Friday, August 14, 2020

రచన:రామకృష్ఞ స్పందన**సంగీతం: కలగ కృష్ణ మోహన్**ప్రసారం: ఆల్ ఇండియా రేడియో అన్ని కేంద్రాలు**సందర్భం:స్వాతంత్ర్య దినోత్సవం*

🌹🌹🌹🌹 *మన సమూహానికి*🌹🌹🌹🌹💐💐💐☘️🍀🌳🌲🌿🌹🌸🌺🌷🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬
 *స్వాతంత్ర్య దినోత్సవ* *శుభాకాంక్షలతో.* 
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮



*రచన:రామకృష్ఞ స్పందన*
*సంగీతం: కలగ కృష్ణ మోహన్*
*ప్రసారం: ఆల్ ఇండియా రేడియో అన్ని కేంద్రాలు*
*సందర్భం:స్వాతంత్ర్య దినోత్సవం*





పల్లవి: ధరణి ఒడిలో అంకురించిన 
త్యాగధనుల పుణ్య ఫలము

ధీర గుణముతో ఘీంకరించిన
మూడు వన్నెల నేల తలము

మురిసి మెరిసిన తరుణము
జనని భారతి చరితము

II ధరణి II


చరణం:1

కడలి అంచులుదాటి కలిసి
నడిచినా స్వరాజ్య కాంక్ష

మన్ను మిన్ను ఏకమై
పోరాడినా సంకల్ప దీక్ష

శిరస్సువంచి అస్తమించిన
పరుల పాలన బానిసత్వం

యుగయుగాల వీర గాథగ
నిలిచి తెలిపిన ఏకతత్వం

మురిసి మెరిసిన తరుణము
జనని భారతి వదనము

II ధరణి II


చరణం:2

వేద ధాత్రిలో వెలసినా 
శాంతి సహనం మనకు స్ఫూర్తి

సత్యం శివం సుందర 
శోభితం మన జాతి కీర్తి

అసేతు హిమాచలము 
ఆధ్యాత్మిక ప్రణవము 

వేష భాషల వైరుధ్యం
భిన్న కళల సౌందర్యం

మురిసి మెరిసిన తరుణము
జనని భారతి గమనము

II ధరణి II


-------- *Lyric: Ramakrishna Spandana* ------

No comments:

Post a Comment