Tuesday, April 1, 2025

అనువాద సాహిత్యం. ఏనుగు లక్ష్మణకవి. అనువదించిన భర్తృహరి నీతి పద్యాలు.

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగర్ .

29/ 3 /25 శనివారం 

అంశం అనువాద కవిత్వం

శీర్షిక  : భర్తృహరి నీతి శతకం.

ఏనుగు లక్ష్మణ కవి అనువాదం.

కవితా సంఖ్య : 3 

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర (.43)

పాట


తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు వివిధ భాషల్లోని రచనలను తెలుగులోకి అనువదించారు. అలాంటి కొందరిలో  

 "ఏనుగు లక్ష్మణ కవి "ఒకరు. ఈయన

   18వ శతాబ్దానికి చెందిన కవి.

    భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రిశతిని" "సుభాషిరత్నావళి" పేరుతో తెలుగులోకి అనువదించారు.

   

 భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రిశతి "ఎంతో ప్రసిద్ధి చెందినది. దీనిలో నీతి, శృంగారం, వైరాగ్యం అనే మూడు శతకాలు ఉన్నాయి. వీటిని తెలుగులో ఎందరో కవులు అనువదించారు. వాటిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చాలా ప్రసిద్ధి చెందింది.


భర్తృహరి నీతి శతకంలోని ఈ పద్య  భావాన్ని చూద్దాం...

 

 "విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

     విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః

     విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం దైవతం

     విద్యా రాజసు పూజ్యతే న తు ధనం విద్యావిహీనః పశుః"


  భావం: 

--------

విద్య మనిషికి అందమైన రూపం. దాచి ఉంచిన గొప్ప ధనం. విద్య వల్ల భోగాలు, కీర్తి, సుఖం లభిస్తాయి. విద్య గురువులకు గురువు. విదేశాలకు వెళ్లినప్పుడు బంధువులా సహాయపడుతుంది. విద్య గొప్ప దైవం. రాజులు కూడా ధనం కంటే విద్యనే పూజిస్తారు. విద్య లేనివాడు పశువుతో సమానం.


సజ్జనుల గురించి...

----------------


  "క్షాంతశ్చేద్గుణ ఏవ కిం శరణినాం త్వం చేత్ సమర్థః కః

     దీనశ్చేత్ కతమా ధియాం గతిరహో గర్వశ్చేన్మా తే రమా

     సత్యశ్చేత్ కిము తత్సవైర్గుణగణైః సర్వేషు చేత్త్వయ్యసౌ

     దోషైకః కిము సజ్జనా యది పునస్త్వయ్యేకదా దుర్వచః"


   భావం:

--------

 ఓ సజ్జనుడా! నీవు క్షమించగలిగితే నీ ఓర్పుకు మించిన గుణం ఏముంది? నువ్వు సమర్థుడవైతే నీకు సాటి ఎవరు? నువ్వు దీనుడవైతే తెలివైనవారికి దిక్కెవరు? నువ్వు గర్విస్తే నీకు లక్ష్మీదేవి దూరమవుతుంది. నువ్వు నిజం మాట్లాడితే ఇక ఇతర గుణాలు ఎందుకు? నీలో అన్ని మంచి గుణాలు ఉంటే ఒకే ఒక చెడు మాటను ఎందుకు వినాలి?"


చాలా బాగున్నాయి కదూ పద్యాలు..

భర్తృహరి శృంగార, వైరాగ్య శతకాలలో కూడా ఎన్నో జీవిత సత్యాలను తెలిపే పద్యాలు ఉన్నాయి.



మహతీ శ్రీరామం,కవితా సంకలనం కొరకు...

మహతీ శ్రీరామం,కవితా సంకలనం కొరకు...

04/01/2025.

అంశం : శ్రీ రామ తత్వం .

( ఆటవెలది పద్యాలు:).

శీర్షిక : సకల గుణాభిసోముడు ,శ్రీరాముడు.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .


 

  ధర్మమూర్తి యతడు, ధరణినే లెడువాడు

  సత్యసంధు డతడు, సాధు మూర్తి.

  ప్రజలనేలు రాజు, ప్రేమ స్వరూపుండు

  రాము డతడు జగతి   రక్షకుండు.!!

   

రామ బాణ మదియె  రక్షించు అస్త్రము 

   దుష్ట రక్కసులను , దునుము శక్తి.

శమము లేక లంక  శాసించు రావణు-

మట్టు బెట్టి నట్టి మహిమ ఘనము.  !!


భక్తి తోడ గొలువ  భాగ్యమిచ్ఛెడు రామ -

 పదము  ముక్తి నిచ్చు  మూల ధనము.

ఏలి కతడు విడడు ఏక పత్నీ వ్రతము- 

 దాత యెపుడు  విడడు ధర్మ పథము. !! 


రామ నామ జపము, రక్షించు మంత్రము

కష్ట ములను దీర్చి కాపాడు నమ్ము.

వాయుపుత్రు హృదిని వరలేటి దేముడు .

నామ మంత్ర మహిమ నమ్మ  ఘనము !!


అన్నదమ్ములకత డాదర్శమగు స్ఫూర్తి.

పుత్ర ధర్మ మేలు పుణ్యమూర్తి    .

రమ్య మైన గాధ రామాయణమె గాద. 

రామ చరిత భువిని రసపు గుళిక.!!




----------------------------

Wednesday, March 26, 2025

శీర్షిక : "చీకట్లోంచి వెలుగులోకి "


 


మహతి సాహితీ కవి సంగమం.

17/03/2025.

 ప్రతిరోజు కవిత పండుగే..

అంశం : చిత్ర కవిత.

 

రచన : శ్రీమతి : పులాభట్ల జగదీశ్వరీమూర్తి 

కళ్యాణ్ :  మహరాష్ట్ర.

కవిత సంఖ్య :  1.

కవి సంఖ్య 43.


శీర్షిక : "చీకట్లోంచి వెలుగులోకి "

--------------------------


మనస్సులో అజ్ఞానం అనే

 మేఘాలు కమ్ముకున్నప్పుడు,

 చీకటి మన జీవితాన్ని ఆవరిస్తుంది.

 నిరాశ అనే చీకటి గుహలో, 

మన ఆత్మ చిక్కుకుపోతుంది.

 అహంకారం అనే చీకటి కోటలో, 

ఒంటరితనం మనల్ని బంధిస్తుంది.

ద్వేషం అనే చీకటి అడవిలో, 

మన హృదయం భయంతో వణుకుతుంది.

హింస అనే చీకటి నదిలో,

 మన ఆశలు మునిగిపోతాయి.కాని ,

జ్ఞానం అనే సూర్యుడు ఉదయించినప్పుడు, 

చీకటి మాయమవుతుంది.

 ప్రేమ అనే వెన్నెల వెలిగినప్పుడు, 

మన మనస్సు శాంతిని పొందుతుంది.

 కరుణ అనే కిరణాలు తాకినప్పుడు, 

మన హృదయం తేలికవుతుంది.

 శాంతి అనే జ్యోతి వెలిగినప్పుడు, 

మన ఆత్మ ప్రకాశిస్తుంది.

 ఆత్మజ్ఞానం అనే కాంతిలో, 

మనం నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాము.

ఈ ప్రయాణం అంతర్గతమైనది, 

మన మనస్సు లోపల జరిగే మార్పు.

 ఇది ఒక నిరంతర ప్రక్రియ, 

ప్రతిరోజూ మనం చీకటిని జయించి 

వెలుగులోకి రావడానికి ప్రయత్నించాలి.

 ఈ ప్రయాణంలో, జ్ఞానం, ప్రేమ, కరుణ, శాంతి,

 ఆత్మజ్ఞానం మనకు మార్గనిర్దేశం చేస్తాయి.

 ఈ ప్రయాణం ముగిసినప్పుడు, 

మనం నిజమైన సంతోషాన్ని, శాంతిని పొందుతాము.

అజ్ఞానం అనేది మాయ, ఇది మనల్ని

 సత్యం నుండి దూరం చేస్తుంది.

 జ్ఞానం అనేది సత్యం, 

ఇది మనల్ని మోక్షం వైపుకు నడిపిస్తుంది.

 చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం అంటే, 

మాయ నుండి సత్యానికి, 

అజ్ఞానం నుండి జ్ఞానానికి ప్రయాణం.

 ఈ ప్రయాణంలో, గురువు యొక్క మార్గదర్శకత్వం, 

గ్రంథాల అధ్యయనం, ధ్యానం, యోగా 

వంటి సాధనలు మనకు సహాయపడతాయి.

 ఇలాంటివి పాటించడం వల్ల మన మనసు, 

శరీరం, ఆత్మ ,శుద్ధి అవుతాయి.

-------------------------

శీర్షిక : స్వర్గానికి నిచ్చెన.

మహతి సాహితీ కవి సంగమం.

 ప్రతిరోజు కవిత పండుగే..

అంశం : చిత్ర కవిత.

 శీర్షిక : స్వర్గానికి నిచ్చెన.

రచన : శ్రీమతి : పులాభట్ల జగదీశ్వరీమూర్తి 

కళ్యాణ్ :  మహరాష్ట్ర.

కవిత సంఖ్య :  1.

కవి సంఖ్య 43.


మానవత్వం మరువని మదిలో,

కరుణా జలధి పొంగు వేళ,

నిస్వార్థపు సేవ నిరతం సాగగా,

స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా.!!


అహంకారం విడనాడి, ప్రేమను పంచగా,

ద్వేషం మాని, మైత్రిని పెంచగా,

సహనం, క్షమ గుణములు అలవరచుకోగా,

స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా !!


జ్ఞానం అనే దీపం వెలిగించగా,

అజ్ఞానం అనే చీకటి తొలగించగా,

సత్యం, ధర్మం మార్గంలో నడవగా,

స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా !!.


ప్రతి జీవిని ప్రేమతో చూడగా,

ప్రకృతిని తల్లిలా ఆరాధించగా,

సేవయే జీవిత పరమార్థమని తెలుసుకోగా,

స్వర్గానికి నిచ్చెన చేరువౌనుగా.!!


--------------------------

ఈ రచన నా స్వీయ కవిత.

అంశం: మూడు కోతులు.


కవన కిరణాలు

17/03/2025

అంశం: మూడు కోతులు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .




మూడు కోతులు, మూడు నీతులు,

సమాజమనే రంగస్థలంపై,

వారి నాటకం, మనకు పాఠం,

చెడును చూడకు, వినకు, మాట్లాడకు.

మొదటి కోతి, కళ్ళు మూసుకొని,

చెడును చూడనని శపథం చేసి,

అంధకారంలో జీవిస్తూ,

సమాజపు చీకటిని విస్మరించింది.

రెండవ కోతి, చెవులు మూసుకొని,

చెడును విననని ప్రతిజ్ఞ చేసి,

నిశ్శబ్దంలో జీవిస్తూ,

సమాజపు ఆర్తనాదాలను విస్మరించింది.

మూడవ కోతి, నోరు మూసుకొని,

చెడును మాట్లాడనని ప్రమాణం చేసి,

మౌనంలో జీవిస్తూ,

సమాజపు అన్యాయాలను విస్మరించింది.

ఈ మూడు కోతులు, నిజంగా తెలివైనవా?

లేక, భయంతో పారిపోయిన పిరికివాళ్ళా?

సమాజపు సమస్యలను చూడకుండా,

వినకుండా, మాట్లాడకుండా,

వాటిని పరిష్కరించగలమా?

కాదు, కాదు, ఎప్పటికీ కాదు!

కళ్ళు తెరిచి, చెవులు విప్పి, నోరు విప్పి,

సమాజపు చెడును చూడాలి, వినాలి, మాట్లాడాలి,

అప్పుడే, మనం మార్పును తీసుకురాగలం.

Tuesday, March 25, 2025

శీర్షిక : కర్తవ్యం.




మహతి సాహితీ కవి సంగమం.

ప్రతీరోజు కవితా పండగే.

24/03/2025.

అంశం :  చిత్ర కవిత.

శీర్షిక : కర్తవ్యం.

కవిత సంఖ్య 1.

రచన :శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 

కళ్యాణ్ :  మహరాష్ట్ర...(43).




అమ్మ మాటల్లో నాన్న కబుర్లు.

దేశ సిపాయిగా పోరాడే గాధలు. 

వింటున్న కొద్ది వినాలనిపించే కథలు.

పాప తలపుల్లో నాన్న పై పెరిగే వలపులు !!


పాప చిరు జ్ఞాపకాలలో వెన్నెల దీపం. 

రెండేళ్లై ఇంటికి రాని నాన్న అందమైన రూపం.

తను చెప్తున్న మాటలు వింటున్న సంతోషం

నాన్న కురిపిస్తున్న మురిపాల ముద్దులు వర్షం.!!


పాప దృష్టిలో  నాన్న ఒక పెద్ద "హీరో".

ఎంతో  మంది నాన్న ముందు "జీరో."

 నాన్న దేశానికే "బ్యాక్ బోన్ "

చిట్టి తల్లి  ఊహల్లో నాన్నో  "సూపర్ మాన్ "!!


కలత నిద్దురలో కనిపించే బొమ్మలు.

పాప ఆడే ఆటల్లో మురిపించే మువ్వలు.

చేతుల నిండా తీపి మిఠాయి, చాక్లెట్లు.

నోరూరించే ఇష్టమైన చిరుతిళ్ల ప్యాకెట్లు !!


నాన్న రాక కోసం చిన్నారి ఎదురుచూపులు.

 తెల్లారితే తీరనున్న ముద్దు మురిపాలు. 

తొలికోడి కూతతో, వెలుగు నింపిన కిరణాలు

ఆలస్యం భరించలేని అమృత క్షణాలు.!!


తీసి ఉంచిన తలుపుల దగ్గర నాన్న రూపం. 

మడచిన నాన్న చేతుల్లో తన కలల సామ్రాజ్యం.

బహుమతుల  సంచులకు  పలికే స్వాగతం.

నాన్న ఒడి చేరిన ఆత్రుతకు నిదర్శనం.!!


క్షణం తర్వాత తెలిసిన నిజం. 

తనను దగ్గరకు తీసుకోలేని 

నాన్న నిస్సహాయత్వం. 

బాధ్యత గల సిపాయిగా .

దేశం కోసం నాన్న చేస్తున్న 

త్యాగానికి  దక్కిన ఫలం .!!


"దేశభక్తి" అంటే ఏమిటో తెలిసిన 

పాప కళ్ళలో భావోద్వేగం.

రక్తసిక్టమై తెగిన నాన్న చేతులకు

తన చేతులు ఇస్తున్న ధైర్యం .!!


"సిపాయి కూతురుగా నా కర్తవ్యం

వారసురాలిగా  నేనున్నానన్న "

నా నిర్ణయానికి నాన్న కళ్ళల్లో 

కోటి వెలుగుల ఆనందోత్సవం !!



Saturday, March 22, 2025

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ,




ప్రేయసి,  ప్రేయసి, పేదవాడను నేను......



తెలుగు వెలుగు సాహిత్య వేదిక ,

అంశం.ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా 

 

ప్రపంచ కవితా దినోత్సవం 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .



ప్రపంచ కవితా దినోత్సవం

  కవితలో మధురిమలు, కమ్మని రాగాలు,

 అక్షరాల అలలతో, హృదయ స్పందనలు-

  భావాల ఒడిలో, పదాల పల్లకీలు.!!


 ఊహల రెక్కలతో, ఎగిరే పక్షులమై

 ప్రేమ, విరహం, ఆనందం, వేదనల,

 భావ సమ్మేళనలు,  నిండే కవితా గానం-

మనసు భావనలకిడే స్వాంతన సందేశం !!


  ప్రకృతి అందాలు, మనిషిలోని భావాలను

వెలికితీసీ వర్ణించే, కవితా కళా స్వరూపాలు 

  అంతర్జాతీయ భాషల్లో, ప్రాంతీయ యాసల్లో,

వెలుగు  నింపుతున్న  అక్షర స్వరూపాలు!!



 కవుల కలాల , జాలువారే  కవితాక్షరాలు,

మన హృదయాలను, తాకే ఆనంద తీరాలు.

భావ సమర్పణల   అక్షరారాధనలు  

గౌరవ పురస్కారాలు నిండిన  కవితా దినోత్సవాలు,!!

  


Monday, March 10, 2025

స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు.
  శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు కలయిక అని చెప్పవచ్చు.నేదునూరివారిలోని రాగభావం,పశుపతిగారి గాత్రంలోని శ్రుతిశుద్ధం,బాలమురళివాణిలోని లాలిత్యం కలబోసిన బాణి వీరిది.
అన్నమయ్య చేసిన పదార్చనకు గరిమెళ్ళవారి రాగాలు 'బంగారానికి తావి' అనిపిస్తాయి.150 కి పైగా రాగాలను తీసుకొని,800 కు పైగా సంకీర్తనలకు వైవిధ్యభరితంగా బాణీలు కట్టిన ఘనత వారిది.ఆయన స్వరపరచిన అన్నమయ్య సంకీర్తన వింటుంటే,సాహిత్యం,దానికి తగ్గ సంగీతం జతగా కలసి,మెలసి,'అన్నమయ్య మనతో మాటాడుతున్నారా!' అనిపిస్తుంది.
     మోహన,హిందోళ,శుద్ధధన్యాసి వంటి రాగాలలో సాధారణంగా ఎవరు స్వరపరచినా పరిమితమైన అవే సంగతులు కనబడతాయి.కానీ గరిమెళ్ళవారు ఒకదానికొకటి భిన్నమైన స్వరప్రయోగాలతో,సాహిత్యంలో ఒదిగిపోయే విధంగా స్వరం సమకూర్చటం విశేషం.ఔడవ(5 స్వరాల) రాగాలలోనే ఆయన అధిక భాగం స్వరపరిచారు.
     ఇక,ఆయన సృష్టించిన రాగాల విషయానికొస్తే సుందరరంజని,వాణీప్రియ,చిత్ర కల్యాణి వంటి రెండుపదుల రాగాలను, వినూత్న భావావిష్కరణలకు ఆలవాలమయేట్లు ఆయన సృజించారు.ఇది ఆయన మరో నవ్య శోధన…
  ఆయనకు మృదంగ వాదనంలోను ప్రవేశం ఉంది...
    తిరుమల తిరుపతి దేవస్థానముల రికార్డింగ్ ప్రాజెక్టు ఎక్ష్పర్ట్ కమిటీ సభ్యుడినైన నా అనుభవంలో తెలుసుకున్నది ఏమంటే గరిమెళ్లవారు రూపొందించిన సిడిలకు కళ్లు మూసుకొని ఆమోదం తెలపటం తప్ప మరో ఆలోచన అనవసరం..అంత  ప్రామాణికంగా ఉంటాయి అవి..  
     5000 కు పైగా విశ్వమంతా పర్యటించి,ఆయన నిర్వహించగా శ్రోతలు బ్రహ్మరథంపట్టిన ప్రదర్శనలు, 'అన్నమయ్య సంకీర్తన మహతి','అన్నమయ్య నాద జ్యోతి' వంటి లెక్కకు మిక్కిలియైన బిరుదాలు,
సమర్పించిన అసంఖ్యాక ఆడియో సీడీలు...ఇవన్నీ ఒక ఎత్తు అయితే,ఆయన రచించి,స్వరపరచి,గానంచేసిన లలితగీతాలు మరొక ఎత్తు.  మహానుభావుని పై చాలా చక్కని వ్యాసాన్ని అందించారు సుధాకర్ గారూ. చాలా చాలా ధన్యవాదాలు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి "శివపద" కీర్తనలను స్వరపరచి ఆలపించడం కూడా. దాదాపుగా 150 శివపద కీర్తనలను వారు స్వరపరచి ఆలపించడం జరిగింది.అవి నిజంగా ఆణిముత్యలే..మధురభావ తరంగాలే...
    గరిమెళ్ళవారు స్వరసహితంగా వెలువరించిన స్వీయ రచిత ఆంజనేయ కృతిమణిమాల,వినాయక కృతులు,నవగ్రహ కృతులు,సర్వదేవతా స్థుతి రచనలు...అనేకం బహుళ జనాదరణ పొందాయి.
  గరిమెళ్ళవారి గళం వినబడని ఆకాశవాణికేంద్రం లేదు... భక్తిరంజని కార్యక్రమం లేదు.
  దేశమంతటా పర్యటించి,'అన్నమయ్య నాదయజ్ఞాలు' ఎన్నో విజయవంతంగా నిర్వహించారు.
   తిరుమలకొండపై ఒక భక్తుడు స్వామి దర్శనార్థమై వచ్చి నిలుచున్నప్పుడు,ఏమూల ఉన్నా,ఏ చోటనున్నా, గాలిఅలలపై తేలివచ్చే గరిమెళ్ళవారి గళం చెవికి సోకగానే, మధురానంద భరితుడవటం తథ్యం..తిరుమల తిరుపతి దేవస్థానానికి అంకితమైనారు గరిమెళ్లవారు...
     వారి గాన కచేరీలెన్నో ప్రత్యక్షంగా విన్న భాగ్యవంతుణ్ణి.తాను ఏది పాడినా,ఆ పాటలోని ప్రతి మాటను,రాగంలోని ప్రతి సంగతినీ స్ఫటికమంత స్వఛ్ఛంగా పలికించగల గంధర్వ గానం వారిది.
  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి వారు.ఆయనకు నాతో పని ఉంటే,స్వయంగా రెండు మూడు సందర్భాలలో మా ఇంటికి స్వయంగా వచ్చి నన్ను కలసి,ఆశ్చర్యపరిచారు. తాను రచించిన ప్రతి గ్రంథాన్నీ  ముందుగా నాకు అందచేసి,నా అభిప్రాయం తెలుసుకొనేవారు.
     ఒకసారి బెజవాడలో అన్నమయ్య ఆరాధనలో నేను ఆయన సమక్షంలో అన్నీ ఆయన స్వరపరచిన సంకీర్తనలు పాడితే,ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం.ఆ ఆనందాన్ని అభినందన మందారమాలగా నాకు సమర్పించారాయన!తిరుపతి లో ఆయన హాజరుకాని నా కచేరీలు బహు కొద్ది మాత్రమే..నేనంటే అంత అభిమానం ఆయనకు!..
     ఆయన పలుకు ఎంత మంద్రమో గానమంత మార్దవము.అనవసర విన్యాసాలకు, ఆడంబర విద్వత్ప్రదర్శనలకు ఆయన దూరంగా ఉంటారు.
    అయితే,సాంప్రపాయాన్ని గౌరవిస్తూ ఆయన చేయని సంగీత,సాహిత్య ప్రక్రియ లేదు.శ్రోతలను తనతోపాటు తోడ్కొనివెళ్ళి,ఏడుకొండలూ ఎక్కించి,తుట్టతుదకు స్వామిదివ్యదర్శనం చేయిస్తుంది గరిమెళ్ళవారి గానం.అది అనన్యసామాన్యం.
   'అన్నమయ్య కీర్తనలకు బాలకృష్ణప్రసాద్ గారి బాణీలకు సాటి మరిలేవు' అనటం అతిశయోక్తి కాదు.అందుకే గరిమెళ్ళవారు 'అన్నమయ్య వరప్రసాది'.
    
             -Modumudi Sudhakar