Thursday, August 6, 2020

భరత భుామి పై కవిత.

🔯విష్ణు సూక్తి 🔯
-డా. గుడిసేవ విష్ణుప్రసాద్ అవనిగడ్డ 9441149608
1.
శ్రీలువెలసినట్టి సిరిసంపదలభూమి
భవ్యమైచెలంగు భరతభూమి 
పూర్వవైభవంబు పూరింపగారమ్ము! 
విశ్వజనహితోక్తి! విష్ణుసూక్తి!! 
2.
సహనశీలమైన సంస్కారకేంద్రంబు
దార్శనికులగన్న ధర్మభూమి
భారతీయజన్మ బహుదుర్లభంబురా
విశ్వజనహితోక్తి! విష్ణుసూక్తి!! 
3.
విశ్వమానవులకువెలుగుచూపినభూమి 
నాగరకతనేర్పి నడుపుభూమి 
విశ్వజననియనుచు విఖ్యాతిగన్నది
విశ్వజనహితోక్తి! విష్ణుసూక్తి!! 
4.
వెలసెనిచటవేద వేదాంగములుజూడ
వేదభూమియనుచు పేరుగాంచె
జ్ఞాననేత్రి గాదె జననిభరతమాత
విశ్వజనహితోక్తి! విష్ణుసూక్తి!!
5.
సాధుసంతులంత సంతరించినభూమి 
జ్ఞాన సంపదలను. జగతికొసగె
భరతభూమియనిన భగవంతుభూమిరా! 
విశ్వజనహితోక్తి! విష్ణుసూక్తి!!

No comments:

Post a Comment