Thursday, August 20, 2020

ఈ కవిత ఎక్కడకు పంపనిది . కరోనా పై కవిత.

శీర్షిక .
కఠిన సత్యం.
------------------
అనందంగా సాగుతున్న  జీవితాల్లోకి
అర్ధాంతరంగా ప్రవేశించిన అపశృతి.
చేసిన  అకృత్యాల, నిష్క్రుతి లేని
పాప ఫల  ఉధృతి.॥
నిర్ముాలన  కానరాని  కణ జాల విస్తృుతి.
ముాగ జీవుల బాధా భరిత కన్నీటి
ఆక్రోశాల మృత  కణాల  ఆకృతి.
కరోనా మహమ్మరీ విఝృంభణల వ్యాప్తి.॥
దేశ -విదేశాల్లో  మారణ హోమాల స్థితి .
వందలు, వేలు, లక్షల్లో శవ దహనాల దుస్థితి.
బయ కంపనాల, గృహ నిర్బంధాల లో
దేశ జనాభా పరిస్థితి.॥
మాస్క్ చాటు ముాతులు
,నిర్మానుష్య బాటలు ,
స్తంభించిపోయిన వేటలు,
కర్మాగారాల ముాతలు.॥
మనిషి -మనిషికి మధ్య నిలిచిపోయిన
బంధానుబంధాల రాకపోకలు.॥
స్వార్ధం నిండిన మనిషి అలోచనలకు -
వినిపించే గీతార్ధసారాల నీతులు.
సంప్రదాయ ఆచరణల,
శుచి శుభ్రతల బాటలు.॥
ఎవరికి ఎవరుా లేరన్న నిజం
అంట రాని వారుగా మిగిలిపోయిన సత్యం
మన ఆచరణలే మనకు ఆరోగ్యదాయకం.
మత ద్వేషాలు లేని సమానత్వ జీవనం.
మన  ఆనందాల జీవ సంజీవనం ॥
అహింసాచరణల ఆదర్శ జీవితమే
శాంతి సౌఖ్యాల బాటకు సోపానం.
నిత్య నియమాల స్వశ్ఛ జీవనం
ఆరోగ్య నిలయమైన దేశోన్నతికి కారణం.
----------------------------------------------------
రచన, శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహారాష్ట్ర .
8097622021.
-----------------------

No comments:

Post a Comment