Tuesday, September 15, 2020

రెండు కవితలు

[9/9, 19:55] iswarimurthy: 9/9/2020.
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
---------------------
శీర్షిక .
ఉద్యమ "ప్రతిధ్వని."
--------------------------

అక్షరాలనే ఆయుధాలుగా సంధించిన 
సాంఘిక రాజకీయ సమాహారం.
ప్రజల హక్కు కై పోరాడిన ప్రజావాది.
బ్రతుకంతా తెలంగాణ కిచ్చిన వైతాళికుడు.
నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకి.
కలం బలం తో ఉద్యమాల పోరు సల్పిన ప్రజా కవి.
అన్యాయాన్నెదిరించే నాకారాద్యుడు.
ఉద్యమమే  ఊపిరై , సమకాలీన సమస్యలపై
 "నా గొడవ" పేరుతో , నిస్కర్ష విమర్శలతో..
అక్షర సంధానం చేసిన ఉద్యమ పోరాటకుడు.
భారత ప్రభుత్వ "  పద్మవిభుాషణ్ " బిరుదును,
కాకతీయ విశ్వ విద్యాలయ "గౌరవ డాక్టరేట్"ను
గ్రహించిన బహుభాషాకోవిదుడు.
ఉద్యమ ప్రతిధ్వనియై , తన జీవితమంతా 
తెలంగాణా భాషోద్యమానికై ధారపోసిన ఘనతకు ప్రతిగా, తెలంగాణ ప్రభుత్వం , అతని "జన్మదినాన్ని"
"తెలంగాణ భాషా దినోత్సవం" గా జరుపుకోవడం,
అతని గౌరవ, ఘన కీర్తికి నిదర్శనం.
-------------------------------------------------
[9/10, 19:28] iswarimurthy: *అంశం
*కవిత*
*--------*


రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021.
-----------------------
శీర్షిక.
నిండు పున్నమి వేళలో..
--------------------------------
పున్నమి  వెలుగులో ప్రకృతి కాంత ఒడిలో,
నాలో భావాలు నక్షత్రాలై నింగికెగసిన  క్షణం..
పరవశించిన నా మనసు  నిండిన హాయి...
వెన్నెల రేయి అందాలే ..
                      నా "కవిత".॥

చల్లని మంచు బిందువులు, లే లేత ఆకుల పై
పడి , కిందకు జారుతుా ముత్యాలై  కురిసే వేళ,
చెలి చీరకట్టు పై నున్న అందాల  పయ్యెద  -
భుజాల పై నుంచి కిందకు జాలువారుతున్న 
భావం...
                           నా "కవిత".॥

మత్తెక్కించే పుాల పరిమళం, 
మలయమారుత గంధమై మంద్రంగా వీచే వేళ,
చెలి జ్ఞాపకాల, చలి కౌగిలింత తలపులే,
                           నా" కవిత".

సముద్ర తీరాన్ని తాకే అలల సడి , నా చెలి పద మంజీరాల చిరు సవ్వడై , గిలిగింతలు పెడుతుా ఉంటే..ఉరకలేసే నా  హృదయ తరంగాల, 
నిశ్శబ్ద  భావ గీతానికి--లయయైన భావనే, నాలో ఉప్పొంగిన -
                          " కవిత".॥

మదిలో మెదిలే భావాలు , కదిలే అక్షర కన్యలై--
కాగితపు పడవ పుటల్లో విహరించేదుకు , కలం పల్లకిలో  చేరి , సిగ్గు మొగ్గలై పయనిస్తుా ఉంటే , 

నా భావ కల్పనకు , పదసంపద కుార్చే నెచ్చెలులు  , 
నాలో సృజనాత్మకతను- పెంచేందుకు ,నాకు తోడై ,
నా కుాడా నిలచిన , అందమైన అనుభుాతుల ఆనందంమే....
  
                      నా "కవిత"॥
-----------------------------------------------------------

No comments:

Post a Comment