Monday, October 30, 2023

ఛందస్సు

11.
విభా -త, ర, గ, గ.

తీరంగ కోర్కెలున్ లోకుల్
జేరంగ నిన్ను గొల్వంగన్
భారంబు దీర్చునిన్ దల్తున్
శ్రీరంగ శాయిగన్ కృష్ణా!//

12.

వాంతభారః -న, త, గ, గ.

హరిహరీ!నిన్ను వేడన్
గరిని రక్షించినావా!
మొరల నాలింప లేవా!
సురవరా!రావ!కృష్ణా!//

13.
తుంగా -న, న, గ, గ.

పరమ పురుష!విష్ణూ!
గరుడ గమన శౌరీ!
నిరతము నిను గొల్తున్
పరము నిడుమ!కృష్ణా!//

14.
వృత్తముఖీ -న, భ, గ , గ.

నియతిగా నిను దల్తున్
భయము బాపగ రావా!
శ్రయము నీయుమ!నాపై
దయను జూపుమ!కృష్ణా!//

15.
 గోపనదీ -    న,మ,గ,గ.

ప్రణతితో నీ పాదంబుల్
వినతిగా మ్రొక్కంగా నిన్
ఘనముగా కీర్తించన్ స
ద్గుణములే కల్గున్ కృష్ణా!//

16.

పాంచాలాంఘ్రి -న, య, గ, గ.

గిరిధర గోపాలా!నీ
చరణములే దిక్కంచున్
సురలట చేరంగా నిన్
సురతుడ వంచున్ కృష్ణా!.//

17.

కరరికా -న,ర, గ, గ.

విరసమెందుకోయీ!నా
కరము వీడకోయీ!సుం
దరముఖారవిందా!నీ
కరుణ జూపూమా!కృష్ణా!.//

18.
రుద్రాళీగణలయనీ - న, స, న, గ.

ఘనుడ వని నిన్ దల్తున్
క్షణికమగు భాగ్యంబుల్
కనను హరి!నీ రూపున్
గన నిలిచితిన్ కృష్ణా!.//

19.
కృష్ణగతికా -భ,జ,గ,గ.

పాదములు పట్టి కొల్తున్
వేదనలు తీర్చ వయ్యా!
నీదయను జూప రాదా!
నాదరికి రావ!కృష్ణా!.//

20.

చిత్రపదా-భ, భ, గ, గ.

కోరను గోర్కెలు శౌరీ!
భారము నీదని దల్తున్
సారెకు మ్రొక్కుచు నిన్నే
చేరితి నీదరి కృష్ణా!.//

No comments:

Post a Comment