*కణిక*
సాహిత్యం, సామాజిక సేవా, విద్యారంగ వేదిక
కొత్త సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది
అదే...
*కణికలు*
*నియమములు*
🔥 *మొదట,చివర ప్రాసలు రావాలి(ఉదా: వలపు...తలపు..అలా)
🔥 *ఎనిమిది వరుసలు*
🔥 *ప్రతి వరుసలో నాలుగు పదాలు* *పాదాలు ఉండాలి*
🔥ప్రతి వరుసకు భావం అనుబంధం *ఉండాలి*
🔥*విడివిడిగా రాయకూడదు*
🔥 *చివరికి ఒక చమక్ మాదిరి రాయాలి*
*ఉదాహరణకు*🔥🌹🔥
*వలపు కోనలలో తిరిగే తలపు*
*కలుపుతూ కొమ్మల విరిసే తరువు*
*ఎరపు రంగుల ఉషోదయాల మెరుపు*
*తళుక్కున విసిరే వర్ణాల చమక్కు*
*కలువ కనుల కదిలే అణుకువ*
*రాగాల పోతపోసిన అనుబంధ సోయగాల*
*సొగసుల గడసరివే మాటల సొబగుల*
*ఊహేనా పూసిన మరుమల్లి నాలోనా*
🌹🔥🌹
*దయలేని చీకటి తంత్రులను*
మోయలేక*
*ఎదగోడు వినని యామిని*
*సరిజోడు*
*ఎగిరే దుఃఖాల సెగల ఆవిరే*
*పలికే మానస వీణ కులికే*
*జాలిలేని రాతిరి నిస్తేజమై వెలివేయలేక*
*వెన్నెల వెలుగులో ప్రసవించు*
*వన్నెలు*
*మరుల విరియని మమతల విరులు*
*గతాల జ్ఞాపకమే మెరిసే స్వగతాల*
🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹
ఈ ప్రక్రియ ద్వారా భాష పైన, ప్రాసలపైన పట్టు ఏర్పడుతుందనే ఉద్దేశ్యం,
కణిక తీసే సంకలనానికి మీ *కణికలను*
చేర్చే ప్రయత్నం,
నియమములతో, కూర్చే కవిత్వానికి సొబగులద్దే ప్రయత్నం..
*కణికలు* ఆవిష్కరణకు శ్రీకారం.
*ఇందులో చేరాలనుకుంటే 8985614123 చరవాణి సంఖ్యను సంప్రదించండి*
*కణికలు సృష్టికర్తలు*
*రమాదేవి కులకర్ణి*
*వినీల విజయదుర్గ*
No comments:
Post a Comment