Wednesday, August 19, 2020

మాయమై పోతుండు మనిషి*

*పల్లవి:-*

*మాయమై పోతుండు మనిషి*
*మనిషిలా మరడా తెలిసితెలిసి*
ఎవరు రాసినరో ఈ మనిషి రాత ఎవరు గీసినారో నీ నుదిటి గీత...
పుట్టేది ఏనాడో తెలిసిన మరణించుట ఏనాడో తెలియదు...
*ఓ ఓ ఓ మనిషి...*
నీ జీవితం నీటిమీద అలల బుగ్గ  లాంటి ది నీ పయాణం...

*చరణం:- 1*

ఉయ్యాల ఊగితే జోలపాట అంటారురా..
ఊపిరి ఆగితే ఏడుపు పాట అంటారురా...  
కన్ను మూస్తే వెలుగురా  కను తెరిస్తే  చీకటిరా...
బంధాలు బంధుత్వాలు దూరమై మట్టిలోనా కలవక తప్పదురా...
*ఓ ఓ ఓ....మనిషి*
నీ జీవితం నీటిమీద అలల బుగ్గలాంటిది నీ పయణం....

*చరణం:- 2*

పట్టు పరుపుపైన పొర్లిన నీవు..
మట్టిపరుపులోన నిన్ను పెట్టక తప్పదురా...
పంచపరమన్నలు తిన్న నీవు...
మట్టెనిన్ను తింటాదిరా ఓ నరుడా..
*ఓ..ఓ...ఓ..మనిషి*
ధనము రాదు నీవెంట డబ్బు రాదురా నీతోడు బొందలగడ్డే నీ అస్థిరా...

*చరణం:- 3*

పరుగులు పెట్టె గాలులు దారిన పారే నదులు ఎవ్వరికోసము అగవురా...
కాలంతో పరుగులు పెడుతున్న రోజులురా
పరుగు పెట్టించు ప్రయాణాన్ని చరిత్రలో నీకంటూ ఒక పేజి మిగలాలిరా..
*ఓ.ఓ.ఓ మనిషి*
రంగులలోకలో నువ్వే రారాజు కావాలిరా ఓ మనిషి....

--//-///-///--///------/////---/-/

*బేతు సునీల్ యాదవ్*
భూపాలపల్లి

No comments:

Post a Comment