను
ఆంగ్లమున రచియించె, సమరయొాధుండు.
జాతిపిత జాడల లొ వెన్నంటి నడచేడు.
ఆంధ్రోద్యమము చేయ ముందు నిలచేడు.
జాతీయ ఝండాకు రుాపకర్తలు వీరు
స్వాతంత్ర్య ఉద్యమా సమర యొాధులు వీరు.
దేశమును ప్రేమించు త్యాజధనులలొ ఒకరు
"పింగళ శ్రీ వేంకయ్య" నామధేయులు వీరు.
ముాడు రంగుల ఝండ మచ్చటగ నిలిపేటి
సమర యొాధుల కివియె "వే జేల అంజలులు" ॥
-------------------------------------------------------------
ఇలవెలసిన దేముళ్ళు. గురువులు.
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------
శీర్షిక .
ఇల వెలసిన దేముళ్ళు.
------------------------------
అక్షర జ్ఞాన ప్రదాతలు.
నిరక్షరాస్యత కు నిర్ముాల కారకులు.
సమ దృష్టి హిత జ్ఞాన ప్రకాశకులు.
సమ సమాజ నిర్మాణ మార్గదర్శకులు.
విద్యార్ధులను భరత పౌరులుగా తీర్చి దిద్దిన
ఆదర్శభావాల ఆచార్య దేవతలు.
అక్షర చైతన్యం నిండిన సరస్వతీ పుతులు.
ఈ నాటి మన ఉన్నతికి కారకులైన
ఉత్తమ భావి భవిత నిర్మాతలు. అటువంటి-
గురుదేవులందరికీ సాదర ప్రణామములు.
-----------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------
మాయమైపోతున్నాడు మనిషి . పాట.
మొగ్గలు ..నుాతన ప్రక్రియ
Wednesday, August 19, 2020
మాయమై పోతుండు మనిషి*
Tuesday, August 18, 2020
చిలక పలుకులు...జుాలై నెల అంశాలు.
*నూతన సాహిత్య ప్రక్రియ.. చిలక పలుకులు* 🌹 *సృష్టికర్త .. చిలక మారి తిరుపతి*
9640908491
💐💐💐💐
జులై మాసం రోజువారి అంశాలు ఒకరోజుకు ఒకటి మాత్రమే పంపాలి.
1. దేవుడు
2. సృష్టి
3. విశ్వం
4. అనంతం
5. అగ్ని
6. వాయువు
7. నీరు
8. నింగిలో రంగుల హరివిల్లు
9. నేలను దున్ని
10. ప్రకృతి పరవశం
11. విపత్తు ఆపుట
12. వినాశనం కొరకు
13. అద్భుతం చేయు
14. వరం అందుకో
15. ఆలోచన హద్దులు
16. ఆకాశం అనంతం
17. మనోనేత్రం తెరువుకు
18. మరుపు విరుపు
19. బుద్ది చేత గొప్ప
20. త్యాగం గుణం
21. మనస్సు పరుగులు
22. హృదయం విశాలం
23. కల చెదిరింది
24. కళ కళ కోసమే
25. సాహిత్యం సృజించు
26. విచిత్రం చూడు
27. విరోధితో వద్దు స్నేహం
28. మిత్రుడు కావ్యం
29. శ్వాస నిశ్శబ్దం
30. ప్రాణం పరిధి
31. ఆత్మ ప్రయయాణం
. ---------------------------
23. కల చెదిరింది..
---------------------------
లంచం తీసుకుంటుాం ఉంటే , గుండె అదిరింది.
ఇంటి బాధ్యతల బరువు , తప్పు లేదంది.
నిద్ర లో మనసు , నిలదీసింది.
కల చెదిరింది , మనసు గెలిచింది. ॥
24. కళ, కళ కోసమే..
----------------------------
నాలో ఎన్నో కళలున్నాయి
బాధ్యతల బరువుతో, అణచివేసాను
కాలం తో పాటు ,మది లో కోర్కె మేల్కొంది
కళ, కళ కోసమే...అంటుా, తట్టి లేపింది.॥
-------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
------------------------------
25. సాహిత్యం సృజించు.
--------------------------------
వేల గ్రంధాల మేలు ముత్యాల సిరి.
పుస్తకాల్లో నిక్షిప్తమైన జ్ఞాన నిధి.
మేటి కవుల రచనా ప్రవాహాల ఝరి.
సాహిత్య సృజన ,భావ వికాశ పెన్నిధి.
--------------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
------------------------------
26. విచిత్రం చుాడు.
-----------------------------
గృహ నిర్బంధ నియమాల జీవితం.
పాటించక పోతే జీవితం సమాప్తం .
కరోనా మహమ్మారి కనపడని విచిత్రం.
సాంప్రదాయ పద్ధతులే సుాత్రం.॥
---------------------------------------------
-రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------
27.విరోధి తో స్నేహం వద్దు.
-------------------------------
చెప్పుడు మాటలు విన వద్దు.
తప్పుడు తోవలు నడవొద్దు.
అబధ్ధమెపుడుా ఆడొద్దు.
విరోధి తో నెపుడుా స్నేహం చేయొద్దు. ॥
---------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
8097622021.
---------------------
28.మిత్రుడు కావ్యం.
-----------------------------
ఘంటశాల గారి గొంతు శ్రావ్యం
చదువు చెప్పే గురువు పుాజ్యం.
భువిలో అన్నదాత రైతు మన సేస్తం.
మంచి మితృని మాటలనంత కావ్యం.
-----------------------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
8097622021.
---------------------
30 . ప్రాణ పరిధి.
-------------------------
క్షణ భంగురం జీవితం.
సాటి మనిషి కష్టంలో చేయుాత నిద్దాం.
ప్రాణం పరిధి , భగవంతుని లిఖితం.
స్నేహ భావంతో మెసులుదాం.
------------------------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
--------------------------
31.ఆత్మ ప్రయాణం
--------------------
మనిషిలో ఉన్న విమర్శనాత్మక శక్తి--
జీవుని శరీరంలో భాగ మైన ఆత్మ .
శరీరంలో ఆత్మ ప్రయాణ సుాక్తి
మంచి- చెడు విమర్శల పరమాత్మ॥
---------------------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
--------------------------
31.ఆత్మ ప్రయాణం.
-----------------------------
మనం చేసే పాప పుణ్యాలు
ప్రసాంత జీవన్ముక్తి కి సోపానాలు.
మరణం తరువాత ఆత్మ చేసే ప్రయాణం.
స్వర్గ , నరక ప్రాప్తికి కారణాలు.
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర) .
---------------------------
7/13, 09:23] iswarimurthy:
చిలక పలుకులు
మేలి అద్బుత ప్రక్రియలు
కిల కిలల, చే ,కులుకులు
ఇల నిండు పారిజాతాలు ॥
రచన , శ్రీమతి ,
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ (మహారాష్ట్ర ).
[7/13, 09:26]
iswarimurthy
------------------
చిలక పలుకులు వేల వేలు
మేలి అద్బుత ప్రక్రియలు
కళ కళల, చే , జాలువారు
ఇల నిండు సుమ పారిజాతాలు ॥
-----------------------------------
రచన , శ్రీమతి ,
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ (మహారాష్ట్ర
31.ఆత్మ ప్రయాణం
--------------------
మనలో ఉన్న విమర్శనాత్మక శక్తి.
జీవుని శరీరంలో భాగ మైన ఆత్మ .
శరీరంలో ఆత్మ ప్రయాణ సుాక్తి
మంచి- చెడు విమర్శల పరమాత్మ
మనసు దిగులు కవిత
Monday, August 17, 2020
గురుదేవోభవ*
Saturday, August 15, 2020
గజల్
పత్రికల వెబ్ సైట్లు
స్నేహం పై కవిత.
పెన్నా రచయితల సంఘం వారికి పంపిన కవిత
చిలక పలుకులు ఆగష్ట్ అంశాలు.------------------------------------------------
చిలక పలుకులు ఆగష్ట్ అంశాలు.
------------------------------------------------
*నూతన సాహిత్య ప్రక్రియ.. చిలక పలుకులు* 🌹 *సృష్టికర్త .. చిలక మారి తిరుపతి*
9640908491
💐💐💐💐
ఆగస్టు మాసం రోజువారి అంశాలు ఒకరోజుకు ఒకటి మాత్రమే పంపాలి.
1. చదువు
2. పదవి
3. అందం
4. ఆనందం
5. ఉద్యోగం
6. వ్యాపారం
7. ప్రేమ
8. స్నేహం
9. మౌనం
10. వివాహం
11. గౌరవం
12. ఐశ్వర్యం
13. సేద్యం
14.చెరువు
15. తరువు
16. గురువు
17. భక్తి
18.అభిమానం
19. ఆరాధన
20. ఓదార్పు
21.సెలయేరు
22. ఐక్యత
23. కుటుంబం
24. కవిత్వం
25. శిల్పం
26. స్వదేశం
27. విదేశం
28.అమ్మ
29. నిరీక్షణ
30. పరిక్ష
31. ఆవేధన
---------------
1