Sunday, August 9, 2020

పోష్ట్ కార్డ్ కధలు

[8/9, 16:00] +91 94416 80024: *గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ  పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు*





        *బతుకు చిత్రం*
       -------------------------
సొంత ఇల్లు, మంచి ఉద్యోగం ఉన్న రమేష్  లాక్డౌన్ సమయంలో వారానికొకసారి కూరగాయలు,కిరాణం సామాను తీసుకొని ఇంట్లోకి దూరిపోవడం ఎప్పుడు టి.వి లేదా మొబైల్ ఫోనుకు అత్తుకుపోవడం అదే పని.  లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసారని సంతోషపడుతూ, బయట ప్రపంచం చూడకపోతే ఎలా?  ఒక రౌండ్ వేసివద్దామని  బైకు తీస్తూ  రెండు నెలలకే జీవితం బందీలా అనిపించింది.నిజంగా పిల్లలు  చదువులతో పోటీ ప్రపంచంలో ఇలాగే బందీలవుతున్నారా! 
వృద్ధ్యాప్య అమ్మానాన్నలు అనాథశ్రమంలో 
ఇలాగే బతుకెళ్ళదీస్తున్నారా!
భార్య వంటింట్లో ప్రతి రోజు బందీగా ఉంటుందా? అనుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. బయటి ప్రపంచం రెండు నెలలోనే మారిపోయిందా అనుకుంటూ ముందుకు వెళూతూ ఒక్కసారిగా ఆగాడు.
ఆకలి తీర్చుకోవటానికి అరకిలోమీటర్ నిలబడిన వారిని చూసి అయ్యేపాపం అనుకుంటూ అటుఇటూ చూస్తున్నాడు
అడ్డామీద కనబడిన కూలీల కన్నీళ్ళు,
కష్టజీవుల బతుకు చిత్రాలు,వలసజీవుల బతుకు ప్రయాణాలు,చిరువ్యాపారుల చిత్రమైన చూపులు గమనించాడు. ఎప్పుడు నేను వెళ్ళిన దారే అయినా కొత్తగా అనిపించింది. ఇన్నాళ్ళు నేను ప్రతి ఉదయం అల్లం టీ కొట్టు బాబాయితో ప్రారంభమైన నా నడక పలకరింపుల నుండి రాత్రివరకు నా స్నేహితుల బాతకానీలతో ఆనందంగా ముగించేవాడిని.ఆఫీసులో హుషారుగా నా తోటివారితో సమోసా,బర్గర్లతో పూర్తికానిచ్చేవాడిని.ఇంటికి రాగానే ఆనందంగా నా భార్యపిల్లలతో ఆటలు,సరదాలు,ముచ్చట్లు సాయంకాల కుటుంబ షికార్లు అందరి జీవితాలు ఇట్లాగే ఉంటాయనుకుంటూ పరిశీలించలేదు.
ఇప్పుడు కనిపిస్తున్నాయి,వినిపిస్తున్నాయి.
ఇన్నాళ్ళు వీరి నాలుగు రూపాయల  తాపత్రయం దాచుకోవడానికి కాదు 
ఇంట్లో పసిపిల్లల అమ్మానాన్నల ఏపూటకాపుట ఆకలికోసమని తెలిసింది.
కరోనా వచ్చి నాకు చూపించింది 
కళ్ళకు కట్టినట్లు బ్రతుకంటే ఏమిటో... ఎలా బతకాలో...










----------------------------------------
ఎ.సంతోష్ కుమార్ రెడ్డి,
ఫోన్ నెం:9441680024
[8/9, 16:04] +91 98662 65630: "గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు"



దేవుడు పారిపోయాడు..!!
****************
కరోనా కారణంగా.., నాలుగు రోజులుగా కుటుంబంతో సహా  పస్తులున్న  ఒక పేదవాడు, విధిలేక అర్ధరాత్రి గుడిలో చొరబడి,  గబ గబ హుండీ పగులగొట్టి కంగారుగా దొరికినంత తీసుకొని పారిపోయాడు.
 
ఆ తరువాత గుడి శుభ్రంచేసేవాడు వచ్చి చూసాడు.   విషయం అర్ధం అయ్యింది. అక్కడక్కడ పేదవాడు జారవిడిచిన డబ్బులు, హుండీలో మిగిలిన డబ్బులు గప్ చుప్ గా కాజేసి, దొంగతనం జరిగిన విషయాన్ని పూజారికి చెప్పాడు. 

పూజారి  వచ్చి చూసాడు, పనిలో పనిగా .., గుడిలోపలి హుండీని కూడా పగులగొట్టి  ఆ సొమ్మును తను  స్వాహా చేసి,  అది కూడా  దొంగ ఖాతాలోవేసి చేతులు దులుపుకొని, ఈ విషయాన్ని ఆలయ ట్రస్టీ కి విన్నవించాడు.

ట్రస్టీ వచ్చి పూజారితో చేతులుకలిపి,   స్వామివారి నగలు నిలువుదోపిడి చేసి, దీనిని కూడా దొంగ ఖాతాలోకి
నెట్టేసారు.

రహాస్యాన్ని  పసిగట్టిన పోలీసువారు, గుట్టు రట్టు చేస్తామని బెదిరించి, అందరి దగ్గర వాటాలు పుచ్చుకొని, ఆరోజే చనిపోయిన ఓ అనాధ శవం  ఖాతాలో  ఆ దొంగతనం జమచేసి, కేసును మూసివేశారు.

ఇదంతా చూసిన దేవుడు, ఈ మనుషులు  ఇక్కడవుంటే తనను కూడా మాయం చేస్తారని  భయపడి దూరంగా పారిపోయాడు!!

కొసమెరుపు, అలయ వాస్తుదోషం 
వల్లనే ఇలా జరిగిందని, ఆలయ పునర్నిర్మాణానికి, విగ్రహ ప్రతుష్టల కొరకు, ఆలయ ట్రస్టీ, అయ్యగారు మళ్ళీ చందాల దందా మొదలుపెట్టారు!.

ప్రజలు భక్తితో చందాలు ఇస్తే ముక్తి లభిస్తుందేమోనని!  ఆశపడి మళ్ళీ  చందాలు  ఇవ్వడం మొదలుపెట్టారు.

పాపం!  ఒక పేదవాని ఆకలి కూడా చివరకు ధనవంతుల కడపే నింపింది.
హతవిది!!!.

                       ..సమాప్త..




మీ రంగనాధ్ సుదర్శనం
9866265630
[8/9, 16:06] +91 80198 96883: **గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ  పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు*


        *కరోనా చేసిన పెళ్లి*

  ఒక ఊరిలో లావణ్య అనే ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను క్వారంటైన్ కు తరలించారు. లావణ్య పక్కన శిరీష్ అనే అబ్బాయికి కూడా పాజిటివ్ రావడంతో ఇద్దరూ పక్కపక్కనే క్వారంటైన్ లో చేరారు. కొన్ని రోజులకు వారి మధ్యన మాటలు కలిసి, అది స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అలా వాళ్ళిద్దరూ ఆ క్వారంటైన్ లో ప్రేమించుకున్నారు. కొన్నిరోజులకు వాళ్ళిద్దరికీ కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికీ నెగటివ్ అని తేలింది. శిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్నాడు. లావణ్య ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అలా వారి ఇష్టాలు కలిసాయి.ఈ శుభ సమయమున వాళ్ళిద్దరూ వాళ్ల పెద్దలను ఒప్పించి, పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది బంధుమిత్రుల సమక్షమున వారి వివాహం ఘనంగా జరిగింది. వాళ్ళిద్దరు ఇప్పుడు సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తున్నారు....
    కారోనా వ్యాధి ఒక   మహమ్మారి అయినా ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసింది. మొత్తానికి వాళ్ళిద్దరి పెళ్లి కరోనా చేసిన పెళ్లిగా చరిత్రలో నిలిచిపోయింది....


దాసరి జగదీష్
8019896883
[8/9, 16:08] +91 94923 39689: **గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ  పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు*


                *"నాగమల్లి"*

      
     బలబద్రుడుండేది అటవీప్రాంతం కావడం వల్ల కుటుంబమంతా కష్టపడి పనిచేసుకోవలసిందే! బలబద్రుడికి ఆరుగురు మగపిల్లలు తర్వాత పుట్టిన ఆడపిల్ల నాగమల్లి.

    బలబద్రుడు పిల్లలు ఎవరికీ చదువు చెప్పించలేదు భార్య సుభద్ర  
బలవంతంతో నాగమల్లిని మాత్రం చదివిస్తున్నాడు

      కరోనా వైరస్ ప్రభావం వలన హాస్టల్లో ఉండొద్దని, సెలవులిచ్చి ఇంటికి పంపించి వేయడంతో తొమ్మిది చదువుతున్న నాగమల్లి ఇంటికి వచ్చింది

    లాక్ డౌన్ సడలింపుతో,వలసకూలీగా వెళ్ళిన మూడో అన్న ఇంటికి వచ్చాడు అతనిని క్వారెంటైన్లో ఉండమని ఎంతచెప్పినా వినకపోవడంతో అతనితోపాటు, తల్లికీ కరోనా వైరస్ సోకింది అది మామూలు జ్వరమేనని, అదే,తగ్గిపోతుందంటూ తండ్రి వాళ్ళకి వైద్యం చేయించక,తావీజు కట్టించి ఊరుకున్నాడు వాళ్ళు రెండు వారాలు తిరగకుండానే చనిపోయారు.

       కూతురు,నాగమల్లి, పరిశుభ్రత పాటించడం గురించి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో తనకీ అనర్ధం జరిగిందని గ్రహించిన బలబద్రుడు తనలా ఎవరికీ అనర్ధం జరగకూడదని ఆరోగ్య సూత్రాలు ప్రచారం చేయడానికి సిద్ధమయ్యాడు.

       పరిశుభ్రంగా స్నానం చేయడం, మాస్క్ ధరించడం,శానిటైజర్ వాడటం, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడం లాంటి విషయాలు నాగమల్లి సహాయంతో ఆదివాసీ ప్రాంతమంతా తిరుగుతూ ఇంటింటికీ వెళ్ళి ఆరోగ్య సూత్రాలు. పాటించేలా ప్రచారం చేస్తూ ఎందరినో కరోనా నుంచి కాపాడే పనిలో లీనమయ్యారా తండ్రీ, కూతురు!


గుంటూరు లక్ష్మణరావు
టి అర్జాపురం విశాఖపట్నం జిల్లా
చరవాణి:# 9989540922
[8/9, 16:10] +91 99482 85353: **గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ  పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు*

   *ఔదార్యం*

     రామాపురం గ్రామం కరోనాతో కకావికలమైంది.పనులు లేక,వ్యవసాయం ముందుకు సాగక,కష్టపడి పండించినా కొనే దిక్కులేక గ్రామప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.రైతులంతా ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.కొందరు తిండిలేక అల్లాడుతున్నారు.ఈ పరిస్థితిని గమనించిన నాగభూషణం,వెంకట్రామయ్య,మరికొందరు సమావేశమయ్యారు.

   మానవతాదృక్పథంతో,తమ ఊరిని,ఊరివారిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు.గ్రామంలో ధాన్యనిల్వలు అధికంగా ఉన్న తమబోటి ఇరవై కుటుంబాలతో ఒక సంఘంగా ఏర్పడి సహాయం చేయాలని నిశ్చయించుకొన్నారు.ఒక్కొక్క ఇంటికి కొంత ధాన్యం,కూరగాయలు,కిరణాసామాగ్రి పెద్ద ఎత్తున సేకరించి ఇంటింటికి వెళ్ళి పంచారు.ఇలా రెండునెలల కాలంలో నాలుగు సార్లు పంచి ఆదుకొన్నారు.

    అందుకే ఉన్న ఊరు,కన్నతల్లి అన్నారు.ఆపద కాలంలో ఒకరికొకరుగా ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది.


డా.రామక కృష్ణమూర్తి
9948285353.
[8/9, 16:10] +91 6281 789 683: గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ పోస్టుకార్డు కథల శీర్షిక కొరకు

కథ: కరోనా ప్రయాణం

కరోనా వైరస్ చైనాలోని వూహన్ సముద్ర ప్రాంతంలోని ఆహారం ద్వారా వ్యాపించిందని అంటున్నారు, కట్ల పాము, నాగు పాములు ఎక్కువగా చైనాలో వుంటాయి, ఈ విషపూరితమైన పాములు కరవడం వల్లన లేదoటే వాటిని తినడం వల్ల వైరస్ సోకి ఉండవచ్చని అంటున్నారు, ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు ,ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి, తర్వాత  తీవ్రమైన న్యుమోనియాకు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుంది, దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ లు ధరించాలి, చేతులకి         గ్లోసులు వేసుకోవాలి,దూరం పాటించాలి, శానిటైషన్ ఉపయోగించాలి, బయటి నుండి రాగానే వేడి నీళ్లతో కడుకోవాలి, అనవసరంగా బయటకు వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండాలి సురక్షితంగా ఉండాలి.


కవి పేరు: గొట్టిముక్కుల నాసరయ్య
ఫోన్ నెంబర్: 6281789683
[8/9, 16:13] +91 98858 71464: ,గోరసం ,వారివాట్సపుకథలపోటీ.
తే.9.8.20.
శీర్షిక;హతవిధీ
అతనోచిరుద్యోగి.మధ్యతరగతిమందహాసమే జీవితం.చుట్టూఅప్పులు.మాట్లాడితే
ముప్పులు.ఈలోగా లాక్డౌను.ప్రకటిఃచారు.నంభైరోజులయింది.కష్టాలుపెరిగాయి.చేతిలోపనిపోయింది.ఆదా DCయంతగ్గింది.పాత అప్పులకేవడ్డీలుకట్టాలి.కొత్తగా అప్ప ఎవరిస్తారు.ఆసఃఘం ,వాళ్ళు ,ఉదారులు ఇచ్చినదానధర్మాలు తీసుకున్నాడు.ఆత్మాభిమానంచంపుకుని.ఇంటిల్లపాదిని ,కడుజాగ్రత్తగా.,నియమాలుపాటించేలాచేసాడు.ప్రభుత్వసొయమూఅందింది.ఏదో చారూ అన్నంతింటున్నారు. ,కరోనా
బూచి.రోజురోజుకీభయపిస్తుంది.ఈమధ్యతలగతివాళ్ళపైనానీకోపం ,అనుకున్నాడాతడు. కరోనా.లోకానికి
భయమంటేఏంటో చెప్పిఃది.సంస్కారాన్నినేర్పింది.కాని పేదవాడికన్నీటిని ,మున్నీటినిచేసింది.
ఇలావుండగా.పిడుగులాంటివార్త.వలసపోయిన తల్లిదండ్రీ నడుస్తూ ,నడుస్తూ బయలుదేరి ,ఇంటిదగ్గరవరకూ వచ్చేసారు.నడవలేనిబక్కప్రాణం.,తండ్రిది ,గాలిలోకలసింది.హతవిధీ.
నీవెంతక్రూరనిధీ.

డా.గాయత్రీదేవి 
9885871464
[8/9, 16:14] +91 73961 96369: భయపెట్టే భూతం( కరోనా పోస్టుకార్డు కథ)
---------==========----------

 అది ఒక విశాల నగరం ఆ నగరంలో రాళ్ళు కూడా మాట్లాడతాయి ఒకరోజు సూరయ్య
 ఆ మార్గం గుండా వెళుతూ.... భయపెట్టే భూతాలు ఉంటాయని భయపడుతూ పోతున్నాడు అంతలో మార్గమధ్యంలో బహుదూరపు బాటసారి బ్రహ్మన్న కలిశాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు.. మాట్లాడే భూతం రానే  వచ్చింది సూరన్న భయంతో వణికిపోతున్నాడు బ్రహ్మన్న మాత్రం
 భయపడకుండా ఇప్పుడు కరోనా భూతం భూమి మీద విచ్చలవిడిగా తిరుగుతోంది మా మార్గానికి అడ్డు  పడ్డావో... మా దేశం లో చనిపోయిన కరోనా బాధితులు చాలామంది కరొనా  భూతాలు గా మారారు అని గట్టిగా చెప్పగానే... మాట్లాడే భూతం భయపడి పారిపోయింది
 ఇప్పుడు కరోనా భూతాలు లక్షల సంఖ్యలో ఉన్నాయని గుట్టుచప్పుడు కాకుండా పారిపోయింది సూరన్న బ్రహ్మన్న హాయిగా మాట్లాడుకుంటూ వారి గ్రామాలకు చేరారు



 కందుకూరి వీర కృష్ణ
 నెల్లూరు జిల్లా, కావలి 
 చరవాణి:7396196369
[8/9, 16:14] +91 94405 49110: **గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహ  పోస్ట్ కార్డ్ కథల శీర్షిక కొరకు*


😷🙏వైద్యుడే దేవుడు🙏 😷
అనగనగా ఒక అందమైన ఊరు . ఆ ఊరిలో అందమైన పూల తోటలతో ఎంతో ఆహ్లాద కరంగా ఉండేది. ఆ ఊరికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఆ ఊరిలో కొందరు అతనితో మాట్లాడడానికి వచ్చారు. అతనికి కరోనా అనే వ్యాధి ఉందని ఎవ్వరికీ తెలియదు. అతను మాటల తుంపరులకి, దగ్గరదగ్గర గా మాట్లాడడం వలన అక్కడ అందరికి ఆ వ్యాధి అంటుకుంది. ఊరంతా దగ్గు, తుమ్ములతో భయంకరంగా మారింది. అప్పుడు ఆ ఊరి దేవుడే ఒక వైద్యుని రూపంలో వచ్చి, మీరంతా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాస్క్ వేసుకొని, సామాజిక దూరం పాటిస్తూ, మాటి మాటికీ సబ్బుతో మోచేతుల వరకు శుభ్రపరుకోవడం వలన ఈ వ్యాధి ని దూరం చేయొచ్చని చెప్పారు. అందరు మన కోసమే ఈ డాక్టర్ దేవుడిలా వచ్చి మనకు చెప్పారని నమ్మారు. అప్పటినుండి అందరు అలాగే నియమాలను పాటిస్తూ, సంతోషం గా ఉండసాగారు.

నీతి :నీతి ఏమిటంటే ఎదుటి వ్యక్తి తో మాట్లాడేటప్పుడు మనం మన జాగ్రత్త లో ఉండాలి

శైలజ. పెదప్రోలు 
9440549110
[8/9, 16:17] +91 98662 03795: **🌹గోరసం వారి ఆదివారం వాట్సాప్ సమూహపోస్ట్ కార్డ్‌కథల‌శీర్షిక కొరకు*🌹

భరద్వాజ రావినూతల✒️
9866203795

 *కథ*👉 *దెబ్బ* *ఒకటి* *పిట్టలు* *తొమ్మిది*
ఆరోజు జనం అంతా ఏదొ జరిగినట్లుగా ఊరి బయటకు పరిగెత్తుతున్నారు,శరాఘాతం నుండి వదలి పెట్టిన బాణాల్లా-ఊరి‌బయట దిగుడు బావిలో శవం కనబడిందట.పొలంలో పొగనారు వేయటానికి నీళ్ళకు దిగిన పిల్ల బిందెకు తగిలింది శవం.భయపడిన పిల్ల కేకకు పరిగెత్తారు జనం.అప్పటికే అందింది పోలీసులకు అందింది ఆహ్వానం. దిగారు‌ రంగం లోకి ఊటబావిలో నీళ్ళలా శవాలు‌ బయటకు వస్తున్నాయి.ఒకటికాదు రెండుకాదు తొమ్మిది. ఆశ్చర్యపోయారు జనం.జరగాల్సిన పని మొదలు పెట్టింది పోలీసు యంత్రాంగం. చనిపోయిన వారు వలస కార్మికులని పని పాట లేక ఊరికి‌ వెళ్ళేదారి లేక‌ ఊరి చివర ఉన్నఫ్యాక్టరీలో ఉన్నారని‌ఒక‌ ముసలమ్మ చెప్పిన‌వైనం తో సాగించాడు పరిశోధన యస్.ఐ రాము.ఊర్లో ఎవరూ చెప్పక పోయినా అడుక్కుతినే ముసలమ్మ‌ మాటలు‌ విశ్వసించి పడిపోయిన ఫ్యాక్టరీకి వెళ్ళిన ఆయనకు అక్కడ జరిగిన పార్టీ ఆనవాళ్ళు...ఎవరినో లాగిన ఆనవాళ్ళు తో పాటు చార్జింగ్ లోక ఒక ప్రక్కగా పడి ఉన్న ఓ సెల్ అతని దృష్టిలో పడింది.దానికి రీచార్జి పెట్టి దాంట్లో‌ పరుమార్లు కనబడ్డ నెంబరుకు కానిస్టేబుల్ చేత ఫోను చేయించి.గందరగోళం గా‌మాట్లాడే అతన్ని తెచ్చి పోలీసు పద్దతి లో విచారించాడు.ఆ ఇంటి పిళ్ళను తన కోర్కె తీర్చుకోవటం  కోసం వాడుకున్నానని కడుపువచ్చిన ఆపిల్లను రైలు లోంచి తోసి చంపేసానని వాళ్ళవాళ్ళుతనను చంపుతారని భయపడి వాళ్ళింట్లో జరిగ పుట్టిన రోజు పార్టీలో కూల్ డ్రింకులో అందరికి విషం కలిపి చంపానని ,వాళ్ళు దాచుకున్న సొమ్మంతా కాజేసి పారిపోదామనుకున్నానని,ఈలోగా కేసులు పెరిగి కర్ఫ్యూ తో బస్సులు ఆపారని చార్జింగ్ లేని ఆసెల్ ఏం చేస్తుంది అనుకున్నానని నిజం గక్కాడు.దేశం అంతా‌ కరోనా తో భయం భయంగా ఆకలి కేకలతో అల్లాడుతుంటే‌ నాలాంటి స్వార్దపరులు‌ ఇలా‌ చేసినందుకు ఉరే సరి అయినదని .బ్రతకటానికి  వచ్చిన వారిపై అమానుషంగా ప్రవర్తించే నాలాంటి వారు‌ బ్రతకకూడదని వాపోయాడు ఆవ్యక్తి-!

👉🌹భరద్వాజరావినూతల✒️
9866203795
[8/9, 16:24] +91 92909 46292: గోరసంవారి ఆదివారం వాట్సప్ సమూహ పోస్ట్ కార్డు కథల శీర్షిక కొరకు
అంశము:కథ
అతి జాగ్రత్త.

దేశమంతా కరోనా భయంతో వణికిపోతోంది.ప్రజలంతా ఇల్లు వదిలి పైకి రావాలంటే భయంగా ఉంది.మరో వైపు మీడియాలో వచ్చే వార్తలతో  మరింత కలవరం రామయ్యకు మొదలైంది.అనుమానంతో పనిమనిషి మాన్పించాడు.
భార్యకు ఎన్నో జాగ్రత్తలు  చెప్పాడు.ఏం తాగాలన్నా,తినాలన్నా సేనిటైజర్ లేనిదే ముట్టుకునే వాడు కాదు.అతని అతి భయంతో అతను ప్రశాంతంగా ఉండే కాదు ప్రక్కనున్న వారిని ప్రశాంతంగా ఉంచేవాడు కాదు.చివరకు అతని భయమే అతని శాపమయ్యింది.
ఎలా వచ్చిందో తెలియదు కానీ
మహమ్మారి ఉప్పెనలా ముంచుకొచ్చింది.ఇంకేముంది ? ముందే భయం అతని భయానికి తగ్గట్టుగా కరోనా అతనికే రావడం మరింత నిరాశ లోకి కూరుకుపోయాడు.భార్యా పిల్లలకు జాగ్రత్తలు చెప్పి ఆసుపత్రి కి బయలుదేరి వెళ్ళాడు.అక్కడ ఎంతో మంది తన కంటే వయస్సులో పెద్దవారు కూడా  మృత్యువుతో పోరాడుతూ దైర్యం గా నిలస్తున్నవారిని చూసి సిగ్గుతో తల దించుకుని ఎంత  అతి జాగ్రత్తగా ఉన్నా అది ఎలా  వస్తుందో తెలుసుకోవడం కష్ణమని దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటే జయించగలమని   గ్రహించి
భయం తో మరోమారు విఫలం కాకుడదని నిర్ణయించుకొని కరోనా తో పోరాడి విజయం సాధించాడు.

నీతి:అతి జాగ్రత్త అనర్థాలకు మూలం.
ధైర్యమే విజయానికి పునాది.

బోర భారతీదేవి
విశాఖపట్నం
9290946292
[8/9, 16:27] +91 94415 65466: *మల్లయ్య ఔదార్యం* 

మైలారం అనే గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు.అతడు అందరి తో చాలా కలివిడిగా ఉండేవాడు. వర్షాలు సరిగా పడక పోవడంతో బ్రతుకుదెరువు కొరకు పల్లె విడిచి పట్నం బాటపట్టాడు. పట్టణంలో భవన నిర్మాణ పనిలో ఉపాధి దొరకడంతో కుటుంబంతో సహా తను పనిచేసే చోటుకి దగ్గర్లోనే ఒక గుడిసె వేసుకొని నివసించేవాడు. మాయ రోగం వచ్చి మనుషులందరూ బలవుతున్నారని తెలిసి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పని లేక గుడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నాడు మల్లయ్య. ఒకరోజు మధ్యాహ్నం పొరుగింటి వ్యక్తి తీవ్రమైన జ్వరం గొంతునొప్పితో ఆస్పత్రికి వెళ్ళడానికి బయటికి వచ్చాడు అటుగా వచ్చిన ఆటో వాడికి విషయం చెప్పి ఆస్పత్రికి వెళ్దాం అని అడిగాడు కరోనా లక్షణాలుగా గుర్తించి ఆటోవాడు తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనకు విపరీతమైన జ్వరం పట్టి నడిరోడ్డు పైన కుప్పకూలిపోయాడు. చుట్టూ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ దరి చేరడం లేదు కరోన అనే భయంతో సాటి మనిషిని ఇలా రోడ్డుపైన వదిలివేయడం ఏమిటని మనసులో చాలా బాధపడ్డాడు మల్లయ్య. వెంటనే గుడిసెలో ఉన్న చేతి గ్లౌజులను మాస్కును ధరించి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి అతని లేపి కూర్చోబెట్టాడు ఆస్పత్రి వారికి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చాక అందులోకి ఎక్కించాడు. అందరూ భయపడుతుంటే ధైర్యం చేసిన మల్లయ్యను చుట్టుపక్కల వారందరూ అభినందించారు.

రాచమల్ల మల్లికార్జున్
9441565466

No comments:

Post a Comment