Thursday, August 20, 2020

అటల్ బిహారీ వాజ్పేయి.జయ శంకర్ సారస్వత సమితికి పంపినది.

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు, తెలంగాణ .
8097622021.
శీర్షిక .
అటల్ జీ.
-------------
భారతికి రత్నమై భాసిల్లు రేడితడు
దేశమేలిన మంత్రి దీన జన బాంధవుడు.
పార్లమెంటుకు ప్రాతినిధ్యతను  వహియించి
రాజ్యసభను ఏలె   జనసంఘ అద్యక్షులు.
భరతావనికి  మేలు సేవలందించి,  ఘన
"భరతరత్నమై "వెలిగె "రాజకీయ భీష్ముడు."
సాహిత్య రంగాన సార కవితలనల్లు
సరళ కవి శ్రేష్ఠుడీ    "పద్మభుాషణుడు".
పురస్కారములనెన్నొ పుర్ణుడై గ్రహియించె
పుణ్య చరితుడు అటల కార్యదీక్షాపరుడు.
గౌరవమ్ముల నొందు లోకమాన్యులు వీరు.
"అటల్ బిహారి వాజ్పేయి"  కీర్తి సంపన్నులు.
---------------------------------------------------------

హామీ...
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని ,
నా స్వీయ రచన.
-----------------------

No comments:

Post a Comment