[8/13, 17:32] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇశ్టపదులు: కవి: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఊరు:జమ్మికుంట,కరీంనగర్
చరవాణి:9963991125
శీర్షిక: అమరవీరులకు వందనం
తెల్లోడి చెరనుండి తల్లి భారతి గావ
ధన,మాన,ప్రాణముల తృణముగా నెంచి మది
వీరులై పోరాడి వీరస్వర్గమునంది
దేశ ప్రజల యెదల దివ్వెలై వెలుగేటి
మాననీయ మూర్తులు! భారతీయ కీర్తులు!
అమర వీరుల్లార! అక్షరార్పణమిదిగొ!
మడమ తిప్పని రాణి మణి కర్ణికా దేవి
భగభగా మండేటి భగత్ సింగపు గుండె
బాలగంగా ధరుని భవ్య జన్మపు హక్కు
ఆజాదు చంద్రునివి అరివీర మీసములు
తలచుకుంటెనె మనకు మొలకలెత్తును తనువు
దేశభక్తియె పొంగి తెలివాహియై పారు
నేతాజి కలగన్న నేటి భారత మిదియ?
బాపూజి కలగన్న భ్రష్ట భారతమిదియ?
త్యాగధనుల కలలను వేగమే నెరవేర్చి
నవ్యభారతముకై నడుము కట్టగరండి!
[8/13, 17:33] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇశ్టపదులు: "అమరవీరులకు వందనం" అనే ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
No comments:
Post a Comment