Sunday, August 23, 2020

గురుదేవోభవ మంచి కవిత

జె.కృష్ణయ్య,
రంగారెడ్డి జిల్లా.
చ.వా: 9441864640

శీర్షిక: *బడిలోన పంతుళ్ళు*(గేయం)

************************************

పల్లవి:

బడిలోన పంతుళ్ళు కొందరు
మా మదిలోనే మెదులూతుంటరు
వారి అడుజాడలో నడువమంటరు
మా జీవితాలకే వెలుగు లవుతరు

                                "బడిలోన"

1.చరణం:

మా అమ్మానాన్నలేమో మమ్ముగన్నరు
వారు చదువు-సంధ్యలు లేకున్నరు
చదువురాకమేము తల్లడిల్లుతుంటే
తల్లిదండ్రులోలే అక్షరాలు నేర్పుతుంటరు

                                "బడిలోన"
                         
2.చరణం:

బ్రతుకు భారమైన బాధలెన్నియున్న
వారు వాడవాడన తిరుగుతుంటరు
చదువులమ్మ తల్లి సారస్వతమ్మ
ఒడిలోకి రమ్మని వాళ్ళు అంటరు

                                "బడిలోన"

3.చరణం:

మా ప్రతిభను కళలను గుర్తిస్తరు
మా జీవితాలకే బాటలవుతరు"2"
మా కన్నవారికన్న గురువులే మిన్ననీ
లోకమంతా వారిని పూజిస్తరు

                                "బడిలోన"

4.చరణం:

మా మాటలల్లో పలుకుతుంటరు
మా పాటలల్లో పుడుతువుంటరు
ఏ బళ్ళుచూసినగాని గుళ్ళుచూసినగాని
ఆ గురువులే గుర్తొస్తువుంటరు

                               "బడిలోన"

5.చరణం:

ఆదేశాలు అంటూ జారిచేస్తరు
వాళ్ళ కాలమైపోయిందంటరు
బదిలీలు వారిని చేస్తువుంటరు
మా బంధాలనే తెంచుతుంటరు

                                "బడిలోన"

6.చరణం:

బాధపడ పోకండి గురువులూ
మా బ్రతుకూకే మీరాదెరువులు
మా ఎదలోన మేం దల్చుకుంటము
మా బడిలోన మిమ్ము పూజిస్తము

                                "బడిలోన"

No comments:

Post a Comment