లోగిలి సాహితీ వేదిక వారు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వచనకవితలపోటీల్లో ద్వితీయ
బహుమతి పొందిన కవిత;
కవితాశీర్షిక; "" గురుపూజ""
తరగతికి ఆలస్యంగా వచ్చానని
మీరు తీయించిన గుంజీలు
వేయించి న గోడకుర్చీలు
సమయాన్ని పాటించేలా
చేస్తున్నాయి మాచే నేడు!
అక్షరాలు దిద్దేప్పుడు
చూచివ్రాత వ్రాసేప్పుడు
మీరు చూపిన జాగర్తలు
రూళ్ళకఱ్ఱతో మేటికలపై కొట్టిన
దెబ్బలు
నేటి మా ముత్యాల్లాంటి
చేతివ్రాతకు కారణాలయ్యా యి!
మరియదాసుతో నేను
కులమతాల హెచ్చుతగ్గుల
గూర్చి గిల్లికజ్జాలు ఆడినప్పుడు
మాచే మీరు ఆడించిన
దేవుడొక్కడే నాటిక
మాలో ఆనాడే వేశాయి
కులమతాలకు సమాధి
మతసామరస్యతకు పునాది!
దసరా పండుగకు
విల్లంబులు చేత ధరించి
జయీభవ దిగ్విజయీభ వ
అంటూ
మీరు అందరి ఇండ్లకు తిరిగి
గురుదక్షిణ స్వీకరించినపుడు
మాలో తొలగిపోయాయి
ఆర్ధిక అసమనతా భావనలు
మిగిలాయి స్నేహపూరిత మధురిమలు!
మిలాంటి గురువులకు
ఆదర్శగురువు సర్ సర్వేపల్లి
రాధాకృష్ణన్ పాదపద్మములకు
ఘటిస్తున్నాం శతాధిక పాదాభివందనములు!
........... .. .............................
ఉన్నతప్రమా ణాలతో కూడిన
ఉత్తమవిధ్యను భోదించి,
మమ్ములను ఉన్నతంగా తీర్చిదిద్దిన మా ప్రాధమిక
పాఠశాల ఉపాధ్యాయిని
శ్రీమతి కారంచే టి విమ లావతి
గారి పాదపద్మములకు గురుపూజ చేస్తున్నాను.
ఇట్లు
చుండూరు ప్రాధమిక పాఠశాల
విద్యార్థి
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి....52221
గుంటూరు... జిల్లా
సెల్ నెంబర్.7416638823.
No comments:
Post a Comment