[17/05, 8:18 am] +91 77998 86016: *హంసికలు నియమాలు*
[18/05, 10:20 am] +91 77998 86016: అందరికీ అభివందనం🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఇన్ని రోజులు మనం ఛందస్సులో పలు పలు గణాలను తీసుకొని కావ్యాలు రచించాము. ఇక నేడు వృత్తాలలో ఒకటైన *ఉత్పలమాల* పద్య రీతిలో నేటి మన రచనలు చేద్దాము.
నేటి ఛందస్సు ప్రయోగం :- *ఉత్పలమాల పద్య రీతిలో పరస్పరం సంబంధం కలిగిన రెండు వాక్యాలు.*
*ఉత్పలమాల :- భ , ర, న, భ, భ, ర, వ అను గణాలు ఉంటాయి. యతి స్థానం 10 వ అక్షరం . యతి ప్రాస చెల్లదు.*
మీ
*ప్రదన్య సాహితీ వేదిక బృందం*
[18/05, 10:20 am] +91 77998 86016: *గణాలు-రకాలు* :- .
అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు
*ఏకాక్షర గణాలు*
ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.
U, U, U
ఉదా: శ్రీ, శై, లం
*రెండక్షరాల గణాలు*
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. *లలము* 2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )* 4.*గగము.*
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
*మూడక్షరాల గణాలు* :-
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
అన్ని గణాలు:
*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU*
ఇవి మూడక్షరముల గణములు
*ఉపగణాలు* :
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
*సూర్య గణములు* . *ఇవి రెండు.*
న = న = III
హ = గల = UI
*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
[18/05, 2:25 pm] +91 94418 71767: *ప్రదన్య సాహితీ వేదిక*
*18-05-2023*
నేటి ఛందస్సు ప్రయోగం :- *ఉత్పలమాల పద్య రీతిలో పరస్పరం సంబంధం కలిగిన రెండు వాక్యాలు.*
*ఉత్పలమాల :- భ , ర, న, భ, భ, ర, వ అను గణాలు ఉంటాయి. యతి స్థానం 10 వ అక్షరం . యతి ప్రాస చెల్లదు.*
----------------------------------------
1)
శ్రీహరి! నీదు లీల బహు
U I I UI UI I I
చిత్రముగా నగుపించు చున్నదే
U I I U I I U I U I U
2)
ఈశ హరీశ నిన్నొదల
U I I U I U I I I
నెప్పుడునూ కలనందు
U I I U I I U I
గూడనూ
U I U
----------------------------------------
తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు
రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్,
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, షార్
సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా
చర వాణి : *9441871767*
[13/06, 10:04 am] +91 77998 86016: అందరికీ అభివందనం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
*సరళములు* :-
హాల్లులలో సులభంగా పలకగలిగేవి .
అవి *గ , జ, డ , ద, బ* లు.
ఇక నేడు వాటితో పనేముంది అని అనుకుంటున్నారా చెప్తా చూడండి , *శ్రీ పదాలు* అనే ప్రక్రియలో మనము ఇంతకు మునుపే ఎన్నో కావ్యాలను రచించాం కదా. ఆ ప్రక్రియను నేడు ఆధారంగా చేసుకొని కేవలం సరళములతో మొదలయ్యే పదాలను ఉపయోగించి నేటి మన కావ్యాలను రచించాలి.
[13/06, 10:06 am] +91 77998 86016: *శ్రీపదాలు*
1,మూడు పాదాలుంటాయి
2.ప్రతీ పాదంలోనూ మూడే పదాలుంటాయి
మొత్తం తొమ్మిది పదాల్లో శ్రీపదం పూర్తవుతుంది..
3x3=9-- లో పూర్తవ్వాలి
3. అక్షరనియమం లేదు
4. ప్రాస నియమం లేదు
సులభంగా సౌకర్యంగా భావప్రకటనకు అనుకూలంగా ఉంటుంది...!
[13/06, 10:09 am] +91 77998 86016: ఉదాహరణ :-
డబ్బు గబ్బు జబ్బు
దాసోహమనునుగా జగతి దానికి
జరుగునుగా గమ్మత్తులెన్నో దానికై