అంశం
"కరోనా కట్టడి"
------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
----------------------
శీర్షిక.
" గుణ పాఠం"
------------------------------
చిత్రాల జగతిలో జేరె నొక విచిత్రం.
"కరోనా " దాడి తో కల -కల్లల జీవితం॥
కణ కణాల విషం ప్రభావం తో
మందులేని మహమ్మారి వీర విహారం ॥
నిర్వీర్య మౌతున్న వృత్తి వ్యపారాలు
బ్రతుకు పోరాటాల వలస ప్రయాణాలు॥
పాటించు విధులన్ని పారద్రోలగ నెంచి
పరదేశ మేలేటి పాప పంకిలమును ॥
సామాజిక దుారముతొ సరి బంధముల గావు
సానిటైజరు వాడు, శ్రద్ధ సతతము నీవు॥
ముాతి ముక్కుల గప్పు, మాస్క్ చాటున నీవు
ముదుసలుల మృదువుగా ప్రక్క నుండీ గావు ॥
పండ్లపై అనురక్తి , రోగనిరోధక శక్తి ,
కాయగుారలు కడిగి' వండ నిచ్చును పుష్టి ॥
కట్టు బట్టల నింట కలగలప జుాడకు-
కాళ్ళు చేతులు కడుగ నువు బద్ధకించకు.॥
కాని పనులను జేసి కన, క్షణిక సుఖముకు-
కాటు విసపు" కరోన" బారి పడ జుాడకు.॥
సమయ పాలన నెంచు, సవ్య వ్యాయామములె
దివ్యౌషధములు గద దీని నంతముజేయ.॥
----------------------------------------------------------
"మనుమ సిద్ధి కవన వేదిక కోసం".
హామీ...
శీర్షిక.
"గుణ పాఠం" .అనే ఈ కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
No comments:
Post a Comment