[8/18, 07:17] Dokka Seetamma: *దిగులు*
అవును..... మనసెందుకో దిగులుగా
జీవం లేని కట్టెలా ......
అర్ధం కాని డైలీ సీరియల్ లా
పండగకు అమ్మమ్మ ఇంటికి వచ్చి వెళ్లిపోయే పిల్లల్లా..
పుట్టిల్లు వదిలి అత్తవారి ఇంటికి వెళ్ళే ఆడపిల్లలా....
అలిగిన చిన్నారి తాయిలం కోసం ఎదురుచూసేలా...
ఒక్క మార్కుతో పాస్ మార్క్ చేజారిన విద్యార్థిలా....
గొంతెండిన అన్నదాత వర్షపు చినుకు కోసం ఎదురుచూసేలా....
వరదలతో చిక్కుకున్నవాడు పులిహోర పొట్లాము కోసం ఎదురుచూసేలా.....
ఏంటి... వింతలా ఉందా...
అవును... నీ కోసం, నీ పలుకులు కోసం వేచి వేచి
చివరకు నాకు నీ పేరు ఒక్కటే గురుతుంది....
నీ ధ్యాసే.... నీ ఊసే.... ఒక్కొక్కమారు ఆదరిస్తావు...
అంతలోనే మళ్ళీ ఘీంకరిస్తావు.....
అనుక్షణం నీ క్షేమమే నాకు ముఖ్యం....
నీ చిరునవ్వే నాకు ఆభరణం.....
నువ్వేమో చీకటిలో సైతం వెలుగిచ్ఛే జాబిల్లివి
నువ్వు లేకపోతే ఆ చీకటిని నేను.....
నీనుండి కబురు లేని రోజు నాకు గ్రహణం....
నీ చుట్టే నా భ్రమణం.....
నీ తోడు లేక....నువ్వు నాకు తోడుగా రాక...
నా మనసేందుకో దిగులుగా... అచేతనంగా
ఉరిశిక్ష రద్దుకు చూసే ఖైదీ గా....
నీ స్నేహం కోసం, నీ పలుకు కోసం, నీ ప్రేమ కోసం....
దిగులుగా ఎదురుచూస్తున్న నీ ప్రియనేస్తాం
( నేను అనేసుకున్నా... నువ్వు అనుకున్నావో లేదో)...
......
...శిష్టు సత్య రాజేష్
[8/18, 07:21] +91 99596 94948: చాతక పక్షి లా ఎదురుచూస్తే వర్షపు చినుకై విచ్చేస్తుంది. మీ కవిత సూపర్.👏👏👏👏👏🙏💐
No comments:
Post a Comment