*మణిపూసల నియమాలు*
1) మణిపూసలో నాలుగు పాదాలుంటాయి.
2) 1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస మరియు 10, 11, 12 మాత్రల నుండి ఏదైనా ఒక సంఖ్యనే ఉపయోగించాలి. అనగా ఈ పాదాల్లో మాత్రలు సమానంగా ఉండాలి.
3) 3వ పాదానికి అంత్యానుప్రాస ఉండరాదు.10 నుండి 12 మాత్రలుండాలి.
4) 3, 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.
【లఘువు(I)ను ఒక మాత్రగా, గురువు(U)ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు.】
*ఉదా:*
ప్రేమను పంచని సతి
U l l U l l l l
2 1 1 2 1 1 1 1=10
బాధ్యత మొయ్యని పతి
U l l U l l l l
2 1 1 2 1 1 1 1=10
ఉన్నలాభ మేమిటయ్య
U l U l U l U l
2 1 2 1 2 1 2 1=12
ఇడుములు బాపని మతి
l l l l U l l l l
1 1 1 1 2 11 1 1=10
*******************
మంచితనం పంచుదాం
U l l U U I U
2 1 1 2 2 1 2=11
మలినగుణం తుంచుదాం
I I I I U U I U
1 11 1 2 2 1 2=11
మనిషికొక్క మొక్కనాటి
I I I U I U I U I
1 11 2 1 2 1 2 1=12
మరువకుండ పెంచుదాం
I I l U I U I U
1 1 1 2 1 2 1 2=11
*******************
మణిపూసల కవులకంత
I I U I I I I I U I
1 1 2 1 1 1 11 2 1=12
చదువుచున్న జనులకంత
I I I U I I I I U I
11 1 2 1 1 1 1 2 1=12
వందనాలు వందనాలు
U I U I U I U I
2 1 2 1 2 1 2 1=12
ప్రోత్సహించుఘనులకంత
U I U I I I I U I
2 1 2 1 1 1 1 2 1=12
*వడిచర్ల సత్యం*
మణిపూసల సృష్టికర్త
7989511543.
అంతర్జాతీయ శాంతి దినోత్సవం.21..9..20
************************************
*విశ్వశాంతి "మణి పూసలు"*
"""""""""""""""""""""""""""""""""
ఉదాహరణలు 👇👇
*రచన:*
నన్నపు రాజు రమేశ్వర రాజు
శాంతి, శాంతి, విశ్వ శాంతి
కాకూడదు, అదొక భ్రాంతి
ప్రతి హృదయం స్పందిస్తే...
ప్రపంచాన నిండు "కాంతి"....1
అరిషడ్వర్గాల పోరు
ఆపలేరు, ఆపలేరు,
వాటికి బానిసలైతె....
అశాంతి ఏరులై పారు...2
సాంకేతిక విప్లవమ్ము
శాంతికి కలిగించె వమ్ము
విచక్షణ విస్మరిస్తె
శాంతి కదియె"విఘాతమ్ము..3
జ్ఞానమొక యోగమూ
ధ్యానమొక యోగమూ
ఆరెంటినెరుగుటే
శాంతి శుభయోగమూ....4
శాంతి కొరకై వేట
దొరకదెచ్చట బయట
స్వచ్ఛ హృదయము నందు
ఊరు అదియై ఊట.....5
మనిషి మారని నాడు
మానవతకే కీడు
ఎంత యత్నించినా..
అశాంతియె,మన తోడు...6
అణుబాంబుల తయారు
ఆధిపత్యపు పోరు
అగనప్పుడు శాంతి...
ఎండమావుల తీరు.....7
శాంతి కాముకులార!
శాంతి సైనికులార!
ప్రపంచాన శాంతిని....
సాధించు హితులార!!....8
శాంతి భావుకులార!
శాంతి సేవకులార!
శాంతి యఙ్ఞము నందు...
సమిధలౌ సఖులార!!....9
వందనాలు గురువులార!
శాంతి కల్పతరువు లార!
విశ్వ శాంతి నెలకొల్పే.......
విశ్వ జ్ఞాన ఝరులారా!!!!...10
ఓం! శాంతి, శాంతి, శాంతిః
No comments:
Post a Comment