5/01/2021.
వారంవారం కవిలో....
అంశం :సంక్రాంతి.
శీర్షిక .
సంక్రాంతి సంబరం. (పంపినది).
--------------------------
రైతులకు సంబరం సంక్రాంతి వారికో వరం.
చేతికొచ్చిన పంటతో ఇంటింట సంబరాల తోరణం ॥
విందు వినోదాలు, నేతి ఱుచుల పిండి వంటలు
పాత వస్తువుల మంట తో చలి కాపుల భోగీమంటలు॥
బుడబుడక్కుల వారి జానపదగీతాలు.
పగటి వేషగాళ్ళకు దానధర్మాలు .
గంగిరెద్దు ఆటలు గాలిపటాల ఎగురవేతలు.॥
కంచు గజ్జెల నాట్యంతో హరిదాసుల ఆశీర్వాదాలు.
అక్షయ పాత్రలు నిండు సిరితో అందుకొనే దానధర్మాలు
సంక్రాంతి పండగ కు పెద్దల తలపుల పితృ తర్పణాలు
బొమ్మల కొలువుతో ఆడపిల్లల ఆనంద గీతాలు॥
కనుమ నాటి మినుము పిండి వంటలతో రైతులు..
పంట పనిముట్లకు, పశు సంపదకు చేసేనిండు పుాజలు
కోడిపందాలాటలు వనభోజనాల సందళ్ళు .
ముక్కనుమ నాటి మట్టి బొమ్మల బారు కొలువులు ॥
సద్ధర్మ సాంప్రదాయాల ఆచార పాలనం
ఆరోగ్యానందాలు నింపే మన పండగల సంబరం.
శాంతి సంతోషాల నిత్య వసంతం. ॥
--------------------------------------------------
రచన :శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment