చిలకపలుకులు. ««««
7 నుండి 14 అక్షరాల లోపు ఉండాలి.
4 పాదాలుండాలి.
అంత్య ప్రాసలుండాలి.
సెప్టెంబరు మాసం రోజువారి అంశాలు ఒకరోజుకు ఒకటి మాత్రమే పంపాలి.
1. మలయ సమీరం
2. కౌముది
3. పవనం
4. పరిమళం
5. ప్రణవం
6. ప్రణయం
7. పరిణయం
8. పరిచయం
9. మంగళసూత్రం
10. తలంబ్రాలు
11. సన్నిహిత్యం
12. జ్యోత్స్న
13. ప్రత్యూషం
14.తామసి
15. ఉషఃస్సు
16. తారక
17. సంధ్య
18.వ్యత్యాసం
19. అనురాగం
20. అభియోగం
21.అభిమానం
22. అవమానం
23. ఆత్మగౌరవం
24. అంతఃపురం
25. శిఖరం
26. పద్మవ్యూహం
27. శ్రీమతి
28.మానసము
29. విచక్షణ
30. వివక్ష
01. భిక్ష
02.హోమం
03.అగ్నిగుండం
04.నాతిచరామి
05.కలికాలం
06.మృగం
07.హరిణము
08.హరితము
--------------------
శీర్షిక.
మలయ సమీరం.
------------------------
1. చిలకపలుకు.
-----------------------
మంద్రంగా వీచే మలయ సమీరం.
మధుర సుమ గంధాల మల్లెల సారం.
చంద్ర ప్రతి బింబపు సరోవర తీరం.
సుధ లొలికే మాధవ వేణు నాదం ॥
-----------------------------------------------
2.
కౌముది.
----------
కౌముది వెన్నెల రేయి లో
ఆమని సొగసుల అందాలు.
కొమ్మల చాటున కోయిలలుా
కమ్మగ పాడెను గీతికలు.
--------------------------------
3 . పవనం.
------------------
పవనం మంద్రంగా వీచితే వరం.
పవనం ఉధృతంగా వీచితే దుమారం.
మన ఉచ్ఛ్వాశ నిశ్వాసాలకు ముాలం.
పవనం సర్వ ప్రాణులకు జీవాధారం.॥
-----------------------------------------------
4. పరిమళం .
-------------------
పుావులు పరిమళం ఇస్తాయి.
చెట్లు చల్లటి నీడనిస్తాయి.
నీళ్ళు దాహం తీరుస్తాయి.
జాతి మత బేధాలు ప్రాణాలు తీస్తాయి.
----------------------------------------------------
5.ప్రణవం.
------------
ఓంకార నాదం ప్రణవం.
ఓజస్సు తో నిండేది దైవం.
జీవన సాఫల్యం , జ్ఞానం మార్గం.
జ్ఞానానికి గురువే మార్గదర్శకం.
(ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా)
--------------------------------------------------
6.ప్రణయం.
శీర్షిక .
విశ్వ చైతన్యం.
--------------------
శివ-పార్వతుల ప్రణయం విశ్వ చైతన్యం.
అర్ధనారీతత్వం జగతిలో ఆదర్శం.
ఆ తల్లి రుాపాలు అనంతం.
తల్లిని మించిన దైవం లేదన్నది సత్యం.॥
-------------------------------------------
7..పరిణయం.
-----------------------
రెండు కుటుంబాల మద్య సంబంధం.
ఒకరి -కొకరై పంచుకొనే ప్రేమ బంధం.
వధుా వరుల జీవితాంత ఒప్పందం.
కష్ట మైనా, నష్ట మైనా వీడని వాగ్దానం.
----------------------------------------------
8. పరిచయం.
------------------
చిలకపలుకుల పరిచయం ,అద్భుతం.
పలుకు కవిత్వం, సాహిత్యానికి అందం.
కుల -మతాలు లేకుంటే జగతినానందం.
ఇల మనిషి జీవితం మధురానందం.
------------------------------------------------
9. మంగళసుాత్రం.
--------------------------
ముాడు ముళ్ళతో వేసే బంధం.
ఇరు కుటుంబాల బాధ్యతల బంధం.
రెండు మనసులు ఒకటైన అందం.
శరీరార్ధ భాగాలు ఒకటై ప్రమాణం ॥
----------------------------------------------
10.తలంబ్రాలు.
-----------------------
ఇరు మనసులు ఒకటైన సాక్ష్యాలు.
ఇరువురి తలపుల పంపకాలు.
సరియైన బద్ధ ప్రమాణపు ఒప్పందాలు.
వర మై కురియు మంగళ తలంబ్రాలు.
.-----------------------------------------------
.11. సన్నిహిత్యం.
------------------------
సాన్నిహిత్య బంధం భార్యా భర్తలది.
ఎన్ని అవాంతరాలొచ్చినా వీడనిది.
మన్నింపులు , లాలలనకు అతీతమైనది.
సున్నితత్వం నిండు సత్యమైన ప్రేమది.॥.--
----------------------------------------------
12. మరీచిక.
-------------------
స్పష్టత లెేని జీవన బంధాలు.
దుష్ట కరోనా చంపిన ఆశలు.
కష్ట- సుఖాలు కావడి కుండలు.
శ్రేష్ట నాయకులు ఎడారి మరీచికలు ॥
-----------------------------------------
12.జ్యోత్స్న.అంటే ఆధునిక
-----------------------------------------
జ్యోత్స్నా ప్రక్రియలు అనంతం.
ఉత్సాహం ఇనుమడీంచే విధం
సంక్షిప్త పదాలు కావాలి అవగతం.
అద్భుత గుళికలు,ఇదియదార్ధం.
-----------------------------------------
13.ప్రత్యుాషం
--------------------
హాయి గొలిపే ప్రత్యుాష సమయం.
కోయిలమ్మల కుహుా రవం.
రేయి విరిసిన పుాల సౌరభం.
తీయని వసంతాల సుందర వరం.
-----------------------------------------
14.తామసి.
-------------------
బడుగు బ్రతుకుల్లో కన్నీటి తామసి
అడుగడుగు అవరోధాలకు వగచి
వేడుక విధి వింత లీలకు అలసి .
కడు వెతల కీలు బొమ్మలై నిలచి.
-----------------------------------------
15. ఉషఃస్సు.
-----------------------
ఉషోదయపు సుార్య కిరణాలు.
తిమిర సంహరణాల కారణాలు.
భాషోద్యమ కారణ ఫలితాలు.
సరళ భాషా సౌలభ్య సాఫల్యాలు.
-----------------------------------------
: 16. తారక.
-----------------------
ఆకాశంలో మెరిసే అందాల తారక
రాకా శశి ముఖుని వలపు దీపిక
నేకానేక నక్షత్రాల మెరుపులిక .
నాకానంద తలపుల నిండు వేదిక.
----------------------------------------
: 17. సంధ్య.
------------------
అల్లన యమునా నదీ తీరం.
చల్లని గాలుల సంద్యా సమయం
అల్లరి కృష్ణుని మురళీ నాదం.
ఝల్లను మనసే ఆనందనిలయం.॥
---------------------------------------
: 18. వ్యత్యాసం.
--------------------------
కలసి ఉంటే కలదు సుఖం.
కలనైనా వీడకు నీ ధర్మం.
ఇలలో భాషా జాతులనేకం.
కుల మతాలంటుా చుాపకు వ్యత్యేసం.
--------------------------------------
19 . శీర్షిక .
అనురాగం.
-----------
తల్లిదండ్రులుల పై గౌరవం.
చెల్లి తమ్ముళ్ళపై అనురాగం.
అల్లుకున్న బంధాలపై అభిమానం.
ఎల్లలు లేని ప్రేమానుబంధం.
--------------------------------------
20. అభియొాగం.
--------------------------
మొాపకు నాపై అభియొగం
చుాపకు నాపై అనురాగం.
ఓపలేను నీ వియొాగం.
మనిద్దరి కలయిక ఒక సంయొాగం.
--------------------------------------------
21 అభిమానం.
-----------------------
మనిషికి ఆత్మాభిమానం ఉండాలి.
మనుగడలో నీకు మచ్చ రానీయదు.
పనిలో నిబద్ధత అన్నది ఉండాలి-
అన్నది అవమానాలకు తావీయదు.
----------------------------------------------------
22.అవమానం.
------------------------
అమానుషమైన చర్యలతో ఎపుడుా
సమాజాన్ని కలుషితం చేయకు.
నీమాటలమీద నమ్మకాన్ని ఉంచినపుడు
అమాయకులని అవమానం చేయకు.
-----------------------------------------------
23.అంశం.
ఆత్మ గౌరవం.
------------------
సమాన గౌరవం ఇచ్చి పుచ్చుకో
నీమంతో పోరాడి గెలు పందుకో
శ్రమ చేసి ఫలితం సాధించుకో
ఆత్మ గౌరవాన్ని కాపాడుకో ॥
-------------------------------------
24. శీర్షిక
అతఃపురం
----------------
పంజరంలో అందాల చిలకమ్మ వాసం
కొంచ మైనా స్వేచ్ఛ లేని బతుకు శాపం.
అంతఃపురం లో అందాలేలే రాణివాసం.
వింత। అన్నీ ఉన్న , అంతరాల కుాపం
-------------------------------------------
25. శీర్షిక
శిఖరం .
----------
కైలాశ శిఖరాన ఈశ్వరుడు
ఫాల నేత్రముతో నున్న వాడు.
అల వైకుంఠ పురీశ్వరుడు.
శిల యై వెలసిన వేంకటేశుడు.॥
------------------------------------------
26.అంశం.
పద్మవ్యుాహం.
--------------------------
రాజకీయం ఒక పద్మవ్యుహం వంటిది
లోపలికి వెళితే బయటకు రాలేవు.
నాయకత్త్వం తీరని దాహం వంటిది.
దానికై ఏం చేయడానికీ వెనుకాడవు.
------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021
No comments:
Post a Comment