Thursday, January 7, 2021

పిడికెడు బువ్వ

అంశం..
వలస జీవనం
--------------------
శీర్షిక .
"పిడికెడు బువ్వ".
----------------------

మాయదారి రోగమంట 
మడిసికి కనపడదంట
మందుకు  లొంగదంట 
మంత్రాలకు  సిక్కదంట
మహమ్మారిలా అల్లుకుపోతదంట
యేలమంది  మడుసుల్ని, మింగేస్తదంట॥

దుడ్డున్నోడిది దొడ్డ బతుకాయె
మరి మాసుంటోల్ల గతెట్టా...
మట్టి మడుసులమాయె.
పుాట కుాలొత్తే  పొట్ట నిండేదుంటాది.॥

కట్టపడేటోల్ల పొట్టకొట్టే సిండ్రు.
యేటీ సేనీయకండా ఎల్లిపోమంటుండ్రు
పాసి  పనులకి కుాడా రానీయమని
పట్టు బట్టిండ్రు. ॥

ఇంటోల్ల పొట్ట నింపేటందుకు
వలస కుాలి పన్ల తిరుగాడేటోల్లం
బుక్కెడు బువ్వ కోసం సేత్తాం కాయ కట్టం .
మా పొట్ట కొట్టేసింది  మాయదారి రోగం ॥

సెప్పుల్లేని కాలి నడకలు.
సిల్లి గవ్వలేని సితికిన బతుకులు.
ఆకలి సావులు ,సితికి నోచుకోని శవాలు.
కోసెడు దుారాల కుాలి బతుకులు॥

గవర్నమెంటోళ్ళు గద్దె నెక్కి
గిన్ని పధకాలు పెట్టేమంటుండృు.
గరీబోల్లం, గాయన్నీ నమ్మి
గోసంత నోటుకి గల్లంతై ఓటు నేసేస్తుండె
గెలిసి నోడు గెలిసినట్టే గెలిసి
గల్లంతు సేసి , మా దార్లు ముాసేత్తాండు.॥.

మా గోస యినేటోల్లు యెవులుా లేరా..?
మా కడుపులు నిపంపేటోల్లు లేరా.?
కారుతున్న  కొపంల్లో, పుట్టెడు మందిమి
సగం సచ్చి బతుకుతున్నం.
పిడికెడు బువ్వెట్టుండ్రి మీ కాల్మొక్కుతం.॥

----------------------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------

వెలుగుదివ్వెలు.

1/10/2020.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
బంగారు భవిత.

కరోనా సంక్షోభం పెరుగుతున్న సమయంలో
తమజీవితాలను రోగుల సేవకై అంకితం
చేసిన ప్రతి ఒక్కరుా నిన్నటి బాలలే..
వారి పెంపక బాధ్యతను మనం
సక్రమంగా నిర్వర్తించ గలిగితే 
నేటి బాలుర లో కొందరు  వైద్యులు -
కొందరు బాధ్యత గల పౌరులు ,పోలీసులు
కొందరు దేశ  రక్షక సిపాయిలు గానే కాక
వివేకానందులు, కొందరు జషుావాలు ,
కొందరు ఉన్నతాధికారులుగా  తీర్ఛి
దిద్దబడి దేశోన్నతికే పాటుపడిన వారై
భరతమాతను  బంగారు కీర్తి కిరీటంతో
అభిషేకిస్తారు అనడం లో సందేహమే లేదు.
"నేటి బాల లే రేపటి దేశ భవిత.."
వారిని ఉత్తమంగా తీర్చి దద్దడం మన "బాధ్యత."

Wednesday, January 6, 2021

మధురిమలు

*కవులు, కవయిత్రులు మనవి*
*===================*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శతకం (108) పూర్తి చేసిన కవులు, కవయిత్రులు ఇదివరకు ఏవిధంగా ఉత్సాహంగా మధురిమలు రాశారో అదే విధంగా ప్రతి రోజు ఒక మధురిమ రాయగలరు. విభిన్న అంశాలతో వినూత్న రీతిలో ప్రజలను చైతన్యవంతం చేసే మధురిమలు రాస్తూ వాటిని విస్తృత ప్రచారం
 చేయగలరని కోరుతున్నాను.
      *- గ్రూప్ అడ్మిని*

Tuesday, January 5, 2021

సంక్రాంతి కవిత

5/01/2021.
వారంవారం కవిలో....
అంశం :సంక్రాంతి.
శీర్షిక .
సంక్రాంతి సంబరం. (పంపినది).
--------------------------

రైతులకు సంబరం సంక్రాంతి వారికో వరం.
చేతికొచ్చిన పంటతో ఇంటింట  సంబరాల తోరణం ॥
విందు వినోదాలు, నేతి ఱుచుల పిండి వంటలు
పాత వస్తువుల మంట తో చలి కాపుల భోగీమంటలు॥

బుడబుడక్కుల వారి జానపదగీతాలు.
పగటి వేషగాళ్ళకు దానధర్మాలు .
గంగిరెద్దు ఆటలు గాలిపటాల ఎగురవేతలు.॥

కంచు గజ్జెల నాట్యంతో హరిదాసుల ఆశీర్వాదాలు.
అక్షయ పాత్రలు నిండు సిరితో అందుకొనే దానధర్మాలు
సంక్రాంతి పండగ కు పెద్దల తలపుల పితృ తర్పణాలు
బొమ్మల కొలువుతో ఆడపిల్లల ఆనంద గీతాలు॥

కనుమ నాటి మినుము పిండి వంటలతో రైతులు..
పంట పనిముట్లకు, పశు సంపదకు చేసేనిండు పుాజలు
కోడిపందాలాటలు వనభోజనాల సందళ్ళు .
ముక్కనుమ నాటి  మట్టి బొమ్మల బారు కొలువులు ॥

సద్ధర్మ సాంప్రదాయాల  ఆచార పాలనం
ఆరోగ్యానందాలు నింపే మన పండగల సంబరం.
శాంతి సంతోషాల నిత్య వసంతం. ॥
--------------------------------------------------

రచన :శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహారాష్ట్ర .
8097622021.



పరిమళాలు పాటల ప్రక్రియ నియమాలు

*ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో*
*పరిమళాలు నూతన ప్రక్రియ ప్రారంభం*
https://chat.whatsapp.com/BxEeMr3hUDh0hHGEyRElNm..
🌹 *పరిమళాలు*🌹

*రూపకర్త*
*పసునూరి సంతోష్ కుమార్*

*నియమాలు*

1) *పల్లవి చరణాల తో కూడిన పాట రాయాలి*.

2) *2 చరణాలకు తగ్గకూడదు, 5 చరణాలకు మించకూడదు*.

3)  *పల్లవి తో పాటు 14 వరసలకు తగ్గరాదు, 20 వరసలకు మించరాదు*

4) *మీకు నచ్చిన అంశం మీద రాయొచ్చు*

5) *అనుపల్లవిని వాడవచ్చు వాడకపోవడం*

6) *21 పాటలు రాసిన వారికి పురస్కారం అందజేస్తాము*.

7) *వారానికి 2 పాటలు రాయాలి*.

9) *సోమవారం, గురువారాలు మాత్రమే మీ పాటలను పంపించాలి*.

10) *వివాదాస్పదమైన పదజాలం మరియు అశ్లీల పదజాలం వాడకూడదు*

పై నియమాలతో మా సంస్థ కొత్త గ్రూపును పరిచయం చేయడం జరుగుతుంది.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*9494300188*.
ప్రశాంత్ కుమార్ ఎల్మల.
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు..
https://chat.whatsapp.com/BxEeMr3hUDh0hHGEyRElNm...

నందనాలు కొత్త ప్రక్రియ.

ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో *నందనాలు* అనే *నూతన ప్రక్రియ.*
*💐రూపకర్త* 💐
*శ్రీ సాయిలు టేకుర్లా గారు*
ఉ.తె.ర.సం.ఉపాధ్యక్షులు
*నియమాలు*
1) నాలుగు పాదాలు ఉంటాయి.

2)1-3 పాదాలలో 9 అక్షరాలు ఉండాలి.

3) 2-4 తను 10 లేదా 11 అక్షరాలు ఉండాలి.

4) 1-3 పాదాలు *ఆది ప్రాస* కలిగి ఉండాలి.

5) 2-4 పాదాలు *అంత్యప్రాస* కలిగి ఉండాలి.

**ఆదిప్రాస అంటే పాదం లోని రెండవ అక్షరం*
**అంత్యప్రాస అంటే పాదం లోని చివరి అక్షరం*

ఆ *త్మ* అజ్ఞానంచే కప్పియు
దుఃఖమునకు హేతువగును *రా*
ఆ *త్మ* జ్ఞాని జ్ఞానమెరిగి
ఏ కర్మమంటక మెలగును *రా*