Saturday, August 22, 2020

"తేనియలు" అనే సాహిత్య ప్రక్రియ నియమాలు

తేనియలు అనేవి సాహిత్యంలో ఒక ప్రక్రియ,దానికి సంబంధించిన సమూహంలో నేను ఉన్నాను మిత్రులారా,దాంట్లో ప్రతి రోజు కనీసం ఒక ఐదు వరకు పంపుతున్నాను..అది తెలియక మన సమూహం లో కొందరు మిత్రులు ఇవి పద్యాలు అనుకోని వేరేలా అంటున్నారు,కానీ అవి కావు..నాకు పద్యాలు రాయడం రావు..నేర్చుకుంటే ఏదైనా రాకపోతుందా కానీ ఇంకా నేను ఆ సాహసం చేయలేదు,భవిష్యత్లో చేస్తాను కానీ నేను ఇప్పుడు రాసేటివి మాత్రం తేనియలు అని చెప్పనికే ఈ సమాచారం పెడుతున్నాను..
దీనిలో...
1)పద్యంలానే నాలుగు పాదాలు ఉంటాయి..
2)ప్రతి పాదములో 13-15వరకు మాత్రలు ఉంటాయి..
3)2&4 పాదాలకు ఖచ్చితంగా అంత్య ప్రాస ఉండాలి..
ఇవి వీటి నియమాలు..
🙏🙏🙏🙏🙏

ఉదాహరణ
------------------
శుభోదయం మిత్రులారా
      🙏🙏🙏🙏🙏
          తేనియలు
    
చరిత్ర తెలుసుకోలేని వాడు...
చరిత్రను నిర్మించలేడు..
ఇది గమనించనంత కాలం..
మనిషి తనను  నిరూపించలేడు..
 
మీ..
పసుల.శంకర్
(ఇవి  డా!! బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు అన్న మాటలను గుర్తు చేస్తూ రాసిన   తేనియము)

No comments:

Post a Comment