వరదలు -మెరుపులు
⚡️🌊⚡️🌊⚡️🌊⚡️
మెరుపులేమి లేకుండానే
వరద పొంగింది
అదుపులోకి రాకుండానే
అలుగు పారింది !
(166)
నడిమిరాత్రి నభముకుచిల్లు
పడినట్లే కుంభవృష్ఠి
చెరువుగండికి గుండెఝల్లు
పంటచేలకు ఏమిటీదిష్టి !
(167)
గోడలేని గుడిసెల్లో
బడుగుజీవులు గజగజలాడే
కరుణగలిగిన మనసుల్లో
ఉడుతసాయం కదలాడే !
(168)
వేడివేడిగా అన్నదానం
పొడిపొడిగా ఇచ్చినబట్టలు
చేయూత నిచ్చినజనం
నిత్యావసరాల పెట్టెలు !
(169)
గూడువదిలిన గువ్వలమ్మ
రేపటివెలుగు కోసమే
తెప్పరిల్లిన మనసులమ్మ
నిలిచెను ఆత్మవిశ్వాసమే !
(170)
✍️ ఎం. వి. ఉమాదేవి
నెల్లూరు
No comments:
Post a Comment