Monday, August 31, 2020

చిలకపలుకులు ఆగష్ట్ అంశాలు.

చిలక పలుకులు ఆగష్ట్ అంశాలు.
------------------------------------------------
*నూతన సాహిత్య ప్రక్రియ.. చిలక పలుకులు*  🌹 *సృష్టికర్త .. చిలక మారి తిరుపతి*
964090849

.చదువు

2. పదవి
3. అందం
4. ఆనందం
5. ఉద్యోగం
6. వ్యాపారం
7. ప్రేమ
8. స్నేహం
9. మౌనం
10. వివాహం
11. గౌరవం
12.. ఐశ్వర్యం
13. సేద్యం
14.చెరువు
15. తరువు
16. గురువు
17. భక్తి
18.అభిమానం
19. ఆరాధన
20. ఓదార్పు
21.సెలయేరు
22. ఐక్యత
23. కుటుంబం
24. కవిత్వం
25. శిల్పం
26. స్వదేశం
27. విదేశం
28.అమ్మ
29. నిరీక్షణ
30. పరిక్ష
31. ఆవేధన
---------------


.చదువు.

-----------

జ్ఞానం పెంచేటిది చదువు.

వెల లేని నిధి నిక్షేపాల కొలువు.

సంస్కార, జ్ఞాన వికాశానికి నెలవు.

సాహిత్య సంస్కృుతి ఇల తీపి మధువు.

__---------------------------------------

రచన, శ్రీమతి. 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర.

8097622021

---------------------------

2.  పదవి.

. ------------

పదవి, సామాజిక రక్షణ కై చేపట్టేది.

ప్రజల అభ్యున్నతి కై ఆరాట పడేది .

బాసల బాటలో నిష్ట పాటించేది

ఆదర్శపు పోరాటంలో ఆహుతయ్యేది.

----------------------------------------------

రచన, శ్రీమతి. 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర

8097622021.


3. అందం

  -------------

సౌందర్యానికి మించినది, సంస్కారం .

చెప్పే మాటకు,తీయని పలుకు అందం. 

బాహ్య రుాపానికి మించిన అందం ,సద్గుణం,

అందరి లో గౌరవింపబడేది, వ్యక్తిత్వం .

--------------------------------------------------

రచన, శ్రీమతి. 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర

8097622021.


4.ఆనందం

--------------------

ఎల్లలు లేనిది అమ్మ అనురాగం.

పరీక్షల్లో పాసైతే  ఎంతో ఆనందం.

చిన్న నాటి జ్ఞాపకాలు అపుార్వం.

పవిత్రమైనది వివాహ బంధం.

---------------------------------------

రచన, శ్రీమతి. 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర

8097622021.

------------------------

5.ఉద్యోగం.

------------------

అదృష్టం ఒక యొాగం.

నేను చేసేది చిన్న ఉద్యోగం.

తెలివి బతుకు తెరువుకు ఉపయొాగం.

జ్ఞానం ఉంటే అనుభవిస్తావు భోగం.

5. ఉద్యోగం.

----------------------

ధనార్జనకై చేసేది ఉద్యోగం .

జీవనాధారమై తృప్తినిచ్చేది.

ధనార్జన ఒక యొాగం.

ఆత్మ విశ్వాసాన్ని పెంచేది.

--------------------------------------

రచన, శ్రీమతి. 

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహరాష్ట్ర

8097622021

---------------------

6.వ్యాపారం.

-----------------

శీర్షిక.

వ్యాపారం.

-------------

నేడు  ప్రతీదీ వ్యాపారమయం.

ప్రతి ఒక్కరి లో ధన దాహం.

న్యాయాన్యాయాల ప్రసక్తి సుాన్యం.

లాభ నష్టాల రిబేజే జీవితం.

--------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

----------------------

7. ప్రేమ.

------------

ప్రేమ , నేటి యువత భ్రమించే అంగడి .

చెట్టా పట్టా లేసుకు తిరగడం సందడి.

పెళ్ళి  పేరుతో మొదలయ్యే అలజడి.

జీవితాల , చితుకు బాటల ఒరవడి.


రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

-----------------------

ప్రేమ ,రెండు మనసుల కలయిక .

సుఖ దుఃఖాలు పంచుకునే భావిక.

జీవిత సహచర్యపు  ప్రణయ దీపిక.

ఆనందపు ఆగమనాల జ్ఞాపిక.

-------------------------------------

శీర్షిక.

8..స్నేహం.

---------

అన్ని బంధాలకుా అతీతమైనది స్నేహం.

కుల మత బేధాలెరుగని ఆత్మానుబంధం.

ఒంటరివైన క్షణం  "ఒదార్చే హస్తం" స్నేహం.

కష్టం వస్తే నేనున్నాననే  "ధైర్యం" స్నేహం.

-----------_------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

-----------------------

9.మౌనం.

----------

నిండుకుండ తొణకదన్న  సత్యం.

మౌనం, జ్ఞానులకు నిలువెత్తు భుాషణం.

మౌనం , శాంతియుత పోరాటం.

ఎన్నో సమస్యలను ఖండించే ఆయుధం.

---------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

------------------------

10 . వివాహం.

---------------------

వివాహం,సమాజపరమైన ఒప్పందం .

పరస్పర అవగాహనల సంబంధం.

రక్షణ, సంరక్షణ ,బాధ్యతల బంధం.

ఒకరికి ఒకరమన్న, నమ్మక ధైర్యం.

-------------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

----------------------

11. గౌరవం.

--------------------

గౌరవం , ఇచ్చి ,పుచ్చుకునేది.

సత్ ప్రవర్తనతో సాధించుకొనేది.

అహంకారం తో, డబ్బుతో కొనలేనిది. 

మాట తీపి, మంచితనం తో వచ్చేది.

-------------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

------------------------

12. ఐశ్వర్యం.

-------------------

స్త్రీ కి అణకువ ,అందం,ఐశ్వర్యం.

చదువు , జ్ఞానసముపార్జనైశ్వర్యం.

సంస్కారం , సమాజవ్యవహారావసరం.

ఐశ్వర్యం (ధనం) బతకడానికి అవసరం.

------------------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

--------------------

13..సేద్యం.

------------------

రైతు చేసేది సేద్యం.

డాక్టర్లు చేసేది వైద్యం.

ప్రకృతి లో పచ్చదనం  ఆరోగ్యకరం

మితి మీరిన తిండి రోగ లక్షణం .

----------------------------------------

రచన ,శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.  మహారాష్ట్ర.

8097622021.

-------------------4

.14.  చెరువు.

--------------------
మంచి నీటి కై చెరువుల ఉపయొాగం.
అఖిల జనావళి కి జీవామృత పానం.
జల -జీవ -జంతువులకు ధామం
గంగా జలం ప్రకృతి సంపదలకు వరం.॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
15. తరువు.
------------------
తరువులు ఇల కల్ప వృక్షాలు.
పచ్చదనం పంచే   ప్రకృతి అందాలు.
ప్రాణ వాయువు నిచ్చే జీవామృతాలు
పచ్చని పంటలు,  బతుకు సారాలు॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
16.. గురువు.
----------------
గురువులు విద్యా బోధకులు.
నిరక్షరాస్యత ను దుారంచేసేవారు.
భావి  జీవిత మార్గ దర్శకులు.
బంగరు భవిష్యత్ప్రదాతలు..॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
17..భక్తి.
--------------------_----
భక్తి , శ్రధ్ధాభిమానాలకు మించినది .
భగవంతుని పై నమ్మకం కలిగించేది.
తల్లిదండృల ఋణం తీర్చుకోగలిగేది.
గురువులపై గౌరవాన్ని చుాపించేది.॥
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
18.అభిమానం.
---------------------
మనసులో, మమత సారం అభిమానం.
అమ్మా- నాన్నలతో  ఉన్న ప్రేమ పాశం.
అక్కా చెల్లెళ్ళ మనసు నొప్పించని బంధం.
స్నేహితులతో ఏర్పడిన అనుబంధం.
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-----------------------
19. అంశం.
ఆరాధన 
----------
పెంచి పోషించిన  దేముడి రుాపాలైన-
అమ్మా ,నాన్నంటే అనురాగం నిండిన ప్రేమ.
తలిదండృల రుాపంలో తరలి వచ్చిన-
దైవం అంటే భక్తి నిండిన ఆరాధన.

20. ఓదార్పు.
-------------
కష్టాల్లో, సాయం చేసే చేయి ఓదార్పు.
బాధల్లో, ధైర్యం నింపే స్నేహం ఓదార్పు.
విపత్తులో, విత్త దానం మనిషికోదార్పు.
అనారోగ్యం లో, వైద్యుల వైద్యమొాదార్పు.
------------------------------------------------------+
రచన,  శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------
21 .సెలయేరు.
--------------------
స్వచ్ఛమైన తేనీటి సెలయేళ్ళు.
పచ్చని పంటల నిండు కళ-కళలు
పుాల పరిమళపు మేలి ఘుమ-ఘలు.
పల్లెలో నిండిన పారవశ్యపు అందాలు.॥
---------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్   మహరాష్ట్ర .
8097622021.
---------------------
22.శీర్షిక .
ఐకమత్యం.
----------------
ఐకమత్యం మహాబలం .
కలసి ఉంటే కలదు సుఖం.
భన్నత్వం లో ఏకత్వం.
అందికే , చుాపించకు ఎన్నడుా బేధ భావం.॥
.---------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------
23. కుటుంబం.
----------------------
భారతదేశం , మన  సమిష్టి కుటుంబం.
ప్రతీ స్త్రీ కీ , ఇవ్వాలి గౌరవం.
అదరం కలిసుంటే ,ఆనంద నిలయం.
భరత మాత బిడ్డలం, .మనమందరం.
------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------

24..కవిత్వం.
-------------------
హృదయ భావాల దర్పణం , కవిత్వం.
సాటివారి ఆటు-పోట్ల  స్పందన చిత్రం
ఆలోచింపజేసే అక్షరం తుాణీరం.
చైతన్య , సమాహారం, కవితోద్యమం.
-----------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.

25 . శిల్పం
-------------------
.రాయిని, కాలితో తన్నిన వారే
చెక్కిన రాయిని  దైవంగా పుాజిస్తారు.
చదువు , సంస్కారం లేనపుడు తిట్టే వారే
హోదాలో ఉన్నపుడు సలాం కొడతారు.॥
---------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
---------------------
26. స్వదేశం.
------------------------
స్వ దేశంలో  స్వతంత్రంగా బతకొచ్చు.
బతుకు భారం., అనువు కాని చోటే.
మనింట్లో,  కాళ్ళు జాపుకు పడుకోవచ్చు.
వేరే వారింట్లో భోగం, ముాణ్ణాళ్ళ ముచ్చటే.
-------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.

27..విదేశం.
----------------
విదేశ వస్తు వ్యామొాహం విడవాలి.
స్వ దేశ  భక్తి తో  మెలగాలి.
అన్ని భాషా, మతాలనుా, ఆదరించాలి.
మన మాతృభాషను గౌరవించాలి.
--------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
-------------------------------------------
28. అమ్మ.
----------------
అమ్మ , అమృత తత్త్వానికి నిదర్శనం .
సృష్టి కి ప్రతి సృష్టి అమ్మన్నది వాస్తవం.
మనందరం భరత మాత బిడ్డలం.
ఇద్దరినీ గౌరవించి తీర్చుకుందాం ఋణం.॥
------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.

29. నిరీక్షణ.
----------------
కాలం స్తంభించింది కరోనా కాటుకు,
మనుషుల మధ్య దుారం పాటించనందుకు-
  కేసులు ఎక్కువయ్యేయి , నిర్ణక్ష్యం వేటుకు.
  అసహనపు నిరీక్షణ వేక్సిన్ రాకకు .
  --------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021.
----------------------
30.పరీక్ష.
-------------
జీవితమే ఒక రంగుల వలయం.
కాలం  పెట్టిన పరీక్షా సమయం .
కరోనా విఝృంభణ ,జవాబు లేని భయం.
సుచి,- సమయపాలనలే మన- కభయం.
----------------------------------------------**
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .

31.ఆవేదన.
-----------------
అంతరించిపోతున్న విలువల వలన,
మనోవ్యధ నిండిన హృదయావేదన.
నా,నీ ల మధ్య నలుగుతున్న  భావన.
ఆనందాగమనాల ఆశల నిరీక్షణ ॥
----------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .

1.మలయసమీరం.
----------------------
మధురానగరిలొ మలయసమీరం
మొాహన మురళీ గాన విలోలం.
బృందావన తీర కేళీ  వినోదం.
గోపీ లోలం కృష్ణం , గోపాల బాలం.॥

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహరాష్ట్ర .

No comments:

Post a Comment