ఈ వేమన కవితా నిలయం లో అహ్వాన పత్రిక....మెయిల్ కి పంపినది.
గురు వందనం.
24/8/2020
శీర్షిక .
జీవితాల్ని మలచిన విశ్వకర్ముడు.
--------------------------------------------
ప్రతీరోజుా పొట్ట కుాటికై వేట.
నాన్న లేని నాపై బాధ్యతల ముాట.
భారమైన బతుకు ముళ్ళ బాట.
పధ్నాలుగేళ్ళకే పేపర్ బోయ్ గా
ఇంటింటి గుమ్మాల వేట.॥
రోజుా నన్ను గమనిస్తున్న ఆగంతకుడు .
నన్ను స్కుాలులో తిరిగి చేర్పించిన దేముడు.
అతనే మా పాఠశాల లో, మంచి ఉపాధ్యాయుడు.
ఫీజు అడగక నా జీవితాన్ని మలిచిన విశ్వకర్ముడు.॥
ప్రతీ అనాధనుా దగ్గర చేర్చుకొన్న వైనం-
అతని హృదయ వైశల్యానికి నిదర్శనం..
ఆగని చదువుల బాటలో అతడే
అందరి ఆశల సోపానం.॥
ఉన్నత పదవుల కలల సాకారం ,
అతని విద్యా- వినయ బోధనల, జ్ఞాన కారణం.
మా అందరి మనసుల్లో ఉత్తమ గురువుగా
నిలిచిపోయిన వందనీయమైన ఆతని చిత్రం .
ఏనాటికీ మర్చిపోలేని జీవిత ఋణానుబంధం
----------------------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
--------------------
No comments:
Post a Comment