[8/29, 19:07] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇశ్టపదులు: నమస్తే మేడం!
గతంలో కరోనాపై ఇష్టపది సంకలనం కోసం ఇష్టపదులు ఆహ్వానించాము...అది ఇపుడు ప్రింటింగుకు వెళ్తోంది.అది 108 ఇష్టపదుల సంకలనం.అందులో ఇంకా 10 ఇష్టపదులు తక్కువగా ఉన్నాయి..మీరు రేపు సాయంత్రం 5-00 లోపు కరోనాపై రెండు ఇష్టపదులు పంపగలరు.....
[8/29, 23:37] iswarimurthy: శీర్షిక.
ఇప్పటిలో పోనిది.
---------------------
చైనానుండి వచ్చి చెలగాటాలాడీ
అంచ లంచలుగాను ఆక్రమించినదది ॥
చిన్నా, పెద్దలనది చిత్తు చిత్తుగ చేసి
చిత్రముగ మారింది చింత లెన్నో పెంచి॥
కనిపించని కణమది కడు పాపపు ఖర్మిది
కఫ,జ్వర తీవ్రతల కలవరపెడుతున్నది ॥
ఇరుగు పొరుగులకు భయం ఇక్కటులకిది ముాలం.
ఇప్పటిలో పొిదిది ఇల ఈశ్వరి మాటిది ॥
---------------------------------------------------------------
చెత్తలన్ని ఊడ్చుకో చేతులను కడుగుకో
వేడినీట పుక్కిలింత వేకువను చేసుకో॥
వేడి నీటి ఆవిరి వేసుకో ముఖానికి
వెరసి రెండు సార్లుగ వెనువెంటనె మరువక ॥
సాటి వారితో నిడు సామాజిక దుారము
లేక పోతె బాధగ లేదు దీని మందుగ॥
ముాతి ,ముక్కు ముాసే మాస్కు నువు వేసుకో ॥
ఇప్పటిలో పొిదిది ఇల ఈశ్వరి మాటిది ॥
----------------------------------------------------------------
కరోనా పేరుతో కలకలం రేపుతుా
కంటి చుాపుకానక కడు తిప్పలు పెడుతుా ॥
అంటు రోగిలా నను అంటకుండ ఉన్నను
కంటి కునుకు రాదుగా కడు భయమౌ బ్రతుకుగ ,॥
అల్లం, మిరియం, లను అదె దోరగను దంచీ
అలరు తేనెను పోసి అది సేవించాలిగ ॥
మనిషిగ గర్వించీ మహి, కణముకు జడిసేవు
ఇప్పటిలో పొిదిది ఇల ఈశ్వరి మాటిది ॥
-------------------------------------------------------
సేవజేయు వైద్యుడు సేవనిరతి సిపాయి
సేవలెన్నొ చేసిరి స్నేహితులై మెలగిరి॥
పాప చింతన ఫలము పాడి కెక్క తరిమెను.
భార్య బిడ్డల గతికి భాధ కన్నీరిడెను॥
బ్రతుకు అంధకారము బరువు గద జీవితము
పనులు ఆగిపోయెను పైస లేక పోయెను.॥
కుాలి బతుకు బరువుగ కుాడు గుడ్డ కరువుగ
ఇప్పటిలో పొిదిది ఇల ఈశ్వరి మాటిది-॥
--------------------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
8098622021
------------------
No comments:
Post a Comment