Friday, August 28, 2020

మణిపుాసలు నియమాలు

[8/17, 12:12] +91 94413 50137: *మణిపూసల నియమాలు*

1) మణిపూసలో నాలుగు పాదాలుంటాయి.

2) 1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస మరియు 10, 11, 12 మాత్రల నుండి ఏదైనా ఒక సంఖ్యనే ఉపయోగించాలి. అనగా ఈ పాదాల్లో మాత్రలు సమానంగా ఉండాలి. 

3) 3వ పాదానికి అంత్యానుప్రాస ఉండరాదు.10 నుండి 12 మాత్రలుండాలి.

4) 3, 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.

【లఘువు(I)ను ఒక మాత్రగా, గురువు(U)ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు.】

*ఉదా:*

ప్రేమను పంచని సతి
U  l  l   U  l  l  l  l
2  1 1  2  1 1 1 1=10

బాధ్యత మొయ్యని పతి
U  l   l   U   l    l   l  l
2  1 1   2   1  1  1 1=10

ఉన్నలాభ మేమిటయ్య
U l   U l   U  l U  l
2 1  2 1  2  1  2 1=12

ఇడుములు బాపని మతి
l  l    l   l   U  l l   l  l
1 1  1 1   2  11 1 1=10

*******************

మంచితనం పంచుదాం
U   l  l  U    U  I   U
2  1 1  2     2 1  2=11

మలినగుణం తుంచుదాం
I  I  I  I  U    U  I  U
1 11 1  2    2  1  2=11

మనిషికొక్క మొక్కనాటి
I  I  I U I   U  I  U  I
1 11 2 1  2  1  2  1=12

మరువకుండ పెంచుదాం
I  I   l   U  I   U  I  U
1 1 1 2  1   2 1  2=11

*******************

మణిపూసల కవులకంత
I   I  U  I  I  I  I  I U I
1 1  2  1 1 1 11 2 1=12

చదువుచున్న జనులకంత
I  I  I   U I   I  I  I  U I
11 1   2 1 1 1 1  2 1=12

వందనాలు వందనాలు
U  I  U  I   U  I U  I
2  1  2 1   2 1 2  1=12

ప్రోత్సహించుఘనులకంత
U  I  U    I   I   I  I U  I
2  1 2    1  1  1 1 2 1=12


*వడిచర్ల సత్యం*
మణిపూసల సృష్టికర్త
7989511543.
[8/17, 12:12] +91 94413 50137: 🙏చిన్న మనవి🙏


 *అందరికీ నమస్కారం!*



*నా పేరు ఏ. ఉమాదేవి*.
*నేను సిద్దిపేట గురుకుల కళాశాల* *యందు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను*.
*మాకు బోధనలో మెళకువలకై  తేది 03/6/2019 నుండి 08/6/2019 వరకు 6 రోజులు, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని Hrdc  విభాగమందు శిక్షణ ఇచ్చారు*.
*అందులో భాగంగా ఏదైనా ఒక అంశముపై సూక్ష్మ బోధన* *చేయమనగా నేను,  నేను వ్రాసిన "మణిపూసల"ను పాఠ్యాంశముగా* *ఎంచుకొని, వివరించగా అక్కడవున్న నాలాంటి వందకుపైగా వున్నఅధ్యాపకులు  నూతన ప్రక్రియను* *పరిచయంచేసినందుకు నన్ను అభినందించి,  లక్షణాలు వ్రాసుకున్నారు* 
*ఇంతవరకు విననటువంటి ప్రక్రియ అన్నారు*
*మనవంతు కృషిగా మణిపూసలను అందరికీ పరిచయం చేయాలని  నా మనవి*.

*నా మణిపూసల పాఠం వీడియోను కూడా మీకు వీలైతే చూడగలరు.*

No comments:

Post a Comment