Wednesday, August 26, 2020

టంగుటుారి ప్రకాశం.భారత సమర సింహం.

టంగుటుారి ప్రకాశం.
భారత సమర సింహం.

శీర్షిక .
భారత సమర సింహం.
-------------------------------
తుాటాలకు భయపడని
మహోగ్ర సమర సింహం.।
"సైమన్ " కమీషన్ వ్యతిరేక
ప్రదర్శనల పోరాటాలకు బలం.॥

ప్రత్యేకాంధ్ర సాధనలో
ముందుండి పోరాడిన వీరుడు. ।
సహాయ నిరాకరణోద్యమాల
ప్రదర్శనా సమర్ధుడు.॥

అవక-తవకల సవరింపుల
విచార సంఘాద్యక్షుడు.
యుద్ధ వ్యతిరేకతకై పోరాడిన-
"సత్యాగ్రహ "నాయక ప్రముఖుడు.॥

"క్విట్ ఇండియా"  ఉద్యమ యొాధుడు.
అసమాన త్యాగ నిరతుడు.
నమ్మిన సిద్ధాంతాలకు
కట్టుబడి  నిలచిన త్యాగముార్తి.॥

భుాస్వాముల  అక్రమాలు
అరికట్టిన  పౌరుష పోరుల పులి.
ఆత్మాభిమానం అతని వ్యక్తిత్త్వం.
టంగుటుారి ప్రకాశం పంతులు-
స్వాతంత్ర్య  పోరాటాల "అంద్ర కేసరి."
---------------------------------------------
రచన, శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------



No comments:

Post a Comment