Friday, August 14, 2020

అచల వృత్తం . కొత్త ప్రక్రియ

[8/14, 15:14] +91 98858 71464: వాన

అచలవృత్తం.

చిటపటచినుకులు
బొటబొటపడినవి
పటుతరపరుగుల
చటులముయతనము.


చిటపటతొలగెను
నటునిటుతిరుగక
తటిలతమరుగున
పటిమలుచినుకులు

ఇటునటుకనుచును
దిటవునహలమును
దిటవున.పొలమున
పటపట కదలిరి


అటతడి ,పొలముల
జటితిగ తగులగ
మటువగతొలగెను
కటకట.వెతలవి
 పటపటపనులను
నటనట యొనరిచి
తటముననిలబడి
వటతరువదిగనె

దిటవునశనగలు
ఎటుగనమినుములు
లొటలొటపదములు
ఫటఫటమొలకలు

అటునిటుతొలకరి
ఎటుగన.హరితము
 ఘటికలొ ,ఘనమయె
తృటి నవి ,వెతలును
పటపట పరుగిడె.

డా.గాయత్రీదేవి
[8/14, 15:42] +91 78423 68534: చాలా బాగుంది మేడం. మిమ్మల్ని అడగాలి అనుకున్న 
నియమాలు. అన్ని లఘువుల తో బాలకృష్ణ ఇష్టపది రెండేళ్లు 
క్రితం రాశాను.
[8/14, 15:55] +91 98858 71464: అచలవృత్తము.
శీర్షిక:విష్ణుస్తుతి.

హరిహరిమురహరి
నరహరిమరిమరి
వరశుభగుణయుత
ధరనిను ,తలతును.

  పగలవితొలగగ
నగవులువిరియగ
నగధర యనయము
జగతిని జయమిడు


సిరిమరియురమున
మురియుచునిలచిన
పరముడవరదుడ
కరములనతులివి.

అసురులనణచగ
విసుగదినెరుగక
రుసరుసరణమున
పసగని ,పరుగిడె

సురనదిజననము
వరమదిజనులకు
అరయగనఖిలము
ధరణినిమధురము

కరివరుకభయము
మరువకనొసగిన
సరిసరి సములట
నరయగ ,కనమిట.


డా.గాయత్రీదేవి

No comments:

Post a Comment