🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అంశము: *భారత దేశ స్వాతంత్ర్యం*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ప్రక్రియ: రాజశ్రీ
రచన: *నరేందర్ రెడ్డి దన్నవరం*
చరవాణి సంఖ్య: *9492002855*
ఈమెయిల్: dannavaram@gmail.com
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
వందల ఏళ్ల పోరాటం
స్వతంత్ర భారతికై ఆరాటం
లక్షల వీరులు పోరాడిరి
జీవితాలనే త్యాగం చేసిరి
సంస్థానాధీశులు పోరు సలిపిరి
జమీందారులు పోరాటం చేసిరి
కదలి వచ్చిరి సకలజనులు
తిరగబడిరి దేశ పౌరులు
భగతసింగ్ బందా బైరాగులు
ఆజాదు బోసు సావర్కరులు
సాయుధ పోరుతో స్వాతంత్ర్యము
పారద్రోల దలచిరి పరతంత్రము
అహింసా మార్గమే మేలని
హింసా మార్గము వలదని
పిలుపు నిచ్చిన గాంధీజీ
ధర్మ పురుషుడు బాపూజీ
ఎందరెందరో త్యాగ మూర్తుల
మరెందరో పోరాట యోధుల
చెమట చుక్కల ఫలము
నేటి మన జీవితాలు
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
తేది: *12-08-2020*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
No comments:
Post a Comment