Friday, August 14, 2020

హనుమంతుని పై గజల్

[8/12, 22:25] +91 94949 42583: సుందరకాండ గజల్-1."సముద్ర లంఘనము"

అంబుధినే లంఘింపగ పూనినాడు శక్తిశాలి
అంజలినే ఘటియించీ వేడినాడు శక్తిశాలి

అమోఘరామబాణంలా నభముకెగసె శుభమంటూ
అచల సంచలనమునే రేపినాడు శక్తిశాలి

అంతులేక తనువుపెంచి శిరముచాచి వాలమొంచి
గగనములో గరుడునిలా సాగినాడు శక్తిశాలి

కిన్నెరలూ గంధర్వులు బెదరి గిరిని వదలునటుల
మహేంద్రగిరి తలమదిమి ఎగసినాడు శక్తిశాలి

జానకమ్మ జాడతెలుప రామయ్యకు ఊపిరూద
అన్యులెవరికలవిగాక పెరిగినాడు శక్తిశాలి  

రెక్కలున్న కొండలాగ పడగవిప్పు పాములాగ
చక్కనైన పక్కిలాగ అరిగినాడు శక్తిశాలి

మొక్కవోని దీక్షతోటి దక్షిణానికేగినాడు 
రాధికమ్మ పులకించగ ఉరికినాడు శక్తిశాలి. 

   --గుడిపూడి రాధికారాణి,
            మచిలీపట్నం.
[8/12, 22:26] Dokka Seetamma: చక్కని కావ్యాన్ని గజల్ రూపంలో అందించినందుకు ధన్యవాదాలు.....

No comments:

Post a Comment