మహతీ శ్రీరామం,కవితా సంకలనం కొరకు...
04/01/2025.
అంశం : శ్రీ రామ తత్వం .
( ఆటవెలది పద్యాలు:).
శీర్షిక : సకల గుణాభిసోముడు ,శ్రీరాముడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
ధర్మమూర్తి యతడు, ధరణినే లెడువాడు
సత్యసంధు డతడు, సాధు మూర్తి.
ప్రజలనేలు రాజు, ప్రేమ స్వరూపుండు
రాము డతడు జగతి రక్షకుండు.!!
రామ బాణ మదియె రక్షించు అస్త్రము
దుష్ట రక్కసులను , దునుము శక్తి.
శమము లేక లంక శాసించు రావణు-
మట్టు బెట్టి నట్టి మహిమ ఘనము. !!
భక్తి తోడ గొలువ భాగ్యమిచ్ఛెడు రామ -
పదము ముక్తి నిచ్చు మూల ధనము.
ఏలి కతడు విడడు ఏక పత్నీ వ్రతము-
దాత యెపుడు విడడు ధర్మ పథము. !!
రామ నామ జపము, రక్షించు మంత్రము
కష్ట ములను దీర్చి కాపాడు నమ్ము.
వాయుపుత్రు హృదిని వరలేటి దేముడు .
నామ మంత్ర మహిమ నమ్మ ఘనము !!
అన్నదమ్ములకత డాదర్శమగు స్ఫూర్తి.
పుత్ర ధర్మ మేలు పుణ్యమూర్తి .
రమ్య మైన గాధ రామాయణమె గాద.
రామ చరిత భువిని రసపు గుళిక.!!
----------------------------
No comments:
Post a Comment