శీర్షిక.
వందేమాతరం.
ఉద్యమ స్ఫుార్తి.
----------------------
నేటికీ ,ప్రతీ భారతీయుని గుండెల్లో నిక్షిప్తమై ఉన్న -దేశభక్తి భావనావేశాలను జాగృతి పరచే-
"వందేమాతరం " ఉద్యమ గీతి---
సర్వ మత సమ భావనా నిరతికి స్ఫుార్తి.
"దేశ విభజన". నిరాకరణోద్యమాల శక్తి.
సంఘటిత సాయుధ పోరాటాల వ్యతిరేకతకు... దేశ
సమైక్యతాభావనోద్దేశ నినాదాలకు నిదర్శన గీతి.
లాల్ ( లాలా లజపతిరాయ్ ),
బాల్ (బాల గంగాధర్ తిలక్ )
పాల్ (బిపిన్ చంద్ర పాల్ ) ల
విదేశీ వస్తు బహిష్కరణ పోరటాల వేటకు మార్గదర్శి.
"వందే మాతరం " స్వాతంత్ర్యోద్యమ గీతం.
జాతి మత విభేదాలకు అతీతం, దేశ భక్తికి నిదర్శనం.
ఎందరో ఉద్యమ కారుల త్యాగనిరతికి సాక్ష్యం.
"వందే మాతరం ఉద్యమ గీతం ".
ఆనాడు వందేమాతరం , ఉద్యమంతో, దేశం లో
జాతి మత భేదాల అంతంకోసం , ఎందరో దేశభక్తులు
తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వైనం,
"వందేమాతరం" గీతం, ఈ నాటికీ మన----
నర -నరాల్లో నిక్షిప్తమైన దేశభక్తికి నిదర్శనం.
ఆనాటి త్యాగముార్తుల ఆశయ పుార్తికై ,
మనం , సమత- మమతల బలం తో,
సర్వ మత సమైక్యతా భావంతో , దేశోన్నతికై ,
చేయిా చేయిా కలిపి ముందుకు అడుగేద్ధాం.
""వందే మాతరం ,స్ఫుార్తిని ,
మన జండా కీర్తిని -నిలపెడదాం.
-----------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర.
8097622021.
No comments:
Post a Comment