Monday, August 31, 2020

ఈ వేమన కవితా నిలయంకు పంపినవి.

[8/27, 05:52] iswarimurthy: *ఆగస్టు నెల*
రెండోపక్షానికి కవితల పోటీ కు
*అన్నదానం*
అంశంపై ఈ ఆగస్టు నెలాఖరు 31 తేదీ లోగా
20 లైన్స్ మించని కవితలు పంపగలరు

         🙏ఈవేమన🙏


  శీర్షిక .
శ్రేష్ట దానం--
అన్నదానం.
----------------
అన్ని దానాల్లోకి అన్న దానం
 శ్రేష్ట  మన్న మామ్మ.
ఇంటికి ఎవరొచ్చినా కడుపు నిండా
 అన్నం పెట్టే అమ్మ.
రాత్రి కాగానే  అమమ్మ  కధల్లో  
అన్నపుార్ణ గా డొక్కా సీతమ్మ.
తీర్ధ యాత్రలకు వెళుతుా --
అకలితో అలమటిస్తున్న 
కొంత మందిని  చుాసి, వారి
ఆకలి తీర్చాలంటుా వెనుతిరిగిన
డిక్కా సీతమ్మగారి దాన గుణ కధనం
అన్నార్తులకు అన్నం పెట్టడం
భగవంతుని పుాజ కన్నా ఉత్తమం.
అనే మాటలు...
నా మనసులో నాటుకున్న  
మంచి భావాల విత్తులు.
నా జీవితంలో నేను పొందిన ఆనంద ధనం.
అన్నార్తులిచ్చే ఆశీర్వాదాల బలం.
"అన్న దానం" భగవంతుని పుాజ సమానం.
కడుపు నిండిన వారి ఆశీర్వాదం
వేల యజ్ఞ -యాగాల సార ఫలం.
----------------------------------------
రచన, శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------------
[8/28, 11:02] iswarimurthy: దేశభక్తిగీతం.
కల్యాణీ రాగం
-------------------

తల్లి భారతి తరలివచ్చెను 
కావ్య మంజరి కవితలా..
మేలు మువ్వల సడుల ,సరిగమ 
సప్త స్వర జతి , పదములా.॥

తెలుగు వెలుగై తరలి వచ్చెను 
పలుకు తేనెల సుధలతో 
మల్లె మాలల మధుర సౌరభ 
మొప్పు మాటల  కళల తో ||

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

సస్యశ్యామల వర్ణమది 
ఆ మేని గిరులా ఒంపులూ...
పైరు,పచ్చని చీరకట్టెను 
,ప్రకృతి పడతీ సొంపులూ...॥

నీలి మబ్బుల కురుల నిండెను 
మిణుకుతారల మాలలూ..
సూర్య, చంద్రుల కాంతి కన్నుల 
కరుణ నిండిన చూపులూ.. ॥

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

వేద ఘోషలు పుణ్య గాధలు 
తల్లి   నడిచెడు  పథములు 
తెలుగు  తల్లికి  వెలుగునిచ్చే 
కీర్తి చంద్రిక తారలు ||

తేటగీతులు , ఆటవెలదులు 
కంద సీసపు మాలలు 
తెలుగు పద్యపు పాదములనిడు 
మేలి సిరి సిరి మువ్వలు ||

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

విజయనగర  కాకతతీయుల 
ఖ్యాతి ఆమెకు వైభవం 
రత్నగర్భ గ పేరు తెచ్చెను 
కోటి నిధుల ప్రాభవం ||

జాతి కవులుగ పేరు గాంచిన 
సుతుల కీర్తులె తేజము 
ఆంధ్ర కేసరి వంటి సుతులకు 
మాత ఒడి తరు కల్పము॥

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

త్యాగరాయ శ్రీ రామదాసు 
,వాగ్గేయకారుల కీరితీ...
పుణ్యచరితపు మేటి 
రత్నాలాయె ఆమెకు సంతతీ...॥

గాంధి, నెహృ వంటి నేతలు 
నిలుప శాంతీ, సౌఖ్యమూ ..
వీర గతినే పొందు సుతులకు 
మాత ఒడి తరుకల్పము...॥

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

మేలు సంస్క్రుతి నిండు ధనమే 
తెలుగు తల్లికి భరణము 
సంప్రదాయ సంగీత గీతులె 
వన్నె తెచ్చెడి సద్ధనం ||

కూచిపూడి నాట్య సంపద 
కొలువు  దీరిన  వైభవం 
తెలుగు దనమే మనకు అభయం 
తెలుగు బాట అదే స్వర్గం. 

తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం. ॥

-----------------------------
రచన.  శ్రీమతి 
పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .

*****

No comments:

Post a Comment