[8/10, 08:17] +91 95421 81301:
తేనియలు అనేవి సాహిత్యంలో ఒక ప్రక్రియ,దానికి సంబంధించిన సమూహంలో నేను ఉన్నాను మిత్రులారా,దాంట్లో ప్రతి రోజు కనీసం ఒక ఐదు వరకు పంపుతున్నాను..అది తెలియక మన సమూహం లో కొందరు మిత్రులు ఇవి పద్యాలు అనుకోని వేరేలా అంటున్నారు,కానీ అవి కావు..నాకు పద్యాలు రాయడం రావు..నేర్చుకుంటే ఏదైనా రాకపోతుందా కానీ ఇంకా నేను ఆ సాహసం చేయలేదు,భవిష్యత్లో చేస్తాను కానీ నేను ఇప్పుడు రాసేటివి మాత్రం తేనియలు అని చెప్పనికే ఈ సమాచారం పెడుతున్నాను..
దీనిలో...
1)పద్యంలానే నాలుగు పాదాలు ఉంటాయి..
2)ప్రతి పాదములో 13-15వరకు మాత్రలు ఉంటాయి..
3)2&4 పాదాలకు ఖచ్చితంగా అంత్య ప్రాస ఉండాలి..
ఇవి వీటి నియమాలు..
*తేనీయలు* ప్రక్రియ రూపకర్త
నలుమాసు విజయ ప్రసాద్ గారు
కరీంనగర్
*తేనీయలు ప్రక్రియ నియమాలు*
నాలుగు పాదాలుండాలి
* ఒక్కోపాదంలో 13-15 లోపల మాత్రలుండాలి
* రెండు నాలుగు పాదాల చివర అంత్య ప్రాస తప్పనిసరి
* సంఘ నీతిని గాని, మానవ మనుగడ గాని, సమాజానికి సందేశాత్మకంగా కాని, సంస్కృతి సంప్రదాయాలు గాని, భక్తి పారవశ్యంగా కాని, చమత్కారంగా గాని
తేనెలొలుకు తీయనైన తెలుగులో *తేనీయలు* రాయండి
ఉదాహరణ
శీర్షిక :- భగవంతుడి లీలలు
*సిరిసంపదలున్న ధనికుడికి*
*ప్రేమానురాగాలు ఇవ్వడు*
*ఆప్యాయత గల బీద వాడికి*
*ఐశ్వర్యాలు మాత్రం ఉంచడు*
సమీక్షకులు నిర్వాహకులు
ఎలిగేటి శ్రీనివాస్ గారు
కల్వల రాజశేఖర్ రెడ్డి గారు
కిషోర్ రాథోడ్ గారు
మోర్లె మురళి గారు
డేవిడ్ రాజు గారు
https://chat.whatsapp.com/IU3Iz0ocLGNFPmRnO0SPyI
🙏🙏🙏🙏🙏
తేనియలు
అడవియందు జీవించేడి..
ఆదివాసి బిడ్డలము మేము..
అడవి సంపదను కాపాడే..
మన్యం జాతి వీరులము మేము...
పండ్లు కాయలనమ్ముచును..
జీవనము ఎల్లదీసె వాళ్ళు..
పసిపాపలా మనసున్నవారు..
అన్నెం,పున్నెం ఎరుగని వాళ్ళు..
నమ్మిన వాళ్లకు న్యాయంగా..
నాణ్యతకు మారుపేరుతో..
అస్తిత్వాన్ని కాపాడుకుంటు..
నిలిచెను మాకు స్ఫూర్తితో..
మీ...
పసుల.శంకర్
(ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను రాసిన తేనియలు)
-----------++---+-
[8/10, 15:09] +91 81793 64366: ప్రకృతి ఇచ్చిన ప్ర"జలం"..
వాడిపోని పువ్వులకైనా.మొక్కలకైనా.
ఎదిగే మనవులకైనా...
జగతిలోని జంతువులకైనా....
సకలచరాచర సృష్టిజీవులకి
సడిసవ్వడిల జీవనాధారం నీరు..
బుల్లేట్ లాంటి బాడీ
బుడిద కాకుండా....
ఆరడుగుల అందమైన దేహానికి
ఆయుష్షును ఆపేది వాయువు ఐనా...
సామాజిక జీవనప్రగతి సారథికి
ములధారం నీరే....
ఆహారం లేకుండా
ఆరు రోజులైనా ఉండగలం...
కానీ...
నీరు లేకుండా నిమిషామైనా
ఉండలేం...
గలగలపారే సేలయేరు..
గడప గడపకు పచ్చదనం జోరు..
అమ్మ కడుపులోనే ఉమ్మ"నీరు"తో ఊపిరి పోసుకున్నా మనం...
బాల్యం నుంచే... బయెడైవర్సీటితో విలీనమై బ్రతుకుతున్నాం..
మనం తోనే వనం...
వనం తోనే జలం...
జలం తోనే జనం...
జనం లోని విలినమే జీవవైవిధ్యం...
కానీ.. నేడు నియంత్రణ లేని నీరుని వాడుతున్నాం...
నీటి కాలుష్య కోరల్లో చిక్కుకుని కాటికి కాళ్లు చాటుతున్నాం...
ఇప్పటికైనా "ఇంటి ఇంటి "ఇంకుడు"గుంతలు నిర్మించుకుని...
కలియుగంలోనే కష్టాలు రాకుండా..
మనతరంలో నీటిని కాపాడుకుంటు..
రాబోయే తరాలు నీరు అనే... రక్కసి కోరల్లో చిక్కుకుని
చితికి పోకుండా....
జగతికి జీవాధారమైన జలంను రక్షించుకుందాం...
పరివర్తన తో పది అడుగులు ప్రకృతితో వేద్దాం....💐💐😊
మీ.కోమ్ము.సాగరిక
22/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక .
అంజలి.
-----------
19.
పాల జలధి లోన పవ్వళించు
పరమ పురుషుడతడు మాధవుండు.
అర్ధ నారీశ్వరుడతడు శివుడు
భోళా శంకరుడుమా ధవుండు ॥
------------------------------------------
20.
శీర్షిక .
తరాజు.
----------
అంతరంగం అద్దం వంటిది
న్యాయాన్యాయాలు చుాపుతుంది.
బుద్ధి వక్రపు తక్కెడ వంటిది.
చెడు వైపే మొగ్గు చుాపుతుంది.॥
------------------------------------------
శీర్షిక .
సాయం.
----------
21.
కర్మ కొలదీ ఫలితమంటారు.
అందుకే మంచి పనులను చేయి.
కరోనా కష్ట కాలం లో ని
బీదా బిక్కి కి సాయం చేయి.॥
-----------------------------------------
No comments:
Post a Comment